22-04-2021 12:26:01 About Us Contact Us
షాదీ ముబారక్ అంటున్న మన బుల్లితెర ఫేమ్ RK నాయుడు!

షాదీ ముబారక్ అంటున్న మన బుల్లితెర ఫేమ్ RK నాయుడు!


టెలివిజన్ తెరపై మొగలిరేకులు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సాగర్ RK నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో హీరోలు తెలియని వారు ఉంటారేమో గాని.. ఆయన తెలియని వరుండరేమో. అయన అంతగా చేరువ అయ్యాడు బుల్లితేర మీద. సీరియల్లో మంచి పేరు తెచ్చుకున్న మన సాగర్ RK నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత హీరోగా వెండితెరపై కనపడనున్నారు. ఇప్పటి వరకు అడపాదండపా అనేక చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించారు.ఇప్పుడు షాదీ ముబారక్ అంటూ మన ముందుకి రాబోతున్నాడు మన RK నాయుడు


ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి బ్యానర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా ఇప్పటికి విడుదలైన పాటలు.. టీజర్.. ట్రైలర్.. చాలా బాగా అందరిని ఆకట్టుకుంటున్నాయి. సునీల్ కాశ్యాప్ సంగీతం సమాకూర్చిన పాటలు మరియు టీజర్, ట్రైలర్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగా అందించారు. దింతో ఈ సినిమా గురించి సామాజిక మధ్యమాలలో చర్చ మొదలైంది. ద్రిస్య రఘనాథ్ కథనాయికగా నటించగా.. హీరో హీరోయిన్ల మధ్య పెళ్లి నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన అంశాలను చక్కగా తెరకేక్కించారు. అలాగే ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే విధంగా చిత్రాన్ని తెరకేక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర విజయం మీద చిత్ర బృందం ధీమాగా ఉన్నారు.


బుల్లితేర మిద అలరించిన RK నాయుడు గారు.. మార్చ్ 5న.. అంటే రేపు విడుదలవుతున్న షాది ముబారక్ చిత్రం ద్వారా వెండితెర మీద కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలానే ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు మంవహి పేరు రావాలని.. నేటి తరం యువతకు పెళ్లి పై ఉన్న అనేక సందేహాలకు ఈ సినిమా ఒక జవబావుతుందని.. ఆశిద్దాం.

నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!

నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!

Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే భారీ విజయం నమోదు చేసుకున్న దర్శకులు.. జయం సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరి.. నేనే రాజు.. నేనే మంత్రి.. సీత వంటి వరస విజయాలతో ఊపు మీద ఉన్న ఎందరో నటీనటులను పరిశ్రమకు పరిచయం చెయ్యడమే కాక.. తన సినిమాల్లో నటించే నటీనటులకు బాగా నటన నేర్పిస్తారని పేరు గడించిన తేజ గారి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..


దర్శకుడి తేజ బాల్యం అంతా మద్రాస్ లోనే గడిచింది. తన తండ్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు తీసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు,అలాగే వాళ్ళకి టెక్సటైల్ వ్యాపారం కూడా ఉండేది. మద్రాస్ లోని తొలి 10 సంపన్నుల కుటుంబాలలో తేజ గారి ఫ్యామిలీ కూడా ఒకటి. తేజ మద్రాస్ లోని గురుకుల పాఠశాలలో విద్యాబ్యాసం చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈయనకి సూపర్ సీనియర్. పాండి బజార్ వెళ్లి సినిమావకాశాల కోసం ప్రయత్నాలు చేసే వారు.. అలా ప్రయత్నలలో భాగంగా కెమరామెన్ రవి కన్నా దగ్గర అసిస్టెంట్ గా చేరి కెమెరా వర్క్ లో మెలకువలు నేర్చుకున్నారు.


అలా అక్కడ రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కు నాగార్జున తో శివ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకి కెమెరామెన్ గా తేజకి అవకాశం ఇద్దాం అనుకున్నాడు.. కానీ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు ఒద్దనడంతో ఆ అవకాశం చెయ్యి జారిపోయింది. బయట వాళ్లు సినిమాలు చేస్తే తనకి నచ్చిన టెక్నీషియన్స్ ని పెట్టుకోవడం కుదరడం లేదని.. తనే ఒక బ్యానర్ స్థాపించి రాత్రి అనే చిత్రం తీశారు అందులో తేజ కెమరామెన్. కెమెరామెన్ గా తేజ వర్క్ నచ్చి.. తరువాత తీసిన మనీ చిత్రానికి కూడా తేజ గారినే తీసుకున్నారు ఆర్.జి.వి.


