21-01-2021 14:01:13 About Us Contact Us
రేపే అహలో ట్రిల్లర్ మూవీ “సూపర్ ఓవర్” విడుదల.!

రేపే అహలో ట్రిల్లర్ మూవీ “సూపర్ ఓవర్” విడుదల.!మన తెలుగు నటి.. లాక్ డౌన్ లో అటు వెబ్ సిరీస్ ఇటు సినిమాలు విడుదల చేస్తూ ఓ.టి.టి లలో తనకంటూ ఒక క్రేజ్ ని పొందిన “చాందిని చౌదరి” మరియు విలక్షణ పాత్రలతో నటుడిగా గుర్తింపు పొందిన “నవిన్ చంద్ర” కలిసి నటించిన క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం సూపర్ ఓవర్.. తెలుగు ఓ.టి.టి ఆహా లో రేపు (జనవరి 22న) కానుంది.


మన దేశంలో క్రికెట్ ఒక ఆట స్థాయి నుండి మతం అనే స్థాయికి చేరింది. అదే ఐపీఎల్ వచ్చింది అంటే క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ మ్యాచ్ లో బెట్టింగ్ లు వేసే వారు.. మరియు బుకీల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతు వస్తుంది. బెట్టింగ్ సామ్రాజ్యంలో రాత్రికి రాత్రి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు రోడ్డున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రమే “సూపర్ ఓవర్”..


ఈ మధ్య విడుదలైన “సూపర్ ఓవర్” చిత్రం ట్రైలర్ విభిన్నంగా ఉంది. భీమవరం.. హైదరాబాద్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ట్రైలర్ లో చాందిని చౌదరి.. నవీన్ చంద్ర మంచి స్నేహితులుగా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ లో కోటి డెబ్భై లక్షలు కోల్పోగా.. అవి తీర్చడానికి ఎలాంటి పనులు చేసారు? ఆ పరిస్థితి నుండి బయటపడ్డారా? తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథస్వామి రారా దర్శకుడు సుదీర్ వర్మ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ వర్మ తెరకేక్కించారు.లాక్ డౌన్ కారణంగా ఎక్కువ ఓటీటీ విడుదల మీద ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ “సూపర్ ఓవర్” చిత్రాన్ని కూడా ప్రముఖ ఓ.టీ.టీ అయిన ఆహాలో జనవరి 22 విడుదల చేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. చాందిని చౌదరి.. నవీన్ చంద్ర.. అజయ్.. వాసు.. మురళి.. వైవా హర్ష ప్రధాన పాత్రలలో ఉండటం.. యువత బాగా ఇష్టపడే క్రికెట్ మరియు బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడం.. పైగా ట్రిల్లర్ మూవీ అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


రేపు వస్తున్న “సూపర్ ఓవర్” మరో ఓ టీ టీ బ్లాక్ బస్టర్ గా నిలవాలని.. చాందిని చౌదరి కి ఓ.టి.టి లో మరో విజయం లభించాలని.. ఈ చిత్ర దర్శకుడికి మంచి పేరు రావాలని ఆశిద్దాం.

వకీల్ సాబ్ టీజర్ అద్భుతః  క్రేజు.. జోరు.. తగ్గని పవర్ స్టార్.!

వకీల్ సాబ్ టీజర్ అద్భుతః క్రేజు.. జోరు.. తగ్గని పవర్ స్టార్.!తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ ది ప్రత్యేకమైన పందా.. వకీల్ సాబ్ టీజర్ రాక తో మరోసారి రుజువు. 3ఏళ్ళ క్రితం రాజకీయాల కోసం తన సినీ కెరీర్ ని పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ తన రిఎంట్రీ కి రంగం సిద్ధం చేసుకున్నారు.


హిందీలో అమితాబ్ నటించిన సూపర్ హిట్ చిత్రం పింక్ ఆధారంగా వస్తున్న చిత్రం వకీల్ సాబ్. సందేశంతో కూడిన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అకృత్యాలను ఎదిరించి నిలిచే లాయర్ పాత్రలో పవర్ స్టార్ నటించగా.. శృతి హస్సన్,అంజలి, నీవేతా థామస్ ప్రధాన పాత్రలో పోషించారు. MCA.. ఓ మై ఫ్రెండ్.. చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్రం బృందం.


టీజర్ ఫాన్స్ మూడేళ్ల నిరీక్షణకి శుభం కార్డ్ వేస్తూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ గారి స్టైలిష్ లుక్స్ మరియు ఫైట్స్ ని మరొక్క సారి అద్భుతంగా చూపించారు వేణు శ్రీ రామ్. కోర్టులో వాదించడం వచ్చు.. కోటు తీసి కోట్టడమూ వచ్చు.. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే పంచ్ డైలాగ్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం అనే చెప్పుకోవాలి. థమన్ అందించిన నేపథ్య సంగీతం చెవులకు వినసొంపుగా అనిపించింది. ఈ టీజర్ విడుదలను అభిమానులు పండుగలా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు థియేటర్లలో వకీల్ సాబ్ టీజర్ ని ప్రదర్శించి థియేటర్ బయట టపాసులు కాలుస్తూ పవన్ ఫ్లెక్సీలకి పాలభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.


