08-12-2021 20:56:11 About Us Contact Us
హీరోగా మారిన విలక్షణ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు నేడు.!

హీరోగా మారిన విలక్షణ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు నేడు.!


ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుటుంబంలో జన్మించి.. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న ఒక మధ్యతరగతి కుర్రాడు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. ఎన్నో అవమానాలు.. మరెన్నో కష్టాను అనుభవించాడు. ఇప్పుడు,నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.తనే.. పెళ్ళి చూపులుతో పరిచయమై.. మల్లేశం తో హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. నేడు అలాంటి ప్రియదర్శి పుట్టినరోజు..


ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఎంఏ చదుకున్న దర్శి సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.తొలుత ఇంట్లో ఒప్పుకోలేదు,ఆయనా వదలలేదు.ఒక కంపెనీ లో యాడ్ ఫిలిమ్స్ కు స్క్రిప్ట్ రైటర్ గా కెరీర్ ప్రారంభించారు.ఆగస్ట్ నెల వచ్చింది.. అప్పటికే తనకు ఆఫీస్ లో పెద్దగా పని ఉండటం లేదు.దింతో పుట్టినరోజు అవ్వగానే మానేదాం అనుకున్నాడు దర్శి.కానీ,అంతకన్నా ముందే వాళ్ళు తనని ఉద్యోగం నుండి పంపించేశారు.అలా బయటకు వచ్చిన దర్శి పరిశ్రమలో నటుడిగా పదయత్నాలు మొదలు పెట్టారు.


2012 నుండి 2016 వరకు దర్శి నటుడిగా షార్ట్ ఫిలిమ్స్ చేశారు.ఎన్నో ఆఫీసుల చుట్టు తిరిగారు.. మరెన్నో ఆడిషన్స్ ఇచ్చారు.10 చోట్ల ప్రయత్నిస్తే ఒకటి లేదా రెండు చొట్ల అవకాశం వస్తుంది అని నమ్మే దర్శి.నాగోల్,ఉప్పల్ నుండి మణికొండ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ ఇలా అన్ని సినిమా ఆఫీసులు తిరిగారు. శ్రీనగర్ కాలనీ,పంజాగుట్ట,కృష్ణానగర్ లో నాలుగేళ్ళు అలా గడిచిపోయాయి.చందా నగర్ లో వుండే దర్శి ఇలా హైదరాబాద్ మొత్తం తిరిగారు.2016లో పెళ్ళిచూపులు సినిమాతో దర్శి.. ప్రియదర్శిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ప్రతి నటుడికి తన సినీ జీవితంలో తాను చేసిన పాత్ర పేరు ప్రేక్షకులకు గుర్తుండేలా కొన్ని మాత్రమే ఉంటాయి.దర్శికి తొలి సినిమాతోనే ఆ అద్భుతమైన అవకాశం దొరికింది.పెళ్ళిచూపులు విడుదలైన కొత్తల్లో ఎక్కడైనా ప్రియదర్శి కనిపిస్తే.. అరేయ్ ఇప్పుడే చూశాను.. మన పెళ్ళిచూపులు కౌశిక్ ని అనే వాళ్ళు.మరి కొందరు ఏకంగా నా చావు నేను చస్తా..లేదా,టైం అంటే కౌశిక్.. కౌశిక్ అంటే టైం.. డైలాగ్ చెప్పాడుగా తనని ఇప్పుడే చూశాము అనే వారు.అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆ పాత్ర.అక్కడ నుండి వెనకకు తిరిగి చూడలేదు ప్రియదర్శి.


ఈ నాలుగు సంవత్సరాలలో తమిళం.. మాలయంలో కలిపి 30కు పైగా సినిమాల్లో నటించారు.జై లవకుశ.. స్పైదర్,F2 సినిమాలలో స్టార్లతో నటించారు.ఘాజి,అ:!సినిమాలో తన నటనకు మంచి స్పందన వచ్చింది.2019లో వచ్చిన మల్లేశం సినిమాతో హీరోగా మారారు.ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మాత్రమే కాక విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.మిఠాయి సినిమాలో సైతం హీరోగా చేశారు.తాజాగా విడుదలైన LOSER అనే వెబ్ సిరీస్ తో మరోసారి తన నటనతో అందరిని కదిలించారు.ఇప్పుడు,రాధేయ శ్యామ్ వంటి పెద్ద సినిమా చేస్తున్నరు.అలానే,ప్రధాన పాత్రగా జాతిరత్నాలు అనే సినిమా కూడా చేస్తున్నారు.


