25-01-2022 17:11:29 About Us Contact Usమూడు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ఐదు భాషలలో.. దాదాపు మూడు వందల సినిమాలలో రెండు వేలకు పైగా పాటలకు బాణీలు అందించిన సంగీత స్వరకర్త.. తన గాత్రంతో పాటలు పాడిన గాయకుడు.. తనలో ఒక రచయిత ఉన్నాడు అదే నాకు గర్వం అని చెప్పిన మరకటమణి కీరవాణి గారి పుట్టినరోజు నేడు.


1961 జులై 4న.. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో కీరవాణి గారు జన్మించారు.తాతగారి సంగీతం పట్ల ఇష్టం ఉండటం.. తండ్రికి కూడా లలిత కళలలో ప్రవేశం ఉండటం.. ఆ తర్వాత సంగీతం.. సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు తండ్రి గారు..దింతో కీరవాణి గారికి చిన్నప్పటి నుండి పాటలు.. సంగీతం పట్ల ఇష్టం కలిగింది. నాలుగు ఏళ్ళ వయసులో వైయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా అక్కడ నుండి సంగీతం వైపు అడుగులు వేసిన ఆయన.. కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉద్యోగం అవసరం అని భావించి.. 1987లో చక్రవర్తి గారి దగ్గర చేరారు. అలా సినీ రంగ ప్రవేశం చేశారు కీరవాణి గారు.


1990లో తొలిసారి బాణీలు అందించిన కీరవాణి. 1991లో వచ్చిన క్షణ క్షణం సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. అక్కడ నుండి వెనకకు తిరిగి చేసుకుంది లేదు.మెలోడీ..భక్తి..మాస్.. ఇలా అన్ని రకాల పాటలలో తనదైన శైలిలో బాణీలు కట్టి.. విజయాలను సాధించారు.1991 నుండి 2010 వరకు వచ్చిన హీరోలు..దర్శకులలో ఆయన చెయ్యని వారు లేరనే చెప్పుచు.ఆయన పరిచయం చేసిన గాయని..గాయకులు అనేకం.తన దగ్గర ఒక్క పాట పాడాలి అని నేటి తరం గాయకులు కోరుకునే స్థాయికి చేరారు కీరవాణి గారు.ఒక తెలుగులోనే కాక తమిళం.. మలయాళం..కన్నడ..హిందీ భాషల్లో సైతం తన బాణీలకు అటు హీరోలతో ఇటు ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.తమిళ..మలయాళ భాషల్లో మరకటమణి గా..హిందీ లో ఏం.ఏం.క్రీం గా ఆయనను పిలుస్తారు. ఇలా పలు పరిశ్రమలలో పలు పేర్లతో ప్రసిద్ధి చెందారు కీరవాణి గారు.


ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా చేసిన కీరవాణి గారు..ఇప్పటికి ఒక సాధారణ మనిషి లానే వుంటారు.. తాను ఒక స్టార్ సంగీత దర్శకుడు అనే భావన ఆయనను చూసిన ఎవ్వరికీ అనిపించదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ.. చిన్నవారిని సైతం గౌరవంగా పిలుస్తూ వుంటారు.చూసేందుకు కోపంగా కనపడినా నిత్యం సరదాగా ఉంటారు.తనలో ఒక రచయిత ఉన్నారని.. తాను సమయం దొరికినప్పుడల్లా రాస్తుంటానని ఒక సందర్భంలో చెప్పారు.ప్రస్తృతనికి తన వద్ద మాత్రమే ఉన్న ఆ రాతలు త్వరలో పుస్తక రూపం దాల్చి మనముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆ దిశగా ప్రయత్నం త్వరలో చేస్తాను అని కూడా ఆయన గతంలోనే ప్రకటించారు.


ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కీరవాణి గారు గడిచిన మూడు దశాబ్దాలుగా తన పాటలతో మనల్ని అలరించారు. ప్రసృతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్.ఆర్.ఆర్ కి పని చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 27వ సినిమాగా క్రిష్ దర్శత్వంలో వస్తున్న సినిమాకు బాణీలు అందించనున్నారు.. నేడు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవణిగారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!