25-01-2022 17:01:08 About Us Contact Us


గీతా మాధురి..ఈ పేరు తెలియని తెలుగు వారు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు ప్రంపంచంలో కూడా వుండరేమో..సినిమాలే చూడని వారు సైతం టీవీ షోలలో పాటలు వింటూ ఉంటారు.. ఏదో ఒక టివి షో లో పెద్దవారికో..ఏదో ఒక కొత్త సినిమా పాట తో యువతరానికో ఆమె గొంతు వినిపిస్తూ ఉంటుంది..అందుకే నేను అంటాను..వారానికి ఒక్కసారైనా గీతా మాధురి స్వరం ప్రతి ఇంట్లో వినిపిస్తూ ఉంటుంది అని..గొంతు మాత్రమే కాదు మనసు కూడా మంచింది..ఎటువంటి ఇగోలు లేకుండా అందరితో బాగా కలిసిపోతుంది అని అంటుంటారు చిత్ర పరిశ్రమ వారు..అందుకే ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని సంబంధం లేకుండా దాదాపు అందరి దగ్గర పాట పాడారు…


ఏదో పాఠశాలలో చదువుకునే రోజుల్లో అందరూ అన్ని పోటీలలో పాలుగోనాలి అని చెప్పడంతో పాట పాడిన ఆ చిన్నారికి మొదటి బహుమతి లభించింది..దింతో తను ఒక నూతనోతేజంతో ఇంటి వెనక ఉన్న సంగీతం నేర్పే టీచర్ దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టింది..అలా మొదలైన ప్రయాణానికి తల్లి సహకారంతో ముఖ్యంగా కార్ నడుపుతూ.. టీవీ షోలు..సినిమాలో కొరస్ లు అలా అలా..2006లో ఖాతర్నాక్ సినిమాలో “” ఆ గగణంలో..” అనే పాట పడింది గీత..చిన్నప్పటి నుండి పాట పాడుతున్న గీత తొలిసారి సినిమా హాల్ లో తన గొంతు విని ఆనంద పడిపోయింది..అలా మొదలైన గీత నేడు..తెలుగు చిత్ర పరిశ్రమలో నేటి తరం స్టార్ సింగెర్స్ లో ఒకరిగా నిలిచారు..14 సంవత్సరాల కెర్రీర్ లో మాస్..క్లాస్..రొమాంటిక్..ఐటమ్ సాంగ్ ఇలా తేడా ఏమీ లేదు..అన్నిటినీ అవలీలగా పాడుతుంటారు..అలా ఎలా సాధ్యం అని ఎవరైనా అడిగితే..సంగీత దర్శకులు చెప్పినట్లు పాడటమే అని చక్కటి సమాధానం ఠక్కున చెప్తుంటారు..


ఆమె పాడిన పాటలు గురించి ప్రస్తావించే అంత సంగీత జ్ఞానం నాకు లేదు కానీ..నేను తొలిసారి ఆమె పేరు విన్నది మాత్రం..మగధీర సినిమాలో..అప్పుడప్పుడే పాటలు హీరో..హీరోయిన్ లు పాడరు..వారి వెనక సింగెర్స్ వుంటారు అని నాకు తెలిసిన రోజులు..”నాకు కోసం నువ్వు..”అనే పాట వింటుంటే..నిజంగా ఆమె ప్రియుడితో అలా ఆడుకొని ఇలా పాడిందేమో అని నేను..నా మిత్రులు మాట్లాడుకున్నాం.. ఆమె పాట మధ్యలో తన గొంతుతో “ఐస్ స్ స్ స్..బాగుంది” అనే శబ్దం చాలా బాగా ఉంటుంది..మా స్కూల్ లో ఆ శబ్దానికే ఒక ఫ్యాన్ బేస్ ఉంది..ఆ తర్వాత “మగాళ్లు వట్టి మాయగాళ్ళే..” పాట తో అందరికి బాగా దగ్గరయ్యారు గీతా..


మహేష్ బాబు ని బిజినెస్ మ్యాన్ లో “బ్యాడ్ బాయ్”..తారక్ తో జనతా గ్యారేజ్ లో “పక్క లోకల్”..చరణ్ తో “జోర్సే”..ప్రభాస్ తో “డార్లింగ్ గే..”బన్నీ తో “టాప్ లేసిపోడి..ఇక పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగ తో రాంబాబు లో “మెలికలు” ఇలా మాస్ సాంగ్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు గీతా మాధురి..ఇది కాకుండా షో లలో “స్వచ్ఛమైన నవ్వు” మంచి మాటలు..చక్కటి వస్త్రధారణతో మన పక్కింటి అమ్మాయి అనేలా ఫామిలీ ఆడియాన్స్ కి బాగా దగ్గరయ్యారు..అలా తన ఇంటి నుండి ప్రతి ఇంట్లో చేరి అందరిని కాసేపు అలా అలరించి వెళ్లిపోయే గీతా మాధురి నేటి తరంలో సినీ రంగంలోకి రావాలి అనుకునే అమ్మాయిలకు ఆదర్శం..


చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరు లేకున్నా..తన ప్రతిభతో అడుగు పెట్టి..14 సంవత్సరాలు సింగర్ గా చిత్ర పరిశ్రమలో కొనసాగడం అంత సాధారణ విషయం కాదు..కొరస్ గా అడుగు పెట్టి స్టార్ గా ఎదిగిన గీతా మాధురి గారికి శుభాకాంశాలు..ఇలానే మరిన్ని పాటలు పాడుతూ అందరిని అలరించాలి అని కోరుకుంటూ..మహిళా సాధికారతలో భాగంగా చిత్ర పరిశ్రమలోని తెలుగు మహిళల గురించి రాస్తున్న మేము..నేడు గీతా మాధురి గారి గురించి కథనం..రేపు మాస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి గారి గురించి వ్యాసము..