24-01-2022 16:19:21 About Us Contact Us
రికార్డుల వేట మొదలు పెట్టిన సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.!

రికార్డుల వేట మొదలు పెట్టిన సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.!


సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకుగా బాల నటుడిగా తెరంగేట్రం తొమిది సినిమాలలో నటించి.. 1999 లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వం చేసిన రాజకుమారుడు సినిమా తో హీరోగా పరిశ్రమకు పరిచయమై.. కృష్ణ గారి అబ్బాయి దగ్గర నుండి..లవర్ బాయ్ ఇమేజ్ పొంది..ప్రిన్స్ గా మారి.. స్టార్ గా ఎదిగారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నేడు ఆయన 45వ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న 27వ సినిమా.. సర్కార్ గారి పాట ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.ఆకట్టుకున్న సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్ రికార్డ్స్ వేట ప్రారంభించిందనే చెప్పాలి.


వరస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్.. మరో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 14 రీల్స్ కలిసి.. మహేష్ బాబు గారి నిర్మాణ సంస్థ జి.ఏం.బి.ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మాఇస్తున్న సినిమా సర్కార్ వారి పాట.ఈ సినిమాకు గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు పరుశురామ్ దర్శకత్వం చేస్తున్నారు.వరస ఆల్బమ్ హిట్స్ తో ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకులు.


సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.అందులో మహేష్ ప్రి లుక్ కూడా ఉంది.టైటిల్ కి తగ్గట్లు గంట టైటిల్ లోగో లో గంట ఉంది.మహేష్ బాబు హెయిర్ స్టైల్ మార్చారు.. అలానే ఆయన మెడ పై రూపాయి లోగో కనపడుతుంది.మహేష్ బాబు గారు చెవి పోగు పెట్టుకున్నారు. మొత్తానికి ఫాన్స్ కు ప్రి లుక్ బాగా నచ్చింది.నేడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రానున్న మోషన్ పోస్టర్ పై అంచనాలు పెరిగాయి.


నేడు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదలైన ఈ మోషన్ పోస్టర్ లో మహేష్ బాబు కుడి చేతితో రూపాయి బిల్లను ఎగరేశారు.ఆయన చేతికి ఓం ఉన్న తాడు కట్టి ఉంది.అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు టైటిల్ స్కోర్ వినిపిస్తుంది.సర్కార్ వారి.. పాట.. అంటూ హారిక నారాయణ్ గొంతుతో వినిపించింది.ఈ టైటిల్ సాంగ్ ను లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు రాశారు.


మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మోషన్ పోస్టర్.. ఫాన్స్ కు ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి.ఈ సందర్బంగా నేడు 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అమ్మాయిల లవర్ బాయ్.. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే.. ఎవర్ గ్రీన్ హీరో.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రిన్స్.. సూపర్ స్టార్ మహేష్ గారికి మా(బి.ఆర్.మూవీ జోన్) తరపున జన్మదిన శుభాకాంశాలు.!

సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్

బాల నటుడిగా వచ్చి.. బిజీ హీరోగా మారిన మానస్ పుట్టిన రోజు నేడు.!

బాల నటుడిగా వచ్చి.. బిజీ హీరోగా మారిన మానస్ పుట్టిన రోజు నేడు.!బాల నటుడిగా పరిచయమై.. అటు బుల్లి తెరపై సీరియల్స్ చేస్తూ.. ఇటు వెండితెరపై హీరోగా సినిమాలు చేస్తూ.. తనదైన నటనా శైలితో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో మానస్.అలాంటి మానస్ పుట్టిన రోజు నేడు…


తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. తల్లి టీచర్.. ఒక్కడే కొడుకు.తల్లిదండ్రులడి వైజాగ్.. కానీ.. తండ్రి ఉద్యోగ రిత్యా ముంబై.. గోవా.. వైజాగ్.. హైదరాబాద్.. ఇలా తండ్రితో పాటు బాల్యంలో అన్ని ఊర్లు తిరిగేశాడు మానస్.చిన్నతనం నుండి డాన్స్ అంటే ఇష్టం.. మెగాస్టార్ అభిమానైన మానస్.. స్కూల్ వేదికల పై చిరంజీవి గారి స్టెప్స్ ని అలానే దింపేసేవాడు.. ఆ తర్వాతి రోజుల్లో వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నారు.అలా ఒక వేదిక పై డాన్స్ చేస్తున్న మానస్ కు బాల నటుడిగా నరసింహనాయుడు సినిమాలో అవకాశం లభించింది.అంటే అక్కడ నుండి డాన్స్ నుండి నటన వైపు అడుగులు వేశాడు మానస్.రెండవ సినిమాగా చేసిన హీరో లో మానస్ నటనకు అటు విమర్శకుల.. ఇటు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.ఆ సినిమాకు తన నటనకు గాను.. ప్రభుత్వం నంది అవార్డ్ తో సత్కరించగా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ చేతుల మీదగా ఆ అవార్డ్ అందుకున్నారు మానస్.అదే సినిమాకు.. మా టీవీ అవార్డ్ ను హీరో అల్లు అర్జున్ చేతుల మీదగా తీసుకున్నారు.మూడవ సినిమాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అర్జున్ సినిమాలో నటించారు.ఒక పక్క చదువు.. మరో పక్క హైదరాబాద్ కు దూరంగా ఉండటంతో అనేక సినిమాలు వదులుకున్నారు మానస్.ఒక పక్క చదువు.. మరో పక్క సినిమాలలో మానస్ ప్రతిభను చూసి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెచ్చుకున్నారు.పై చదువుల కోసం సినిమాలకు విరామం ఇచ్చిన మానస్ బాగా చదువుతున్నా.. సినిమా మీద ప్రేమ తగ్గలేదు.దింతో తిరిగి సినిమాల వైపు అడుగులు వేశారు మానస్.జలక్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మానస్.గ్యాప్ ఇచ్చిన మానస్.. స్టైల్ గా కనిపించి.. అందరిని ఆకట్టుకున్నారు.


గ్రీన్ సిగ్నల్.. నుతిలో కప్పలు.. సినిమాలు చేసిన మానస్ కు కాయ్ రాజా కాయ్.. తో మంచి పేరు లభించింది.ప్రేమికుడు.. సోడా…గోలిసోదా.. లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నక్షత్రం సినిమాతో సాయిధరమ్ తేజ్.. సందీప్ కిషన్ తో కలిసి నటించారు.ప్రసృతం బుల్లి తెరపై కోయిలమ్మ.. మనసిచ్చిచూడు..సీరియల్స్ చేస్తున్నారు మానస్. వెండితెరపై క్షిరసాగరమధనం.. పాయల్ రాజపుట్ తో కలిసి W5 అనే సినిమా చేస్తున్నారు.అటు వెండితెర.. ఇటు బుల్లి తెర లతో బిజీ..బిజీ..గా గడుపుతున్న మానస్.. ఓ.టి.టి. లను కూడా వడలకుడదు అని మరో ఓ.టి.టి సినిమా చేస్తున్నారట..!


బాల నటుడిగా పరిచయమై.. బుల్లితెర.. వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్న మానస్.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

హీరోగా మారిన డాక్టర్ అశ్విన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు..!

హీరోగా మారిన డాక్టర్ అశ్విన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు..!


ప్రొడక్షన్ తో ప్రవేశించి.. డ్యాన్సర్ గా బుల్లితెరతో పరిచయమై.. నటుడిగా వెండితెరపై కనిపించి.. ఇప్పుడు హీరోగా స్థిరపడ్డారు అశ్విన్ బాబు.13 ఏళ్ళ సినీ జీవితంలో ఒకో మెట్టు ఎక్కుతూ.. స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తున్న అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కథనం..!


