11-04-2021 06:32:33 About Us Contact Us



సున్నితమైన ప్రేమ కథలను విభిన్నమైన తరహాలో చూపించడంలో సిద్దహాస్తుడు శేఖర్ కమ్ముల గారు తను తీసే ప్రతి చిత్రారాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటాయి అయన సినిమాలు.అయన దర్శకత్వం లో వస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ ని చిత్ర బృందం ఈరోజు విడుదల చేసారు.


ఈ మధ్య కాలంలో నాగ చైతన్య నటనలో ఎంతో పరిణితి చెందాడు అనే చెప్పాలి తన కెరీర్ లో చేసిన వాటిలో ఎక్కువ లవ్ స్టోరీస్ అనే చెప్పాలి.. తెలుగింటి అమ్మాయిలా అనిపించి వరుణ్ తెజ్ సరసన ఫిదాతో తెలుగు ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిలా మారిపోయింది సాయి పల్లవి


ఇంకా టీజర్ విషయానికి వస్తే మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే శేఖర్ కమ్ముల సినిమా అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఉండాలి అనుకుంటారో అన్ని కలబోసి చూపించారు.మధ్య తరగతి అబ్బాయి కి.. జీవితంలో ఏదో సాధించాలి అని ఆరాటపడే అమ్మాయి కి మధ్య ప్రేమకథని ఈ చిత్రం ద్వారా మనకి పరిచయం చేయబోతున్నారు శేఖర్ కమ్ముల.


ఈ చిత్ర టీజర్ లో నాగ చైతన్య చెప్పే సున్నితమైన సంభాషణలు తెలంగాణ యాసతో అద్భుతంగా అనిపించాయి.. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఎమోషనల్ డైలాగ్స్ టీజర్ లో ఉన్నవి ఒకటి రెండు అయినా మనసుకి హత్తుకునేలా ఉన్నాయి.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్ k నరాగ్ మరియు పుస్కర్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ CH సంగీతం చిత్రాన్ని మరొక మెట్టు ఎక్కించింది అనే చెప్పాలి.


శేఖర్ కమ్ముల గారి నుండి వస్తున్న మరొక ఫీల్ గుడ్ మూవీ ఈ లవ్ స్టోరీ అని టీజర్ తో అర్ధం అవుతుంది. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో మైలురాయిగా నిలవాలని చిత్ర బృందానికి మరపురాని విజయాన్ని అందించాలి అని ఆశిద్దాం.

లవ్ స్టొరీ టీజర్