17-05-2022 02:37:46 About Us Contact Us
నేటి తరం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టినరోజు స్పెషల్.!

నేటి తరం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టినరోజు స్పెషల్.!యూట్యూబ్ లో పరిచయమై.. వెండితెరపై అలరించి.. ఇప్పుడు ఓ.టి.టి లలో సైతం దూసుకుపోతున్న మన తెలుగమ్మాయి చాందిని చౌదరి.అందం.. అభినయం.. కలగలిసిన అభినేత్రి.కైలాషగిరి పర్వతాలలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుంటే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడని సిగ్గుతో డైలాగ్ చెప్పడం ఆపేసిన దగ్గర నుండి ఇప్పుడు వందల మంది మధ్యలో నిర్భయంగా నటించే స్థాయికి చేరిన చాందిని నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


చిన్నతం నుండి చదువుతో పాటు క్రీడల్లో రణించింది చాందిని.ఇంజినీరింగ్ లో అమ్మాయిలు అతి తక్కువగా ఉన్న మెకానికల్ తీసుకోవడంలోనే తెలుస్తుంది ఆమెకు నచ్చింది చేసే నైజం.. దేనికి బయపడని గుణం.బిటెక్ చదువుతూ తనకు నచ్చిన చిత్ర పరిశ్రమ వైపు అడుగు వేసేందుకు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.థి వీక్(the week) అనే షార్ట్ ఫిల్మ్ లో (రాజ్ తరుణ్ తో) 2011లో తొలిసారి కనిపించారు.అక్కడ నుండి ఎంతోమంది తెలుగు యువకుల మనసును కొల్లగొట్టారు.


చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్ విడుదలవుతుందంటే ఆ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి ఉండేది.ఇప్పుడంటే యూట్యూబ్.. ఇంస్టాగ్రామ్.. టిక్ టాక్ లో అనేకమంది అమ్మాయిల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ..ఆ రోజుల్లో యూట్యూబ్ లో తెలుగు అమ్మాయి అంటే అందరికి గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు చాందిని చౌదరి.2014లో వచ్చిన మధురంతో.. ఆ రోజుల్లో కాలేజీ చదివే విద్యార్థులకు ఆమె ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయారు.అప్పుడే తెలుగు చిత్రపరిశ్రమ నుండి అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు చదువు ముందు అనడంతో చదువు పూర్తి చేసుకొని పరిశ్రమ వైపు అడుగులు వేశారు. 2015లో “కేటుగాడు”తో తెరంగ్రేటం చేసి.. “శమంతకమణి” ధరించి “హౌరా బ్రిడ్జి” పై “కుందనపు బొమ్మ” లా “మను” తో కలిసి “కలర్ ఫోటో” దిగేందుకు సిద్ధంగా ఉంది.


అటు వెండితెరపై సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే.. కొత్తగా వచ్చిన ఓటీటీ లలో సైతం వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు చాందిని.ఇప్పటికే “గాడ్స్ ఆఫ్ ధర్మపురి”.. “మస్తిస్” తో వెబ్ సిరీస్ చూస్తున్న నేటి తరం యువతకు బాగా చేరువయ్యారు.నేడు.. తన పుట్టినరోజున విడుదల కానున్న కలర్ ఫోటో సినిమా తో అటు పెద్దవారికి.. ఇటు యువతకు మరింత చేరువకనున్నట్లు విడుదలైన టీజర్.. పాటల తో అర్ధమవుతుంది.


పరాయి భాషల్లో అవకాశాలు వస్తున్నా.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తుంది.ఆమె కథల ఎంపిక చూస్తుంటే నాకు నిత్యా మీనన్ గుర్తుకొస్తుంది.ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. చేసిన పాత్రల వల్ల.. మనం ఎంత ప్రభావం చూపాము అనే సిద్ధాంతం బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది.అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు హీరోయిన్లు దొరకడం లేదని చెప్పే మన చిత్ర పరిశ్రమ పెద్దలకు.. దర్శకనిర్మాతలకు.. చాందిని చౌదరి ఎందుకు కనపడటం లేదనేది బదులు దొరకని ప్రశ్న..!


