25-01-2022 15:33:59 About Us Contact Usకలర్స్ స్వాతి..ఎక్కడో రష్యాలో నేవీ ఫ్యామిలీలో పుట్టిన స్వాతి,మనందరికీ కలర్స్ స్వాతి గా పరిచయమయ్యారు..హైదరాబాద్ లో ఒక పక్క చదువుకుంటూ టీవీలో షో చేసేందుకు ముందుకు వచ్చారు.ప్రైమ్ టైం లో దాదాపు 150 ఎపిసోడ్స్ పైన కలర్స్ అనే ప్రోగ్రాం చేశారు..ఒక షో ముద్దుగా,అమాయకపు మొహంతో తెలుగులో ఎప్పుడు పూర్తి జోష్ తో అందరిని అలరించే అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకున్నారు..ఆ తర్వాత 2005లో ప్రముఖ దర్శకులు కృష్ణ వంశీ గారు చేసిన డేంజర్ సినిమాతో నటిగా వెండితెరపై పరిచయం అయ్యారు..2007లో ఆడవారి మాటలకు అర్దాలే వేరులే..!సినిమాలో త్రిష చెల్లెలిగా చేశారు..


2008లో సుభ్రమణ్యపురం అనే సినిమాతో తమిళంలో పరిచయమయ్యారు..తెలుగులో అనంతపురం 1980గా ఈ సినిమా డబ్ చేశారు..ఈ సినిమాలోని కొంటె చూపుతో పాటకు ప్రేక్షకుల నుండి బాగా ఆదరణ వచ్చింది..అదే సంవత్సరం నానితో చేసిన అష్టా చమ్మా తో తెలుగులో భారీ విజయం నమోదు చేశారు..2009లో కలవరమాయే మదిలో,2010లో గోల్కొండా హై స్కూల్,ప్రముఖ దర్శకుడు అర్జీవి గారు దర్శకత్వం వహించిన కథ స్క్రీన్ ప్లే,దర్శకత్వం బై అప్పలరాజు సినిమా చేశారు..మిరపకాయ్,కందిరీగ సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించారు..2013లో వచ్చిన స్వామి రా..రా.. తో నిఖిల్ కలిసి మరో పెద్ద హిట్ అందుకున్నారు..2014లో బంగారు కోడి పెట్ట,కార్తికేయ,2015లో త్రిపురా..చివరిగా తెలుగులో 2017లో లండన్ బాబులు అనే సినిమా చేశారు..ఇది కూడా మంచి విజయం సాధించింది..ఇదే సమయంలో తమిళంలో,మలయాళంలో కూడా ఆమె సినిమాలు చేశారు..మొత్తం కలిపి 27 సినిమాలు చేశారు..


అంతేనా 2011లో అప్పలరాజు సినిమాలో Unbelivable అనే పాట పాడారు,అదే సంవత్సరం 100%లవ్ లో A square B sqaure పాట పాడారు..2013లో యో యో మేమంతా అనే పాట కూడా పాడారు..2008లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా మూవీలో ఇలియానా కు డబ్బింగ్ చెప్పారు..ఇలా ఒక యాంకర్ గా పరిచయమై,హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని,సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తాన్ ప్రతిభ చాటారు స్వాతి..


యాంకర్ గా కెరీర్ ప్రారంభించి దాదాపు 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న కలర్స్ స్వాతి సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు,రివార్డులు,ప్రశంసలు..చిత్ర పరిశ్రమలో కనీసం ఎవరు తెలియని కుటుంభం నుంచి వచ్చి..తన ప్రతిభతో ఈ స్థాయికి వచ్చిన స్వాతి ఎందరో నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..సినీ జీవితంలో విమర్శలు ఉంటాయి..కచ్చితంగా ఉంటాయి వాటిని తీసుకోవాలి..మొదట్లో చాలా ఎక్కువ రోజులు బాధ ఉండేది..ఆ తర్వాత రోజుల్లో కొని నిమిషాలు మాత్రమే అని విమర్శల గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు స్వాతి..నిజం ప్రతి చోటా విమర్శ ఉంటుంది..దానిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు పోవాలి తప్ప వాటికి భయపడి ఆగిపోకూడదు..ఇదే స్వాతి సినీ జీవితం మనకు చెబుతున్న పాఠం..రానున్న రోజుల్లో మళ్ళీ తన చెలాకితనం తో అమాయకపు ముఖ కవళికలతో మరిన్ని సంవత్సరాలు మనన్ని అలరించాలి అని కోరుకుందాం


మహిళా సాధికారత లో భాగంగా నేడు కలర్స్ స్వాతి గారి గురించి వ్యాసము రాశాము..రేపు నటిగా మంచి పేరు తెచ్చుకున్న గోదావరి జిల్లా రాజోలు అమ్మాయి హేమ గారి గురించి…