తేజ బాలీవుడ్ లో బిజీ అయిపోయాడు.. తన బాలీవుడ్ చిత్రాలు అన్ని షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగేలా చూసుకునేవారు.. తన ఇంటికి సౌలభ్యంగా ఉంటుందని. అది తెలుసుకున్న రామోజీ రావు గారు తేజతో మాట్లాడి కథ ఉంటే చెప్పామన్నారు.. తను ‘చిత్రం’ కథ చెప్పారు.. 40లక్షల బడ్జెట్ లో సినిమా పూర్తి చేశారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది తరువాత నితిన్ కథనాయకుడిగా జయం, నవదీప్ తో జై.. సూపర్ స్టార్ మహేష్ తో నిజం.. ఇలా 13 ఏళ్ళ సినీ జీవితంలో 13 చిత్రాలు తీశారు తేజ.


వరస విజయాలతో జోరు మీద ఉన్న తేజ.. తనకి భారీ విజయాన్ని అందించిన చిత్రంకి కొనసాగింపుగా చిత్రం1.1 ని తెరకేక్కిస్తున్నారు. ఇప్పటి మన స్టార్ హీరోలకి కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలు అందించిన తేజ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం.


ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి 

ఫిబ్రవరి26న.. “అక్షర”గా అలరించునున్న “నందిత  శ్వేత”!

ఫిబ్రవరి26న.. “అక్షర”గా అలరించునున్న “నందిత శ్వేత”!

Nandita Swetha Akshara : విభిన్న కథలతో.. విచిత్రమైన పాత్రలు చేస్తున్న నందిత శ్వేత ప్రధాన పాత్రలో.. విద్యావిధానంలో నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అర్థంపడుతూ.. త్రిల్లర్ జోనర్ లో వస్తున్న చిత్రం “అక్షర”. ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. పాటలకు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రం బృందం.. ఈ సినిమాను ఈ నెల (ఫిబ్రవరి)26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే..


నిఖిల్ కథనాయకుడుగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి పేరు తెచ్చుకుని తరువాత అనేక చిత్రలాలో మెరిసిన నటి నందిత శ్వేత తదుపరి చిత్రం “అక్షర”. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో వస్తున్న అక్షర చిత్రంలో నంధితా తో పాటు శకలక శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. విద్యా వ్యవస్థ మీద పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్ర ట్రైలర్ ని చిత్రం బృందం ఇటీవలే విడుదల చేసింది.


ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యా నారాయణో సిరి.. అని అడ్డగోలుగా ఫీజులు పెంచి చదువు సామాన్యుడి నుండి దూరం చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యలకి దీటుగా నిలబడి పోరాటం సాగించే యువతిగా నందిత శ్వేత నటించారు. చదువు ని డబ్బుతో కొనుక్కోవడం తప్పు అనే కాన్సెప్ట్ ని హైలైట్ చేస్తూ ఉన్న సంభాషణలు ఆసక్తి పెంచుతున్నాయి.
ఓ కాలేజీలో జరిగిన హత్య ని ఎలా చెదించారు అస్సలు హత్యకి కారకులు ఎవరు అనే దగ్గర మొదలై.. విద్యావిధానాలను ప్రశ్నించారు ఈ చిత్ర దర్శకుడు. ఎవరు.. ఎందుకు హత్య చేశారు అని తెలియలన్నా.. విద్యావిధానాల్లో లోపాలను తెలుసుకోవాలన్నా.. పూర్తి సినిమా చూడాల్సిందే.


ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు.. మాటల మాంత్రికులు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయగా.. ఈ చిత్రాన్ని సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ సంయుక్తంగా.. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.. ప్రతి సీన్ ఆసక్తికరంగా నిలవడంలో సహాయపడ్డాడు. సరైన కూర్పు తో దర్శకుడు బి. చిన్ని కృష్ణ సగం విజయం సందిచారనే చెప్పాలి. ఇక నిర్మాత అహితేజ ఎక్కడా తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.


నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందేశాత్మక చిత్రంగా అన్ని కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని.. నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు గుర్తింపు.. నిర్మాతలకు డబ్బులు రావాలని.. ఇటువంటి వైవిధ్యమైన సినిమాలు మరెనో వచ్చేందుకు ఈ చిత్రం నాంది పలకాలని కోరుకుందాం.


అక్షర ట్రైలర్

ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి 

జాతిరత్నాలుగా వస్తున్న నవీన్ పోలిశెట్టి!

