12-04-2021 03:01:42 About Us Contact Us
నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!

నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!

Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే భారీ విజయం నమోదు చేసుకున్న దర్శకులు.. జయం సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరి.. నేనే రాజు.. నేనే మంత్రి.. సీత వంటి వరస విజయాలతో ఊపు మీద ఉన్న ఎందరో నటీనటులను పరిశ్రమకు పరిచయం చెయ్యడమే కాక.. తన సినిమాల్లో నటించే నటీనటులకు బాగా నటన నేర్పిస్తారని పేరు గడించిన తేజ గారి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..


దర్శకుడి తేజ బాల్యం అంతా మద్రాస్ లోనే గడిచింది. తన తండ్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు తీసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు,అలాగే వాళ్ళకి టెక్సటైల్ వ్యాపారం కూడా ఉండేది. మద్రాస్ లోని తొలి 10 సంపన్నుల కుటుంబాలలో తేజ గారి ఫ్యామిలీ కూడా ఒకటి. తేజ మద్రాస్ లోని గురుకుల పాఠశాలలో విద్యాబ్యాసం చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈయనకి సూపర్ సీనియర్. పాండి బజార్ వెళ్లి సినిమావకాశాల కోసం ప్రయత్నాలు చేసే వారు.. అలా ప్రయత్నలలో భాగంగా కెమరామెన్ రవి కన్నా దగ్గర అసిస్టెంట్ గా చేరి కెమెరా వర్క్ లో మెలకువలు నేర్చుకున్నారు.


అలా అక్కడ రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కు నాగార్జున తో శివ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకి కెమెరామెన్ గా తేజకి అవకాశం ఇద్దాం అనుకున్నాడు.. కానీ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు ఒద్దనడంతో ఆ అవకాశం చెయ్యి జారిపోయింది. బయట వాళ్లు సినిమాలు చేస్తే తనకి నచ్చిన టెక్నీషియన్స్ ని పెట్టుకోవడం కుదరడం లేదని.. తనే ఒక బ్యానర్ స్థాపించి రాత్రి అనే చిత్రం తీశారు అందులో తేజ కెమరామెన్. కెమెరామెన్ గా తేజ వర్క్ నచ్చి.. తరువాత తీసిన మనీ చిత్రానికి కూడా తేజ గారినే తీసుకున్నారు ఆర్.జి.వి.


తేజ బాలీవుడ్ లో బిజీ అయిపోయాడు.. తన బాలీవుడ్ చిత్రాలు అన్ని షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగేలా చూసుకునేవారు.. తన ఇంటికి సౌలభ్యంగా ఉంటుందని. అది తెలుసుకున్న రామోజీ రావు గారు తేజతో మాట్లాడి కథ ఉంటే చెప్పామన్నారు.. తను ‘చిత్రం’ కథ చెప్పారు.. 40లక్షల బడ్జెట్ లో సినిమా పూర్తి చేశారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది తరువాత నితిన్ కథనాయకుడిగా జయం, నవదీప్ తో జై.. సూపర్ స్టార్ మహేష్ తో నిజం.. ఇలా 13 ఏళ్ళ సినీ జీవితంలో 13 చిత్రాలు తీశారు తేజ.


వరస విజయాలతో జోరు మీద ఉన్న తేజ.. తనకి భారీ విజయాన్ని అందించిన చిత్రంకి కొనసాగింపుగా చిత్రం1.1 ని తెరకేక్కిస్తున్నారు. ఇప్పటి మన స్టార్ హీరోలకి కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలు అందించిన తేజ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం.


ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి 

సున్నిత ప్రేమ కథల దర్శకుడు శేఖర్ కమ్ములకి జన్మదిన శుభాకాంక్షలు.

సున్నిత ప్రేమ కథల దర్శకుడు శేఖర్ కమ్ములకి జన్మదిన శుభాకాంక్షలు.


