24-01-2022 16:47:41 About Us Contact Usఎంతో మంది అమ్మయిలలాగే తెలుగు సినిమాలలో హీరోయిన్ కోసం ముంబై నుండి హైదరాబాద్ వచ్చిన పంజాబీ అమ్మాయి చార్మీ కౌర్,కానీ తెలుగులో సినీ జీవితం మొదలు పెట్టిన చార్మీ ఇక్కడే ఉండిపోవడం తెలుగువారికి నచ్చిన విషయం..2002 నుండి 2013 మధ్యకాలంలో తెలుగు,తమిళ,ములాయం,కన్నడ,హిందీ భాషలలో కలిపి యబ్బాయికి పైగా సినిమాలు చేశారు..15ఏళ్లకే భార్య పాత్రతో “నీతోడు కావాలి”అనే సినిమాతో తెరంగేట్రం నుండి “మంత్ర 2” దాక తన అందచందాలతోతో..అద్భుతమైన నటనతో కుర్రాల అభిమాన నటిగా మారిపోయింది..మాములు అమ్మయిలకే పడిపోయే అబ్బాయిలు చార్మీ అందానికి ఫిదా అయిపోయారు..మహేష్ బాబు పెళ్ళికి ఎంతమంది ఆడపిల్లలు ఏడ్చారో తెలియదు కానీ చార్మీ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తే చాలా అబ్బాయిలు మాత్రం ఏడుస్తారు..


శ్రీ అంజనేయం..గౌరీ..చంటి..మాస్..చక్రం ఇలా 2004-05లో విడుదలైన ఐదు సినిమాలతో హీరోయిన్ గా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు..2005లో చంద్రశేఖర్ ఏలేటి గారు తీసిన అనుకోకుండా ఒక రోజు సినిమాతో నటిగా విమర్శకుల ప్రశంసలు పొందారు..”ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని..”ఈ పాట వినగానే చార్మీ మనకు గుర్తుకురావాల్సిందే..ఈ సినిమాతో వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు..మోహన్ బాబు గారితో పొలిటికల్ రౌడీ..బాలయ్యతో అల్లరి పిడుగు..వెంకటేష్ గారితో లక్ష్మీ..ప్రభాస్ తో పౌర్ణమి..తారక్ తో రాఖీ..మధ్యలో స్టైల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నటించారు..జయాపజాయలకు సంబంధం లేకుండా వరస సినిమాలు వచ్చాయంటే ఆ రోజుల్లో ఆమె ఫాలోయింగ్ అలా ఉండేది మరి..


సరిగ్గా అప్పుడే 2007లో మంత్ర సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఘన విజయం సాధించారు..బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా భారీ వసూళ్లు సాదించింది..ఒక పక్క “మహా..మహా..”అంటూ అందరిని అలరిస్తూనే..భయపెట్టింది..ఆ పాట..ఆ సినిమా చార్మీ కెరీర్ లో నిలిచిపోయాయి..ఆ తర్వాత కావ్య’స్ డైరీ..మంగళ..జ్యోతి లక్ష్మి..మంత్ర2 వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు..2008లో ఎంతో ప్రఖ్యాత గడించిన బాపు-రమణ గార్ల సుందరకాండలో ముఖ్యపాత్రతో మరో విభిన్నమైన పాత్ర చేశారు..2011 లో బుదా హోగా తెరా బాప్ సినిమాతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారితో సైతం నటించారు..అదే సంవత్సరం దొంగల ముఠా సినిమాతో అర్జీవి గారితో కూడా సినిమా చేశారు..


2015 నుండి వెండితెరపై కనిపించడం మానేశారు..ఇప్పుడు ఆమె తెర వెనక ప్రొడ్యూసర్ పాత్ర చేస్తున్నారు..2015 నుండి జ్యోతి లక్ష్మి..రోగ్..పైసా వసూల్..మెహబూబా..ఇస్మార్ట్ శంకర్ సినిమాలను నిర్మించారు..ఇప్పుడు రొమాంటిక్,పూరి..విజయ్ దేవరకొండ సినిమాలు నిర్మిస్తున్నారు..పూరి గారితో కలిసి ఆమె వరసగా సినిమాలు నిర్మిస్తున్నరు చార్మీ..ముంబై నుంచి వచ్చి ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండిపోయిన అతికొద్ది మందిలో ఆమె ఒక్కరు..అందుకే ఆమెపై చాలామందికి గౌరవం..అటు సామాజిక సేవకుడా బాగా చేస్తుంటారు చార్మీ..ఇటీవల పూరి జగనాథ్ గారి పుట్టినరోజు నాడు..ఇప్పుడు ఉపాధి లేని కష్టాల్లో ఉన్న దర్శకులకు చేయుటనిచ్చారు..


నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చార్మీ కౌర్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు..ఇలా సినిమాలు నిర్మిస్తూ..హిట్లు సాధిస్తూ..పెద్ద ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం..మరీ ముఖ్యంగా ఆమె అభిమానుల కోరిక మేరకు మరొక్కసారి వెండితెర పై ఆమె కనిపించాలని ఆశిడాం..