17-05-2022 04:09:06 About Us Contact Us
ప్యాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.!

ప్యాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.!


ఈశ్వర్ తో పరిచయమై.. వర్షం తో భారీ విజయం సాధించి.. ఛత్రపతి తో యంగ్ రెబల్ స్టార్ గా మారిన అమ్మయిల డార్లింగ్.. ఆరడుగుల మిస్టర్ పర్ఫెక్ట్.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు.రేపు(అక్టోబర్23న) అటువంటి బాహుబలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..!


ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారిల మూడవ సంతానం ప్రభాస్.భీమవరంలో కొద్ది సంవత్సరాలు చదువుకున్న ప్రభాస్.. ఆ తర్వాత హైదరాబాద్ లో పూర్తి చేశారు.పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా 2002లో జయంత్. సి. పరంజాయ్ దర్శకత్వంలో.. ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకుడిగా.. శ్రీదేవి విజయకుమారి హీరోయిన్ గా ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.వెంటనే రాఘవేంద్ర సినిమా చేశారు.తొలి రెండు సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.2004లో విదులైన వర్షం సినిమాతో భారీ విజయం అందుకున్నారు ప్రభాస్.అక్కడ నుండి అందరికి తెలిసిన చరిత్రే.తాను చేసిన ఒక్కో సినిమాతో తనకంటూ అభిమానులను పెంచుకుంటూ పోయారు ప్రభాస్.ఛత్రపతి.. పౌర్ణమి.. బిల్లా సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.డార్లింగ్.. మిస్టర్ పర్ఫెక్ట్.. మిర్చి.. సినిమాలతో అమ్మయిల అభిమాన హీరో అయిపోయారు.ఈ మూడు సినిమాల భారీ విజయంతో యువతలో మంచి ఫాలోయింగ్ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. పదేళ్ళ సినీ జీవితంలో భారీ విజయాలతో పాటు పరాజయాలను చూసిన ప్రభాస్ అల్ టైం స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.


అమ్మయిల “డార్లింగ్”.. “పౌర్ణమి” యొక్క “బుజ్జిగాడు”.. “బిల్లా” తో “రెబల్” స్టార్ గా మారిన “మున్నా”.. “మిర్చి” లాంటి “ఈశ్వర్”.. ఇప్పటికీ “ఎక్ నిరంజన్” అంటున్న “అడివి రాముడు”.. “యోగి” “రాఘవేంద్ర” స్వామి భక్తుడు..”వర్షం” తో బాక్స్ ఆఫీస్ లో “చక్రం” తిప్పిన “ఛత్రపతి” ని.. “మిస్టర్.పర్ఫెక్ట్” అంటూ.. “సాహో” “బాహుబలి” అంటూ దేశం కీర్తించింది.ఇప్పుడు “రాధే శ్యామ్” తో మన ముందుకు వస్తున్నారు “ఆదిపురుషు”..2015లో విడుదలైన బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు స్టార్ హీరోల జాబితా నుండి దేశం మొత్తం తెలిసిన ప్రాంతీయ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించారు.బాహుబలి 2 విడుదల సమయానికి ప్యాన్ ఇండియా హీరోగా అవతరించారు ప్రభాస్.సాహో.. రాధే శ్యామ్.. ఆదిపురుషు.. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇలా తాను చేస్తున్న ప్రతీ సినిమా.. అన్ని భాషలలో విడుదల చేస్తూ.. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు.అటు దక్షణ చిత్ర పరిశ్రమలతో పాటు.. ఇటు బాలీవుడ్ లో సైతం జండా పాటెందుకు ముందుకు వెళ్తున్నారు ప్రభాస్.


రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి.. యంగ్ రెబల్ స్టార్ గా పేరు పొంది.. వరస విజయాలతో కోట్లాది మంది అభిమాన రెబల్ స్టార్ గా మారారు.ఇప్పుడు ప్రాంతీయ చిత్ర పరిశ్రమ నుండి ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగారు.చేస్తున్న సినిమాలు భారీ విజయాలు సాధించి తెలుగు హీరో స్థాయి.. స్టామినా.. దేశ.. విదేశాల్లో ప్రతిధ్వనించాలని కోరుకుంటూ..రేపు (అక్టోబర్ 23న) పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు..!

