25-01-2022 17:05:15 About Us Contact Us


ఎక్కడో ఇప్పటి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ధర్మపూరి అనే ఊరిలో 1979 మార్చ్ 31న జన్మించాడు ఒక బాలుడు.ఆ కుర్రాడు సినిమాల పై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు.చిన్నతనం నుండి సినిమాలు చేస్తూ పెరగడమే కాదు,నాటకాలు కూడా వేశాడు.కళ ఎంత గొప్పదో ఆ నాటక రంగం ఆ కుర్రాడికి తెలిపింది.హైదరాబాద్ కి దాదాపు 250కిలోమీటర్ల దూరంలో ఉన్నా,తాను సినిమా పరిశ్రమలో పని చెయ్యాలి అని భావించాడు.తనకు సినిమా మీద వున్న ప్రేమ ఆ 250కిలోమీటర్ల దూరం చాలా చిన్నదైపోయింది.హైదరాబాద్ వచ్చేశాడు,చదువు కూడా పూర్తి చేశాడు,తెలుగు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు.తొలుత స్క్రిప్ట్ రైటర్ గా ప్రారంభించి,అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి,ఆ తర్వాత తిరుగులేని మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన ఆనాటి బాలుడు మరెవరో ఎవరో కాదు, ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ గారితో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ డైరెక్టర్ గా నిలిచిన ‘హరీష్ శంకర్’..!

పరిశ్రమకి వచ్చిన తొలి రోజుల్లో కోనా వెంకట్,పూరి జగన్నాథ్ లతో కలిసి పని చేశారు మన హరీష్ శంకర్.2003లో కోన వెంకట్ స్టోరీ రైటర్ గా చేసిన సినిమా ‘నిన్నే ఇష్టపడ్డాను’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు.2004లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యడంతో ‘మాస్ రాజా రవితేజ’కు బాగా దగ్గరయ్యాడు.ఆ సన్నిహిత్యంతోనే ‘షాక్’ సినిమా కథ చెప్పాడు హరీష్.2005 లో ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాకు కో-రైటర్ గా పని చేశాడు.రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేయగా,కోనా వెంకట్ మాటలు రాయగా,రవితేజ నటించిన ‘షాక్’ సినిమాతో 2006లో హరీష్ శంకర్ దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.మరి ఎక్కడ ఏ లెక్క తప్పిందో కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అంతటి ఆగలేదు హరీష్,తిరిగి కోనా వెంకట్ తో ‘చింతకాయల రవి’ సినిమాకి కో-రైటర్ గా చేశాడు,ఇదే సమయంలో పూరి దర్శకత్వం వహించిన ‘బుజ్జిగాడు’ సినిమాకి సైతం కో-రైటర్ గా పని చేశాడు.2009లో ‘కొంచం ఇష్టం కొంచం కష్టం’ సినిమాతో హరీష్ శంకర్ కో-రైటర్ గా వరసగా మూడు విజయాలు అందుకున్నాడు.దింతో మళ్ళీ కథ రాయడం మొదలు పెట్టాడు.ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలవాలి అనుకున్నాదేమో కాని,హరీష్ మళ్ళీ రవితేజకే కథ చెప్పి,ఒప్పించాడు.ఐదు సంవత్సరాలు తర్వాత 2011లో మరోసారి రవితేజతో ‘మిరపకాయ్’ అంటూ దర్శకుడిగా ప్రేక్షకుల ముందు వచ్చాడు.ఆ సినిమా రవితేజ కెర్రీర్ లో వన్ ఆఫ్ బెస్ట్ హిట్స్ లో నిలిచింది.అందులో రవితేజ క్యారెక్టర్ ఆనాటి యూత్ కి పిచ్చి పిచ్చి గా ఎక్కేసింది.