జాతిరత్నాలుగా వస్తున్న నవీన్ పోలిశెట్టి!

Jathi Ratnalu : ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ చిత్రంతో అద్భుత విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి తన కెరీర్ ని అచ్చి తూచి అడుగులు వేస్తున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తున్న చిత్రం “జాతీరతన్నాలు ”


నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో అనుదీప్ KV దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర (Jathi Ratnalu) టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.


టీజర్ అధ్యంతం కామెడీ రైడ్ లానే ఉంది జైలు లో ప్రియదర్శి చెప్పే పేరడి డైలాగ్స్ బావున్నాయి. ముగ్గురు స్నేహితులు కలిసి ఒక ప్రాబ్లెమ్ లో ఇరుక్కుంటే దాని నుండి ఎలా బయటపడ్డారు అస్సలు వాళ్ళకి ఎదురైనా సమస్య ఏంటి అనేది తెర మీద చూడాలి.


టీజర్ విడుదల అయినా 48 గంటల్లోనే 2మిలియన్ విక్షకులను సొంతం చేసుకుని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

jathi ratnalu


ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి స్వప్న సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదిప్ KV దర్శకత్వం వహిస్తుండగా రధన్ బాణిలు సమాకూరుస్తున్నాడు.


ఇప్పటికి విడుదల అయినా చిట్టీ ని నవ్వంటే పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది.


సిద్ధం మనోహర్ కెమెరామెన్ గా వ్యవహారిస్తున్నాడు ఎడిటర్ గా అభినవ్ దండ పని చేస్తుండగా భారీ తారగణంతో చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు.మార్చ్ 11 న విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల రైడ్ లో ముంచి చక్కటి విజయాన్ని చిత్ర బృందం అందుకోవాలని ఆశిద్దాం.

ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి 

రేపు ‘ఉప్పెన’లా  దూసుకు వస్తున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్

రేపు ‘ఉప్పెన’లా దూసుకు వస్తున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్


మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరొక హీరో “పంజా వైష్ణవ్ తేజ్”. మెగా అల్లుడు వైష్ణవ్ కథనాయకుడిగా పరిచయం చేస్తూ.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఉప్పెన.


ఉప్పెన అంటే ఉప్పు + పెన, పెన అంటే బంధం ఉప్పునీటి బంధం అని ఉప్పు నీరు ఎంత తాగినా దాహం తీరదు ఈ చిత్రం కూడా అలాంటి చక్కటి ప్రేమ కథ అని గేయ రచయిత చంద్రబోస్ ఓ సందర్బంగా చెప్పారు.


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మరియు మొదటి సినిమా విడుదల అవ్వకముందే అభిమానులను సంపాదించుకున్న కీర్తి శెట్టి జంటగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఉప్పెన.విడుదలైన చిత్ర పాటలు, టీజర్, ట్రైలర్.. సినిమా మీద అంచనాలను ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లాయి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో మీరు ఊహించని ట్విస్ట్ ఉందని దాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించాడు అన్నారు. దింతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.


స్వచ్ఛమైన ప్రేమకథని మీ ముందుకి ఫిబ్రవరి 12న తీసుకుని వస్తున్నాం అన్నారు దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించునున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం మంచి పేరు ని గడించాయి. పాటలు మ్యూజికల్ గా మంచి విజయాన్ని అందుకోగా సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం.


షమదత్ సైనిద్దీన్ సినిమాటోగ్రఫి సినిమాకి అదనపు అందంగా నిలవగా.. విశాఖపట్నం లోని బీమిలి తదితర ప్రాంతాలలో చిత్రికరించిన ఈ చిత్రాన్ని అచ్చ తెలుగు నేపథ్యం కొట్టొచ్చినట్టు చూపించారు తన కెమెరా పనితనంతో ఇక ఎడిటర్ గా ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి పని చేసారు. నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల ఎంపికతోనే సంగం విజయం సాధించిన బుచ్చి బాబు సినిమా ఎలా తీసాడో తెలియలన్నా.. చూసేందుకు హీరోలా అందంగా కనిపిస్తున్న.. మెగా కుటుంబం నుండి వస్తున్న వైష్ణవ్ నటన ఎలా చేశారో తెలియాలంటే మటుకు మరి కొన్ని గంటలు ఆగాల్సిందే..


రేపు(ఫిబ్రవరి 12న) భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఉప్పెన చిత్రం అద్భుత విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.