24-01-2022 16:29:51 About Us Contact Us2015లో ఒక 17ఏళ్ళ తెలుగమ్మాయి నటనపై ఇష్టం ఉండటంతో తనలోని ప్రతిభ చూపించేందుకు ఎదో వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది..సరిగ్గా అప్పుడే డబ్స్ మ్యాష్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ రావడం అందులోనే డైలాగ్స్..సాంగ్స్ వస్తుండటంతో ఆ అమ్మాయి దానినే ఒక ఆసరాగా చేసుకొని వీడియోలు చెయ్యడం ప్రారంభించింది..చదువుతున్నది సైంట్.యాన్స్ మహిళా కళాశాల కావడంతో అంతా అమ్మాయిలే కనుక ఏ మాత్రం భయం లేకుండా వీడియోలు చేసేసింది..ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లల నుండి కాలేజీ దోస్తుల దాక ఎవ్వరిని వదలలేదు అందరితో కలిసి చేసింది..చూసేందుకు అందంగా ఉండటం..బాగా నటిస్తుండటంతో….సామాజిక మాధ్యమంలో ఆమె వీడియోలు బాగా వైరల్ అయ్యాయి..అలా డాన్స్..డబ్ స్మాష్ వీడియోల నుండి యూట్యూబ్ లో కవర్ సాంగ్స్..షార్ట్ ఫిలిమ్స్ కి చేరింది..అక్కడా తన ప్రతిభతో మంచి పేరు తెచ్చుకుంది..ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ హౌస్ లో చేరి తన అల్లరి చేష్ఠలతో అందరిని అలరించి..ఇప్పుడిప్పుడే సినిమాలలో కనిపిస్తున్న దీప్తి సునైనా..


సాధారణంగా ఒక 16-17 ఏళ్ళ అమ్మాయికి తను ఏమి చదువుతుందో..భవిషత్తులో ఏమవ్వాలో అనే ఆలోచన పెద్దగా ఉండదు..తల్లితండ్రులు చెప్పిన కాలేజీలో చెప్పిన కోర్స్ నేర్చుకుంటూ వుంటారు..కానీ దీప్తి అలా కాదు..తనకు నచ్చిన రంగం వైపు అడుగులు వేసేందుకు తనే ఒక మార్గాన్ని వేసుకుంది..సినీరంగానికి సంబంధించిన కుటుంబం కాకపాయినా..ఎలా వెళ్ళాలో చెప్పే వారు లేకున్నా..తను నమ్మిన దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది..అలా తన మార్గంలో డబ్ స్మాష్ లాంటి మంచి వేదిక తోడైంది..దింతో ఆమె ప్రతిభ ఎక్కువ మందికి త్వరగా చేరింది..నేడు తెలుగు రాష్ట్రాలలో దీప్తి సునైనా తెలియని యువత పెద్దగా ఉండరు..సామాజిక మాధ్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె తెలుసు..ఆ స్థాయికి చేరింది..అయితే ఇదంతా ఏదో చాలా సులువుగా అయిపోలేదు..అనేక సార్లు ఒత్తిడిని తను అధిగమించింది..ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని చదువుకుంటున్న ఒక తెలుగమ్మాయి తన ప్రతిభను చూపిస్తుంటే కుదిరితే మెచ్చుకోవాలి..లేకుంటే వదిలెయ్యాలి..కానీ ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్స్ సామాజిక మాధ్యమంలో చెయ్యడం ఎంత వరకు సమంజసం..అంత జరిగినా ఆమె ఏ మాత్రం పట్టు సడలించలేదు..ఒకో అడుగు ముందుకు వేస్తూనే వచ్చింది..


ఆ వయసులో ఆ అమ్మాయి ఎంత బాధ పడుతుంది..అది చూసి తన తల్లితండ్రులు ఎలా బాధ పడుతారు అని కనీసం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చెయ్యడం తప్పు కదా..నాకు గుర్తున్న ఒక్క సంఘటన..రెండు..మూడేళ్ళ ముందు ఫేస్ బుక్ లోనో..ఇంస్టాగ్రామ్ లోనో లైవ్ లో మాట్లాడుతుంది..దీప్తి..ఎవరో చూస్తుంటే వారి మొబైల్ లో నేను చూస్తున్నా..కింద కామెంట్స్..అప్పటికే ఒకటి రెండు చెత్త కామెంట్స్ చదివాను..ఒకడు ఏకంగా ఐ..లవ్..యు..అని పెట్టాడు..ఒక్కసారిగా అది చదివి ఫోన్ వైపు నుండి పైకి చూసి మళ్ళీ కెమెరా చూస్తూ మా నాన్న లైవ్ చూస్తున్నారు అని చెప్పింది..ఆ ఒక్క క్షణం చాలా బాధ కలిగింది..తెలుగమ్మాయి..ఆ వయసులో తనకు నచ్చిన రంగంలోకి అడుగు పెట్టేందుకు..తనకు మించిన పనులు చేస్తుంటే మనం ఇలా తనని క్రిందకు లాగే ప్రయత్నం చేశాం..ఇలాంటివి ఎన్ని వచ్చినా తన కూతురిని ఆపకుండా..తన వెంట నిలుస్తున్న ఆ తల్లితండ్రులను కచ్చితంగా మనమందరం అభినందించాలి..


తెలుగు ప్రజానీకానికి దీప్తి పరిచయమై అర్దదశాబ్దం అవుతుంది..నాడు ట్రోలింగ్ చేసినవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ..దీప్తి మాత్రం ఒకో అడుగు వేస్తూ సినిమాలు చేసే స్థాయికి చేరింది..బిగ్ బాస్ హౌస్ లో పిల్లి లాగా..తను చేసిన అల్లరితో చాలా మంది కుటుంభ ప్రేక్షకులకు సైతం దగ్గరైంది..రానున్న రోజుల్లో అనేక సినిమా అవకాశాలు రావాలని..నటన..డాన్స్..ఇలా తన ప్రతిభను ఇప్పటికే మనం చూశాం కనుక అలానే సినిమాల్లో కూడా గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం..చిన్న వయసులో వచ్చిన స్టార్దం..కొంత గర్వం..కొంత పక్క దారిలోకి వెళ్ళడం సహజం..అవేవి దరికి రాకుండా చూసుకుంటే రానున్న రోజుల్లో దీప్తి ఒక పెద్ద హీరోయిన్ గా మారి దక్షిణాది సినిమాల్లో నటించే స్థాయికి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు..నేటి తరం అమ్మాయిలు..దీప్తిని చూసి నచ్చిన పనిలో ఎందరు విమర్శించినా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యడం నేర్చుకోవాలి..చిన్న చిన్న విషయాలకు బాధ పడకుండా..గమ్యం వైపు అడుగులు వెయ్యడం నేర్చుకోవాలి..1998 జనవరి 10న జన్మించిన దీప్తి సునైనా చిన్న వయసులోనే ఎంతో సాదించిందుకు హాట్స్ ఆఫ్..


మహిళా సాధికారత లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన..రాణిస్తున్న..తెలుగు మహిళను గౌరవించుకునే క్రమంలో నేడు దీప్తి సునైనా గురించి కథనం..రేపు మరొక్కరి పై వ్యాసము..