నేడు సినిమాల ద్వారా జీవిత సత్యాలు చెప్పే పూరి పుట్టిన రోజు.!

నేడు సినిమాల ద్వారా జీవిత సత్యాలు చెప్పే పూరి పుట్టిన రోజు.!యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రాజు విశాఖ తీరంలోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊరిలో ఒక అల్పపీడనం పుట్టింది.అది హైదరాబాద్ చేరుకొని రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో తుఫాన్ గా మారింది. సునామీ వంటి బీభస్థాని సృష్టించిన ఆ తుఫాన్ పేరు పూరి జగన్నాథ్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బద్రి సినిమాతో పరిచయమై.. తొలి సినిమాతోనే తన సినిమాలో హీరో క్యారెక్టర్లు మున్ముందు ఎలా ఉంటాయో చూపించాడు.. పబ్లిక్ పల్స్ పట్టిన ఆ యువ దర్శకుడు.ఆ రోజు పవన్ కళ్యాణ్ సైతం ఊహించి ఉండదు తను మెడ మీద చెయ్యి పెట్టడం తన మ్యానరిజం అవుతుందని.ఇక యువత బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ గారికే కాక తొలి సినిమా దర్శకత్వం చేసిన దర్శకునికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు.నాటి బద్రి నుంచి నిన్నటి ఇస్మార్ట్ శంకర్ వరకు హిట్లు,ఫ్లాప్లు అనే సంబంధం లేకుండా రెండు దశాబ్దాలుగా యువతకు బాగా చేరువైన దర్శకుడు పూరి జగన్నాథ్ గారు.నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనం..


తొలి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో భారీ విజయం అందుకున్న పూరి,వెంటనే జగపతిబాబు గారితో బాచి.. కన్నడలో శివ రాజ్ కుమార్ తో మన తెలుగు తమ్ముడిని రీమేక్ చేశారు.2001లో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. 2003 కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో అప్పు.. తెలుగులో రవితేజను స్టార్ హీరో చేసిన ఇడియట్ సినిమా చేశారు..ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమ్మిళ అమ్మాయి సీనిమాతో పూరి,రవితేజ కంబోగా వరస హాట్-ట్రిక్ హిట్స్ అందుకున్నారు.


అక్కడ నుండి వెనక్కు తిరిగి చూడలేదు.. అలనాటి అగ్ర హీరోలు నాగార్జున,బాలకృష్ణ.. నేటి తరం స్టార్లు పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,తారక్,బన్నీ,రామ్ చరణ్,ప్రభాస్,రానా,గోపిచంద్,రవితేజ,వరుణ్ తేజ్,రామ్ పోటీనేని వంటి హీరోలతో సినిమాలు చేశారు..బాలీవుడ్ లో బద్రి ని రీమేక్ గా షార్ట్ సినిమా.. తన అభిమాన నటుడు బిగ్ బి అమితా బచ్చన్ గారితో బుద్దా హోగా తెర బాప్ అనే సినిమాని డైరెక్ట్ చేశారు పూరి.చిరుత.. తో నేనింతే.. అని చెప్పిన ఎక్ నిరంజన్.
ఒక పక్క జ్యోతిలక్ష్మి తో.. 143.. నేను నా రాక్షసి..అంటూ,మరో పక్క కెమరామెన్ గంగతో రాంబాబు గా మారి.. మేరీ మెహబూబా అని చెప్పిన.. ఇద్దరమ్మాయిల రోమియో. వారికి గోలిమార్ తో హార్ట్ ఎటాక్.. తెప్పించిన ఆంధ్రవాలా.. దేశముదురు.. పోకిరి.. లోఫర్..రోగ్.. మన బుజ్జిగాడు. చివరకు దేవుడు చేసిన మనుషులు.. ఇంతే అనే ఇజం నమ్మిన శివమణి.. తన టెంపర్..తో సూపర్.. బిజినెస్ మ్యాన్ గా పైసా వసూల్ సాధించారు.
ఇట్లు..
ఇస్మార్ట్ శంకర్.


