23-09-2021 03:17:34 About Us Contact Us



ఈ నగరానికి ఏమైంది సినిమా ఫేమ్ సుశాంత్ రెడ్డి.. సిమ్రన్ చౌదరి మరియు కలర్ ఫోటో తో ఓ.టి.టి లో భారీ విజయం అందుకోవడంతో పాటు తన నటనకు విమర్శకులచే ప్రశంసలు అందుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి కలిసి నటించిన బొంభాట్ చిత్రం డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల కానుంది.నవంబర్ 28న.. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.వివరాలలో వెళ్తే…


రాఘవేంద్ర వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం బొంభాట్.ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.తాజాగా విడుదలైన ట్రైలర్ లో విజువల్స్ చాలా బాగున్నాయి.అటు మోడరన్ ఇటు సంప్రదాయ దుస్తులలో చాందిని చౌదరి చాలా అందంగా కనిపించింది.సుశాంత్ రెడ్డికి సోలో హీరోగా మంచి సినిమా కానున్నట్లు అనిపించింది.మానవ రోబో పాత్రలో సిమ్రన్ కనిపించడంతో తన ప్రతిభ చూపేందుకు మంచి అవకాశం లభించింది.. ట్రైలర్ చూస్తుంటే తను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఉంది.కామెడీ చేసేందుకు ప్రియదర్శి ఉందనే ఉన్నారు. జోష్ బి (జోశ్యభట్ల) నేపధ్య సంగీతం బాగుంది.సినిమా కధాంశంలోకి వెళ్తే..



చిన్నతనం నుండి బ్యాడ్ లక్ వెంటాడుతున్న మన హీరో విక్రమ్(సుశాంత్)కు.. అదే బ్యాడ్ లక్ వల్ల తను ప్రేమించిన చైత్ర(చాందిని చౌదరి) దూరమవుతుంది.ఈ బాధలో ఉన్న విక్రమ్..అప్పటికే చనిపోయిన ప్రోఫెసర్ ఆచార్య గారి కూతురు మాయ(సిమ్రన్ చౌదరి)ను కలుస్తాడు.అప్పటి నుండి లక్ తనకు అనుకూలంగా మారుతుంది.అలాంటి సమయంలో మాయ మానవ రూపంలో ఉండే రోబోట్ అని.. ఆ రోబోట్ ని మరో సైంటిస్ట్ వెంటాడుతున్నాడు అని తెలుస్తుంది.తర్వాత.. ఏం జరిగిందో?? తెలియాలంటే బొంభాట్ సినిమా చూడాల్సిందే..!


గాడ్(జి.ఓ.డి).. మస్తిస్.. కలర్ ఫోటో వంటి భారీ విజయాలు నమోదు చేసుకొని మంచి ఫార్మ్ లో ఉన్న చాందిని చౌదరి తన విజయపరంపర కొనసాగిస్తారేమో చూడాలి..తొలి సినిమా తోనే సైన్స్ ఫిక్షన్ సినిమాను చేసిన దర్శకుడు రాఘవేంద్ర వర్మ తాను చేసుకున్న కూర్పు తో… ఎంచుకున్న కధాంశంతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించారు.. మరి సినిమా ఎలా చేశారో చూడాలి మరియు సోలో హీరోగా హిట్ కొట్టి సత్తా చాటాలనుకుంటున్న సుశాంత్.. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.ఇప్పటికే పాటలతో తన సత్తా చాటిన సంగీత దర్శకుడు జోస్యభట్ల.. తనకు ఇది మంచి పేరు తెస్తుంది అని ఆశిస్తున్నారు.మానవ రోబో లా నటించిన సిమ్రన్ చౌదరి సైతం ఈ సినిమాతో తన నటనకు మంచి ప్రశంసలు వస్తుంది అని నమ్మకంతో వున్నారు.మరో విషయం ఏమిటంటే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఈ సినిమాను సమర్పించారు.


ఇలా బొంభాట్ చిత్ర బృందం కొత్తగా ప్రయత్నించి.. సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు.సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వ తేదీ వరకు ఆగాల్సిందే.అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న బొంభాట్ చిత్రం విజయం సాధించాలని మా బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం..!

బొంభాట్ ట్రైలర్