అప్పుడప్పుడే ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి.. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. ప్రేక్షకులను మెప్పించి.. యూట్యూబ్ లో తొలి లేడీ స్టార్ గా ఎదిగటం.. షార్ట్ ఫిలిమ్స్ క్వీన్ అనే పేరు సంపాదించటం చాలా గొప్ప విషయం.9ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్న క్వీన్ చాందిని చౌదరి.. రానున్న రోజుల్లో వెండితెర పై విభిన్న పాత్రలు చేసి చిత్ర పరిశ్రమలో సైతం ప్రకాశించాలని కోరుకుంటూ.. నేడు(అక్టోబర్ 23న)పుట్టిన రోజు జరుపుకుంటున్న చాందిని చౌదరి గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!

ట్రైలర్ తో ఆసక్తి రేపిన శంకర్ మార్తాండ్స్ ఎక్స పైరీ డేట్.!

ట్రైలర్ తో ఆసక్తి రేపిన శంకర్ మార్తాండ్స్ ఎక్స పైరీ డేట్.!అసలే.. వెబ్ సిరీస్ అందులో థ్రిల్లర్.. ఇంకేముంది భాషతో సంబంధం లేకుండా కేవలం సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు మన యువత.అలాంటి వారికి ఈ లాక్ డౌన్ లో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది.తెలుగు,హిందీ భాషల్లో మన తెలుగు దర్శకుడు శంకర్ మార్తాండ్ తీసిన వెబ్ సిరీస్ ఎక్స్ పైరీ డేట్ ( Expiry Date). వచ్చే నెల (అక్టోబర్) 2న హిందీ లో.. 9న తెలుగులో.. ఈ సిరీస్ జీ5 లో విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది.


ఉల్లాసంగా.. ఉత్సాహంగా,కరంట్,సింహ,అలా మొదలైంది చిత్రాలలో నటించి తెలుగు వారికి చేరువైన బాలీవుడ్ నటి.. అటు హిందీ.. ఇటు తెలుగులో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్.. బడలా సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టోనీ లూక్ జంటగా ఈ వెబ్ వెరీస్ లో నటిస్తున్నారు.మరో జంటగా తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో సైతం సినిమాలు చేసిన మధు షాలిని మరియు బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ రెజా నటించారు.


స్నేహా ఉల్లాల్ పెళ్లికి వెళ్ళిన రోజు నుండి కనిపించడం లేదని పిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న టోనీ కి.. అదే మార్గంలో.. అదే పెళ్ళికి వెళ్లిన అలీ రెజా కూడా కనిపించడం లేదని మధు షాలిని పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మరి అక్కడ నుండి వారికి ఏమైంది?వారిద్దరికీ సంబంధం ఏమిటి?తప్పిపోయ్యారని చెప్పుతున వీరి మాటల్లో నిజమెంట?పోలీసు విచారణలో అసలు ఆ రోజు ఏమి జరిగిందని తెలిసింది??పాత్రధారులు ఎవరు?వారి వెనక ఉన్న సూత్రధారులు ఎవరనే కధాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెకింది.ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.సురేష్ రాజుతు సినిమాతోగ్రఫీ చేశారు.నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మించారు.

Sneha ullal,madhu shalini,expiry date web series,shankar marthand

దర్శకుడు శంకర్ మార్తాండ్.. ఈ వెబ్ సిరీస్ ని బాగా తెరకెకించినట్లు.. సిరీస్ ఆద్యంతం చాలా ఉత్కంఠ బరిమతంగా సాగుతుందని.. ఈ సిరీస్ అటు హిందీ,ఇటు తెలుగులో భారీ విజయం నమోదు చేస్తుందని.. అక్టోబర్ 2వ తేదీ కోసం ఎదురు చుట్టున్నట్లు వెబ్ సిరీస్ లో నటించినవారు మరియు సాంకేతిక బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. మార్చ్ చివరి నాటికే సింహ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. మన హైదరాబాద్ సిటీ.. మరియు హైదరాబాద్ శివార్లలోనే చిత్రీకరణ మొత్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి దాకా ఏదో దేశంలో ఎవరో తెలియని వారు నటించిన త్రిల్లర్ సిరీస్సులు చూసిన మన ప్రేక్షకులకు.. మనకు తెలిసిన వారు నటించిన మన సమాజానికి దగ్గరగా ఉన్న ఈ త్రిల్లర్ ను ఎలా ఆదరిస్తారో చూడాలి!? హిందీలో 2న.. తెలుగులో 9న విడుదల చేస్తున్నారు కనుక అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం.!