ఇప్పుడు 2020లో స్టార్ హీరోగా మారిన నేటి తరం రౌడీ విజయ్ దేవరకొండ తో కలిసి దేశ స్థాయిలో భారీ సినిమా చేస్తున్నారు పూరి..ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ కుడా ఉన్నారు.ఇలా తన 20ఏళ్ళ సినీ జీవితంలో 32 సినిమాలు చేశారు.నేటి తరం దర్శకులలో చాలా మంది జీవితంలో చేసే సినిమాలు ఆయన ఈ 20ఏళ్లలో చేశారు. ఒక్క సంవత్సరంలో 3 సినిమాలు చేసినా,అతి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసినా..అవన్నీ పూరి మార్క్ దర్శకత్వ ప్రతిభకు అర్థం పడతాయి.. కన్నడ లో పునీత్ రాజ్ కుమార్.. తెలుగు తో రామ్ చరణ్ వంటి సినీ వారసులను పరిశ్రమకు పరిచయం.. అక్కడ రాజ్ కుమార్.. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అడిగి చేయించుకున్నారు. డైలాగ్స్ విషయానికి వస్తే..


పవన్ కళ్యాణ్(బద్రి):- నువ్వు నందా,నందా అయితే నాకేంటి నేను బద్రి బద్రీనాథ్.
మహేష్ బాబు(పోకిరి):- ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లోక్ అవుడో వాడు పండు,నేనే..
నాగార్జున(శివమణి):- నా పేరు శివమణి,నాకు కొంచెం మెంటల్.
అల్లు అర్జున్(దేశముదురు):- జాయింట్లు జారిపోతాయి,ఫిలమెంట్లు రాలిపోతాయి..
రవితేజ(ఇడియట్):- సిటీ కి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు..పోతుంటారు..కానీ,చంటిగాడు.. లోకల్..
ఎన్టీఆర్(టెంపర్):- నా పేరు దయా,నాకు లేనిదే అది..
ప్రభాస్(బుగ్గిగాడు):- టిప్పర్ లారీ వచ్చి గుడితే ఎలా ఉంటుందో తెలుసా..ఇలా ప్రతి సినిమాలో పదుల సంఖ్యలో డైలాగ్స్ మనకు టక్కున గుర్తొచ్చేస్తాయి..హీరోల మ్యానరిజంలలో సైతం పూరి మార్క్ ఉంటుంది.ఆయన సినిమా డైలాగ్స్ లో జీవిత సత్యాలు కూడా ఉంటాయి..ఉదాహరణకు,నాకు బాగా నచ్చిన డైలాగ్.. నేనింతే సినిమాలో.. “ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కడు స్వార్థ పరుడే ఇదే మాటచెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు..”.ప్రపంచంలో జరుగుతున్న నిజాలని పూరి చూపించే విధానం అద్భుతం.. కొంచం ఘాటుగా చెప్పినా ఆయన ప్రతి సినిమాలో ఒక చక్కటి సందేశం ఉంటుంది.. పాటలకు పూరి సినిమాలో మరో ప్రాత్యేక స్థానం.అందుకే పూరి సినిమా పాటలు మన ప్లే లిస్ట్ లో కచ్చితంగా ఎక్కువే ఉంటాయి. ఆయన సినిమాలే జీవిత సత్యాలు, చాలామందికి ఆదర్శాలు.. ప్రేమ,దేశం పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఆయన సినిమాలు చూస్తే మనకు అర్ధమవుతుంది.మనలో చాలా మంది ఆయన మాటలలో ఆటో,ఇటో వెళ్లకుండ మధ్యలో ఊగిసులడుతుంటాం..వీరే ఈ దేశానికి ప్రమాదకరం..వీరు ఉండకూడదు అనేదే తన తపనలా కనిపిస్తూ ఉంటుంది.సమాజం పట్ల తనకున్న బాధ్యత తను ఇలా సినిమాలు తీస్తూ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది.