టీజర్ విడుదల అయినా 24గంటల్లో 700k + లైక్స్ పొంది పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలియచేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

సామాజిక మాధ్యమాల్లో ఉప్పెన లా ఎగిసిపడుతున్న ఉప్పెన టీజర్..!

సామాజిక మాధ్యమాల్లో ఉప్పెన లా ఎగిసిపడుతున్న ఉప్పెన టీజర్..!మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో యువ కధానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం ఉప్పెన. ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందించిన కథతో బుజ్జిబాబు సన దర్శకత్వం వహించారు.


వైష్ణవ్ తేజ్ సరసన మలయాళం నటి కృతి శెట్టి నటించగా తమిళ అగ్ర కథానాయకుడు మెక్కల్ సెల్వం అదే విజయసేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ని సంక్రాంతి కానుకగా మొన్న విడుదల చేసారు.


ఒక చక్కటి ప్రేమకావ్యం లాంటి కథని తెరపై ఆవిష్కరిస్తున్నట్టు ఉంది ఈ చిత్రం టీజర్.. హీరోయిన్ హీరో తో పలికే సంభాషణలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయ్ అనడం లో ఎటువంటి సందేహం లేదు “నీకు నాకు మధ్య ప్రేమ ఎందుకు ఆని పక్కన పెట్టేసా” అంటూ చెప్పే మాటలు బావున్నాయి. టీజర్ కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది ప్రతి సన్నివేశాన్ని మరో మెట్టు పైకి తీసుకుని వెళ్ళేలా ఉంది నేపథ్య సంగీతం. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. విడుదలైన టీజర్ కు ప్రక్షుకుల నుండి మంచి స్పందన వస్తుంది.. ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసింది. దింతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.సమధత్ సైనుద్దీన్ కెమెరా పనితనం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచించి ఇంకా ఆర్ట్ డైరెక్టర్ మోనికా రామకృష్ణ స్క్రీన్ ని అందంగా చూపించడంలో అదనపు హంగులు అద్దరు.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుండి నవీన్ యారనేని,వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

సంక్రాంతి బరిలో బెల్లంకొండ “అల్లుడు అదుర్స్ “

సంక్రాంతి బరిలో బెల్లంకొండ “అల్లుడు అదుర్స్ “బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్,అను ఇమ్మాన్యూల్ ప్రధాన పాత్రలో కందిరిగ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు తెరకేక్కించిన “అల్లుడు అదుర్స్ ” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. పక్కా కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సోను సూద్ ముఖ్యపాత్రలో నటించారు.


ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు సామాజిక మధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణిలు సమాకూర్చారు. ఇటీవల బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న మోనాల్ గజ్జర్ ప్రేత్యేక గీతంలో అలరించునుంది ఈ పాట అత్యధిక బడ్జెట్ తో విజవల్ వండర్ గా తెరకేక్కించారు అని చిత్రబృందం తెలియచేసారు.


సుమంత్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ మీద గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి చోటా.కె.నాయుడు చూపించిన విజువల్స్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


టీజర్ కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం వినసొంపుగా ఉంది మరియు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి అదనపు హంగులు అద్దుతుంది అని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసారు. సంక్రాంతి కానుకగా వస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అందరించాలని ఆశిద్దాం.

“రెడ్” తో సంక్రాంతి కి “రెడీ’ అంటున్న “ఇస్మార్ట్” రామ్.!

“రెడ్” తో సంక్రాంతి కి “రెడీ’ అంటున్న “ఇస్మార్ట్” రామ్.!తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రామ్ ఈ సారి సంక్రాంతి అల్లుడుగా బరిలోకి దిగబోతున్నాడు.ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ వంటి ఇండస్ట్రీ హిట్ తో మంచి ఫార్మ్ లో ఉన్న రామ్ మరో విజయం తన ఖాతాలో ఖాయమని ధీమా తో ఉన్నారు.


రామ్ పోతినేని.. మాళవిక శర్మ జంటగా నీవేత పేతురాజ్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం రెడ్. తమిళ చిత్రం తడం ఆధారంగా తెరకేకుతున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల.. హ్యాట్- ట్రిక్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14 న సంక్రాతి కానుకగా విడుదల కానుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు.. పాటలకు అద్భుతమైన స్పందన వస్తుంది.


ఈ చిత్రంలో ప్రతేక ఆకర్షణగా హెబ్బా పటేల్ చేసిన ఐటమ్ సాంగ్ నిలవనుంది.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అయన ఇచ్చిన నేపథ్య సంగీతానికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక పాటలు సమాజిక మాధ్యమాలలో మారు మొగుతున్నాయి.


రామ్.. కిషోర్ కలయికలో వచ్చిన రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడం.. మరో పక్క తమిళనాట బ్లాక్ బస్టర్ ఐన కథ కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయ్.ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చ్చేసినట్లు పోస్టర్స్ ని చుస్తే తెలుస్తుంది.ఇది ఈ సినిమాకు మరో ఆసక్తి కలిగించే అంశం. ఎనర్జీటిక్ స్టార్ గా పేరు పొందిన రామ్ ఇమేజ్ తగ్గకుండా.. మంచి థ్రిల్లర్ సినిమాగా తెరకెకించినట్లు సినిమా బృందం తెలిపింది.


స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడులవుతున్న సందర్భంగా మంచి విజయాన్ని అందుకోవాలి అని కోరుకుందాం.