25-01-2022 16:07:10 About Us Contact Usయాభై రెండు సంవత్సరాలలో.. పదమూడు భాషల్లో 150కి పైగా సినిమాలు నిర్మించి.. ప్రపంచ రికార్డులు పొందుపరిచే గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన మన తెలుగు వారు.. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు గారు.. ఆయన ప్రతిభకు.. కష్టానికి.. కృషికి ఎస్. వి. యూనివర్సిటీ వారు డాక్టరేట్ తో సన్మానిస్తే.. సినీరంగంలో ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కరమైన రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు.. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ సైతం ఆయనకు వరించింది.. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది.. అనేక సినీ అవార్డులు ఆయన సినీ ప్రస్థానంలో ఆయనకు లభించాయి.. సినిమాను కథ రూపంలో ఉండగానే ఆ సినిమా జయాపజయలతో పాటు.. ఏ స్థాయిలో ఆడబోతుందో చెప్పగలిగే గొప్ప నిర్మాత మన రామానాయుడు గారు.. అటువంటి మహానుభావుడి 83వ జయంతి సందర్భంగా ఆయన గురించి కథనం..


1936లో ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే గ్రమంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.. చీరాలలో విద్యను అభ్యసించి.. ఉన్నత చదువులు.. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివారు.. అక్కడ నుండి వ్యాపార రంగం వైపు అడుగులు వేశారు నాయుడు గారు.. రైస్ మిల్ ఓనర్ గా ప్రారంభించి.. ట్రాన్స్ పోర్ట్.. రంగంలోకి వెళ్లి.. ఇటుక వ్యాపారం వైపు వెళ్ళాలి అని భావించి చివరకు రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేశారు.. 1958లో నాయుడు గారి తండ్రిగారు నాగేశ్వరరావు సావిత్రి గార్లతో నమ్మిన బంటు అనే సినిమా నిర్మించారు.. అయినా 1962 వరకు నాయుడు గారు ఇటు చూడలేదు.. చెన్నైలోని ఆంధ్ర క్లబ్ కు తరచు వెళ్లే అలవాటు ఉన్న నాయుడు గారికి అక్కడ సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.. దింతో 1963లో ఆయన తన మిత్రులతో కలిసి అనురాగం అనే సినిమా నిర్మించారు.. అక్కడ నుండి చరిత్ర …


తొలి ప్రయత్నం విఫలమైనా.. అడుగు వెనక్కి వెయ్యలేదు.. 1964లో ఎన్టీఆర్ గారితో చేసిన రాముడు భీముడు తో విజయం సాధించారు.. అక్కడ నుండి వరస సినిమాలు చేస్తూ వెళ్లిపోయారు.. 1971లో ఏ.ఎన్.ఆర్ తో చేసిన ప్రేమ నగర్.. ఘన విజయం సాధించింది.. తమిళం.. హిందీ సైతం నిర్మించి విజయం సాధించారు నాయుడు గారు.. అప్పటి వరకు స్టూడియోస్ అంటే చెన్నై లో మాత్రమే ఉండేవి.. 1983లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ నిర్మించారు.. పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ తో సినిమాలు నిర్మించిన రామానాయుడు.. చిన్న కుమారుడు వెంకటేష్ ను హీరోగా చేశారు.. కేవలం పది నుండి పాతిక సినిమాలు నిర్మించగానే ఇక చాలు.. మనం చాలా చేశాం అనుకొని ఆగిపోలేదు నాయుడు గారు.. 150 సినిమాలు పైన నిర్మించారు.. అది కూడా భారీ సక్సెస్ రేట్ తో అంటే సాధారణ విషయం కాదు.. ఒక బాషలో సినిమాను నిర్మించి.. విడుదల చెయ్యడం కష్టం అనుకుంటే.. ఆయన పదమూడు భాషల్లో చేశారు.. అందుకే అంటారు అది ఆయన ట్రాక్ రికార్డ్ కాదు అల్ టైం రికార్డ్..


సినీ పరిశ్రమలో కొందరిని భర్తీ చెయ్యడం అసాధ్యం అందులో ముందువరుసలో వుంటారు రామానాయుడు గారు.. అగ్ర కథానాయకుల నుండి కొత్త వారి దాక.. అగ్ర దర్శకుల నుండి కొత్త వారి దాక.. అందరితో సినిమాలు నిర్మించి విజయం సాధించారు నాయుడు గారు.. అందుకే మూవీ మొఘల్ అని పిలుస్తుంది పరిశ్రమ.. పరిశ్రమ ఎప్పుడు సంశోభం దిశగా వెళ్తున్న సమయంలో ముందుండి దాన్ని పరిష్కరించే వారు.. ఎప్పుడు ఎవరు కనిపించినా ఒక చిరు నవ్వుతో పలకరిస్తూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు.. సినీ రంగం హైదరాబాద్ రావడానికి ప్రధాన వ్యక్తులలో నాయుడు గారు ఒక్కరు.. చిత్ర నిర్మాణంలో సాంకేతిక రంగంలో వచ్చే కొత్త మార్పులను నిత్యం ప్రోత్సహించేవారు.. అలాంటి మూవీ మోఘల్ మన మధ్య లేకున్నా ఆయన సినిమాలు.. మనకు ఆయనను గుర్తు చేస్తూ ఉంటాయి.. జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం..