17-05-2022 02:54:12 About Us Contact Us
నేటి తరం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టినరోజు స్పెషల్.!

నేటి తరం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టినరోజు స్పెషల్.!యూట్యూబ్ లో పరిచయమై.. వెండితెరపై అలరించి.. ఇప్పుడు ఓ.టి.టి లలో సైతం దూసుకుపోతున్న మన తెలుగమ్మాయి చాందిని చౌదరి.అందం.. అభినయం.. కలగలిసిన అభినేత్రి.కైలాషగిరి పర్వతాలలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుంటే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడని సిగ్గుతో డైలాగ్ చెప్పడం ఆపేసిన దగ్గర నుండి ఇప్పుడు వందల మంది మధ్యలో నిర్భయంగా నటించే స్థాయికి చేరిన చాందిని నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


చిన్నతం నుండి చదువుతో పాటు క్రీడల్లో రణించింది చాందిని.ఇంజినీరింగ్ లో అమ్మాయిలు అతి తక్కువగా ఉన్న మెకానికల్ తీసుకోవడంలోనే తెలుస్తుంది ఆమెకు నచ్చింది చేసే నైజం.. దేనికి బయపడని గుణం.బిటెక్ చదువుతూ తనకు నచ్చిన చిత్ర పరిశ్రమ వైపు అడుగు వేసేందుకు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.థి వీక్(the week) అనే షార్ట్ ఫిల్మ్ లో (రాజ్ తరుణ్ తో) 2011లో తొలిసారి కనిపించారు.అక్కడ నుండి ఎంతోమంది తెలుగు యువకుల మనసును కొల్లగొట్టారు.


చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్ విడుదలవుతుందంటే ఆ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి ఉండేది.ఇప్పుడంటే యూట్యూబ్.. ఇంస్టాగ్రామ్.. టిక్ టాక్ లో అనేకమంది అమ్మాయిల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ..ఆ రోజుల్లో యూట్యూబ్ లో తెలుగు అమ్మాయి అంటే అందరికి గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు చాందిని చౌదరి.2014లో వచ్చిన మధురంతో.. ఆ రోజుల్లో కాలేజీ చదివే విద్యార్థులకు ఆమె ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయారు.అప్పుడే తెలుగు చిత్రపరిశ్రమ నుండి అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు చదువు ముందు అనడంతో చదువు పూర్తి చేసుకొని పరిశ్రమ వైపు అడుగులు వేశారు. 2015లో “కేటుగాడు”తో తెరంగ్రేటం చేసి.. “శమంతకమణి” ధరించి “హౌరా బ్రిడ్జి” పై “కుందనపు బొమ్మ” లా “మను” తో కలిసి “కలర్ ఫోటో” దిగేందుకు సిద్ధంగా ఉంది.


అటు వెండితెరపై సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే.. కొత్తగా వచ్చిన ఓటీటీ లలో సైతం వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు చాందిని.ఇప్పటికే “గాడ్స్ ఆఫ్ ధర్మపురి”.. “మస్తిస్” తో వెబ్ సిరీస్ చూస్తున్న నేటి తరం యువతకు బాగా చేరువయ్యారు.నేడు.. తన పుట్టినరోజున విడుదల కానున్న కలర్ ఫోటో సినిమా తో అటు పెద్దవారికి.. ఇటు యువతకు మరింత చేరువకనున్నట్లు విడుదలైన టీజర్.. పాటల తో అర్ధమవుతుంది.


పరాయి భాషల్లో అవకాశాలు వస్తున్నా.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తుంది.ఆమె కథల ఎంపిక చూస్తుంటే నాకు నిత్యా మీనన్ గుర్తుకొస్తుంది.ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. చేసిన పాత్రల వల్ల.. మనం ఎంత ప్రభావం చూపాము అనే సిద్ధాంతం బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది.అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు హీరోయిన్లు దొరకడం లేదని చెప్పే మన చిత్ర పరిశ్రమ పెద్దలకు.. దర్శకనిర్మాతలకు.. చాందిని చౌదరి ఎందుకు కనపడటం లేదనేది బదులు దొరకని ప్రశ్న..!


అప్పుడప్పుడే ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి.. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. ప్రేక్షకులను మెప్పించి.. యూట్యూబ్ లో తొలి లేడీ స్టార్ గా ఎదిగటం.. షార్ట్ ఫిలిమ్స్ క్వీన్ అనే పేరు సంపాదించటం చాలా గొప్ప విషయం.9ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్న క్వీన్ చాందిని చౌదరి.. రానున్న రోజుల్లో వెండితెర పై విభిన్న పాత్రలు చేసి చిత్ర పరిశ్రమలో సైతం ప్రకాశించాలని కోరుకుంటూ.. నేడు(అక్టోబర్ 23న)పుట్టిన రోజు జరుపుకుంటున్న చాందిని చౌదరి గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!