అటు హీరోగా ఇటు కమిడియన్ గా మనని మరిన్ని సంవత్సరాలు అలరించాలని.. నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా అని చెప్పిన కౌశిక్ అలియాస్ ప్రియదర్శి.. తన గురించి ఒక్కరు పుస్తకం రాసే స్థాయికి చేరాలి అని కోరుకుంటూ.. ప్రియదర్శి గారికి మా(బి ఆర్ మూవీ జోన్ టీం)తరపున జన్మిదిన శుభాకాంశాలు..!

సామాజిక మాధ్యమాల్లో ఈసారి ఘనంగా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుక..!

సామాజిక మాధ్యమాల్లో ఈసారి ఘనంగా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుక..!


రేపు (ఆగస్ట్ 22న) పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమంలో రచ్చ చేసేందుకు అభిమానులు.. ఆయనకు శుభాకాంశాలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ సర్వం సిద్ధం చేసుకుంటుంది.నేడు సాయంత్రం ఆరు గంటల నుండి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు 100 అతిరథమహారధులు మోషన్ పోస్టర్స్ ని విడుదల చేస్తుంటే.. మెగా హీరోలు.. ప్రత్యేకంగా శుభాకాంశాలు తెలపనున్నారు.


అంజనీ కుమారుడు.. సుప్రీమ్ హీరో.. గ్యాంగ్ లీడర్.. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఏలుతున్న వెండితెర మెగాస్టార్.. కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్యదైవం.. కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం దేశ.. విదేశాల్లో ఘనంగా జరుగుతుంటాయి.తెలుగు రాష్ట్రాలలో వారం రోజుల నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది.ఇక హైదరాబాద్ లో అయితే ప్రతి ఏటా అభిమానులు అంతా ఒక పండగలా ఈవెంట్ చేసుకుంటూ వుంటారు.అలాంటిది కరోనా కారణంగా ఈ వేడుకలకు ఈ సారి అంతరాయం కలిగింది.దింతో అభిమానులను నిరాశ పరచకూడదు అని అటు చిరంజీవి అభిమానుల సంఘం.. ఇటు మెగా హీరోలు.. మరోపక్క పరిశ్రమ భావించింది.దింతో ఈ సారి వేడుకలు సామాజిక మాధ్యమాల్లో జరగనున్నాయి.నేడు సాయంత్రం ఆరు గంటలకు చిరంజీవి గారి తనయుడు.. మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ కామన్ డీపీ విడుదల చెయ్యడంతో ఆరంభం కానున్న ఈ వేడుకలు.. రేపు సాయంత్రం ఆరు గంటలకు చిరంజీవి గారి ప్రత్యేకమైన పోస్టర్ విడుదల తో ముగుస్తాయి.ఈ వేడుకలో దాదాపు 80మంది అగ్ర సినీ ప్రముఖులు నేడు రాత్రి ఏడు గంటలకు ప్రత్యేకమైన మోషన్ పోస్టర్ తో శుభాకాంశాలు తెలుపుతారు.అలానే మెగా బ్రదర్ నాగబాబు గారు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. మెగా హీరోలు.. అల్లు శిరీష్.. కళ్యాణ్ దేవ్.. మెగా హీరోయిన్ నిహారిక.. నిర్మాతగా మారిన కాస్ట్యూమ్ డిజైనర్ చిరంజీవి గారి కుమార్తె సుష్మితా.. ప్రత్యేకమైన వీడియోల ద్వారా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపనున్నారు.


దీనితో పాటు ఒక చిరంజీవి గారి గురించి పోస్టర్లు.. ఫోటోలు.. వీడియోలు.. విడుదల చేయన్నున్నారు.ఇలా ప్రతి అర్ధగంట కు ఒక కార్యక్రమంలా నేటి సాయంత్రం ఆరు నుండి రేపు సాయంత్రం ఆరు దాక అలరించనున్నారు.కరోనా కారణంగా బయటకు రాకున్నా మెగాస్టార్ అభిమానులు మాత్రం ఆయన పుట్టినరోజును ఇలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అందరిలో కుతూహలం పెంచింది.మెగాస్టార్ అభిమానులా మజాకా..!మా(బి.ఆర్.మూవీ జోన్) తరపున్న అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!

రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ 3డి సినిమా.!

రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ 3డి సినిమా.!


ఉదయం(ఆగస్ట్ 18న) ప్యాన్ ఇండియా హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ 22వ సినిమా టైటిల్ ఆదిపురుష్. సినిమా యొక్క ట్యాగ్‌లైన్ “చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటుంది” అని ఆ పోస్టర్ లో ఉంది.దేశంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 3డి మూవీ ఇది.వివరాల్లోకి వెళ్తే..


తన్హాజీ తో భారీ విజయం అందుకున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి ఒక పెద్ద వార్త రేపు ఉదయం చెప్తాను అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి అటు భారతీయ చిత్ర పరిశ్రమ తో పాటు ఇటు ప్రభాస్ డై హార్ట్ ఫాన్స్.. ఆ వార్త గురించి ఎదురు చూడటంతో పాటు అనేక ఊహాగానాలు చేశారు..


ఆదిపురుష్ గురించి పెద్దగా తెలియకపోయినా, రాబోయే కాలంలో, యాక్షన్ చిత్రంలో ప్రభువు రాముడి పాత్రను ప్రభాస్ పోషించినట్లు తెలుస్తుంది. పురాణ రామాయణం కూడా చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటుంది.. ట్యాగ్‌లైన్ కూడా అదే సూచిస్తుంది. వాస్తవానికి, ఆదిపురుష్ యొక్క పోస్టర్ మధ్యలో విల్లును పట్టుకున్న ప్రధాన పాత్రను కలిగి ఉంది మరియు ‘గడా’ పట్టుకున్న నేపథ్యంలో హనుమంతుడిలాంటి వ్యక్తి కూడా కనిపిస్తాడు. రావణుడి పది తలలు కూడా ఆదిపురుష్ పోస్టర్ మధ్యలో ఉన్నాయి.ఆదిపురుష్ హిందీ మరియు తెలుగు భాషలలో చిత్రీకరించబడుతుంది మరియు తమిళం, మలయాళం, కన్నడ మరియు అనేక అంతర్జాతీయ భాషలలో డబ్ చేయబడుతుంది.ఈ చిత్రం 2021 లో చిత్రీకరణ ప్రారంభించి 2022 లో విడుదల చేస్తారు. ఇది 3 డిలో చిత్రీకరణ చేయనున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ టి.సిరీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది.


ఈ సినిమాతో ప్రభాస్ నేరుగా హిందీలో చేయబోయే తొలి సినిమా కానుంది.ఇప్పటికే బాహుబలి నుండి అన్ని సినిమాలు హిందీ లో విడుదలైనప్పటికి.. బాలీవుడ్ నిర్మాత.. దర్శకుడితో కలిసి సినిమా చేయడం ఇదే తొలిసారి.టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు భారీగా పెంచిన ఈ సినిమా చూడాలంటే, 2022 దాక ఆగాల్సిందే.

రచయిత.. దర్శకులు.. నిర్మాత.. నెల్లూరు వాసి సాయి రాజేష్ పుట్టిన రోజు నేడు

రచయిత.. దర్శకులు.. నిర్మాత.. నెల్లూరు వాసి సాయి రాజేష్ పుట్టిన రోజు నేడు


హృదయకాలయం దర్శకులు.. కొబ్బరిమట్ట నిర్మాత.. సంపూర్ణేష్ బాబు పాత్ర సృష్టి కర్త.. మెగాస్టార్ కు అభిమాని.. సినిమా పట్ల ప్రేమ.. గౌరవం గల నెల్లూరు వాసి.. సాయి రాజేష్.ఇప్పుడు కలర్ ఫోటో ద్వారా ప్రేక్షకుల ముందుకు రచయితగా.. నిర్మాతగా మరోసారి రానున్న సాయి రాజేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనం.


నెల్లూరు లో లీలా మహల్ లో విడుదలైన ప్రతి సినిమాను చేస్తూ.. మిత్రులు వీడు ఒక సినిమా పిచోడు అనే స్థాయికి చేరారు సాయి రాజేష్.అలాంటి సాయి రాజేష్ కు మెగాస్టార్ అంటే ఇష్టం.. ఆయన నటనకు.. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కు వీరాభిమాని.అలా మెగాస్టార్ పట్ల ఇష్టం.. సినిమా అంటే పిచ్చి తో హైదరాబాద్ చేరారు.సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సాయి రాజేష్ కు అవకాశాలు మాత్రం రాలేదు.