కాకినాడ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్న ఒక్క కుర్రాడు మిస్టర్.కాకినాడ టైటిల్ గెలిచాడు.టీవీ షో లలో యాంకర్ గా అప్పుడే పరిచయమైన మరో డాక్టర్..అన్నయ్యకు.. తాను ఇలా గెలిచాను.. నాకు సినిమాలో హీరో అవ్వాలని ఉంది.నేను ఫోటోలు పంపుతాను అని చెప్పాడు.మనకు పరిశ్రమలో పెద్దవారు ఎవరు లేరు ముందు చదువుకో అని చెప్పాడు.ఆనాడు అన్నయ్య మాట విని డాక్టర్ కోర్స్ పూర్తి చేసి.. హైదరాబాద్ చేరాడు ఆ తమ్ముడు.అన్నయ్య కూడా యాంకర్ గా సెటిల్ అయ్యి.. జీ లో షో చేసేందుకు నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.దింతో తమ్ముడు కూడా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.ఆ మిస్టర్.కాకినాడ ఎవరో కాదు అశ్విన్..అన్నయ్య ఓంకార్..షో ఆట.. ఇది అశ్విన్ పరిశ్రమలో ప్రవేశానికి నేపథ్యం.


అలా అన్నయ్యకు నిర్మాణ పనుల్లో సహాయపడుతూ కెరీర్ ప్రారంభించారు అశ్విన్.ఎప్పటికైనా తమ్ముడిని హీరో చెయ్యాలి అని అన్నయ్య ఆశ.హీరో అయ్యి.. సి.సి.ఎల్ ఆడాలి అనేది తమ్ముడి కోరిక.ఆట-3 లో కంటెస్టెంట్ గా చేశారు అశ్విన్.డాన్స్ విషయానికి వస్తే..సాక్షాతూ రాజమౌళి గారే డాన్స్ లో అశ్విన్ ని పొగిదారు..అలా 5 ఏళ్ళు నిర్మాణంలో పని చేసిన అశ్విన్ జీనియస్ లో తొలుత హీరోగా అనుకోని.. కొన్ని కారణాల చేత సెకండ్ లీడ్ పాత్ర చేశారు.ఆ తర్వాత వచ్చిన రాజు గారి గది తో భారీ విజయం అందుకున్నారు.హీరోగా తొలి సినిమాలో సెటిల్ గా యాక్టింగ్ చేసిన అశ్విన్ రెండవ సినిమా జతకలిసే సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ లా కనిపించి అందరిని అలరించారు.అటు విమర్శకుల.. ఇటు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు అశ్విన్.నాన్న..నేను నా బాయ్ ఫ్రెండ్స్.. రాజు గారి గది 2.. రాజు గారి గది 3 లలో హీరోగా చేశారు అశ్విన్.అన్నయ్య వల్లే నేను ఈ స్టేజ్ లో వున్నాను అని నిర్మొహమాటంగా చెప్తూ ఉంటారు అశ్విన్.ఇన్ని సంవత్సరాలు అన్నయ్యతో కష్టపడి.. ఇలా చెప్పడం నిజంగా అశ్విన్ యొక్క మంచి మనసుకి నిదర్శనం.ఒక పక్క హీరోగా చేస్తూ.. అన్నయ్య ఓంకార్.. తమ్ముడు కళ్యాణ్ కు షో ల నిర్మణంలో సహాయ పడుతుంటాడు అశ్విన్.నిర్మాణ రంగంలో ఉండటం వల్ల అందరిని బాగా పలకరించుకుంటారు అని పరిశ్రమలో చెప్తుంటారు.ప్రసృతం ఇస్మార్ట్ జోడి షో కి సహాయపడుతూ.. మరో సినిమాను సైన్ చేశారు అశ్విన్. ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా కరోనా అనంతరం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.


కష్టాన్ని నమ్ముకొని.. నిర్మాణ రంగంలో తొలి అడుగులు వేసి.. మంచి డ్యాన్సర్ గా నిరూపించుకొని.. నటుడిగా పరిచయమై.. హీరోగా విజయాలు అందుకున్నరు అశ్విన్. ఒక మంచి సినిమాతో పెద్ద హిట్ సాధించాలని.. హీరోగా ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించి.. స్టార్ హీరోల జాబితాలో చేరాలని కోరుకుంటూ.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అశ్విన్ బాబు కి మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున జన్మదిన శుభాకాంక్షలు..!