ఎక్స పైరీ డేట్ ట్రైలర్

హైడ్ తో సత్తా చాటిన నెల్లూరు కుర్రాళ్లు

హైడ్ తో సత్తా చాటిన నెల్లూరు కుర్రాళ్లుఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్ లో వుండే జిల్లా నెల్లూరు..అక్కడ నుండి ఇప్పటికే చెన్నై చేరి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినవారు చాలామందే ఉన్నారు..ఇప్పుడు తాజాగా మరో యువకుల బృందం పరిశ్రమ వైపు అడుగులు వేశారు.. దర్శకుడు.. కెమరామెన్.. సంగీత దర్శకుడు.. ఫైటర్.. హీరో.. మిగిలిన తారాగణం అంతా నెల్లూరు వాసులే..అంతేనా ఇటీవల వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ చిత్రీకరణ అంతా కూడా నెల్లూరు లోనే చేశారు..ఇది కూడా త్రిల్లర్ జోనర్..కరోనా సమయంలో వచ్చిన హైడ్ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశంగా మారింది..


పేరు కే ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్..దర్శకుడు శ్రీ వంశీ దీని ఒక చిన్న సినిమా స్థాయిలో తీశారు..నలబై ఆరు నిమిషాల రన్ టైం లో..రెండు పాటలు..డ్రోన్ షాట్స్..క్లైమాక్స్ లో ఫైట్స్..మధ్యలో హ్యాకింగ్..గన్ ఫైరింగ్..రొమాన్స్..ఇలా చాలానే ఉన్నాయి..హ్యాపీ గా సాగిపోతున్న ఇద్దరి ప్రేమకుల జీవితంలో ఒక వీడియో వల్ల వారి జీవితంలో వచ్చే మార్పు ఈ సినిమా..ఏంటా వీడియో..ఏమితా మార్పు..చివర్లో ఏమైంది..తెలుసుకోవాలి అంటే మీరు ఒకసారి హైడ్ చూడాల్సిందే..దర్శకుడు వంశీ..తనే కధ రాసుకొని..మాటలు రాసి..తనే కెమరామెన్ అవతారం ఎట్టి..కథలో భాగంగా వుండే ఒక ముఖ్య పాత్రలో తనే యాక్టింగ్ చేసి..చివరికి..చిత్రీకరణ అనంతరం ఎడిటింగ్ కూడా తానే చేశారు..ఒక దర్శకుడికి అన్ని డిపార్ట్మెంట్ల పై అవగాహన ఉండాలి అని అంటారు..కానీ ఈయన ఏకంగా అన్ని డిపార్ట్మెంట్లలో తనకు ఉన్న ప్రతిభ ఈ ఒక ఇండిపెండెట్ ఫిల్మ్ చూపించారు..చూస్తుంటే అన్ని తానై హైడ్ చేసినట్లు ఉన్నారు..


ఇండిపెండెట్ ఫిల్మ్ ఆద్యంతం వెనక వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది..ఇప్పటికే మార్కెట్ లో విదులైన పాటలకు సైతం ప్రక్షుకుల నుండి మంచి స్పందన వచ్చింది..ఈశ్వర్ హేమకాంత్ అనే సంగీత దర్శకుడు స్వరాలు మాత్రమే కాదు..లిరిక్స్ సైతం తానే రాశారు..ఇందులో ఎమోషనల్ సాంగ్ చాలా బాగుంది..ఇక హీరో విషయానికి వస్తే..ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ తో గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఆడియాన్స్ కి సూపరిచితమైన ఫైజల్ అన్వేష్..కొత్తగా ఆయన నటన గురించి చెప్పేదేమి లేదు..కాకుంటే కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ఈ ఇండిపెండెంట్ సినిమాలో గతంతో పోల్చుకుంటే కొంత తగ్గినట్లు కనిపిస్తున్నారు..బహుశా తదుపరి చిత్రాలలో సిక్స్ ప్యాక్ చేస్తారేమో..


