25-01-2022 15:39:42 About Us Contact Usకొరటాల శివ.. దర్శకుడిగా తీసింది నాలుగు సినిమాలు.. కానీ ఇప్పుడు ఆయన ఒక స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు ఆయన కధ చెబుతాను అంటే స్టార్ హీరో నుండి కొత్త హీరో దాక ఎవరైనా సమయం ఇవ్వాల్సిందే.. కారణం ఒకో సినిమా అంతలా ప్రేక్షకులల్లో చొచ్చుకుపోయింది..బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో వసూళ్లు సాధించాయి.. అతి తక్కువ విజయాల శాతం ఉన్న చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడు కనుక.. అలాంటి కొరటాల శివ గారి పుట్టిన రోజు నేడు..


కొరటాల శివ కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చారు.. అయితే తనకు చిన్నప్పటి నుండి రాయడం ఇష్టం.. దీనికి తోడు మరో రచయిత రవి మిత్రుడు.. ఇద్దరు కలిసి హైదరాబాద్ కు వచ్చారు.. శివ అత్త కొడుకు పోసాని కృష్ణ మురళి అప్పటికే గొప్ప రచయిత.. దింతో వారిద్దరూ ఆయన దగ్గర పని చేసేందుకు వెళ్ళారు.. ఇంట్లో నన్ను తిట్టుకుంటారు అని.. శివని సాఫ్ట్ వేర్ జాబ్ కి పంపి రవిని పనిలో పెట్టుకున్నారు పోసాని.. ఆరు నెలల పాటు అటు ఉద్యోగం ఇటు సినిమా పనులు చేశారు శివ.. దింతో చేసేది ఏమిలేక.. తన వద్ద పెట్టుకున్నారు పోసాని.. అలా మొదలై.. రైటర్ కి అసిస్టెంట్ గా ప్రారంభించి.. రైటర్ గా డైలాగ్స్.. స్క్రిప్ట్ ఇచ్చే స్థాయి నుండి.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు..


2002లో తొలిసారి మిత్రుడు బి.వి.ఎస్. రవి తో కలిసి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు కధ ఇచ్చారు.. అది భారీ విజయం సాదించడంతో అవకాశాలు వచ్చాయి.. భద్ర.. మున్న.. ఒక్కడున్నాడు.. సింహ.. బృందావనం.. ఉసరవిలి.. ఇలా కొన్ని సినిమాలకు మాటలు.. కొన్నింటికి కథలు ఇచ్చారు.. అలాంటి సమయంలో తనకు గుంటూరు లో డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్న మిత్రుడు వంశీ ప్రొడ్యూసర్ గా మారాలి అనుకుంటున్నాను అని చెప్పారు.. శివ రాసుకున్న కధ విన్న వంశీ.. ప్రభాస్ నాకు మిత్రుడు మనం అడిగితే డేట్స్ ఇస్తారు అనడంతో ప్రభాస్ కి కధ చెపేందుకు వెళ్ళాడు.. అక్కడ కధ వినే ముందు ప్రభాస్.. నేను రాజమౌళి గారికి సినిమా చేయబోతున్నాను.. కేవలం వంశీ ఒత్తిడి తో కధ వింటున్నాను.. తప్పుగా అనుకోవద్దు అని చెప్పి.. కధ చెప్పామన్నారు.. ఇదేంటి ఇలా అయింది అనుకుంటూనే కధ చెప్పారు శివ.. ప్రభాస్ వెంటనే.. నేను అందుకే కధ వినన్ను అని చెప్పాను.. ఐపొడు చూడు కధ చాలా బాగుంది.. ఇప్పుడు నేను ఏమి చేయ్యాలి అని అన్నారు.. రెండు రోజుల తర్వాత ప్రభాస్ రాజమౌళి ఇంటికి వెళ్ళి ఇలా ఒక కథ విన్నాను.. నచ్చింది.. అనడంతో నాకు మొత్తం సెట్ అవ్వడానికి టైం పడుతుంది వెళ్ళి చేయమన్నారు.. అలా తొలి అవకాశం దక్కింది శివకు.. ఇక్కడ ప్రభాస్ రాజమౌళి తో మాట్లాడకున్నా.. రాజమౌళి సమయం లేదు అని చెప్పినా.. మిర్చి సినిమా మనం చేసే వాళ్ళం కాదు..ఇక మిర్చి నుండి మనకు తెలిసిన చరిత్ర.. ప్రభాస్.. మహేష్.. తారక్ లకు కారియర్ లో అల్ టైం హిట్ ఇచ్చిన శివ.. భారత్ అనే నేను తో మరో ఎత్తుకి వెళ్లిపోయారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం చూడని దర్శకుడిగా ఒక వెలుగు వెలుగుతున్నారు శివ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు.. వామపక్ష కుటుంబం నుంచి వచ్చినందున ఆయన ప్రతి కథలో ఒక సందేశం కనిపిస్తుంది.. ఇలాంటి మరెనో సినిమాలు కొరటాల శివ గారు చెయ్యలని.. కోరుకుందాం.. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మా బి.ఆర్. మూవీ జోన్.. తరపున జన్మదిన శుభాకాంక్షలు..