ఆగస్ట్ 14న ఆహా లో నేరుగా విడుదల కానున్న జోహార్ సినిమా.!

ఆగస్ట్ 14న ఆహా లో నేరుగా విడుదల కానున్న జోహార్ సినిమా.!తెలుగు చిత్ర పరిశ్రమ మెగా నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీద ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ రోజు (జులై 25న) సాయంత్రం ఏడు గంటలకు జోహార్ సినిమా పోస్టర్ విడుదలైంది.అదే సమయంలో సినిమాను నేరుగా ఆహా యాప్ ద్వారా ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ లైవ్ ద్వారా ఈ సమాచారాన్ని విడుదల చేసినందుకు చిత్ర బృందం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.


దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా ఇది.ఇల్లు పోగొట్టుకున్న ఒక ముసలి తాత పాత్రలో ప్రముఖ సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ గారు చేశారు.జాతీయ స్థాయి పోటీలో పాలుగోనెందుకు కష్టపడుతున్న ఒక క్రీడాకారిణి పాత్రలో నైనా గంగూలీ చేశారు.యువ ప్రేమ జంటగా.. అంకిత్ కోయా మరియు ఎస్టర్ అనిల్ చేశారు.కలుషిత నీటి వల్ల అనారోగ్యం పాలైన ఒక పాపను కపాడుకోలేని నిస్సహాయతలో ఉన్న ఒక తల్లి.ఈ నాలుగు కథలులలో గల ఐదు పాత్రలు తీసుకున్న ఒక్క నిర్ణయం ముందు.. తర్వాత ఏమి జరిగింది అనే కథాంశంతో వస్తున్న సినిమా జోహార్..!


విచిత్రమైన పోస్టర్స్ తో సినిమాపై ప్రేక్షకుల గురి కుదిరేలా చేసుకున్నారు దర్శకుడు తేజ.అలానే ఇప్పటికే విడుదలైన నీ రూపం ఎదురుగా.. పాటకు సైతం ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.నిజానికి వేసవిలో విడుదులకు సిద్ధమైంది ఈ సినిమా.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సినిమా విడుదలకు నోచుకోలేదు.ఇప్పటికే పలు సినిమాలు ఓ.టి.టి ద్వారా విడుదల చేస్తుండటం.. మరో పక్క ధియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శక నిర్మాతలు సినిమాను ఓ.టి.టి ద్వారా విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.


నేడు.. ఈ సినిమా ఆహా యాప్ ద్వారా ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు.జోహార్ శీర్షిక..హిస్టరీ ఐస్ సెట్ ఆఫ్ లైస్ యగ్రీడ్ అపోన్(History is a set of Lies Agreed upon)తెలుగులో అనువాదిస్తే..చరిత్ర అంగీకరించిన అబద్ధాల సమితి అనే బలమైన అర్థం వస్తుంది.ఇలాంటి బలమైన శీర్షిక తో వస్తున్న సినిమా జోహార్.కొత్త తరహా సినిమాలను ఎప్పుడు ప్రోత్సహించే మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందో లేదో తెలియాలంటే.. ఆగస్ట్ 14వరకు ఆగాల్సిందే..!

నేడు మెగా స్టార్ అభిమాని నుండి నిర్మాత గా మారిన ఎస్.కె.ఎన్ పుట్టినరోజు.!

నేడు మెగా స్టార్ అభిమాని నుండి నిర్మాత గా మారిన ఎస్.కె.ఎన్ పుట్టినరోజు.!మెగాస్టార్ అభిమానిగా మొదలై..రివ్యూ రైటర్ గా మారి..సినిమా రిపోర్టర్ గా పని చేసి.. పి.ఆర్.ఓ గా పేరు తెచ్చుకొని..ఎక్సగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా..లైన్ ప్రొడ్యూసర్ గా..కో-ప్రొడ్యూసర్ గా చేసి..ఇప్పుడు నిర్మాతగా మారారు జి.శ్రీనివాస్ కుమార్..అందరికి తెలిసిన పేరు ఎస్.కె.ఎన్.. అలాంటి ఎస్.కె.ఎన్ పుట్టినరోజు నేడు.