నెల్లూరు లో సింగర్ గా మంచి పేరు కార్తీక్ తెచ్చుకున్న మధ్యలో హీరో కి మిత్రుడిగా కనిపించాడు.. ఇలాంటి ప్రతిభ కలిగిన యువకులకు తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అవకాశం రావడం ఆలస్యం అవ్వచ్చు కానీ ఒక్కసారి వస్తే వీళ్ళని అందుకోవడం కష్టం..త్వరలో శ్రీ వంశీ..ఫైజల్ అన్వేష్..ఈశ్వర్ హేమకాంత్ అనే పేరులు ఇలా యూట్యూబ్ లో కాకుండా సినిమా హాల్ లో వెండితెర పై కనపడాలని..కోరుకుందాం..హైడ్ లింక్ క్రింద ఉంచుతున్నాం..కాళీ సమయంలో ఒక్కసారి చూసి..మీ అభిప్రాయం..కామెంట్స్ రూపంలో తెలపితే..ఈ యువకుల ప్రయత్నం సఫలీకృతం అయినట్లే..


HIDE INDEPENDENT MOVIE

ప్రతిభతో ఒకో మెట్టు ఎక్కుతున్న దీప్తి సునైనా..!

ప్రతిభతో ఒకో మెట్టు ఎక్కుతున్న దీప్తి సునైనా..!2015లో ఒక 17ఏళ్ళ తెలుగమ్మాయి నటనపై ఇష్టం ఉండటంతో తనలోని ప్రతిభ చూపించేందుకు ఎదో వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది..సరిగ్గా అప్పుడే డబ్స్ మ్యాష్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ రావడం అందులోనే డైలాగ్స్..సాంగ్స్ వస్తుండటంతో ఆ అమ్మాయి దానినే ఒక ఆసరాగా చేసుకొని వీడియోలు చెయ్యడం ప్రారంభించింది..చదువుతున్నది సైంట్.యాన్స్ మహిళా కళాశాల కావడంతో అంతా అమ్మాయిలే కనుక ఏ మాత్రం భయం లేకుండా వీడియోలు చేసేసింది..ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లల నుండి కాలేజీ దోస్తుల దాక ఎవ్వరిని వదలలేదు అందరితో కలిసి చేసింది..చూసేందుకు అందంగా ఉండటం..బాగా నటిస్తుండటంతో….సామాజిక మాధ్యమంలో ఆమె వీడియోలు బాగా వైరల్ అయ్యాయి..అలా డాన్స్..డబ్ స్మాష్ వీడియోల నుండి యూట్యూబ్ లో కవర్ సాంగ్స్..షార్ట్ ఫిలిమ్స్ కి చేరింది..అక్కడా తన ప్రతిభతో మంచి పేరు తెచ్చుకుంది..ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ హౌస్ లో చేరి తన అల్లరి చేష్ఠలతో అందరిని అలరించి..ఇప్పుడిప్పుడే సినిమాలలో కనిపిస్తున్న దీప్తి సునైనా..


సాధారణంగా ఒక 16-17 ఏళ్ళ అమ్మాయికి తను ఏమి చదువుతుందో..భవిషత్తులో ఏమవ్వాలో అనే ఆలోచన పెద్దగా ఉండదు..తల్లితండ్రులు చెప్పిన కాలేజీలో చెప్పిన కోర్స్ నేర్చుకుంటూ వుంటారు..కానీ దీప్తి అలా కాదు..తనకు నచ్చిన రంగం వైపు అడుగులు వేసేందుకు తనే ఒక మార్గాన్ని వేసుకుంది..సినీరంగానికి సంబంధించిన కుటుంబం కాకపాయినా..ఎలా వెళ్ళాలో చెప్పే వారు లేకున్నా..తను నమ్మిన దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది..అలా తన మార్గంలో డబ్ స్మాష్ లాంటి మంచి వేదిక తోడైంది..దింతో ఆమె ప్రతిభ ఎక్కువ మందికి త్వరగా చేరింది..నేడు తెలుగు రాష్ట్రాలలో దీప్తి సునైనా తెలియని యువత పెద్దగా ఉండరు..సామాజిక మాధ్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె తెలుసు..ఆ స్థాయికి చేరింది..అయితే ఇదంతా ఏదో చాలా సులువుగా అయిపోలేదు..అనేక సార్లు ఒత్తిడిని తను అధిగమించింది..ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని చదువుకుంటున్న ఒక తెలుగమ్మాయి తన ప్రతిభను చూపిస్తుంటే కుదిరితే మెచ్చుకోవాలి..లేకుంటే వదిలెయ్యాలి..కానీ ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్స్ సామాజిక మాధ్యమంలో చెయ్యడం ఎంత వరకు సమంజసం..అంత జరిగినా ఆమె ఏ మాత్రం పట్టు సడలించలేదు..ఒకో అడుగు ముందుకు వేస్తూనే వచ్చింది..


