08-03-2021 03:19:29 About Us Contact Us


రెబల్ ఈ పేరు విన్నవెంటనే మీ మనసులో ప్రభాస్ పేరు రావడం సహజం కానీ ఒక తరం వెనక్కి వెళ్లి చూస్తే రెబల్ స్టార్ అనగానే ఆరడుగుల యాక్షన్ హీరో కృష్ణంరాజు గారు గుర్తుకు వస్తారు.1940లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు కృష్ణంరాజు గారు.. కృష్ణం రాజు గారి అసలు పేరు శ్రీ వెంకట కృష్ణంరాజు.


కష్టపడి పని చేసే తత్వం ఉన్న కృష్ణంరాజు గారికి ఫోటోగ్రఫీ అంటే మక్కువతో ఇంట్లో ఉన్న ఒక కెమెరాతో ఫొటోస్ తీయడం అలవాటుగా మార్చుకున్నారు.చిన్నతనంలో ఎక్కువ అల్లరి చేసే కృష్ణంరాజు గారు తన తండ్రి వెంకట సత్యనారాయణ రాజు గారి మాటలు విని తనకి బాగా ఇష్టం అయిన ఫోటొగ్రఫీని వ్యాపారంగా చేద్దాం అని నిర్ణయించుకున్నారు.తన దగ్గర ఉన్న ఒక కెమెరాతో పాటు ఇంకొక కెమెరా కొని ఒక షాప్ అద్దెకి తీసుకుని దానికి రాయల్ ఫొటో స్టూడియో అని పేరు పెట్టారు.


ఆ షాప్ లో పని చేసే కుర్రాడు ఒక రోజు కృష్ణంరాజు గారితో ఇలా అన్నాడు.. సార్ మీరే హీరో లా ఉంటారు మీ ఫొటోస్ కొన్ని తీసి షాప్ లో షోకేస్ లో పెడదాం అని.. దానికి బదులుగా కృష్ణంరాజు గారు.. నా ఫొటోస్ ఎందుకు ఎన్టీఆర్, ఏ న్ ఆర్ ఫొటోస్ పెట్టు అన్నాడు.. అయినా ఆ కుర్రాడు పట్టుపట్టి మరి కృష్ణంరాజు గారితో కొన్ని స్టిల్స్ తీసుకుని షాపులో పెట్టాడు.ఆలా షాపులో ఫొటోస్ చూసిన ఒక పెద్దాయన నువ్ హీరోలా ఉన్నావ్ నేను కూడా ఒక సినిమా తియ్యాలి అనుకుంటున్నా నీకు ఇష్టం అయితే ఇప్పుడే మద్రాస్ తీసుకుని వెళ్తా అని చెప్తే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు స్ని సున్నితంగా తిరస్కరించారు కృష్ణంరాజు గారు


కానీ ఆ పెద్దాయన మరుసటి రోజు మళ్ళీ వచ్చి అడిగాడు ఆలా రెండు రోజులు వచ్చి అడిగే సరికి కృష్ణంరాజు గారికి కూడా ఆశ కలిగింది వెంటనే వాళ్ళ పత్రిక బాబాయ్ కి ఫోన్ చేసిన అడిగాడు వాళ్ళ బాబాయ్ కూడా హీరోలా ఉంటావ్ ఒక సారి ప్రయత్నించి చూడు అనే సరికి మద్రాస్ వెళ్ళాడు కృష్ణంరాజు.


మద్రాస్ వెళ్లిన కృష్ణంరాజు గారు అజంతా హోటల్ లో ఉండే వారు ప్రముఖ హీరోలకి మేకప్ వేసే పితాంబరం గారిని పిలిపించి మేకప్ టెస్ట్ చేయించారు ఆలా మూడు రోజులు గడిచాయి తరువాత 15రోజులు అయినా సరే ఆ పెద్దాయన కనిపించడం మానేసాడు అది గమనించిన హోటల్ యజమాని కృష్ణంరాజు గారితో ఇలా అన్నాడు.. మీరు ఆ పెద్దాయన కోసం ఎదురుచూస్తున్నట్టు అయితే వెళ్లిపోండి ఇంకా అయన రాడు అయన ఇలానే ప్రతి సారి తెలుగు వారిని ఒకరు ఇద్దరిని తీసుకుని వచ్చి సినిమా తీస్తా అని చెప్పి తన ఖర్చులకు డబ్బులు తీసుకుని మెల్లగా జారుకుంటాడు అని చెప్పడంతో కృష్ణంరాజు గారు నిరాశతో మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారు.


1966 లో ప్రత్యేకాత్మ గారి దర్శకత్వంలో చిలక గోరింకా అనే చిత్రంలో నటించారు కృష్ణంరాజు గారు.. ఈ చిత్రంలో S V రంగారావు గారిలాంటి మేటి నటులకు దీటుగా నటించి మెప్పించారు రాజు గారు కానీ ఆ చిత్రం నిరాశపరిచినా కాని కృష్ణంరాజు గారి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు.తరువాత బుద్దిమంతుడు, పవిత్రబంధం, జై జవాన్ లాంటి చిత్రాలలో విలన్ పాత్రలో నటించారు మళ్ళీ తిరిగి 1974 లో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.


ఇంటి దొంగలు చిత్రం తో మళ్ళీ హీరోగా వెలుగొందిన కృష్ణంరాజు గారు తరువాత కృష్ణవేణి అనే చిత్రం సగం పూర్తి అయిన తరువాత ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అయిపోవడంతో కృష్ణంరాజు గారు మిగిలిన డబ్బులు పెట్టి సినిమా పూర్తి చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా హీరో పాత్రాల్లో చేయడం ప్రారంభించారు నిత్యసుమంగళి, మొగుడా పెళ్ళామా, భక్త కన్నప్ప వంటి చిత్రాలు చేసి మెప్పించారు తరువాత బిల్లా, రెబల్ వంటి చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు.


ఇంకా ముందు ముందు మరెన్నో పాత్రాల్లో అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ “రెబల్ స్టార్ కృష్ణంరాజు” గారికి B R మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.