Happy Birthday Sekhar Kammula: ప్రేమకథా చిత్రాలు తెరకేక్కించడంలో ఒక్కొక్కరిది ఒకొక్క పంధా ఉంటుంది అలానే శేఖర్ కమ్ముల గారు కూడా ప్రేమకథలలో తనదైన మార్క్ ని వేసుకున్నారు.హీరోయిన్ లను గ్లామర్ మెటీరియల్ గా చూసే సినిమాలు వస్తున్నా కూడా శేఖర్ కమ్ముల గారి చిత్రలలో ఎప్పుడు కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత పుష్కళంగా ఉంటుంది.


హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శేఖర్ కమ్ముల గారు పై చదువులకు వాషింగ్టన్ వెళ్ళినప్పుడు ఒక కథ రాసుకున్నారు. అది డాలర్స్ మాయలో పడి తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాల్లో స్థిరపడుతున్న యువతని ఉద్దేశించి తయారుచేసుకున్న కథ తో 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రాన్ని తెరకేక్కించారు శేఖర్ కమ్ముల గారు కానీ కమర్షియల్ గా అంతా విజయాన్ని అందుకోకపోయినా సప్తగిరి ఛానల్ వాళ్ళు సాటిలైట్ రైట్స్ రూపంలో 15 లక్షలకు కొనుకున్నారు.ఇక ఈ చిత్రానికి గాను ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.


తరువాత తన స్నేహితులు సహాయంతో ఆనంద్ చిత్రాన్ని తెరకేక్కించారు అది చాలామంది భయ్యార్స్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు దీనితో హైదరాబాద్ లో 5 థియేటర్స్ కి ఒక్కో థియేటర్ కి 2లక్షలు ఇచ్చి రెండు వారాలు ఉంచాల్సిందిగా కోరాడు అ సినిమా విడుదల అయిన రెండురోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దర్శకుడిగా అద్భుత విజయాన్ని అందుకున్నారు శేఖర్ కమ్ముల గారు.

Shekar kammula birthday


తరువాత కొత్త ఆర్టిస్ట్లతో హ్యాపీ డేస్ చిత్రాన్ని తెరకేక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు అ సమయంలో యువత ఎగబడి చూసిన చిత్రం హ్యాపీ డేస్ ఈ చిత్రంలో తమని తాము చూసుకుంటూ థియేటర్స్ నుండి బయటకు వచ్చిన యువత హ్యాపీ డేస్ ని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు.


అక్కడ నుండి దర్శకుడిగా వెనుతిరిగి చూసుకోలేదు గోదావరి, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్,అనామిక వంటి చిత్రాలు తీసి తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దిల్ రాజు నిర్మించిన ఫిదా చిత్రంతో 50కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు (Sekhar Kammula )శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా love స్టోరీ అనే చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేస్తున్నారు.


అద్భుత విజయాలు అందించిన శేఖర్ కమ్ముల గారు ఇంకా మరెన్నో చక్కని చిత్రాలు అందించి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ BR మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

“పోలీస్ వారి హెచ్చరిక”.. “లక్ష్య”.. “వరుడు కావలెను” అంటున్న నాగశౌర్య కి జన్మదిన శుభాకాంక్షలు

“పోలీస్ వారి హెచ్చరిక”.. “లక్ష్య”.. “వరుడు కావలెను” అంటున్న నాగశౌర్య కి జన్మదిన శుభాకాంక్షలు10 ఏళ్ళ ముందు హీరోగా పరిచయమై.. ఊహలు గుసగుసలాడే.. చలో వంటి భారీ విజయాలను నమోదు చేసుకొని.. 2ఒక పైగా సినిమాలు పూర్తి చేసి..ప్రసృతం మూడు సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్న.. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న.. కథానాయకుడు నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ కధనం..


నాగశౌర్య పుట్టింది ఏలూరు. 6వ తరగతి నుండి స్కూల్ బంక్ కొట్టి సినిమాలు చూడటం అలవాటు అయింది ఆలా సినిమాల మీద ఆసక్తి పెరిగింది నాగశౌర్య కి ఆలా 10వ తరగతి పూర్తి చేసిన తరువాత సినిమాలలో నటిస్తా అని వాళ్ళ అమ్మ గారికి చెప్పడంతో ఆమె నువ్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత నచ్చింది చెయ్యు అని షరతు పెట్టరు.


విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ హైదరాబాద్ లో చదివితే.. సినిమా అవకాశాలు కోసం ప్రయత్నాలు చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఇంట్లో ఒప్పించి డిగ్రీ హైదరాబాద్ లో చదువుతూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు.ఆలా 4ఏళ్ళు సినీ ప్రయత్నాలు చేసిన తరువాత2010లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. తరువాత 2013 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చందమామ కధలు అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు.


తరువాత 2014 లో వారహి చిత్రం బ్యానర్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో “ఊహలు గుసగుసలాడే” చిత్రంలో నటీంచగా అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావా మా ఇంటికి, జాదుగాడు, చలో, అశ్వాద్దామా వంటి చిత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.


ప్రస్తుతం వరుడు కావలెను.. లక్ష్య..పోలీస్ వారి హెచ్చరిక.. చిత్రలోలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవాలని.. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది B R మూవీ జోన్.

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ కు జన్మదిన  శుభాకాంక్షలు

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు


రెబల్ ఈ పేరు విన్నవెంటనే మీ మనసులో ప్రభాస్ పేరు రావడం సహజం కానీ ఒక తరం వెనక్కి వెళ్లి చూస్తే రెబల్ స్టార్ అనగానే ఆరడుగుల యాక్షన్ హీరో కృష్ణంరాజు గారు గుర్తుకు వస్తారు.1940లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు కృష్ణంరాజు గారు.. కృష్ణం రాజు గారి అసలు పేరు శ్రీ వెంకట కృష్ణంరాజు.


కష్టపడి పని చేసే తత్వం ఉన్న కృష్ణంరాజు గారికి ఫోటోగ్రఫీ అంటే మక్కువతో ఇంట్లో ఉన్న ఒక కెమెరాతో ఫొటోస్ తీయడం అలవాటుగా మార్చుకున్నారు.చిన్నతనంలో ఎక్కువ అల్లరి చేసే కృష్ణంరాజు గారు తన తండ్రి వెంకట సత్యనారాయణ రాజు గారి మాటలు విని తనకి బాగా ఇష్టం అయిన ఫోటొగ్రఫీని వ్యాపారంగా చేద్దాం అని నిర్ణయించుకున్నారు.తన దగ్గర ఉన్న ఒక కెమెరాతో పాటు ఇంకొక కెమెరా కొని ఒక షాప్ అద్దెకి తీసుకుని దానికి రాయల్ ఫొటో స్టూడియో అని పేరు పెట్టారు.


ఆ షాప్ లో పని చేసే కుర్రాడు ఒక రోజు కృష్ణంరాజు గారితో ఇలా అన్నాడు.. సార్ మీరే హీరో లా ఉంటారు మీ ఫొటోస్ కొన్ని తీసి షాప్ లో షోకేస్ లో పెడదాం అని.. దానికి బదులుగా కృష్ణంరాజు గారు.. నా ఫొటోస్ ఎందుకు ఎన్టీఆర్, ఏ న్ ఆర్ ఫొటోస్ పెట్టు అన్నాడు.. అయినా ఆ కుర్రాడు పట్టుపట్టి మరి కృష్ణంరాజు గారితో కొన్ని స్టిల్స్ తీసుకుని షాపులో పెట్టాడు.ఆలా షాపులో ఫొటోస్ చూసిన ఒక పెద్దాయన నువ్ హీరోలా ఉన్నావ్ నేను కూడా ఒక సినిమా తియ్యాలి అనుకుంటున్నా నీకు ఇష్టం అయితే ఇప్పుడే మద్రాస్ తీసుకుని వెళ్తా అని చెప్తే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు స్ని సున్నితంగా తిరస్కరించారు కృష్ణంరాజు గారు


కానీ ఆ పెద్దాయన మరుసటి రోజు మళ్ళీ వచ్చి అడిగాడు ఆలా రెండు రోజులు వచ్చి అడిగే సరికి కృష్ణంరాజు గారికి కూడా ఆశ కలిగింది వెంటనే వాళ్ళ పత్రిక బాబాయ్ కి ఫోన్ చేసిన అడిగాడు వాళ్ళ బాబాయ్ కూడా హీరోలా ఉంటావ్ ఒక సారి ప్రయత్నించి చూడు అనే సరికి మద్రాస్ వెళ్ళాడు కృష్ణంరాజు.


