05-03-2021 09:20:33 About Us Contact Us

తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యానటుడిగా అగ్ర తాంభూలం అందుకుని ప్రపంచంలో ఏ హాస్య నటుడు నటించని అన్ని సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి హాస్య బ్రాహ్మగా ఎనలేని కీర్తి సంపాదించిన నవ్వుల రారాజు బ్రాహ్మనందం గారి గురించి కొన్ని విశేషాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

1956 ఫిబ్రవరి 1 న గుంటూరు జిల్లా సత్తేనపల్లి నియోజకవర్గం ముప్పాల్ల వారు మండలం చాగంటి వారి గ్రామంలో కన్నెగంటి నాగలింగా చారి, లక్ష్మి దంపతులకు ఏడవ సంతానంగా జన్మించారు బ్రాహ్మనందం గారు.

బ్రాహ్మనందం నాన్న గారు అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు.. బ్రహ్మానందం గారు పుట్టిన తరువాత వల్ల అమ్మ గారికి గుర్రపువాతం రావడంతో అందరూ బ్రహ్మానందం గారిని తిడుతూ ఉండే వారు, కానీ అదృష్టవశాత్తు ఆమె అ వ్యాధి నుండి కోలుకున్నారు.

5వ ఏట నుండి శరబయ్య హైస్కూల్ లో 5వ తరగతి వరకు చదువుకున్నారు. సినిమాలు చూడాలి అని ఉన్నా ఆర్ధిక పరిస్థితి కారణం చేత ఏడాదికి ఒక సినిమా కూడా చూడటానికి కూడా డబ్బులు ఉండేవి కావు.ఏ చిన్న తప్పు చేసిన తిట్టేసేవారు వాళ్ల నాన్న గారు..10 క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అయన ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో స్నేహితుల సహాయంతో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు.

తరువాత కొంతమంది స్నేహితుల సహకారంతో PC సెంటర్ లో తెలుగు సాహిత్యంలో MA పట్టా పొందారు.తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు లెక్చరర్ గా పని చేస్తూన్నా కూడా మనసు అంతా సినిమాల వైపు ఉండేది

అలా జంద్యాల గారు దర్శకత్వం వహించిన అహనా పెళ్ళంటా చిత్రంలో అరగుండు పాత్ర ఇచ్చారు అ పాత్రతో ప్రాముఖ్యత సంపాదించుకున్నారు బ్రహ్మానందం గారు.ఇంకా ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో అలరించారు బ్రహ్మానందం గారు అయన స్క్రీన్ మీద కనిపిస్తేనే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించేవారు అయన పోస్టర్స్ చూసి బిజీనెస్ చేసుకున్న సినిమాలు ఎన్నో స్టార్ హీరోలకి దీటుగా పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగారు, ప్రతి రోజు సామాజిక మధ్యమాలలో మనం చూసే మిమ్స్ రూపంలో కూడా మెరుస్తూ ఉంటారు బ్రాహ్మనందం గారు.

అదుర్స్ చిత్రంలో బట్టుగా,వెంకీ, దుబాయ్ శీను, డాన్ శీను, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ఢీ, కింగ్ వంటి ఎన్నో గుర్తుండిపోయే పాతల్లో మెరిసారు ఇంకా ఇలాంటి పాత్రాలు మరెన్నో చెయ్యాలి అని ఆశిస్తూ

హాస్య బ్రాహ్మ బ్రాహ్మనందం గారికి BR మూవీ జోన్ తరువాత హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.