25-01-2022 16:13:44 About Us Contact Usఅంజలి.. తెలుగు ప్రేక్షకులకు సీత.. ఇంట్లో బేబీ.. అసలు పేరు బాల త్రిపుర సుందరి అంజలి.. పుట్టింది నర్సాపురం..చదివింది రాజోలు.. వెళ్ళింది చెన్నై.. అక్కడే మోడలింగ్.. తెరంగేట్రం.. తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు తీసిన మన తెలుగమ్మాయి “అంజలి” .. అందంతో కూడిన అభినయం ఆమె సొంతం.. చక్కనైన గొంతు.. దింతో కుర్రాల మది చెదకొట్టేశారు.. ఐదు రాష్ట్రాల్లోని కోట్లాదిమంది.. అభిమానులుగా మారిపోయారు..”కట్టర్ పంటి”తో తమిళంలో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న అంజలి.. షాపింగ్ మాల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. జర్నీ తో రెండు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక నేటి తరానికి తొలి పెద్ద మల్టీ స్టార్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు తో ప్రతి తెలుగు వారింట్లో.. వారి అమ్మాయిగా మారిపోయారు.. తొలి సినిమా నుండే సొంత డబ్బింగ్ చెప్తు తమిళ్,తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన అంజలి గారి పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె గురించి కొన్ని విషయాలు..


నర్సాపురంలో సెప్టెంబర్ 11న జన్మించిన అంజలి.. చదువంతా రాజోలు లోనే చేశారు.. ఇంటర్ చదివేందుకు చెన్నై లో ఉన్న పిన్ని దగ్గరకు వెళ్ళింది.. మోడలింగ్ చేస్తూ.. డాన్స్ నేర్చుకుంటున్న అంజలికి 2007లో తొలి సినిమా కట్టర్ పంటి సినిమాలో జీవ పక్కన నటించే అవకాశం లభించింది.. అప్పటికి తమిళం రాని ఆ తెలుగమ్మాయి.. ఏదో ఒక పాటకు ముందు నాలుగు మాటల కోసం తన గొంతుతో చెప్పమంటే ఆ వాయిస్ నచ్చడంతో.. నటన మొత్తం తెలుగులో డైలాగ్ చెప్పిన తను.. సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది.. రాని తమిళంలోనే డబ్బింగ్ చెప్పిన తను.. ఇక తెలుగులో ఎందుకు చెప్పరు.. ఇక్కడా చెప్పేశారు.. తొలి సినిమా బ్లాక్ బస్టర్.. ఆ తర్వాత షాపింగ్ మాల్.. జర్నీ ఇలా తమిళంలో హిట్ మీద హిట్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు అంజలి.. అప్పటికే 15 సినిమాలు దాటేశాయి..


అప్పుడు 2012లో ప్రతిష్టాత్మక సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి పక్కన జోడిగా అవకాశం వచ్చింది.. తెలుగులో అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న అంజలికి తెలుగులో సైతం స్టార్దం తెచ్చిపెట్టింది ఆ సినిమా.. ”ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంటే..” అంటూ తను చెప్పిన మాట.. మరో దశబ్దమైనా మనకు గుర్తుండిపోతుంది.. 2012లో మాస్ మహరాజ్ రవితేజ గారితో బలుపు.. వెంకటేష్ గారితో మసాలా తో వరసగా హాట్ట్రిక్ హిట్లు అందుకున్నారు.. 2014లో వచ్చిన గీతాంజలి సినిమాతో తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే అద్భుతమైన హిట్ అందుకున్నారు.. ఆ సినిమాతో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది.. నిఖిల్ తో శంకరాభరణం.. నతరత్న బాలకృష్ణ గారితో డిక్టేటర్.. అల్లుఅర్జున్ రసుగుర్రంలో స్పెషల్ సాంగ్ ఇలా తెలుగులో కూడా బాగా పేరు తెచ్చుకున్నారు అంజలి.. గతకొంత కాలంగా తమిళంలో వరుస సినిమాలలో బిజీగా ఉన్న అంజలి ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్దం.. వకీల్ సాబ్ సినిమాలతో మన ముందుకు రానున్నారు..


పదమూడు సంవత్సరాలు.. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. నాలుగు భాషలు.. నలబై ఆరు సినిమాలు.. ఒక హీరోయిన్ కి ఇంత బ్రహ్మదమైన లాంగ్ జర్నీ.. అందులోనూ మన తెలుగుమ్మాయికి ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ దక్కలేదనే చెప్పాలి.. కష్టాలు.. కన్నీళ్లు.. విజయాలు.. ఆనందాలు అంటూ అన్నిటినీ చేసేశారు అంజలి.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు.. వాటిల్లో నుంచి ఏది మంచి రోల్ అనేది గుర్తుపట్టి సినిమాను ఎంపిక చేసుకున్నారు అంజలి.. రాని భాషలో డబ్బింగ్ చెప్పిన ఆమె పట్టుదలను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. ఫిట్ నెస్ కోసం నిత్యం వర్క్ ఔట్ చేస్తూ ఆఖరికి క్యారివాన్ లో కూడా ఆసనాలు వేస్తుంటారు అంజలి..


అనేక భాషల్లో విడుదల కానున్న నిశ్శబ్దం.. మరో పక్క వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్న అంజలి.. ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని.. మరిన్ని సంవత్సరాలు ఇలానే సినిమాలు చేస్తూ మనల్ని అలరించాలి అని కోరుకుందాం.. అలానే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అంజలి గారికి మా బి.ఆర్. మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు..