25-01-2022 17:02:45 About Us Contact Usతెలుగువారి ‘అల్లు అర్జున్’..కేరళలో ‘మల్లు అర్జున్’. పేరు ఏదైనా స్టైలిష్ స్టార్ కి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు కేరళలో క్రేజ్ మాత్రం పీక్స్ లో ఉంటుంది.ఇక అమ్మాయిల గురించి చెప్పాలి అంటే పొరపాటున అల్లు అర్జున్ ఫోటో షూట్ కేవలం అమ్మాయిలకు మాత్రమే అని ప్రకటిస్తే కనీసం రెండు మూడు రోజులు పడుతుంది బన్నీ అందరికి ఫోటోలు ఇచ్చేసరికి.కొంచం గ్యాప్ తర్వాత వచ్చిన అల వైకుంటపురములో.. తో కెరీర్ లో అతి పెద్ద హిట్ అందుకొని ఆనందంగా ఉన్న ‘స్టైలిష్ స్టార్’.. ‘సౌత్ ఇండియన్ మైకెల్ జాక్సన్’.. ‘మైన్యుట్ ఎక్స్ప్రెషన్ కింగ్’.. ‘అల్లు అర్జున్’ గారికి ఏప్రిల్ 8న,38వ జన్మదిన శుభాకాంక్షలు..!అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం కొన్ని విషయాలు..!

‘అల్లు అర్జున్’ ప్రముఖ హాస్య నటుడు “అల్లు రామలింగయ్య” గారి మనవడు.. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ అధినేత ‘అల్లు అరవింద్’ గారి కుమారుడు.ఇక ‘మెగా స్టార్ చిరంజీవి’,’పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ గార్ల అల్లుడు,కానీ తనకు స్టార్ డమ్ అంత ఈజీగా రాలేదు.1985లొనే ‘మెగాస్టార్ చిరంజీవి’ గారి విజేత సినిమాతో బాల నటుడిగా తెలుగు వారికి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత 86లో ‘కమల్ హాసన్’ గారితో కలిసి “స్వాతి ముత్యం”లో నటించాడు.ఇలా చిన్న వయసులోనే స్టార్ హీరోలతో కలిసి నటించాడు బన్నీ.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 2001లో మళ్ళీ మెగాస్టార్ సినిమా “డాడీ” లో కాసేపు డాన్స్ చేశాడు.


ఇక 2003లో ‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు’ 100వ సినిమా “గంగోత్రి” తో హీరోగా పరిచయం అయ్యాడు.సినిమా అయితే భారీ విజయం సాధించింది,పాటలు,లవ్ స్టొరీ,ఏక్షన్ సీన్స్ ఇలా అన్నిటికీ మంచి మార్కులు పడ్డాయి.కానీ అల్లు అర్జున్ పై మాత్రం కొన్ని విమర్శలు వచ్చాయి.నటన పై మాత్రం కాదు,చూడటానికి హీరోలా లేడు అనేది విమర్శ,అది చిన్నతనం అని కూడా లేకుండా కొందరు నోరు జారారు..అలాంటి విమర్శని సినీరంగంలో ఏ అనుభవం లేని ఆ 20ఏళ్ల కుర్రాడు ఎలా తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు.తనలో కసి పెరిగింది..లుక్ మార్చి 2004లో సుకుమార్ తో కలిసి “ఆర్య” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ ఒక్క సినిమాతో అమ్మాయిలను ఫిదా చేసేశాడు.. భారీ విజయం అందుకున్న ఈ సినిమా బన్నీ ని యువతకు బాగా చేరువ చేసింది.వెంటనే 2005లో వచ్చిన “బన్నీ”తో మాస్ ఆడియాన్స్ కి కూడా దగ్గరైపోయాడు.ఆ తర్వాత “హ్యాపీ”తో అందరిని అలరించాడు.ఇక 2006లో “దేశముదురు” సినిమాతో అల్లు అర్జున్ స్టార్దం అందుకున్నాడు.తెలుగులో తొలిసారి సిక్స్ పాక్ చేసిన హీరోగా చరిత్రలోకి ఎక్కాడు.పూరి జగనాథ్ క్యారక్టర్ కనుక దేశముదురులో బన్నీ అందరకీ దగ్గరైపోయాడు. ముఖ్యంగా యువత.. అందులోనూ అమ్మాయిలు బన్నీ కి తమ గుండెల్లో చోటు ఇచ్చేశారు.


ఆనాడు 2003లో గంగోత్రి లో చూసిన అబ్బాయేనా అనేలా చేశాడు. విమర్శించిన ప్రతి నోరు ఈ సినిమాతో మూత పడింది.స్టైలిష్ స్టార్ గా అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లు అర్జున్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.సినిమాలు హిట్స్,ప్లాప్స్ సంబంధం లేకుండా స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు బన్నీ.”పరుగు”తో క్లాసిక్ హిట్ అందుకున్న బన్నీ ఆ తర్వాత వైవిధ్య పాత్రలను చేశాడు.”ఆర్య2″,”వరుడు”,”వేదం”,”బద్రీనాథ్”ఇలా ఒక సినిమాకి మరో సినిమా కి సంబంధం లేని పాత్రలు పోషించాడు.”వేదం” సినిమాతో నేటి తరంలో తొలి మల్టిస్టార్ సినిమాని ‘మంచు మనోజ్’తో కలిసి అప్పుడే చేశాడు.


