25-01-2022 17:00:00 About Us Contact Us


దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడిని అలరిస్తున్న,ప్రతి తెలుగోడు ప్రేమగా మా ‘అన్నయ్య’ అని పిలుచుకునే
‘పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి’ గారు ఇప్పుడు అభిమానులకు మరింత దగ్గరకనున్నారు.మారుతున్న కాలంతో పాటు మనం మారాలి అన్నట్లు ఆరు పదుల వయసులో కూడా కొత్త తరానికి దగ్గరైయెందుకు ప్రయత్నిస్తున్నారు చిరు.రేపు తెలుగు వారి పండగ ఉగాది.ఉగాది అంటే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభరోజు అని అర్థం.ఆ రోజున చిరంజీవి గారు కొత్త పనికి శ్రీకారం చుట్టనున్నారు.

నేటి తరం యువత టీవీ,పేపర్ల కన్నా సామాజిక మాద్యమం ద్వారానే సమాచారం తెలుసుకుంటున్నారు.ఇప్పటికే సీనియర్ నటులు ‘కింగ్ నాగార్జున’,’విక్టరీ వెంకటేష్’ సామాజిక మాద్యమాలల్లో వున్నారు.ఇక బాలీవుడ్ ‘బిగ్ బి అమితాబ్’,కోలీవుడ్ ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ ట్విట్టర్ లో ఎప్పుడు వారి సందేశాన్ని పంచుతూ వుంటారు.ఇవన్ని చూసి తనేందుల్లో తక్కువ కాకూడదు అని అనుకున్నారో ఏమో గాని చిరంజీవి గారు సోషల్ మీడియాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించేశారు.తెలుగు కొత్త సంవత్సర ప్రారంభరోజైన ఉగాది పండుగ రోజు ఆయన సామాజిక మద్యంలోకి రానున్నట్లు వీడియో ద్వారా ఈ రోజు ప్రకటించారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 1న చిరంజీవి గారి ఇంటి వద్ద తన అభిమానులు వచ్చి తనని కలుస్తూ ఉంటారు.అది కాక ఈ మధ్య ప్రతి సినిమా ఫంక్షన్ కి తానే ముఖ్య అతిధిగా వస్తూ అటు ఆ సినీ బృందానికి ప్రచారంలో సహాయపడుతూ ఇటు అభిమానులకు చేరువవుతూ వచ్చారు చిరు.సామాజిక స్పృహ ఎక్కువ ఉన్న చిరు తన సందేశాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ద్వారా,లేక కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అకౌంట్ ద్వారా,లేక తన కోడలు ఉపాసన అకౌంట్ నుండి పంపేవారు.ఇప్పుడు నేరుగా ఆయనే సామాజిక మద్యంలోకి వస్తుండడంతో ఆయనే స్వయంగా అభిమానులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.కరోనా వల్ల అటు సినిమా షూటింగ్స్ లేక పరిశ్రమ,ఇటు సినిమా ప్రదర్శనలు లేక తీవ్ర నిరాశతో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు చిరంజీవి గారి ప్రకటన కొంత ఆనందాన్ని పంచిందనే చెప్పాలి.

ఇక ఎవరు సోషల్ మీడియాలోకి వచ్చినా రికార్డ్స్ గురించి మాట్లాడుతుంటారు అభిమానులు,మరి ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికే ఆయనకు స్వాగతం పలుకుతున్న వేళ ఆయనను తొలి రోజు ఎంతటి స్థాయిలో అభిమానులు అనుసరిస్తారో చూడాలి..!కేవలం సినిమా వేడుకలలో మాత్రమే ఆయన సందేశాన్ని ఇస్తున్న చిరు ఇక మీదట వీడియోల రూపంలో పెడుతూవుంటారా?ఎప్పుడైనా ఒక్కసారి లైవ్ లోకి వస్తారా?వస్తే నా ప్రశ్నకు సమాధానం ఇస్తారా అంటూ ఇప్పటికే మెగాభిమానులు సామాజిక మాధ్యమంలో మాట్లాడుకుంటున్నారు.


ఇప్పటికే క్యారివాన్ గురించి నేటి తరం నటీనటులకు ఒక క్లాస్ తీసుకొని ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన ‘బిగ్ బాస్’,మరి ఇప్పుడు సామాజిక మాధ్యమంలోకి వచ్చి అటు ఇండస్ట్రీ,ఇటు ప్రజలకు ఇంకేన్నీ క్లాసులు తీసుకుంటారో మనందరి మంచి కోరే మన ‘మాస్టారు’ అనేది చూడాలి..!

Chiranjeevi instagram official account
Chiru video