ఈ సారి బండ్ల గణేష్ నిర్మిస్తున్న హిందీ ‘దబాంగ్’ రిమేక్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.ఆ సినిమాలో హీరో తాను ఎంతో ఇష్టపడే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’.దింతో హరీష్ ఎక్కడా తగ్గలేదు,దాదాపు 10 సంవత్సరాల నుండి సరైన హిట్ లేక అటు పవన్ కళ్యాణ్ ఫాన్స్ బాధలో వున్నారు,అప్పుడప్పుడే ‘జల్సా’తో సంబరాలు జరుపుకున్నా ఇంకా ఏదో వెలితి వారిలో ఉంది.సరిగ్గా అప్పుడే సినిమాలో ఒక డైలాగ్ బయటకు వచ్చింది.”నాకు కొంచెం తిక్కుంది,కానీ దానికో లెక్కుంది”ఈ ఒక్క మాట సినిమా పై అంచనాలు పెంచింది.మరోపక్క ‘దేవిశ్రీ ప్రసాద్’ అందించిన ఆడియో సూపర్ హిట్,ఆ వేడుకకు అన్నయ్యలు ‘మెగాస్టార్ చిరంజీవి’గారు,’నాగబాబు’గారు రావడం ఒక్క హైలైట్ అయితే,అక్కడ బండ్ల గణేష్ మాట్లాడిన స్పీచ్ ఆ నాటి వేడుకకు అతి పెద్ద హైలైట్.ఇలా అన్ని కలగలిసి సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.2012 మే11న వచ్చిన ఆ సినిమా,తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టేసింది.అభిమానులు పవన్ కళ్యాణ్ కట్ ఔట్ లను దాదాపు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరిలో మాత్రమే కాక దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కూడా ఊరేగించారు.ఆ సినిమాతో హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులకు ఇష్టమైన దర్శకుడిగా మారిపోయ్యాడు.చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ హోదా అందుకున్నాడు.

అక్కడ నుండి మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.2013లో ‘రామయ్య వస్తావయ్యా’ తో ‘తారక్’ తో కలిసి బాగా అలరించాడు,2015లో సాయి ధరమ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తో మెగా ఫాన్స్ కి మరింత దగ్గరవుతూ కమర్షియల్ హిట్ అందుకున్నాడు,2017లో బన్నీ తో కలిసి ‘డిజే’ సినిమాతో మాస్ ఆడియాన్స్ కి దగ్గరయ్యాడు.2019లో వచ్చిన ‘వాల్మీకి’ అదే ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మెగా హీరోల ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు.రీమేక్ సినిమా అయినా వరుణ్ తేజ్ లుక్స్ నుండి యాక్టింగ్ వరకు అన్ని ఆకట్టుకున్నాయి.ఆ సినిమా కూడా భారీ విజయం అందుకుంది.ఇప్పుడు మళ్లీ తిరిగి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ తో సినిమా చేసేందుకు సిద్ధపడుతున్నారు.ఇక వేదికల పై ఆయన మైక్ తీసుకుంటే ఆయనను ఆపడం అసాధ్యం,ఆయన స్పీచ్ లకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఇక ఆయన సినిమాలలో హీరోయిన్లను చూపించే తీరు వర్ణనాతీతం..!

సినిమా పై ప్రేమతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం,ఒక ప్లాప్ అందుకున్నా ఐదేళ్లు నిరీక్షించి మళ్ళీ అదే హీరోతో హిట్ కొట్టిన విధానం.వేదిక ఏదైనా సినిమా పట్ల తనకున్న ప్రేమను చెప్పడం.తాజాగా మధ అనే సినిమా ఎన్నో అవార్డ్స్ పొందింది కానీ విడుదలకు నోచుకోలేదు అని తెలిసి ఆ సినిమా విడుదలకు తనవంతు సహాయం అందించిన హరీష్ శంకర్ అభినందనియుడు.అంతేనా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పతకంలోని డబ్బులు తనకు అవసరం లేదు అని చెప్పి,ఆ ప్రభుత్వ డబ్బు అవసరం ఉన్న మరొక్కరికి అందించిన విశాల హృదయం కలవాడు హరీష్.ఇలా తనకు తెలిసిన వారికి ఎప్పుడు సహాయపడుతూనే ఉన్న హరీష్ శంకర్ మంచి మనసున్న వ్యక్తి.కృషి,పట్టుదల,ఇతరులకు సహాయపడే గుణం,ఓర్పు ఇలా నేటి తరం యువత తన నుండి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.తన ప్రతి సినిమాను వర్ణిస్తూ రాయాలి అని వున్నా ఆర్టికల్ కాస్త పుస్తకమవుతుందేమో అని భయపడి ఆపేస్తున్న..,

నేటితో 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘బిగ్ బి’ అభిమాని,రవితేజ ఆప్తుడు,పవర్ స్టార్ భక్తుడు,’మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్’ గారికి చిత్ర పరిశ్రమ తరుపున,ప్రేక్షకుల తరపున మరి ముఖ్యంగా ఆయన అభిమానుల తరపున,మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఈ సందర్భంగా మరిన్ని విజయాలు అందుకోవాలి అని,ఇండస్ట్రీలో మరెన్నో మైలురాళ్లు అధిగమించాలి అని కోరుకుందాం.!