సింగీతం శ్రీనివాస్ గారి దగ్గర ఆరు నెలలు పని చేసిన సాయి రాజేష్ కు ఆయన ఒక మాట చెప్పారు.కమర్షల్ సినిమాలకు హిట్ అయ్యే అవకాశం 10 శాతం కానీ.. కొత్త రకమైన సినిమాకు 50 శాతం అని.. దింతో ఒక సైన్స్ ఫిక్షన్ కథ సిద్ధం చేశారు.అలా అనేక మంది హీరోలకు చెప్పారు.. అందులో ఒక హీరోకి కథ నచ్చింది..కానీ,బడ్జెట్ కారణంగా చెప్పి సినిమా చెయ్యలేదు.దింతో ఒక చెత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.


సామాజిక మాధ్యమాలలో పరిచయమైన మిత్రుల సహాయంతో చెత్త సినిమా చేసేందుకు నిధులు సమకూర్చుకొని ప్రారంభించి.. మారుతి గారు లాంటి వారి సహాయంతో సినిమాను పూర్తి చేశారు.హీరో కోసం కొన్ని నెలలు పాటు నిరీక్షించి చివరకు సంపూ తో చేశారు.రాజమౌళి గారు పోస్టర్ పై తన అభిప్రాయం చెప్పడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది.అలా తీసిన సినిమా హృదయకాలయం. చెత్త సినిమా అని తెలిసి కేవలం గుర్తింపు కోసం చేశారు సాయి రాజేష్.బహుశా ఒక చెత్త (ప్రేక్షకులు మెచ్చిన) సినిమా ద్వారా ఈ స్థాయి స్టార్దం సంపాదించింది తెలుగులో ఒక సాయి రాజేష్ మాత్రమే ఉండచ్చు.


ఆ తర్వాత కొబ్బరిమట్ట సినిమాను నిర్మించారు.ప్రసృతం కథ రచయిత.. నిర్మాతగా కలర్ ఫోటో సినిమా చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్ తో మంచి స్పందన లభించింది.త్వరలో తను అనుకున్న ఒక మంచి సినిమాకు దర్శకత్వం చేసి గొప్ప దర్శకుడిగా సాయి రాజేష్ పేరు తెచ్చుకుంటారు అని ఆశిస్తూ.. ఎప్పటిలానే సామాజిక మాధ్యమాల ద్వారా.. సమాజానికి తనదైన శైలిలో సేవ చేస్తారని కోరుకుంటూ.. పుట్టిన రోజు సందర్భంగా మా (బి.ఆర్.మూవీ.జోన్) తరపున జన్మదిన శుభాకాంశాలు..

కొణిదెల పవన్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా “ఈ కథలో పాత్రలు కల్పితం” పోస్టర్ విడుదల

కొణిదెల పవన్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా “ఈ కథలో పాత్రలు కల్పితం” పోస్టర్ విడుదల


*చిత్రీకరణ పూర్తి చేసుకున్న “ఈ కథలో పాత్రలు కల్పితం”*


పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. చిత్ర హీరో పవన్ తేజ్ కొణిదెల ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ…
”ఈ కథలో పాత్రలు కల్పితం” షూటింగ్ పూర్తి అయ్యింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. మా దర్శకుడు అభిరామ్ మంచి విజన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జెస్సీ’, రీసెంట్ గా వచ్చిన ‘ ఓ పిట్టకథ ‘ ..సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి, మా హీరో పవన్ తేజ్ కొణిదెలకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నాను అన్నారు.డైరెక్టర్ అభిరామ్.ఎం మాట్లాడుతూ…
చిత్రీకరణ పూర్తి చేసుకున్న మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అలాగే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. లేటెస్ట్ గా విడుదలైన థీమ్ పోస్టర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో పవన్ తేజ్ కొణిదెలకు చిత్ర యూనిట్ తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము అన్నారు.

నటీనటులు:
పవన్‌ తేజ్‌, మేఘన, ల‌క్కి

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ ఎన్‌
సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల
ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్ ఆర్‌
ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌
ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి
మాటలు: తాజుద్దీన్‌ సయ్యద్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ
కో-డైరెక్టర్‌: కె. శ్రీనివాస్‌ రెడ్డి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి
లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి
నిర్మాత: రాజేష్‌ నాయుడు
రచన, దర్శకత్వం: అభిరామ్‌. ఎం