శ్రీనివాస్ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు.చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని.చదువు తర్వాత ఏమవుతావు అని ఎవరైనా అడిగితే..చిరంజీవి గారి దగ్గరకు వెలిపోతా అనేంత అభిమానం.శ్రీనివాస్ కి ఆయన దగ్గర ఏమి చెయ్యాలో తెలియదు కానీ చిరంజీవి గారి దగ్గర ఉండాలి అనే ఆలోచన ఉండేది.సామాజిక మాధ్యమాలు కొత్తగా వచ్చిన రోజుల్లో..2000వ సంవత్సర సమయంలో మెగా అభిమానులకు ఆయన సినిమా సమాచారం ఇంటర్నెట్ లో దొరికింది అంటే అదే కచ్చితంగా ఎస్.కె.ఎన్ రాసిన ఆర్టికల్ ద్వారానే.అలా నాన్ స్టాప్ సినిమా అనే వెబ్సైట్ ప్రారంభించి సినిమా రివ్యూలు..సినిమా సమాచారం ఇవ్వడం ప్రారంభించారు.


అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కు..తను ఇంటర్నెట్ లో ఎలా పని చేస్తున్నారో గమనించి..మెగా అభిమానిగా తన తపనను గుర్తించి నిత్యం అందుబాటులో ఉండేవారు.బన్నీ గంగోత్రి సినిమా ప్రారంభం అవుతున్న సమయంలో మా అన్నయ్య సినిమాలో హీరోగా అవుతున్నారు.తనకు పిఆర్వో..మేనేజర్ కావాలి.నువ్వు ఏమి చేస్తావు అని అడగడం.శిరీష్ కి పిఆర్వో అని చెప్పి అప్పుడే 24 గంటల వార్త ఛానల్ గా ప్రారంభమైన టీవీ9లో సినిమా రిపోర్టర్ గా ఉద్యోగం ప్రారంభించారు ఎస్.కె.ఎన్.అలా ఏలూరులో మెగా అభిమాని హైదరాబాద్ లో రిపోర్టర్ గా మారారు.


2009లో చిరంజీవి గారితో రాజకీయాల్లోకి వెళ్ళి..తిరిగి సినిమా ప్రారంచంలోకి వచ్చేశారు.సినీ ప్రయాణంలో దర్శకుడు మారుతి..నిర్మాత బన్నీ వాసు..ఏలూరు శ్రీను..యూవీ క్రియేషన్స్ వంశీ..శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గార్లు మిత్రులుగా మారారు.వీరు గుంటూరు..వెస్ట్ గోడవరిలలో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు.మారుతి దర్శకుడిగా చేసిన ఈ రోజుల్లో సినిమాతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన ఎస్.కె.ఎన్..గీత ఆర్ట్స్ లో 100%లవ్ తో బన్నీ వాసుకు నిర్మాతగా అవకాశం రావడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో సినిమా నిర్మాత చెయ్యాల్సిన అన్ని విషయాలు తెలుసుకున్నారు.ఆ తర్వాత యూ.వి క్రయషన్స్ ప్రారంభించడంతో అందులో ఎక్సుగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేశారు.టాక్సీ వాలా తో నిర్మాతగా మారారు.రెస్ట్ ఐస్ హిస్టరీ..


మెగాస్టార్ మీద అభిమానం హైదరాబాద్ కు చేరిస్తే..సినిమా పట్ల ప్రేమ..తన కష్టం తనను నిర్మాత స్థాయికి చేర్చింది.ఎప్పుడు సినిమా..మెగాస్టార్..బన్నీ గురించి మాత్రమే మాట్లాడే శ్రీనివాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!