ఆ వయసులో ఆ అమ్మాయి ఎంత బాధ పడుతుంది..అది చూసి తన తల్లితండ్రులు ఎలా బాధ పడుతారు అని కనీసం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చెయ్యడం తప్పు కదా..నాకు గుర్తున్న ఒక్క సంఘటన..రెండు..మూడేళ్ళ ముందు ఫేస్ బుక్ లోనో..ఇంస్టాగ్రామ్ లోనో లైవ్ లో మాట్లాడుతుంది..దీప్తి..ఎవరో చూస్తుంటే వారి మొబైల్ లో నేను చూస్తున్నా..కింద కామెంట్స్..అప్పటికే ఒకటి రెండు చెత్త కామెంట్స్ చదివాను..ఒకడు ఏకంగా ఐ..లవ్..యు..అని పెట్టాడు..ఒక్కసారిగా అది చదివి ఫోన్ వైపు నుండి పైకి చూసి మళ్ళీ కెమెరా చూస్తూ మా నాన్న లైవ్ చూస్తున్నారు అని చెప్పింది..ఆ ఒక్క క్షణం చాలా బాధ కలిగింది..తెలుగమ్మాయి..ఆ వయసులో తనకు నచ్చిన రంగంలోకి అడుగు పెట్టేందుకు..తనకు మించిన పనులు చేస్తుంటే మనం ఇలా తనని క్రిందకు లాగే ప్రయత్నం చేశాం..ఇలాంటివి ఎన్ని వచ్చినా తన కూతురిని ఆపకుండా..తన వెంట నిలుస్తున్న ఆ తల్లితండ్రులను కచ్చితంగా మనమందరం అభినందించాలి..


తెలుగు ప్రజానీకానికి దీప్తి పరిచయమై అర్దదశాబ్దం అవుతుంది..నాడు ట్రోలింగ్ చేసినవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ..దీప్తి మాత్రం ఒకో అడుగు వేస్తూ సినిమాలు చేసే స్థాయికి చేరింది..బిగ్ బాస్ హౌస్ లో పిల్లి లాగా..తను చేసిన అల్లరితో చాలా మంది కుటుంభ ప్రేక్షకులకు సైతం దగ్గరైంది..రానున్న రోజుల్లో అనేక సినిమా అవకాశాలు రావాలని..నటన..డాన్స్..ఇలా తన ప్రతిభను ఇప్పటికే మనం చూశాం కనుక అలానే సినిమాల్లో కూడా గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం..చిన్న వయసులో వచ్చిన స్టార్దం..కొంత గర్వం..కొంత పక్క దారిలోకి వెళ్ళడం సహజం..అవేవి దరికి రాకుండా చూసుకుంటే రానున్న రోజుల్లో దీప్తి ఒక పెద్ద హీరోయిన్ గా మారి దక్షిణాది సినిమాల్లో నటించే స్థాయికి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు..నేటి తరం అమ్మాయిలు..దీప్తిని చూసి నచ్చిన పనిలో ఎందరు విమర్శించినా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యడం నేర్చుకోవాలి..చిన్న చిన్న విషయాలకు బాధ పడకుండా..గమ్యం వైపు అడుగులు వెయ్యడం నేర్చుకోవాలి..1998 జనవరి 10న జన్మించిన దీప్తి సునైనా చిన్న వయసులోనే ఎంతో సాదించిందుకు హాట్స్ ఆఫ్..


మహిళా సాధికారత లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన..రాణిస్తున్న..తెలుగు మహిళను గౌరవించుకునే క్రమంలో నేడు దీప్తి సునైనా గురించి కథనం..రేపు మరొక్కరి పై వ్యాసము..

