25-01-2022 16:49:03 About Us Contact Usఅసలే.. వెబ్ సిరీస్ అందులో థ్రిల్లర్.. ఇంకేముంది భాషతో సంబంధం లేకుండా కేవలం సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు మన యువత.అలాంటి వారికి ఈ లాక్ డౌన్ లో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది.తెలుగు,హిందీ భాషల్లో మన తెలుగు దర్శకుడు శంకర్ మార్తాండ్ తీసిన వెబ్ సిరీస్ ఎక్స్ పైరీ డేట్ ( Expiry Date). వచ్చే నెల (అక్టోబర్) 2న హిందీ లో.. 9న తెలుగులో.. ఈ సిరీస్ జీ5 లో విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది.


ఉల్లాసంగా.. ఉత్సాహంగా,కరంట్,సింహ,అలా మొదలైంది చిత్రాలలో నటించి తెలుగు వారికి చేరువైన బాలీవుడ్ నటి.. అటు హిందీ.. ఇటు తెలుగులో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్.. బడలా సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టోనీ లూక్ జంటగా ఈ వెబ్ వెరీస్ లో నటిస్తున్నారు.మరో జంటగా తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో సైతం సినిమాలు చేసిన మధు షాలిని మరియు బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ రెజా నటించారు.


స్నేహా ఉల్లాల్ పెళ్లికి వెళ్ళిన రోజు నుండి కనిపించడం లేదని పిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న టోనీ కి.. అదే మార్గంలో.. అదే పెళ్ళికి వెళ్లిన అలీ రెజా కూడా కనిపించడం లేదని మధు షాలిని పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మరి అక్కడ నుండి వారికి ఏమైంది?వారిద్దరికీ సంబంధం ఏమిటి?తప్పిపోయ్యారని చెప్పుతున వీరి మాటల్లో నిజమెంట?పోలీసు విచారణలో అసలు ఆ రోజు ఏమి జరిగిందని తెలిసింది??పాత్రధారులు ఎవరు?వారి వెనక ఉన్న సూత్రధారులు ఎవరనే కధాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెకింది.ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.సురేష్ రాజుతు సినిమాతోగ్రఫీ చేశారు.నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మించారు.

Sneha ullal,madhu shalini,expiry date web series,shankar marthand

దర్శకుడు శంకర్ మార్తాండ్.. ఈ వెబ్ సిరీస్ ని బాగా తెరకెకించినట్లు.. సిరీస్ ఆద్యంతం చాలా ఉత్కంఠ బరిమతంగా సాగుతుందని.. ఈ సిరీస్ అటు హిందీ,ఇటు తెలుగులో భారీ విజయం నమోదు చేస్తుందని.. అక్టోబర్ 2వ తేదీ కోసం ఎదురు చుట్టున్నట్లు వెబ్ సిరీస్ లో నటించినవారు మరియు సాంకేతిక బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. మార్చ్ చివరి నాటికే సింహ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. మన హైదరాబాద్ సిటీ.. మరియు హైదరాబాద్ శివార్లలోనే చిత్రీకరణ మొత్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి దాకా ఏదో దేశంలో ఎవరో తెలియని వారు నటించిన త్రిల్లర్ సిరీస్సులు చూసిన మన ప్రేక్షకులకు.. మనకు తెలిసిన వారు నటించిన మన సమాజానికి దగ్గరగా ఉన్న ఈ త్రిల్లర్ ను ఎలా ఆదరిస్తారో చూడాలి!? హిందీలో 2న.. తెలుగులో 9న విడుదల చేస్తున్నారు కనుక అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం.!

ఎక్స పైరీ డేట్ ట్రైలర్