24-01-2022 17:09:16 About Us Contact Us“అఖిల్ అక్కినేని”,ఈ పేరు చెప్పగానే అందరికి ఎప్పుడో 1995లో వచ్చిన “సిసింద్రీ” సినిమా గుర్తుకొచ్చేది.సినిమా విడుదలై దాదాపు 20ఏళ్ళు అవుతున్నా అఖిల్ చిన్నతనంలో చేసిన అల్లరి ఎవరూ మర్చిపోలేరూ.తండ్రి నాగార్జునతో కలిసి ఆ రోజుల్లోనే అతి పెద్ద హిట్ అందుకున్నాడు,ఈ సినిమా తమిళంలో సైతం డబ్బింగ్ అయి అక్కడ కూడా విజయం సాధించింది.అతి చిన్న వయసులోనే సినిమాలో నటించి,భారీ విజయం అందుకోవడం,ఏ వారసుడుకి,ఆ మాటకు వస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ దక్కని,సాద్యంగాని ఫిట్.ఆ సర్కస్,జూ పార్క్,తన చిరు నవ్వు,ఇవేవీ 20ఏళ్ళు గడిచినా ప్రజలు మర్చిపోలేదు,అఖిల్ అంటే అలానే గుర్తు మనందరికీ.ఆ తర్వాత 2014లో “మనం” సినిమా విడుదలైంది,అందులో ‘అక్కినేని నాగేశ్వరరావు’ గారు,’నాగార్జున’ గారు,’నాగ చైతన్య’ కలిసి నటించారు అనే విషయం అందరికి తెలుసు,కానీ సరిగా సినిమా మరో 5 నిమిషాల్లో అయిపోతుంది అనగా ఒక డ్యుక్ బైక్ పై హెల్మెట్ తో ఒక కుర్రాడు,ఏఎన్నార్ గారికి లిఫ్ట్ ఇస్తాడు,రిస్క్ చేసి అందరిని కాపాడుతాడు,సరిగ్గా అక్కడే హెల్మెట్ తీస్తూ,నోటితో గ్లోవ్స్ తీస్తూ,స్లో మోషన్ లో నడుస్తూ వస్తాడు అఖిల్ అక్కినేని,అక్కడ అఖిల్ కోసం బాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.


అక్కినేని వంశం మూడవ తరం మరో వారసుడి రాకతో ఆ సినిమా పరిసామాప్తం అవుతుంది.దింతో అందరూ సిసింద్రీ పిల్లోడు హీరో అయ్యాడు అంటూ సినిమా హాల్స్ నుంచి బయటకు వచ్చారు.ఆ తర్వాత సినిమా కంటే ముందే యాడ్ లో కనిపించాడు,అంతకు కొన్ని సంవత్సరాల ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రికెట్ ఆడగా, తండ్రి టీం కోసం బ్యాట్ పట్టి అందరిని అప్పుడే అలరించాడు.ఇలా హీరోగా ఒక్క సినిమా చెయ్యకున్నా అఖిల్ కు మంచి క్రేజ్ వచ్చేసింది.అప్పటి వరకు అఖిల్ గురించి అడిగితే ఇంకా టైం ఉంది అని చెప్తూ వచ్చిన నాగార్జున సైతం అఖిల్ ని హీరోగా వస్తున్నట్లు ప్రకటించాడు.


“వి.వి.వినాయక్’ దర్శకవత్వంలో “అఖిల్” సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత మనం చేసిన ‘విక్రమ్.కె.కుమార్’ తో కలిసి అందరికి “హలో” చెప్పాడు.ఇక తాజాగా ‘వెంకీ అట్లూరి’ తీసిన “మిస్టర్.మజును” తో అమ్మాయిలకు ఎప్పటికి మన్మధుడుగా నిలిచిన ఏ.ఎన్.ఆర్,నాగార్జున వారసుడిగా అఖిల్ నిలిచాడు.చేసింది తక్కువ సినిమాలే అయినా అఖిల్ కి అమ్మయిలలో ఉన్న ఫాలోయింగ్ మాములుగా కాదు.మరి ఇప్పుడు “బొమ్మరిలు” ఫేమ్ ‘భాస్కర్’ దర్శకత్వంలో “Most Eligible బ్యాచ్లర్” అనే సినిమా తో మన ముందుకు రానున్నాడు.కరోనా లేకుంటే ఈ రోజుకి సినిమా విడుదల తేది కూడా ప్రకటించేవారు.సినిమా చిత్రకరణ మొత్తం అయిపోయినట్లే,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సెరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా వచ్చింది.


ఇలా అఖిల్ హీరోగా చేసింది మూడు సినిమాలు కానీ తెలుగు వారందరికీ బాగా దగ్గరయ్యాడు.సిసింద్రీ,మనం తో అక్కినేని కుటుంభం నుంచి తెలుగు వారి కుటుంబాలలో బాగమయ్యాడు.తల్లి అమలతో ఫోటోలు పెడుతూ అప్పుడప్పుడు సామాజిక మాద్యమాలలో సందడి చేసే అఖిల్,కరోనా సమయంలో వచ్చిన పుట్టినరోజు కనుక సినిమా విశేషాలు ఏమి ఉండవు కానీ తన కుటుంభంతో ఫోటో పెడుతున్నట్లు నిన్ననే ప్రకటించాడు.మీరు సైతం అలానే పంచుకోండి,ఇంట్లోనే ఉండండి అనే సందేశం అభిమానులకు ఇచ్చాడు.అఖిల్ సినిమా అనగానే అదేంటో ఎక్కడ లేని భారీ హైప్ సినిమాకి వస్తుంది అని పలువురు సినీ విశ్లేషకులు అంటుంటారు.ఇది చూస్తుంటే అఖిల్ కనుక మంచి హిట్ కొడితే అది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టడమే కాక ఇండస్ట్రీ మొత్తం చెప్పుకునే హిట్ అవుతుంది అని,ఇది అఖిల్ రేంజ్ అని అనిపిస్తూ ఉంటుంది.నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న “అఖిల్ అక్కినేని” ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి అని,భారీ విజయాలు సాధించాలని కోరుకుంటూ ‘అక్కినేని ఫాన్స్’ తరపున,’తెలుగు చిత్ర పరిశ్రమ’ తరపున,మా ‘బి.ఆర్.మూవీ జోన్’ టీం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు..!