‘త్రివిక్రమ్’తో కలిసి “జులాయి”గా వచ్చి ‘పూరి’ చెప్పిన “ఇద్దరమ్మాయిలతో” రోమ్యాన్స్ చేసి,’సురేందర్ రెడ్డి’ కోసం “రేస్ గుర్రం” లా పరిగెత్తి,’చరణ్’ “ఎవడు” అని అడిగితే “సన్ ఆఫ్ సత్యమూర్తి” అంటూ ‘గుణశేఖర్’ “రుద్రమదేవి” కి సహాయపడి “సరైనోడు” అని ‘బోయపాటి’ చేత అనిపించుకున్న ‘హరీష్ శంకర్’ గారి “దువ్వడ జగన్నాధం” ,’వక్కంతం వంశీ’ “నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా”లో చేసి “అల వైకుంఠపురం” లోకి ‘గురూజీ’ తో వచ్చాడు ‘అల్లు వారి వారసుడు’,’హావభావాలను పాలకించగల నుత్యకారుడు’ ‘మగువుల మనసు దోచిన’ “బన్నీ”.


అలాంటి అల్లు అర్జున్ కి మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు మళయంలో సైతం పిచ్చ ఫాన్స్ ఉన్నారు.ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలి.నేను చెన్నై లో చదువునే రోజుల్లో జులాయి సినిమా విడుదలైంది.ఇంటర్వెల్ లో మా కాలేజీ కేరళ అమ్మయిలు కనిపించారు వారిని పలకరించాను..ఏ సినిమాకి అని అడగగా జులాయి అన్నారు. ఇక్కడ మళయంలో కూడా రిలీజ్ అయిందా అని అడిగితే లేదు అందుకే తెలుగు చూస్తున్నాం అని అన్నారు.నాకు ఒక దెబ్బకి ఏమి అర్థం కాలేదు మీకు ఎలా అర్ధమవుతుంది అని అడిగితే ఒక అమ్మాయి అక్కడ మల్లు అర్జున్ వున్నాడు అది చాలు భాష అవసరం లేదు అని చెప్పింది.ఆ రోజు ఒక తెలుగు వాడిగా తెలుగు హీరోకి కేరళ కుట్టిలలో ఫాలోయింగ్ చూసి గర్వ పడ్డాను.ఇది కేరళలో మన అల్లు అర్జున్.. వాళ్ళ మల్లు అర్జున్ ఫాలోయింగ్,ఇక తమిళం,కన్నడలో కూడా అల్లు అర్జున్ సినిమాలు బాగా ఆడుతుంటాయి,అంతేకాదు అక్కడ కూడా ఆయనకు అభిమానులు వున్నారు..!


బన్నీ కి సినిమా అంటే బాగా ఇష్టం,తన కుటుంభాన్ని మూడు తరాలుగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ అంటే గౌరవం అందుకే పరిశ్రమలో ఏ సినిమా హిట్ అయినా ఒక గ్రాండ్ పార్టీ ఇస్తుంటాడు.భాషల్లో తనకున్న పట్టు.. యాసల్లో వ్యత్యాసం.. ప్రతి చిన్న విషయంలో తనకున్న పట్టుకు నిదర్శనం తన సినమాలేనని చెప్పుకోవచ్చు.ఇక ఇప్పుడు సోషల్ మీడియా జమాన,నేడు ఆయన పేరు సామాజిక మాద్యమాలలో ఒక ట్రెండింగ్ టాపిక్..తన సినిమా విశేషాలు ఏమీ లేకున్నా నిత్యం ట్రేండింగ్ లో ఉంటుంది ఆయన పేరు.అలా ఏకంగా “అల్లు అర్జున్ ఆర్మీ” ఏర్పడింది,అల్లు అర్జున్ ఫోటోలు,పేరుని ఒంటి మీద పచ్చ బొట్లు పొడిపించుకుంటున్నారు.అది నేటి తరం యూత్ లో ఆయన క్రేజ్.ఇలా తన సినీ జీవితంలో తిట్లు,పొగడ్తలు,విజయాలు,పరాజయాలు అన్ని చూసిన బన్నీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని కోరుకుంటూ… “తెలుగు చిత్ర పరిశ్రమ” తరపున,”మెగా ఫాన్స్” తరపున మరీ ముఖ్యంగా “అల్లు అర్జున్ ఆర్మీ” తరపున మా “బి.ఆర్.మూవీ జోన్”బృందం తరపున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!