25-01-2022 15:49:40 About Us Contact Usచిత్తూరు జిల్లా మదనపల్లె లో ప్రభుత్వ అధికారి కుటుంభంలో జనించింది బిందు మాధవి..నాన్న ప్రభుత్వ ఉదోగి కావడంతో తిరుపతి,నెల్లూరు,గుంటూరు,తెనాలి,విజయవాడ,హైదరాబాద్ ఇలా అన్ని చోట్ల చిన్నతనంలో తిరిగేసారు..ఆ తర్వాత తమిళనాడులో వి.ఐ.టి లో బీటెక్ చేసి మోడలింగ్ వైపు అడుగులు వేశారు..తండ్రి సినిమాలు వద్దని వారించడంతో 8 నెలలు మాట్లాడటం మానేసిన ఆమె..చివరకు ఒపించారు..తొలుత కొన్ని యాడ్ లలో కనిపించడం..


ఆ తర్వాత2008 శేఖర్ కమ్ముల గారి ముద్దపప్పు ఆవకాయ సినిమాతో తెరంగేట్రం చేశారు..తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు..2009లో బంపర్ ఆఫర్ తో తనకంటూ అభిమానులను పొందారు..2010లో ఓం శాంతి..రామ్ తో కలిసి రామ రామ..కృష్ణ..కృష్ణ లో నటించారు..ఈ సినిమా కూడా ఘానా విజయం సాధించింది..2011లో నానితో పిల్ల జమిందార్ లో చేశారు..ఈ సినిమా నాని కెరీర్ లోనే ఒక పెద్ద విజయవంతమైన సినిమాగా నిలిచింది..2008 నుంచే తెలుగుతో పాటు వరసగా తమిళంలోను సినిమాలు చేస్తూ వచ్చారు..2012 తర్వాత బిందు మాధవి తెలుగులో కనిపించలేదు..మధ్యలో కేడి బిల్లా..కీలది రంగ అనే తమిళ సినిమాతెలుగులో అనువాదమయ్యింది..


2015లో సినిమాలో నటించినా అది పెద్దగా గుర్తింపు పొందలేదు..2008నుంచి ఇప్పటి వరకు 20కి పైగా సినిమాల్లో నటించినా తెలుగు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి..సినిమాలు తక్కువైనా తెలుగు ప్రేక్షకులకు ఆమె ఇంకా గుర్తున్నారు అంటే ఆమె ఎంచుకున్న పాత్రలు అలాంటివి..మరో పక్క బంపర్ ఆఫర్..ఆవకాయ బిర్యానీ సినిమాలలో రెండు వైవిధ్యమైన పాత్రలను బాగా చెయ్యడంతో ఆమె ఇంకా తెలుగు వారికి గుర్తున్నారు..ఇప్పుడు తిరిగి మళ్ళీ మస్తీ’స్ అనే వెబ్ శ్రేయస్ ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు..ఆహా అప్ లో ఉన్న ఈ సిరీస్ ను ఇప్పటికే 10మిలియన్ మంది చూసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించారు..దింతో బిందు రి-ఎంట్రీ అదిరింది అనే చెప్పాలి..


తమిళ బిగ్ బాస్ సీజన్ 1 లో పోటీ చేశారు..అటు తమిళనాట ఇటు తెలుగులో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బిందు మాధవి నుండి నేటి తరం అమ్మాయిలు నచ్చిన రంగంలోకి వచ్చేటప్పుడు ఇంట్లో ఒపించేందుకు ఎంత పట్టుదలతో ఉండాలో నేర్చుకోవాలి..అలానే అపజయాలకు కుంగిపోకుండా ఓపికతో ముందుకు అడుగు వెయ్యడం నేర్చుకోవాలి..మస్తిస్ తో తిరిగి తెలుగులోకి రావడం..వస్తూనే మంచి విజయం సాధించిన బిందు మాధవి..తిరిగి తెలుగులో మంచి సినిమాలు చెయ్యాలని..మనందరిని మళ్ళీ అలరించాలని కోరుకుందాం..


మహిళా సాధికారతలో భాగంగా చిత్ర పరిశ్రమలో ఉన్న తెలుగువారిని గౌరవించుకునే క్రమంలో నేడు విందు మాధవి పై ప్రత్యేక కథనం..రేపు ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా అడుగు పెట్టి..ఒక కామెడీ షో తో మంచి పేరు సంపాదించుకొని..ఇప్పుడు హీరోయిన్ గా..నటిగా వరస హిట్స్ తో దూసుకుపోతున్న రంగమత్త “అనసూయ భరద్వాజ్”పై వ్యాసము..