మద్రాస్ వెళ్లిన కృష్ణంరాజు గారు అజంతా హోటల్ లో ఉండే వారు ప్రముఖ హీరోలకి మేకప్ వేసే పితాంబరం గారిని పిలిపించి మేకప్ టెస్ట్ చేయించారు ఆలా మూడు రోజులు గడిచాయి తరువాత 15రోజులు అయినా సరే ఆ పెద్దాయన కనిపించడం మానేసాడు అది గమనించిన హోటల్ యజమాని కృష్ణంరాజు గారితో ఇలా అన్నాడు.. మీరు ఆ పెద్దాయన కోసం ఎదురుచూస్తున్నట్టు అయితే వెళ్లిపోండి ఇంకా అయన రాడు అయన ఇలానే ప్రతి సారి తెలుగు వారిని ఒకరు ఇద్దరిని తీసుకుని వచ్చి సినిమా తీస్తా అని చెప్పి తన ఖర్చులకు డబ్బులు తీసుకుని మెల్లగా జారుకుంటాడు అని చెప్పడంతో కృష్ణంరాజు గారు నిరాశతో మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారు.


1966 లో ప్రత్యేకాత్మ గారి దర్శకత్వంలో చిలక గోరింకా అనే చిత్రంలో నటించారు కృష్ణంరాజు గారు.. ఈ చిత్రంలో S V రంగారావు గారిలాంటి మేటి నటులకు దీటుగా నటించి మెప్పించారు రాజు గారు కానీ ఆ చిత్రం నిరాశపరిచినా కాని కృష్ణంరాజు గారి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు.తరువాత బుద్దిమంతుడు, పవిత్రబంధం, జై జవాన్ లాంటి చిత్రాలలో విలన్ పాత్రలో నటించారు మళ్ళీ తిరిగి 1974 లో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.


ఇంటి దొంగలు చిత్రం తో మళ్ళీ హీరోగా వెలుగొందిన కృష్ణంరాజు గారు తరువాత కృష్ణవేణి అనే చిత్రం సగం పూర్తి అయిన తరువాత ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అయిపోవడంతో కృష్ణంరాజు గారు మిగిలిన డబ్బులు పెట్టి సినిమా పూర్తి చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా హీరో పాత్రాల్లో చేయడం ప్రారంభించారు నిత్యసుమంగళి, మొగుడా పెళ్ళామా, భక్త కన్నప్ప వంటి చిత్రాలు చేసి మెప్పించారు తరువాత బిల్లా, రెబల్ వంటి చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు.


ఇంకా ముందు ముందు మరెన్నో పాత్రాల్లో అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ “రెబల్ స్టార్ కృష్ణంరాజు” గారికి B R మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

“ఎఫ్ 3” తో అలరించేందుకు వస్తున్న “గని”.. “వరుణ్ తేజ్” బర్త్ డే స్పెషల్..!

“ఎఫ్ 3” తో అలరించేందుకు వస్తున్న “గని”.. “వరుణ్ తేజ్” బర్త్ డే స్పెషల్..!బాల నటుడిగా పరిచయమై.. ఆరేళ్ళ నుండి హీరోగా అలరిస్తున్న ఆరడుగుల అందగాడు.. అమ్మయిలలో మంచి ఫాలోవింగ్ సంపాదించి.. అటు మాస్ ఇటు క్లాస్ అని తేడా లేకుండా.. తన సినిమా అంటే వెళ్లి చూడచ్చు అనే స్థాయికి చేరిన హీరో.. విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు.. టవర్ స్టార్.. మన నవ్వుల బాబు.. నాగబాబు గారి తనయుడు.. “మెగా ప్రిన్స్” “కొణిదెల వరుణ్ తేజ్”. నేడు అలాంటి వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..


