05-03-2021 09:44:39 About Us Contact Us


ఏడాదికి ఆరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చే అల్లరి నరేష్ ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గించాడు ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ మీ తీర్చడానికి ఒకే రోజు రెండు చిత్రాల ట్రైలర్ లతో మన ముందుకు వచ్చాడు మన అల్లరోడు..బంగారు బుల్లోడుగా రానున్న అల్లరి నరేష్ :-


కామెడి సినిమాలు మాత్రమే కాకుండా మంచి వినూత్నమైన సినిమాలు అడపాదండపా చేస్తూ వచ్చే మన అల్లరి నరేష్ మళ్ళీ తన మార్క్ కామెడీని చూపించడానికి బంగారు బుల్లోడు చిత్రంతో సిద్ధం అయ్యాడు.


ఇక ఈ చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే బ్యాంకులో పని చేసే బంగారు రాజుగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. లాకర్ లో పెట్టిన నగలు వేరే వాళ్ళకి ఇస్తూ మళ్ళీ తిరిగి పెట్టేస్తూ ఉండగా అందులో కొంతమేరా బంగారం కనిపించకుండా పోవడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకేక్కించాడు దర్శకుడు గిరి పలిక.అలనాటి బాలయ్య బాబు బంగారు బుల్లోడు చిత్రంలోని స్వాతిలో ముత్యమంతా పాట ని మళ్ళీ ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయడం విశేషం.


Ak ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కి జోడిగా పూజ ఝావేరి నటించగా ఇంకా ముఖ్య పాత్రాల్లో తనికెళ్ళ భరణి, పోసాని, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.. సాయి కార్తీక్ సంగీతం సమాకూర్చగా సతీష్ ముత్యాల కెమరామెన్ గా పని చేసిన ఈ చిత్రాన్ని జనవరి నెలలోనే విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది.


నాందిలో విలక్షణ పాత్రలో కనిపించునున్న అల్లరి నరేష్ :-


కామెడీ చిత్రాలతో పాటు సీరియస్ పాత్రలను కూడా చేయగల నటుడు అల్లరి నరేష్ మరొక్క సారి అలాంటి పాత్రలోనే ప్రేక్షకులను అలరించునున్నాడు..NS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దర్శకుడు సతీష్ వేగష్ణ నిర్మాత గా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో క్రాక్ లో విలక్షణ నటనలో అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించారు.


ఇక ట్రైలర్ అంతా సీరియస్ గానే చూపించారు అల్లరి నరేష్ వాయిస్ తో వచ్చే డైలాగ్ లు “15 లక్షల మంది ప్రాణ త్యాగం చేసుకుంటేనే కానీ మన దేశానికీ స్వాతంత్ర రాలేదు..1300 పైగా బలిదానాలు చేసుకుంటే కానీ ఒక రాష్ట్రం ఏర్పడలేదు..ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్బం చరిత్రలో ఒకటి లేదు…నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ న్యాయం గెలవాలి న్యాయమే గెలవాలి ” ఈ డైలాగ్ తో న్యాయం కోసం పోరాడే ఒక యువకుడిగా అల్లరి నరేష్ కనిపించునున్నాడు అని అర్ధం అవుతుంది.


విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా సీద్ కెమరామెన్ గా వ్యవహారించారు.


ఈ రెండు చిత్రాలు అల్లరి నరేష్ కెరీర్ లో మైలురాయిగా నిలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.