ట్రెండింగ్ నెం 1 తో మిలియన్ వ్యూస్ దాటిన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.!

ట్రెండింగ్ నెం 1 తో మిలియన్ వ్యూస్ దాటిన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.!అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉదయం పదిన్నర గంటలకు(10:30) బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా టీజర్ నిన్న(అక్టోబర్ 5న) ఒక మిలియన్(10 లక్షల) వ్యూస్ దాటింది.విభిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నందు హీరోగా.. యాంకర్ గా అటు బుల్లితెర పై దూసుకుపోటు ఇటు వెండితెరపై హీరోయిన్ గా చేస్తున్న రేష్మి గౌతమ్ హీరోయిన్ గా.. లఘు చిత్రాలతో మంచి పేరు సంపాదించిన రాజ్ విరాట్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న సినిమా “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఆ టీజర్ వివరాల్లోకి వెళ్తే…


అక్టోబర్ 2న ఉదయం విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ వెంటనే లో ట్రెండింగ్ 1 కి చేరింది.. దాదాపు 48 గంటల పాటు అదే స్థానంలో నిలిచింది.మిలియన్(10లక్షల) వ్యూస్ ని చాలా వేగంగా చేరుకుంది.ఇప్పటికే చూసిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.సవారిలో మాస్ పాత్ర చేసిన నందు నుండి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఫస్ట్ లుక్ కి ముందు నుండే బజ్ నడిచింది.దీనికి తోడు.. బిబి అంటూ నందు పోస్ట్ చేయడంతో సినిమా టైటిల్ కి బిగ్ బాస్ కి మధ్య చర్చ జోరుగా సాగింది.ఎట్టకేలకు టైటిల్ పోస్టర్ తో చర్చ కు తెర పడింది.ఆ తర్వాత ఈ సినిమాలో పాత్ర పేరు పోతురాజు కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అన్నవరం సినిమాలోని పోతురాజు డైలాగ్ తో వీడియో విడుదల చేశారు.నందు పుట్టినరోజున వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంది.


ప్రదీప్ మాచిరాజు విడుదల చేసిన రేష్మి గౌతమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పూరి జగన్నాథ్ గారి పుట్టినరోజున పోతురాజు రూమ్ లో ఆయన పోస్టర్స్ ఉన్న వీడియో విడుదల చెయ్యడంతో ఆయన సైతం టీజర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.అప్పటికే హీరో.. హీరోయిన్ ఫస్ట్ లుక్ వల్ల ప్రేక్షకులు సైతం టీజర్ కోసం ఎదురు చూశారు.నిన్న గాంధీ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.విశాఖ జిల్లా అచుతాపురం ఊరిలో నాటకాలు వేసుకునే పోతురాజు(నందు)పూరి జగన్నాథ్ గారి వీరాభిమాని.తన జీవిత కథను తన అభిమాన దర్శకుడు పూరికి ఇచ్చి సినిమా తియ్యమని చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి పోతురాజు జీవిత కథ ఏమిటి?అతనికి వాణి(రేష్మి)ఎలా పరిచయమవుతుంది.. తర్వాత ఏంటి అనేది కధాంశం.ప్రతి స్కీన్ మాస్ ఆడియాన్స్ కి దగ్గరగా ఉంది.నందు స్క్రీన్ మీద ఉన్నంత సేపు హై వోల్టాజ్ లో షాట్స్ ఉన్నాయి.ఈ టీజర్ లో హీరో శ్రీ విష్ణు వాయిస్ ఓవర్ ఇచ్చారు.దర్శకుడి కష్టం మరియు ఆలోచన పోతురాజు రూమ్ మరియు నాటక మండలి రూమ్ చూస్తే తెలిసిపోతుంది.డైలాగ్స్ కూడా బాగున్నాయి.ఒక్క ముక్కలో చెప్పాలంటే టీజర్ అదిరిపోయింది భయ్యా..!


ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సుజాత సిద్దార్థ్ సినిమాతోగ్రఫీ చేశారు.ఈ సినిమాను విజయీభవ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల,బోసుబాబు నిదుమోలు,ఆనంద్ రెడ్డి మద్ది మరియు మనోహర్ రెడ్డి ఏడా నిర్మించారు.దర్శకులు పూరి జగన్నాథ్ టీజర్ బాగుందని బాహాటంగా మెచ్చుకోగా.. మరో ప్రముఖ దర్శకులు సుకుమార్ వాట్సాప్ కాల్ ద్వారా అభినందించినట్లు హీరో నందు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.ఫస్ట్ లుక్.. టీజర్ తోనే అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సినిమా విడుదల తేది కోసం ఎదురుచూస్తు.. “బొమ్మ బ్లాక్ బస్టర్” కావాలని కోరుకుందాం..!

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్

పుట్టినరోజు సందర్భంగా రేపు పవన్ అభిమానులకు మూడు కానుకలు.!

పుట్టినరోజు సందర్భంగా రేపు పవన్ అభిమానులకు మూడు కానుకలు.!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్బంగా రేపు.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాల విశేషాలు విడుదల చేయనున్నట్లు మూడు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. దింతో ఆయన అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇలా జరగడం ఆయన సినీ జీవితంలో ఇదే తొలిసారి.. వివరాల్లోకి వెళ్తే..


సాధారణంగానే హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజున వారు ప్రసృతం చేస్తున్న సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్.. టీజర్.. పాట.. ఇలా ఏదొకటి విడుదలవ్వడం లేకుంటే తదుపరి సినిమాకు సంబంధించి ఒక సమాచారం ఇవ్వడం గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనవాయితీగా మారిపోయింది. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన అభిమానులకు సినిమా వార్తలు కరువయ్యాయి.రాజకీయాల్లో ఆయనతో పాటు క్రియాశీలకంగా పాలుగుంటున్నా.. 2017 సెప్టెంబర్ 2 తర్వాత.. ఏ హీరో పుట్టినరోజు వచ్చినా మా హీరో పుట్టినరోజున ఇలాంటి వార్తలు మేము వినలేమే అనే బాధ ఆయన అభిమానుల్లో ఎక్కడో కొంచం కనిపించేది.


2019 ఎన్నికల తర్వాత.. తాను ఇదివరకే ఒప్పుకున్న సినిమాలను త్వరతిగతిన పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. దింతో వరసగా మూడు సినిమాల దర్శక.. నిర్మాతల సమాచారం బయటకు వచ్చేశాయి. ఇప్పటికే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తో పాటు.. ఒక పాట కూడా విడుదలయ్యింది. కరోనా లేకుంటే ఇప్పటికే సినిమా విడుదల చేసేవారు.రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం తొమిది గంటలా తొమిది నిమిషాలకు(09:09AM) ఒక వీడియోను విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తెలిపింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.


వకీల్ సాబ్ తర్వాత.. ఏ.ఎం. రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయన్నున్నారు.ఈ సినిమాకు సంబంధించి కూడా ఒక వార్తను రేపు మధ్యాహ్నం పండిండు గంటలా ముప్పయి నిమిషాలకు (12:30PM) విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఆ రెండు సినిమాల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని.. మాస్ డైరెక్టర్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమా గురించి రేపు సాయంత్రం నాలుగు గంటలా ఐదు నిమిషాలకు(04:05PM) ఒక వార్తను తెలపనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.


తన సినీ జీవితంలో సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ వచ్చారు…అలాంటిది,ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాల విశేషాలు బయటకు వస్తుండటం.. అది కూడా బాగా గ్యాప్ తర్వాత కావడంతో ఆయన అభిమానులు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ఇప్పటికే పుట్టిన రోజు డీపీ తోనే ప్రపంచ రికార్డ్ అందుకొని.. రేపు పుట్టినరోజుకు కానుకగా… 100 మిలియన్ ట్వీట్స్ వేసేందుకు సిద్ధపడిన కళ్యాణ్ గారి అభిమానులకు ఇలా 26,27,28 సినిమాల విశేషాలు వస్తున్నట్లు వార్తలు రావడంతో ఫుల్ “ఖుషీ”గా “జల్సా” చేస్తున్నారు..

కృష్ణానగర్ కళ తప్పింది.!పూర్వవైభవం ఎప్పుడో మరి??

