25-01-2022 17:09:07 About Us Contact Usఆరంభం నుండే అటు ప్రేక్షకుల.. ఇటు సినిమా వర్గాల దృష్టిని ఆకర్షించిన సినిమా కలర్ ఫోటో.ఈ నెల 23న ఆహా యాప్ లో నేరుగా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్… పాటలు.. టీజర్ కు మంచి స్పందన వచ్చింది.కోటి ఆశలతో యువ బృందం చేసిన ప్రయత్నం కలర్ ఫోటో.ఆదివారం(అక్టోబర్ 18న) ప్రి-రిలీస్ వేడుక చేసుకొని ఈ శుక్రవారం (అక్టోబర్ 23న) విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమా గురించి ప్రత్యేక కథనం..!


ముందుగా ఈ సినిమాకు బీజం వేసిన వ్యక్తి ఈ సినిమా కథా రచయిత.. నిర్మాత సాయి రాజేష్ గారు.దర్శకుడవ్వాలని హైదరాబాద్ చేరిన సింహపురి(నెల్లూరు) వాసి సాయి రాజేష్ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదు.దింతో అటు ప్రేక్షకుల ఇటు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు మరియు మంచి సినిమా నిర్మించేందుకు డబ్బులు పొందేందుకు ఒక విభిన్నమైన కోణంలో ప్రయత్నం చేశారు.. అదే హృదయ కాలేయం.ఆ తర్వాత నిర్మాతగా కొబ్బరి మట్ట సినిమా చేశారు.ఆ తర్వాత స్వయంగా తన లవ్ స్టోరీని వెండితెర పై అవిష్కరించాలని కథ రాశారు.ఆ సినిమాను తన మిత్రుడు బెన్నీ ముప్పనేని తో కలిసి నిర్మించేందుకు సిద్ధమయ్యారు.


ఏడేళ్ళ ముందు చాయ్ బిస్కకెట్ ద్వారా షార్ట్ ఫిల్మ్ దర్శకుడిగా మంచి పేరు పొంది.. దర్శకుడిగా ఒక మంచి సినిమా తియ్యాలని అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు సందీప్ రాజ్.అలాంటి సందీప్ రాజ్ కు సాయి రాజేష్ కథ చెప్పడం.. తానే నిర్మిస్తాను.. దర్శకత్వం చెయ్యమని చెప్పడంతో కలర్ ఫోటో దర్శకుడిగా మారారు సందీప్ రాజ్.తన రచనతో.. అటు నటీనటుల.. సాంకేతిక నిపుణుల ఎంపిక తో సగం విజయం చిత్ర ప్రారంభానికి ముందే సాధించారు సందీప్ రాజ్


యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్న సుహాస్.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. మజిలీ.. డియర్ కామ్రేడ్.. ఉమామహేశ్వర ఉగ్రరూపాస్య వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు నటుడిగా బాగా దగ్గరయ్యారు.ఇలాంటి సమయంలో హీరోగా సుహాస్ చేస్తున్న తొలి ప్రయత్నం కలర్ ఫోటో.మంచి పాత్రలు వస్తున్న సమయంలో ఇలా ప్రయతించి విఫలమైతే వస్తున్న అవకాశాలు సైతం ఆగిపోతాయని తెలిసి కూడా కథ నచ్చడం.. మిత్రుడు.. దర్శకుడు సందీప్ రాజ్ పై నమ్మకంతో ఒప్పుకున్నారు సుహాస్.ఇప్పటికే చిత్రంలో పని చేసిన వారు నవాజుద్దీన్ సిద్ధికి.. తెలుగు విజయ్ సెట్టుపతి తో పోల్చడంతో ఆయనకు ఈ సినిమా తర్వాత నటుడిగా గొప్ప పేరు రావడం ఖాయంగా కనిపిస్తుంది.తెలుగులో యూట్యూబ్ లో స్టార్ గా మారిన తొలి హీరోయిన్ చాందిని చౌదరి.తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది తెలుగు హీరోయిన్ లలో ఒక్కరు చాందిని చౌదరి.మను సినిమాతో ఇప్పటికే నటిగా మంచి పేరు తెచ్చుకున్నరు.గాడ్స్ ఆఫ్ ధర్మపురి.. మస్తిస్.. వెబ్ సిరీస్ లతో భారీ విజయాలు నమోదు చేసుకొని మంచి ఫామ్ లో ఉన్న చాందిని చౌదరి కి నటిగా పేరు రానున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.


విలన్ పాత్రలో సునీల్ గారు మెప్పించి.. పరిపూర్ణమైన నటుడిగా సునీల్ మారనున్నరు. ఇప్పటికే పాటలతో సంగీత దర్శకుడు కాలభైరవ విజయం సాధించారు.ఇప్పుడు సినిమా విడుదల తర్వాత నేపధ్య సంగీతంలో కూడా తన మార్క్ చూపించనున్నారు కాలభైరవ.ఇప్పటికే టీజర్ తో వెంకట్ గొప్ప సినిమాతోగ్రఫీ అందించినట్లు పరిశ్రమలోని పెద్ద వ్యక్తులు వ్యాఖ్యానించారు.దింతో ప్రేక్షకులకు సైతం తన కెమెరాతో ఆకట్టుకొనున్నారు.ఈ సినిమా కోసం ఎడిటర్ పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో ప్రి-రిలీస్ వేడుక చూసిన ఏవిరికైనా అర్ధమవుతుంది.


సినిమా ఆహాకు ఇచ్చేయడంతో నిర్మాతగా ఇప్పటికే విజయం సాధించిన సాయి రాజేష్ కు ఈ సినిమాతో అటు కథా రచయితగా మంచి పేరు తో పాటు దర్శకుడిగా సినిమా అవకాశాలు రావాలని.. ఈ నెల 23న తొలిసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సందీప్ రాజ్.. దర్శకుడిగా మంచి పేరు పొందాలని.. సుహాస్.. చాందిని చౌదరి లకు వారి నటనలో మంచి పేరుతో పాటు.. మరిన్ని అవకాశాలు రావాలని.. సంగీత దర్శకుడు.. సినిమాతోగ్రఫీ.. ఎడిటర్ ఇలా అన్ని విభాగాలలో విజయాలు సాధించి మొత్తం యువకులతో కూడిన ఈ కలర్ ఫోటో బృందం విజయం సాధించడంతో పాటు మరిన్ని అవకాశాలు రావాలని మా బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం.అందరిలా 23న కలర్ ఫోటో చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాం.