25-01-2022 17:03:45 About Us Contact Us


2004,ముంబయిలో నటన,డాన్స్ వచ్చో,రాదో తెలియని ఒక కన్నడ అమ్మాయి తెలిసిన వారు చెప్పారని అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ గారు నాగార్జున గారి సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో కలిసింది.ఆ రోజుకి ఆమెకు సినిమా గురించి ఎంతలా తెలుసంటే ఫోటోలు ఇమ్మని అడిగితే పాస్ పోర్ట్ ఫోటో ఇచ్చేంత.చూసేందుకు అందంగా కనపడడంతో ఆ యోగా టీచర్ ని హైదరాబాద్ రమ్మన్నారు మన పూరి.

అలా విమానం ఎక్కిన ఆమె,విమనంలోనే దర్శకులు వై.వి.యెస్.చౌదరి గారి కంట పడింది.విమానంలొనే చౌదరి గారు సినిమాలలో చేసే ఆలోచన ఉందా అని అడగగా నేను సినిమా చేసేందుకే హైదరాబాద్ బయలుదేరాను అని చెప్పింది ఆ అమ్మాయి.ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో ససీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారిని కలిసింది,ఆ రోజే ఆయన ఆమె గొప్ప నటి అవ్వడం ఖాయం అని చెప్పరాట ఆమెకు,నాగార్జున గారికి.

ఇలా తొలి సినిమా చెయ్యక ముందే ముగ్గురు దర్శకుల ప్రశంస పొందిన ఆమె పూరి గారి దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో తెరంగేట్రం చేసి,మంచి మార్కులే కొట్టేసింది.మూడవ సినిమాతో రాజమౌళి,రవితేజ కలయికలో వచ్చిన మాస్ మూవీ ‘విక్రమార్కుడు’లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.అలా నాలుగు సంవత్సరాలు గడిచే సరికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి నుండి అందరి హీరోలతో కలిసి 13 సినిమాలు చేసేసింది ఆ హీరోయిన్.

2009 ఆమె సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.ఇలయథాలపతి విజయ్ తో వేటైకరణ్ అనే సినిమా తో రెండవసారి తమిళంలో ఒక సినిమా చేసింది ఆ ముద్దు గుమ్మ.ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్,అదే సంవత్సరం ఇక్కడ తెలుగులో ప్రభాస్ తో చేసిన బిల్లా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది.ఇంతటితో అయిపోలేదు అదే సంవత్సరం ఈ రెండింటికి ముందు విడుదలయ్యింది అరుంధతి.ఆ సినిమా రికార్డ్స్ మాత్రమే కాక ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చింది.ఇదే ఆమె చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా.అక్కడ నుండి తిరిగి చేసుకున్నది లేదు.

2009-2019 వరకు పది సంవత్సరాలలో అటు తెలుగు ఇటు తమిళంలోని అగ్ర కధానాయకులందరితో కలిసి నటించింది.తమిళంలో రజినీకాంత్,అజిత్,విజయ్ ల నుండి సూర్య,కార్తీ,సింబు,ఆర్యల దాక ఇటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,మహేష్ బాబు ల నుండి అల్లు అర్జున్,ప్రభాస్,రానా దాక ఎదరితోనో చేసింది.
అంతేనా అరుంధతి తో మొదలై పంచాక్షరీ,రుద్రమదేవి,సైజ్ జీరో,భాగమతి అంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.తెలుగు,తమిళ భాషతో పాటు,డాన్స్ కూడా నేర్చుకుంది.కళ్ళతో హవాభావాలు పలికించడంతో పాటు తన శరీరం మొత్తం పాత్రకు తగ్గట్లు మార్చడం,ఆమెకు సినిమా పట్ల గౌరవం,పాత్ర కోసం ఆమె పడే తపన కనిపిస్తుంది.అందరితో మంచిగా మాట్లాడడం,తెలిసిన వారికి సహాయపడటం,క్రమశిక్షణ,చెప్పిన సమయానికి లొకేషన్ కి రావడం,ఫిట్ నెస్ వంటి ఏనో మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆమె 40కి పైగా సినిమాలు చేయగలిగారు.

అందరి హీరోయిన్లలా గ్లామరస్ పాత్రలు మాత్రమే కాక ఎంతో ప్రతిష్టాత్మక బాహుబలిలో దేవసేన,సైరా,రుద్రమదేవి సినిమాలలో రుద్రమదేవి పాత్ర చెయ్యడం.వేదం సినిమాలో సరోజ పాత్ర,సైజ్ జీరో సినిమాలో స్వీటీ పాత్ర,అరుంధతి,భాగమతి పాత్రలతో ఆమెకు ప్రేక్షకులలో గౌరవం వచ్చింది.2004 పేరు అడిగితే అమాయకంగా స్వీటీ అని చెబుతూ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె ఇప్పుడు అనుష్క శెట్టి గా దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ గా ఒక్క వెలుగు వెలుగుతున్నారు.ఇప్పుడు రానున్న నిశ్శబ్దం సినిమాతో మాట మాట్లాడకుండా నటిస్తూ,నటిగా మంచి పాత్ర తెచ్చే మరో పాత్ర చేస్తున్నారు.

వెండితెరకు పరిచయమై ఒక్కతిన్నర దశాబ్దం (15 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న అనుష్క మరెనో సంవత్సరాలు సినిమాలు చేస్తూనే ఉండాలి అని కోరుకుంటూ తెలుగు ప్రేక్షకుల తరపున,చిత్ర పరిశ్రమ తరపున,ముఖ్యంగా ఆమె అభిమానుల తరపున,మా బి.ఆర్.మూవీ జోన్ టీం తరపున అభినందనలు,శుభాకాంక్షలు..!