సినిమాల్లోకి రాకముందు నుండే పూరి ఇలానే ఉన్నారు.తాను విశాఖలో ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లోనే తన మిత్రులతో మాట్లాడటానికి ఒక ఆఫీస్ ఏర్పచుకున్నారు.. ఆయన శైలే ఆయన పాత్రలకు ఇచ్చారంటే.సొంతగా పూరి కనెక్స్ అనే నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు నిర్మించడమే కాక చాలామందికి అవకాశాలు,మరెందరికో ఉద్యోగాలు ఇస్తున్నారు పూరి.గత సంవత్సరం తన పుట్టినరోజున(ఇదే రోజు).. సినిమాలు చెయ్యలేని వృద్ధ దర్శకులకు ఆర్థిక సహాయం అందించారు పూరి.ఇదే కాదు,చేసిన సహాయం ఎన్నడూ చెప్పుకోలేదు పూరి..సాధారణంగా ప్రేక్షకులు మాట్లాడుకుంటూ..మా హీరో పాత్రలో ఎలా జీవించగలదో చూస్తావు ఆగు,పూరి గారితో మా వాడి సినిమా వస్తుంది.హీరోయిన్ లను చూపించడంలో కూడా తనదైన మార్క్ ఉంటుంది.ఆ అమ్మాయిని సరిగ్గా ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు..ఇప్పుడు పూరితో సినిమా చేస్తుంది కదా..ఇప్పుడు చూడు ఎలా చూపిస్తాడో పూరి..అంటున్నారు.


ఇలా పూరి గారి గురించి రాసుకుంటూ పోతే పుస్తకమే రాయచ్చు.తాజాగా ..తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెన్ సెషన్,పంచ్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్,మాస్ సినిమాలకు పర్మనెంట్ అడ్రస్.. పూరి గారి మాటలలో చెప్పాలి అంటే..పూరీ నువ్వు తోపు రా..పూరి నువ్వు తురుము రా.. పూరి నువ్వే మా అందరి రుస్తుం..మరిన్ని దశాబ్దాలు ఇలా సినిమాలు చెయ్యాలని.. మీడియా,పోలీస్,రాజకీయం అనే తేడా లేకుండా సమాజంలో తప్పు చేసే ప్రతి యడవను కడిగేయ్యాలని కోరుకుంటూ.. నేడు యాభై నాలుగవ పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరి జగన్నాథ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు.!

నేడు,అందరిని నవ్వించిన.. బ్లాక్ బస్టర్ దర్శకులు.. శ్రీను వైట్ల పుట్టిన రోజు

నేడు,అందరిని నవ్వించిన.. బ్లాక్ బస్టర్ దర్శకులు.. శ్రీను వైట్ల పుట్టిన రోజుశ్రీను వైట్ల.. ఈ పేరు తెలియని తెలుగు వారు వుంటారేమో కానీ.,ఆయన సినిమాలు చూడని వారు ఉండరు.అలానే ఆ సినిమా పేర్లు చెప్పగానే అందరికి ఏదో ఒక హాస్య సన్నివేశం గుర్తుకు వస్తుంది.. వారు ఆ సన్నివేశాన్ని చెబుతూ నవ్వుతూ వుంటారు.దూకుడు వంటి సినిమాలకు తన పారితోషికం విడుదలకు ముందు తీసుకోకుండా తన సినిమా పట్ల తనకున్న నమ్మకం చాటుకున్న దర్శకులు.నేడు.. అంతలా 1999 నుంచి మన అందరినీ వినోదం లో ముంచేసిన శ్రీను వైట్ల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఈ కథనం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఈస్ట్ గోదావరి జిల్లా.. కండులపాలెం అనే ఊరిలో 1972న జన్మించారు శ్రీను వైట్ల.చిన్నతనం నుండి సినిమాలను అమితంగా ప్రేమించారు..విపరీతంగా సినిమాలు చూడడటం మొదలు పెట్టారు. బాగా చదువుకొని,ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా.. వినకుండా,వ్యవసాయం చేశారు శ్రీను వైట్ల తండ్రి గారు.అలాంటి వ్యక్తి తనయుడుగా శ్రీను వైట్ల సినిమా మీద ఇష్టంతో డిగ్రీని తొలి సంవత్సరమే చదవకుండా కాకినాడ నుండి చెన్నై బయలుదేరారు.ఇంట్లో వాళ్ళు కాలేజీ ఫిజు,బట్టలు,పుస్తకాలకు ఇచ్చిన 1500 రూపాయలతో మద్రాస్ చేరిన ఆ 18 ఏళ్ళ కుర్రాడు దర్శక విభాగం లో అవకాశం కోసం అనేక పాట్లు పాడారు.


