21-01-2021 18:02:12 About Us Contact Us



బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్,అను ఇమ్మాన్యూల్ ప్రధాన పాత్రలో కందిరిగ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు తెరకేక్కించిన “అల్లుడు అదుర్స్ ” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. పక్కా కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సోను సూద్ ముఖ్యపాత్రలో నటించారు.


ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు సామాజిక మధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణిలు సమాకూర్చారు. ఇటీవల బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న మోనాల్ గజ్జర్ ప్రేత్యేక గీతంలో అలరించునుంది ఈ పాట అత్యధిక బడ్జెట్ తో విజవల్ వండర్ గా తెరకేక్కించారు అని చిత్రబృందం తెలియచేసారు.


సుమంత్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ మీద గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి చోటా.కె.నాయుడు చూపించిన విజువల్స్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


టీజర్ కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం వినసొంపుగా ఉంది మరియు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి అదనపు హంగులు అద్దుతుంది అని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసారు. సంక్రాంతి కానుకగా వస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అందరించాలని ఆశిద్దాం.