25-01-2022 16:55:45 About Us Contact Us


సాధారణంగా మార్చ్ మధ్య వారానికి ఇంటర్ పరీక్షలు,ఏప్రిల్ మొదటి వారానికి 10వ తరగతి పరీక్షలు ముగుస్తాయి.దింతో విద్యార్థులు నేరుగా ఎక్సమ్ హాల్ నుండి సినిమా హాల్ లోకి వస్తుంటారు.అందుకే మార్చ్ చివరి వారం నుండి మే చివరి వారం మధ్య వుండే రెండు నెలలు చిత్ర పరిశ్రమకు పెద్ద బిజినెస్ సీజన్.కనీసం వారానికి ఒక పెద్ద సినిమా అయినా విడుదలవుతూ ఉంటుంది.ఇక చిన్న సినిమాలకు లెక్కే లేదు.

ఒక పక్క వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి,మరో పక్క కుటుంబ సభ్యులతో కలిసి వినోదం పంచుకోవడాని అంటూ సినిమా హాళ్లకు వస్తుంటారు ప్రజలు.ఏక్సిబిటర్లకు ఈ రెండు నెలలు చాలా కీలకం.ఫిబ్రవరిలో పెద్దగా సినిమాలు విడుదలవ్వవు కాబట్టి సినిమా హాళ్ల ఓనర్లు ఏసీ రిపేర్,సీట్లు మార్చడం లాంటి మరమ్మతులు అన్ని ఆ నెలలో చేసి వేసవి కాలం కోసం ఎదురు చూస్తుంటారు.ఎప్పటిలనే ఈ సంవత్సరం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా సినిమా హాళ్లు వేసవి కాలం కోసం సర్వం సిద్ధమయ్యాయి.

మార్చ్ 25న ఉగాది రావడం తో మార్చ్ 20 నుండే సినిమాల కొలహలం మొదలవుతుంది అని అనుకున్నారంతా.సంక్రాంతిలో రెండు పెద్ద సినిమాలు భారీ స్థాయిలో వసూలు రావడంతో ఈ వేసవిపై అంచనాలు భారీగా పెరిగాయి.అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే,మార్చ్25న సుధీర్ బాబు హీరోగా నాని విలన్ గా చేసిన ‘వి’ చిత్రం,యాంకర్ ప్రదీప్ నటించిన ’30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా,ఏప్రిల్ 2న అనుష్క ‘నిశ్శబ్దం’,రానా ‘అరణ్య’,సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్న ‘ఉప్పెన’ విడుదలవ్వాలి.ఇవి మాత్రమే కాక అఖిల్ నటించిన మోస్ట్ ఏలిజబుల్ బ్యాచ్ లర్,నాగ చైతన్య లవ్ స్టొరీ,రామ్ నటించిన రెడ్ లాంటి సినిమాల నుండి రెండు సంవత్సరాలు తర్వాత తిరిగి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్న తొలి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వరకు పెద్ద సినిమాలే ఒక 10కి పైగా ఈ రెండు నెలలలో విడుదలకు సిద్ధమయ్యాయి.ఇక చిన్న సినిమాలు,పరాయి భాషా సినిమాలు అన్ని కలుపుకొని దాదాపు 50 సినిమాలు పైనే విడుదలైయ్యేవి.

కానీ ప్రపంచాని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో ప్రవేశించింది.దింతో మార్చ్ 15న నుండే తెలంగాణ అంతా సినిమా ప్రదర్శనలను రద్దు చేసింది ప్రభుత్వం.గడించిన నాలుగు రోజుల నుండి ఏపీ ప్రభుత్వం సైతం ఇదే నిర్ణయం ప్రకటించింది.ఈ సినిమా హాల్స్ మార్చ్ 31వరకు మాత్రమే ముస్తున్నట్లు రెండు ప్రభుత్వాలు ప్రకటించినా ఇప్పడు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తుంటే ఆ సమయం పెరిగే అవకాశం లేకపోలేదు.దింతో మార్చ్25న,ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైన అన్ని సినిమాల బృందాలు వాయిదా వేసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

ఏప్రిల్ రెండవ వారం నుండి సినిమాలు విడుదలైనా, భయాందోళనలో ఉన్న ప్రజలు సినిమాలకు వస్తారా అనేది సందేహమే.దింతో చిత్ర పరిశ్రమ లోని సినిమా హాళ్ల ఓనర్లు భారీ నష్టాన్ని చూడబోతున్నారనమాట.ఇప్పటికే మార్చ్ లో 15 రోజులు మూసేయ్యడంతో టాకీసులు,ముల్టిప్లెక్సులు మార్చ్ నెలలో నష్టాన్ని చూస్తున్నాయి.ఒకవేళ ఈ చిత్ర ప్రదర్శన రద్దు మరి కొన్ని రోజులు పెరిగితే మాత్రం సినిమా సీజన్ లో సినిమా హాల్స్ కి నష్టం వస్తుంది.ఒక సినిమా హాల్ ఓనర్లు మాత్రమే కాక బైక్ స్టాండ్ దగ్గర టికెట్ తీసుకునే వాడి నుండి,క్యాంటీన్ ఓనర్ దాక అందరూ నష్టాన్ని చూస్తున్నారు.ఇదే కనుక కొనసాగితే కౌంటర్ లో టిక్కెట్లు తీసుకునే వాడి నుండి స్వీపర్ల దాక అందరికి జీతం వచ్చే అవకాశం ఉండదు.ఇలా ఎన్నో కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉంది.

సినిమా హాల్స్ విషయం పక్కన పెడితే ఇప్పటికే చిత్రీకరణకు,విడుదల కోసం ప్రచారానికి డబ్బుని వడ్డీకి తెచ్చుకున్న చిన్న సినిమా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏమిటి?అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకుంటే వారి సినిమా విజయం సాధించినా వస్సులు తెచ్చుకున్న డబ్బుకి,వడ్డీకి,సరిపోతాయి.ఒక వేళ సినిమా ప్రదర్శన అలస్యమై,తక్కువ సమయంలో ఎక్కువ పెద్ద సినిమాలు విడుదలైతే ఈ వేసవి కాలంలో చిన్న సినిమాలకు హాల్స్ దొరకడం కష్టమే.ఇదే కనుక జరిగితే వారు భారీ నష్టాన్ని చూడవలసి వస్తుంది.మొత్తం మీద థియేటర్ ఓనర్లతో పాటు చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు కూడా ఈ క్రోనా వల్ల ఈ వేసవిలో నష్టపోనున్నారు.ఈ వేసవి గడిస్తే కానీ మొత్తం మీద అటు సినిమా హాళ్లు ఇటు ప్రొడ్యూసర్లు కలిసి ఎన్ని కోట్లు నష్టపోయారో చెప్పలేము.ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా రాయితీ ప్రకటిస్తారేమో చూడాలి..!

ఇప్పటికే 15 రోజులు మూతపడ్డ సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వేచిచూద్దాం..!అన్ని సాధారణ స్థితికి వచ్చి మళ్ళీ సినిమా హాళ్లు పూర్వ వైభవంతో ప్రేక్షకులతో కళకళలాడాలి అని కోరుకుందాం.