25-01-2022 15:48:27 About Us Contact Usఅబ్బయిలకు అసూయ కలిగించే ఎత్తు..అమ్మయిలకు ఈర్ష కలిగించే అందం..బుల్లి తెరతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై..జబర్దస్త్ తో స్టార్ యాంకర్ గా మారి..సోగ్గాడే చిన్నినాయనా తో వెండితెర పై కనిపించి..క్షణంతో నటనకు మార్కులు కొట్టేసి..ఒక పక్క అందం మరో పక్క నటనతో..అటు బుల్లి తెర పై షోలు..ఇటు వెండితెర పై సినిమాలతో అదరకొడుతున్నారు మన రంగమత్త “అనసూయ భరద్వాజ్..”అనసూయ బాల్యం..చదువు అంతా హైదరాబాద్ లోనే..విద్యార్థి దశలో ఎన్.సి.సి లో చురుకుగా పాలుగున్నారు..ఎంబీఏ చేసి మీడియా వైపు అడుగులు వేశారు అనసూయ..


ప్రముఖ న్యూస్ ఛానల్ సాక్షి లో గుడ్ మార్కింగ్ ఆంధ్ర ప్రదేశ్ తో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యారు..ఆమె బులిటన్ చివర్లో వచ్చే బిజినెస్ న్యూస్ లో అంఖ్యలను తెలుగులో చెపేందుకు కష్టపడుతూ కొన్ని ఆంగ్లంలో చెప్పేవారు..కొందరు ఆమెను తప్పు పట్టినా చాలా మంది నవ్వుకున్నారు..తెలుగులో చెప్పడం రాక ఆమె కష్టపడితే..అది ఆమెను ప్రేక్షకులకు ఒక రకంగా దగ్గర చేసింది..ఆ తర్వాత అదే ఛానల్ లో దిల్ సే అనే షో తో మంచి మార్కులు కొట్టారు..అక్కడ నుండి సినిమా రంగం వైపు అడుగులు మొదలు పెట్టారు..ఆ తర్వాత మా మ్యూజిక్ లో వీడియో జాకీ గా చేశారు..అక్కడ నుండి వేరే షో కు తొలుత ఎంపికై అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది..ఆ తర్వాత జబర్దస్త్ లో అనసూయను ఎంచుకున్నారు..అక్కడ నుండి తెలుగు ప్రజలకు తెలిసిందే..


జబర్దస్త్ షో లో కామెడీ ఎంత హైలైటైయిందో..అనసూయ ఎంట్రీ డాన్స్..ఆమె కాస్ట్యూమ్ అంటే హైలైటైంది..అనసూయ ఎంట్రీ డాన్స్ కి తెలుగు రాష్ట్రాలలో చాలా మంది అభిమానులు వున్నారు..జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులను బుల్లి తెరపై అలరిస్తున్న అనసూయకు వెండితెర అవకాశం 2016లో సోగ్గాడే చిన్నినాయనా తో వచ్చింది..తొలి అవకాశమే కింగ్ నాగార్జునతో రావడం..అందులో ఉన్నది కాసేపైనా అనసూయకు మంచి గుర్తింపు లభించింది..అదే సంవత్సరం వచ్చిన క్షణం తో విమర్శకుల ప్రశంసలు పొందింది..2017లో విన్నర్ సమయానికి తన పై సాంగ్ రాసే స్థాయికి వెళ్ళింది..ఆ పాటతో అనసూయ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు..2018లో వచ్చిన రంగస్థలంతో తన సినీ కెరీర్ లో గుర్తుందిపోయే పాత్ర చేసింది..


నటీనటులు సినీ ప్రస్థానంలో ఎన్ని పాత్రలు చేసినా కొన్ని పాత్రలు ప్రేక్షకుల మదిలో మిగిలిపోతాయి..అనసూయ సినీ జీవితంలో రంగమత్త అలాంటి పాత్రే..పాత్ర ఎంత స్థాయిలో ప్రేక్షకులకు చేరింది అంటే..రంగస్థలం విజయోత్సవ వేడుక జరుగుతుంది..అక్కడ వేడికపైన ముఖ్య అతిధిగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు..రామ్ చరణ్ నుండి మొత్తం టీం స్టేజి మీదకు వస్తున్నారు..కానీ ప్రేక్షకుల నుండి రంగమత్తను పిలవడం లేదని ఒక్కటే అరుపులు..ఒక దశలో ఆ అరుపులు ఆ వేదికపై ఉన్న స్టార్ లకు కూడా వినిపించాయి..అప్పుడు యాంకర్ పిలుపుకు వేదికపైకి వచ్చిన అనసూయకు ప్రేక్షకుల కేరింతలతో ఘనస్వాగతం పలికారు..ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆ పాత్ర ఎంతలా ప్రజలకు చేరిందో చెప్పడానికి..


తనకంటూ ఎప్పుడు ఒక గిరి గీసుకు కూర్చోలేదు అనసూయ..తెలుగమ్మాయి..పెళ్లయింది..పిల్లలు ఉన్నారు కనుక ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని ఆలోచించలేదు..తన వృత్తికి ఏది అవసరమో అది చేశారు..అందంగా కనిపించేందుకు ఆమె కొన్ని బట్టలు వేసుకొని ఉండచ్చు కానీ ఎక్కడా అసభ్యకరంగా ఉండవు..అనేకసార్లు సామాజిక మాధ్యమాలలో అనసూయ పై ట్రోల్స్ వచ్చేవి..దీనికి ఎదురు నిలిచి సమాధానం చెప్పారు..కొన్ని సార్లు ఆమె ఎమోషనైనా..ఆమె ధైర్యాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి..బయటకు వచ్చి మాట్లాడడం మాములు విషయం కాదు..దీనికి అనసూయకు మెచ్చుకోవాల్సిందే..ఆ సమయంలో ఆమె ఒక మాట అన్నారు..తెలుగమ్మాయిలు ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని ఆలోచిస్తే..తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ వేరే రాష్ట్రపు అమ్మాయిలే హీరోయిన్లుగా వుంటారు..నూటికి నూరు శాతం ఆమె మాటల్లో అర్థం ఉంది..తెలుగువారు వేసుకుంటే వచ్చే తప్పు వేరే రాష్ట్రం అమ్మాయిలు హీరోయిన్లుగా వేసుకుంటే తప్పు లేదా!?మార్పు ఎక్కడో ఒక్క దగ్గర నుండి మొదలవ్వాలి..కానీ నా నుండి అవ్వాలి అని తొలి అడుగు వేసేవాళ్ళు చాలా తక్కువమంది..అలా తొలి అడుగు వేసిన అనసూయకు హాట్స్ ఆఫ్..


సినీ రంగంలోకి రావాలి అని కోరుకునే తెలుగుమ్మాయిలు అనసూయ నుండి ధైర్యం..పట్టుదల..నమ్మిన దాని వెంట నడవడం..క్రమశిక్షణ నేర్చుకోవాలి…ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి అడుగు పెట్టిన అనసూయ రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని..కథానాయికగా కూడా అనేక సినిమాలు చెయ్యాలని ఆశిస్తూ..నేడు పుట్టిన రోజు జరుపుతుంకున్న అనసూయ గారికి మా బి.ఆర్ మూవీ జోన్ తరపున్న..ముఖ్యంగా అనసూయ గారి అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు..


మహిళా సాధికారతలో భాగంగా నేడు అనసూయ గారిపై కథనం..రేపు మరొక్కరి పై వ్యాసములో కలుదాం..