చివరకు,బాలకృష్ణ గారి సినిమాకి దర్శక విభాగంలో చేరారు,సినిమా ఆడకపోవడంతో ఆ దర్శకుడికి మళ్ళీ అవకాశం రాలేదు.అంతలో శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసేందుకు హైదరాబాద్ బయల్దేరారు వైట్ల.హైదరాబాద్ చేరిన శ్రీనుకు అర్జీవి దగ్గర అవకాశం దొరకడం అసాధ్యం అని భావించి.. సీనియర్ దర్శకుడిగా పేరు పొందిన సాగర్ వద్ద చేరారు.అక్కడే వి.వి.వినాయక్ గారితో కలిసి పని నేర్చుకున్నారు.అనేక సంవత్సరాల అనుభవం తర్వాత తొలి సినిమా దర్శక అవకాశం లభించింది.అపరిచితుడు అనే టైటిల్ తో రాజశేఖర్ హీరోగా సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.. ఆర్థిక ఇబ్బందులతో సినిమా ఆగిపోయింది.దింతో బాగా కుంగిపోయారు వైట్ల.1999లో కేవలం 32లక్షల్లో దాదాపు ఐదుగురు నిర్మాతలతో ఒక చిన్న సినిమా చేశారు.అదే మాస్ మహరాజ్ రవితేజ తో చేసిన నీకోసం.సినిమా చూసిన రామోజీరావు గారు ఆయన సినిమాను తానే తీసుకొని పెద్దగా విడుదల చెయ్యడంతో పాటు మరో సినిమా అవకాశం కూడా ఇచ్చారు.తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు,నంది అవార్డులు అందుకున్న శ్రీనుకి తన మిత్రులు,ఎక్కడా ఒక్క కామెడీ సన్నివేశం లేదు అని చెప్పిన మాటలు బాగా ఆలోచింపచేశాయి.దాంతో ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేసిన శ్రీనుకి తిరుగు లేదు.ఆనందం,సొంతం,వెంకీ వంటి విజయాలతో స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయారు.మెగాస్టార్ చిరంజీవి గారి అందరివాడు సినిమా చేసి టాప్ దర్శకులలో ఒక్కరిగా గుర్తింపు పొందారు.ఢీ..దుబాయ్ శ్రీను.. రెడీ వంటి వరస విజయాలతో అగ్ర కథానాయకుల నుండి అవకాశాలు లభించడం మొదలయ్యాయి.నాగార్జున గారితో కింగ్,వెంకీ గారితో నమో వేంకటేశా.!,మహేష్ బాబు తో దూకుడు,తారక్ తో బాద్ షా చెయ్యడంతో పాటు భారీ విజయాలు నమోదు చేశారు.ఇటీవల చరణ్ తో బ్రూస్ లీ.. వరుణ్ తేజ్ తో మిస్టర్,రవితేజ తో మూడవ సినిమాగా అమర్..అక్బర్..ఆంటోనీ చేశారు.


ఇలా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసిన శ్రీను వైట్ల తనదైన కామెడీ పంచ్ లతో ప్రతి ఇంటిలో నవ్వులు పూయించారు..ముఖ్యంగా ఆయన సినిమాల్లో బ్రహ్మానందం గారి కామెడీ అందరిని బాగా నవ్వించాయి.హీరో ఇమేజ్ తగ్గకుండా ఫామిలీ ఆడియాన్స్ కు బాగా చేరువయ్యారు.వరస విజయాల్లో వున్నా తక్కువ పారితోషికం తీసుకోవడం,బడ్జెట్ పెరగడంతో,తన సినిమా మీద నమ్మకంతో విడుదల తర్వాత పారితోషకం తీసుకోవడం వంటివి శ్రీను వైట్లకే చెందాయి.అలాంటి శ్రీను వైట్ల గారు నేడు 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు…!

త్వరలో శ్రీను వైట్ల గారు మరో బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని కోరుకుంటూ..

హీరోగా మారిన విలక్షణ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు నేడు.!

హీరోగా మారిన విలక్షణ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు నేడు.!


ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుటుంబంలో జన్మించి.. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న ఒక మధ్యతరగతి కుర్రాడు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. ఎన్నో అవమానాలు.. మరెన్నో కష్టాను అనుభవించాడు. ఇప్పుడు,నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.తనే.. పెళ్ళి చూపులుతో పరిచయమై.. మల్లేశం తో హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. నేడు అలాంటి ప్రియదర్శి పుట్టినరోజు..


ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఎంఏ చదుకున్న దర్శి సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.తొలుత ఇంట్లో ఒప్పుకోలేదు,ఆయనా వదలలేదు.ఒక కంపెనీ లో యాడ్ ఫిలిమ్స్ కు స్క్రిప్ట్ రైటర్ గా కెరీర్ ప్రారంభించారు.ఆగస్ట్ నెల వచ్చింది.. అప్పటికే తనకు ఆఫీస్ లో పెద్దగా పని ఉండటం లేదు.దింతో పుట్టినరోజు అవ్వగానే మానేదాం అనుకున్నాడు దర్శి.కానీ,అంతకన్నా ముందే వాళ్ళు తనని ఉద్యోగం నుండి పంపించేశారు.అలా బయటకు వచ్చిన దర్శి పరిశ్రమలో నటుడిగా పదయత్నాలు మొదలు పెట్టారు.


2012 నుండి 2016 వరకు దర్శి నటుడిగా షార్ట్ ఫిలిమ్స్ చేశారు.ఎన్నో ఆఫీసుల చుట్టు తిరిగారు.. మరెన్నో ఆడిషన్స్ ఇచ్చారు.10 చోట్ల ప్రయత్నిస్తే ఒకటి లేదా రెండు చొట్ల అవకాశం వస్తుంది అని నమ్మే దర్శి.నాగోల్,ఉప్పల్ నుండి మణికొండ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ ఇలా అన్ని సినిమా ఆఫీసులు తిరిగారు. శ్రీనగర్ కాలనీ,పంజాగుట్ట,కృష్ణానగర్ లో నాలుగేళ్ళు అలా గడిచిపోయాయి.చందా నగర్ లో వుండే దర్శి ఇలా హైదరాబాద్ మొత్తం తిరిగారు.2016లో పెళ్ళిచూపులు సినిమాతో దర్శి.. ప్రియదర్శిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ప్రతి నటుడికి తన సినీ జీవితంలో తాను చేసిన పాత్ర పేరు ప్రేక్షకులకు గుర్తుండేలా కొన్ని మాత్రమే ఉంటాయి.దర్శికి తొలి సినిమాతోనే ఆ అద్భుతమైన అవకాశం దొరికింది.పెళ్ళిచూపులు విడుదలైన కొత్తల్లో ఎక్కడైనా ప్రియదర్శి కనిపిస్తే.. అరేయ్ ఇప్పుడే చూశాను.. మన పెళ్ళిచూపులు కౌశిక్ ని అనే వాళ్ళు.మరి కొందరు ఏకంగా నా చావు నేను చస్తా..లేదా,టైం అంటే కౌశిక్.. కౌశిక్ అంటే టైం.. డైలాగ్ చెప్పాడుగా తనని ఇప్పుడే చూశాము అనే వారు.అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆ పాత్ర.అక్కడ నుండి వెనకకు తిరిగి చూడలేదు ప్రియదర్శి.


ఈ నాలుగు సంవత్సరాలలో తమిళం.. మాలయంలో కలిపి 30కు పైగా సినిమాల్లో నటించారు.జై లవకుశ.. స్పైదర్,F2 సినిమాలలో స్టార్లతో నటించారు.ఘాజి,అ:!సినిమాలో తన నటనకు మంచి స్పందన వచ్చింది.2019లో వచ్చిన మల్లేశం సినిమాతో హీరోగా మారారు.ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మాత్రమే కాక విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.మిఠాయి సినిమాలో సైతం హీరోగా చేశారు.తాజాగా విడుదలైన LOSER అనే వెబ్ సిరీస్ తో మరోసారి తన నటనతో అందరిని కదిలించారు.ఇప్పుడు,రాధేయ శ్యామ్ వంటి పెద్ద సినిమా చేస్తున్నరు.అలానే,ప్రధాన పాత్రగా జాతిరత్నాలు అనే సినిమా కూడా చేస్తున్నారు.


