25-01-2022 16:20:50 About Us Contact Usఅక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉదయం పదిన్నర గంటలకు(10:30) బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా టీజర్ నిన్న(అక్టోబర్ 5న) ఒక మిలియన్(10 లక్షల) వ్యూస్ దాటింది.విభిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నందు హీరోగా.. యాంకర్ గా అటు బుల్లితెర పై దూసుకుపోటు ఇటు వెండితెరపై హీరోయిన్ గా చేస్తున్న రేష్మి గౌతమ్ హీరోయిన్ గా.. లఘు చిత్రాలతో మంచి పేరు సంపాదించిన రాజ్ విరాట్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న సినిమా “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఆ టీజర్ వివరాల్లోకి వెళ్తే…


అక్టోబర్ 2న ఉదయం విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ వెంటనే లో ట్రెండింగ్ 1 కి చేరింది.. దాదాపు 48 గంటల పాటు అదే స్థానంలో నిలిచింది.మిలియన్(10లక్షల) వ్యూస్ ని చాలా వేగంగా చేరుకుంది.ఇప్పటికే చూసిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.సవారిలో మాస్ పాత్ర చేసిన నందు నుండి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఫస్ట్ లుక్ కి ముందు నుండే బజ్ నడిచింది.దీనికి తోడు.. బిబి అంటూ నందు పోస్ట్ చేయడంతో సినిమా టైటిల్ కి బిగ్ బాస్ కి మధ్య చర్చ జోరుగా సాగింది.ఎట్టకేలకు టైటిల్ పోస్టర్ తో చర్చ కు తెర పడింది.ఆ తర్వాత ఈ సినిమాలో పాత్ర పేరు పోతురాజు కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అన్నవరం సినిమాలోని పోతురాజు డైలాగ్ తో వీడియో విడుదల చేశారు.నందు పుట్టినరోజున వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంది.


ప్రదీప్ మాచిరాజు విడుదల చేసిన రేష్మి గౌతమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పూరి జగన్నాథ్ గారి పుట్టినరోజున పోతురాజు రూమ్ లో ఆయన పోస్టర్స్ ఉన్న వీడియో విడుదల చెయ్యడంతో ఆయన సైతం టీజర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.అప్పటికే హీరో.. హీరోయిన్ ఫస్ట్ లుక్ వల్ల ప్రేక్షకులు సైతం టీజర్ కోసం ఎదురు చూశారు.నిన్న గాంధీ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.విశాఖ జిల్లా అచుతాపురం ఊరిలో నాటకాలు వేసుకునే పోతురాజు(నందు)పూరి జగన్నాథ్ గారి వీరాభిమాని.తన జీవిత కథను తన అభిమాన దర్శకుడు పూరికి ఇచ్చి సినిమా తియ్యమని చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి పోతురాజు జీవిత కథ ఏమిటి?అతనికి వాణి(రేష్మి)ఎలా పరిచయమవుతుంది.. తర్వాత ఏంటి అనేది కధాంశం.ప్రతి స్కీన్ మాస్ ఆడియాన్స్ కి దగ్గరగా ఉంది.నందు స్క్రీన్ మీద ఉన్నంత సేపు హై వోల్టాజ్ లో షాట్స్ ఉన్నాయి.ఈ టీజర్ లో హీరో శ్రీ విష్ణు వాయిస్ ఓవర్ ఇచ్చారు.దర్శకుడి కష్టం మరియు ఆలోచన పోతురాజు రూమ్ మరియు నాటక మండలి రూమ్ చూస్తే తెలిసిపోతుంది.డైలాగ్స్ కూడా బాగున్నాయి.ఒక్క ముక్కలో చెప్పాలంటే టీజర్ అదిరిపోయింది భయ్యా..!


ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సుజాత సిద్దార్థ్ సినిమాతోగ్రఫీ చేశారు.ఈ సినిమాను విజయీభవ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల,బోసుబాబు నిదుమోలు,ఆనంద్ రెడ్డి మద్ది మరియు మనోహర్ రెడ్డి ఏడా నిర్మించారు.దర్శకులు పూరి జగన్నాథ్ టీజర్ బాగుందని బాహాటంగా మెచ్చుకోగా.. మరో ప్రముఖ దర్శకులు సుకుమార్ వాట్సాప్ కాల్ ద్వారా అభినందించినట్లు హీరో నందు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.ఫస్ట్ లుక్.. టీజర్ తోనే అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సినిమా విడుదల తేది కోసం ఎదురుచూస్తు.. “బొమ్మ బ్లాక్ బస్టర్” కావాలని కోరుకుందాం..!

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్