“మనసా నమః” మధురమైన అనుభూతి

“మనసా నమః” మధురమైన అనుభూతి10రోజుల క్రితం,అంటే మార్చ్ 28న ఒక షార్ట్ ఫిల్మ్ విడుదలైంది.10రోజుల్లో 2లక్షల,పాతిక వేల పైన వ్యూస్ వచ్చాయి.మీరు అనుకోవచ్చు,లాక్ డౌన్ కదా,2.25లక్షల వ్యూస్ అనేవి సాధారణమే కదా,దీని గురించి ఒక ఆర్టికల్ ఎందుకు అని,అదే ఇక్కడ మరి.ఆ ఛానల్ ని 7,500 మంది మాత్రమే ఫాలో అవుతున్నారు.ఇక ఆ ఛానల్ లో లాస్ట్ వీడియో పెట్టి సంవత్సరం దాటింది.మరి అలాంటి ఛానల్ లో షార్ట్ ఫిల్మ్ విడుదలై 10రోజుల్లో 2లక్షల పైన వ్యూస్ అంటే మాములు విషయం కాదు కదా..!ఇక వివరాలలోకి వెళ్తే..,


ఆ షార్ట్ ఫిల్మ్ పేరు “మనసా నమః”.దర్శకుడు దీపక్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ని ప్రజలకు,తన టేకింగ్ స్కిల్స్ ని ప్రొడ్యూసర్లకు ఒకేసారి చూపించాడు.దీపక్ కు సినిమా దర్శకత్వం వహించేందుకు కావలసిన అన్ని లక్షణాలు పూర్తిగా ఉన్నట్లు ఈ 17నిమిషాలు చూడగానే అర్థమైంది.ఇక ఇందులో నటించిన అశ్విన్ సైతం బాగా ఆకట్టుకున్నాడు.ఇప్పటికే ఒక సినిమా చేసిన అశ్విన్ ఎత్తుగా,మంచి కలర్ తో స్క్రీన్ మీద ఫస్ట్ షాట్ చూడగానే లీడర్ లో రానా ని చూసినట్లు కనిపించాడు.ఈ కుర్రాడికి ఒక్క హిట్ పడితే మనకు ఇండస్ట్రీ కి మరో స్టార్ హీరో దొరికేసినట్లే..!


ఇక అమ్మాయిలు మొత్తం ముగ్గురు చేసినా, సొట్టబుగ్గల మధ్య నేను కాసేపు సూర్యలా ఇరుకోపోయా.ఇక ద్రిష్టికా చందర్ కనిపించినంతసేపు గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరు రోజూ నా పరిస్థితి ఇదే కదా అనేలా ఉంది.అమ్మాయి కూడా పక్కా తెలుగు అమ్మాయిలా బాగా చేసింది.చివరిలో పాప నవ్వించింది.ఇక పాట ఒక అద్భుతం.ఆ పాటను చిత్రీకరించిన రాజుని,ఎడిటర్ ని అభినందించాల్సిందే.ఇక కర్మన్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వినపడలేదు అంటే స్కీన్ లో కలిసిపోయింది అని అర్థం ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పాలి.


నాకు బాగా నచ్చిన డైలాగ్,నేడు చేదు గాను,రేపు భయం గాను ఉంటుంది,కానీ ఎప్పుడూ మధురంగా ఉండేది గతం మాత్రమే అనే లైన్ బాగా రాసుకున్నాడు,ఆ ఒక స్కీన్ లో అశ్విన్ నటన,మ్యూజిక్ సరిగ్గా సరిపోయాయి.ఇప్పటికే నారా రోహిత్,అడివి శేష్,సందీప్ కిషన్,శ్రీ విష్ణు,మొదలగువారు ఈ షార్ట్ ఫిల్మ్ ని ప్రశంసించగా,సంగీత దర్శకుడు థమన్ దీనిని విడుదల చేశారు.ఇలా అందరూ కాసేపు ఈ లఘు చిత్రాన్ని చూసి మీ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.ఈ షార్ట్ ఫిల్మ్ లింక్ క్రిందఇస్తున్నాము.చూసి ఆనందించండి,కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించండి.అంతకన్నా ఏమి చేస్తాం అందరం ఇంట్లోనే ఉన్నంగా..!


ఈ “మనసా నమః” చిత్ర బృందానికి అభినందనలు.భవిషత్తులో అశ్విన్,దీపక్ తో పాటు మొత్తం చిత్ర బృందం ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ఆశిద్దాం..!


మనసా నమః షార్ట్ ఫిల్మ్