25-01-2022 17:08:39 About Us Contact Us


నిన్న(ఆగస్ట్ 6న) ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన కలర్ ఫోటో టీజర్.. సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.విడుదలైన 12గంటలలో మిలియన్ వ్యూస్ సాదించింది టీజర్. యూట్యూబ్ ద్వారా యువతను అలరించి.. మజిలీ,డియర్ కామ్రడ్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు సుహాస్ తొలిసారి హీరోగా చేస్తున్న సినిమా కలర్ ఫోటో.అదే యూట్యూబ్ లో పరిచయమై.. లఘు చిత్రాలలో స్టార్ గా మారిన తొలి తెలుగు నటి.. పలు సినిమాలలో హీరోయిన్ గా ఇప్పటికే నటించిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్.లఘు చిత్రాలతో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా డెబ్యూ డైరెక్టర్ గా పరిశ్రమకు పరిచయం కానున్నారు.ప్రముఖ హీరో.. కమెడియన్.. సునీల్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిధులుగా జనవరి 8న పూజా కార్యక్రమాలు చేసుకున్న నాటి నుండి సినిమా పై అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో మంచి అంచనాలు అందుకుంది ఈ సినిమా.విడుదలైన పోస్టర్స్ సైతం అలానే ఆకట్టుకున్నాయి.నిన్న విజయ్ దేవరకొండ విడుదల చేసిన టీజర్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి అనే చెప్పాలి.ఇక టీజర్ విషయానికి వెళ్తే..


టీజర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి పోస్టర్ కనపడటం.. నటీనటుల వస్త్రధారణను బట్టి.. 1990లలో ఒక పల్లెటూరి ప్రేమ కథకు హాస్యం జోడించి ఈ సినిమాను తీసినట్లు అర్ధమవుతుంది. పల్లెటూరు అమ్మాయి దీప్తి ఇందుకురి పాత్రలో చాందిని చౌదరి చాలా అందంగా కనిపించింది.ఆమె హావభావాలు.. వస్త్రధారణ బాగా ఆకట్టుకున్నాయి.జయ కృష్ణ పాత్రలో సుహాస్ అటు కామెడీ డైలాగ్.. ఇటు.. కోపం.. మరోపక్క బాధగా ఉన్న సన్నివేశాల షాట్స్ లో బాగా నటించినట్లు కనపడింది.యూట్యూబ్ నుండి వచ్చి పరిశ్రమలో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వైవా హర్ష ఈ టీజర్ కు మరో హైలైట్.పోలీస్ రామరాజు గా సునీల్ చెప్పిన డైలాగ్ తో సినిమాలో ప్రేమ కథను తనే విలన్ లా అనిపించింది.ఈ సినిమాలో తన నటనతో సునీల్ అందరిని భయపెడుతారు అని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది.మత్తు వదలరా తో సంగీత దర్శకుడిగా మారిన గాయకుడు కాల భైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఆయన నేపధ్య సంగీతం టీజర్ లో మరో హైలైట్.వెంకట్ ఆర్ శాఖమురి ఛాయాగ్రహణం సినిమాకు అతి పెద్ద ప్లస్ కానుంది అని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.మాటలు.. ఆర్టిస్టుల ఎంపిక.. ఆ కాలపు వాతావరణం.. నేపధ్య సంగీతం.. కొన్ని షాట్స్.. ఎమోషన్స్.. ఇలా అన్ని చూస్తుంటే దర్శకుడు సందీప్ రాజ్ తొలి సినిమాతో హిట్ అందుకోవడం ఖాయం అనేలా టీజర్ కట్ ఉంది.


హృదయకాలయం..కొబ్బరిమట్ట.. సినిమాలను నిర్మించిన నిర్మాత.. దర్శకులు.. సాయి రాజేష్ మరియు బెన్నీ ముప్పనేని ఈ సినిమాకు నిర్మాతలు.ఈ సినిమాకు కోదాటి పవన్ కళ్యాణ్.. ఎడిటింగ్ చెయ్యగా.. క్రాంతి ప్రియం.. ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు.మణికంఠ ఈ సినిమాకు సహా నిర్మాత కాగా.. గంగాధర్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్.నిర్మాత సాయి రాజేష్ ఈ సినిమా కథను అందించారు.


ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా విజయం సాధించాలని.. కొత్త వారు ఇలా పరిశ్రమకు వస్తుందాలని.. కొత్త కథలను.. కొత్త రకమైన సినిమాలను ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని మేము(బి.ఆర్.మూవీ జోన్ బృందం) ఆశిస్తున్నాం..

కలర్ ఫోటో టీజర్