అటు హీరోగా ఇటు కమిడియన్ గా మనని మరిన్ని సంవత్సరాలు అలరించాలని.. నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా అని చెప్పిన కౌశిక్ అలియాస్ ప్రియదర్శి.. తన గురించి ఒక్కరు పుస్తకం రాసే స్థాయికి చేరాలి అని కోరుకుంటూ.. ప్రియదర్శి గారికి మా(బి ఆర్ మూవీ జోన్ టీం)తరపున జన్మిదిన శుభాకాంశాలు..!

సామాజిక మాధ్యమాల్లో ఈసారి ఘనంగా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుక..!

సామాజిక మాధ్యమాల్లో ఈసారి ఘనంగా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుక..!


రేపు (ఆగస్ట్ 22న) పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమంలో రచ్చ చేసేందుకు అభిమానులు.. ఆయనకు శుభాకాంశాలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ సర్వం సిద్ధం చేసుకుంటుంది.నేడు సాయంత్రం ఆరు గంటల నుండి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు 100 అతిరథమహారధులు మోషన్ పోస్టర్స్ ని విడుదల చేస్తుంటే.. మెగా హీరోలు.. ప్రత్యేకంగా శుభాకాంశాలు తెలపనున్నారు.


అంజనీ కుమారుడు.. సుప్రీమ్ హీరో.. గ్యాంగ్ లీడర్.. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఏలుతున్న వెండితెర మెగాస్టార్.. కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్యదైవం.. కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం దేశ.. విదేశాల్లో ఘనంగా జరుగుతుంటాయి.తెలుగు రాష్ట్రాలలో వారం రోజుల నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది.ఇక హైదరాబాద్ లో అయితే ప్రతి ఏటా అభిమానులు అంతా ఒక పండగలా ఈవెంట్ చేసుకుంటూ వుంటారు.అలాంటిది కరోనా కారణంగా ఈ వేడుకలకు ఈ సారి అంతరాయం కలిగింది.దింతో అభిమానులను నిరాశ పరచకూడదు అని అటు చిరంజీవి అభిమానుల సంఘం.. ఇటు మెగా హీరోలు.. మరోపక్క పరిశ్రమ భావించింది.దింతో ఈ సారి వేడుకలు సామాజిక మాధ్యమాల్లో జరగనున్నాయి.నేడు సాయంత్రం ఆరు గంటలకు చిరంజీవి గారి తనయుడు.. మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ కామన్ డీపీ విడుదల చెయ్యడంతో ఆరంభం కానున్న ఈ వేడుకలు.. రేపు సాయంత్రం ఆరు గంటలకు చిరంజీవి గారి ప్రత్యేకమైన పోస్టర్ విడుదల తో ముగుస్తాయి.ఈ వేడుకలో దాదాపు 80మంది అగ్ర సినీ ప్రముఖులు నేడు రాత్రి ఏడు గంటలకు ప్రత్యేకమైన మోషన్ పోస్టర్ తో శుభాకాంశాలు తెలుపుతారు.అలానే మెగా బ్రదర్ నాగబాబు గారు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. మెగా హీరోలు.. అల్లు శిరీష్.. కళ్యాణ్ దేవ్.. మెగా హీరోయిన్ నిహారిక.. నిర్మాతగా మారిన కాస్ట్యూమ్ డిజైనర్ చిరంజీవి గారి కుమార్తె సుష్మితా.. ప్రత్యేకమైన వీడియోల ద్వారా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపనున్నారు.


దీనితో పాటు ఒక చిరంజీవి గారి గురించి పోస్టర్లు.. ఫోటోలు.. వీడియోలు.. విడుదల చేయన్నున్నారు.ఇలా ప్రతి అర్ధగంట కు ఒక కార్యక్రమంలా నేటి సాయంత్రం ఆరు నుండి రేపు సాయంత్రం ఆరు దాక అలరించనున్నారు.కరోనా కారణంగా బయటకు రాకున్నా మెగాస్టార్ అభిమానులు మాత్రం ఆయన పుట్టినరోజును ఇలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అందరిలో కుతూహలం పెంచింది.మెగాస్టార్ అభిమానులా మజాకా..!మా(బి.ఆర్.మూవీ జోన్) తరపున్న అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!