కెర్రీర్ ప్రారంభం నుండి మెగా హీరో అనే ఒక ట్యాగ్ పడకుండా జాగ్రత్త పడ్డారు వరుణ్ తేజ్. పెదనాన్న.. తండ్రి.. బాబాయ్.. పేరు వాడుకొని క్రేజ్ సంపాదించాలనుకోకుండా.. తన స్టోరీ సెలక్షన్ తో అభిమానులను పొందారు వరుణ్ తేజ్. ముకుంద చిత్రంతో హీరోగా మొదలైన తన సినీ ప్రస్థానం.. అనతి కాలంలోనే తన వైవిధ్యమైన పాత్రాల ఎంపికతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ కొణిదెల వారసుడు. రెండవ సినిమా కంచె లో తన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు పొందారు. లోఫర్.. గడ్డలకొండ గణేష్ సినిమాలతో మాస్ ఆడియాన్స్ కి బాగా చేరువయ్యారు.


తొలిప్రేమ తో యువతకు.. ఫిదా తో అమ్మయిలకు ఫేవరేట్ హీరో గా మారిపోయారు. ఇక ఎఫ్2 లో మన విక్టరీ వెంకటేష్ గారితో తాను చేసిన హంగామా అంతా.. ఇంతా కాదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాను చేస్తున్న తదుపరి చిత్రాలు ఎఫ్ 3 మరియు బాక్సింగ్ కధాంశం తో తెరకెక్కుతున్న గని సినిమా పోస్టర్స్ విడుదల చేశారు. గని పోస్టర్ కు సామాజిక మాధ్యమాలలో మంచి స్పందన వస్తుంది. వరుణ్ తేజ్ ఆన్ స్క్రీన్ విషయాలు కాసేపు పక్కన పెడితే..అటు సెట్ లో.. ఇటు ఈవెంట్స్ లలో.. ఎప్పుడు చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ.. చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. రెండవ సారి నుండి నన్ను ఎక్కడ చూసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటే మీడియా కాబట్టి నన్ను గుర్తు పెట్టుకున్నారేమో అనుకున్నాను. కానీ.. అభిమానులను సైతం ఆయన అలానే గుర్తుపెట్టుకొని మాట్లాడుటారు అని తర్వాత తెలిసింది. అందుకే మెగా అభిమానులలో వరుణ్ తేజ్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక మూస ధోరణి లో వెళ్లకుండా అన్ని రకాల సినిమాలను చెయ్యడం ద్వారా అందరిని ఆకట్టుకున్న ఈ మెగా ప్రిన్స్.. ఆఫ్ కెమెరా లో ఎక్కడా స్టార్ హీరో అని గాని.. మెగా ఫామిలీ హీరో అనే అహం కనపడకపోవడం.. నాగబాబు గారి పెంపకానికి నిదర్శనం. అందుకే ఆఫ్ కెమెరాలో ప్రవర్తన వల్ల హీరోలలో కొందరికే అభిమానులు ఉంటారు.. అలాంటి జాబితాలో వరుణ్ ఒక్కరు.


మెగా బ్రదర్స్ చిరంజీవి.. నాగబాబు గార్లు కలిసి నటించిన “హాండ్స్ అప్” సినిమాతో బాల నటుడిగా కనిపించి.. “ముకుందా” తో హీరోగా పరిచయమై.. “కంచె” తో విమర్శకుల ప్రశంసలు పొంది.. “లోఫర్” తో మాస్.. “మిస్టర్” తో ఫామిలీ ఆడియన్స్ కి చేరువై.. ఎంతో మంది అమ్మయిలను “ఫిదా” చేసి.. తన “తొలిప్రేమ” తో “అంతరిక్షం” స్థాయి విజయం అందుకొని.. “ఎఫ్ 2 ” తో క్లాస్.. మాస్ అనే భేదం లేకుండా అందరిని అలరించిన “గడ్డలకొండ గణేష్” అలియాస్ “గని”.. అమ్మయిలలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆజానుభావుడు “మెగా ప్రిన్స్” “కొణిదెల వరుణ్ తేజ్” గారికి మా బి.ఆర్. మూవీ జోన్ తరపున “జన్మదిన శుభాకాంశాలు”.!