కృష్ణానగర్ కళ తప్పింది.!పూర్వవైభవం ఎప్పుడో మరి??కృష్ణా నగర్.. ఈ పేరు తెలియని తెలుగు వారు పెద్దగా ఉండరు.అందులో సినిమా గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా కృష్ణానగర్ తెలుసు.హైదరాబాద్ లో ఉన్న ఈ కృష్ణానగర్ ఇలా తెలుగువారందరికి సినిమా వారు ఉండే చోటుగా తెలుసు.ఇప్పటికే అనేక మంది ఫిల్మ్ నగర్.. జూబ్లీ హిల్స్.. మణికొండ.. చిత్రపురి కాలనీ.. అంటూ వెళ్లిపోయినా.. కృష్ణానగర్ మాత్రం ఎప్పుడు సినిమా రంగం వారితో కళ కళ లాడుతుంటుంది..!మరి ఇప్పుడు కృష్ణానగర్ గురించి ఎందుకంటే..!?


కెమెరా..లైట్..సెట్ డిపార్ట్మెంట్ నుండి ఎడిటింగ్.. దబ్బింగ్ స్టూడియో వరకు దాదాపు 24 క్రాఫ్ట్స్ లో పని చేసే వారు కృష్ణానగర్ లో ఉంటారు.వారం మొత్తం పొద్దున్న ఆరు నుండి సాయంత్రం దాక అలిసిపోయి.. ఎవరి జీవితాలలో వారు బిజీ బిజీ గా ఉంటారు.అలాంటి కృష్ణానగర్ కు ఒక ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత వెళితే కేఫ్ లు దగ్గర.. సందుల్లో ఒకటే కోలాహలంగా ఉంటుంది.వారం మొత్తం పని చేసి అలిసిపోయిన కళాకారులు.. సినీకార్మికులు.. ఆదివారం పగలు విశ్రాంతి తీసుకొని.. సాయంత్రం మిత్రులను కలిసేందుకు బయటకు వస్తారు.కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే వీరు మిత్రులకే కదా కష్టసుఖాలు చెప్పుకునేది.


అగ్ర కథానాయకుల సినిమాల నుండి కొత్తవారితో చేస్తున్న చిన్న సినిమా వరకు సెట్ లో జరిగిన అన్ని విషయాలు ఇక్కడ మిత్రులతో పంచుకుంటూ.. శుక్రవారం విడుదలైన సినిమా హిట్ అయిందా.. లేదా.. దానికి గల కారణాలు విశ్లేషిస్తూ.. పరిశ్రమలో వచ్చిన మార్పులను.. వారి అనుభవాలను కొత్తగా పరిశ్రమకు వచ్చిన వారికి వివరిస్తూ.. ఇలా ఏ కేఫ్ లో చూసినా.. ఏ హోటల్ లో చూసినా.. ఏ సందులో చూసినా అందరూ.. సినిమా విషయాలు మాట్లాడుతూ కనిపిస్తారు.సరదాగా జోకులు వేసుకుంటూ.. చాలా రోజులు తర్వాత కనపడిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఇప్పుడు తానే సినిమా చేస్తున్నాడో తెలుసుకుంటూ.. తిను ఏ సినిమా కు పని చేస్తున్నాడో చెప్తూ కనపడుతారు.


నిజంగా ఆదివారం సాయంత్రం కృష్ణానగర్ కు కొత్తవారు ఎవరైనా వెళ్తే.. సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మనకు తెలియని ఎన్నో విషయాలు అక్కడ తెలుస్తాయి.చిత్ర పరిశ్రమ గురించి తెలియాలని కుతూహలం ఉన్న ఎవరైనా ఒక ఆదివారం కృష్ణానగర్ కు వెళ్తే.. సినిమా ఎంత గొప్పదో.. ఎంతమందికి అన్నం పెడుతుందో..ఒక రెండున్నర గంటలు వినోదం పంచడానికి ఎంతమంది ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది.అలాంటి కృష్ణానగర్ ఇప్పుడు ముగబోయింది.లాక్ డౌన్ విధించిన తొలి రోజుల్లో.. ఉహించకుండా వచ్చిన విరామంలో అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు.పాత మిత్రులను కలుసుకున్నారు.. కొత్తవారితో పరిచయాలు చేసుకున్నారు.రోజులు గడిచే కొద్ధి.. వారిలో ఆందోళన పెరిగింది.అసలు ఏమి జరుగుతుంది.. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక కొంత భయపడ్డారు.కుటుంబ సభ్యులను కలిసేందుకు చాలా మంది ఎలాగోలా సొంత ఊరికి వెళ్లిపోయారు.సినిమా షూటింగ్స్ గురించి సినీ ప్రముఖులు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడంతో తిరిగి వచ్చేందుకు కొందరు సిద్ధపడితే.. కొందరు వచ్చేశారు.మరి కొంతమంది ఇక్కడే ఉన్నారు.


ఎన్నో ఆశలతో.. మరెనో సందేహాలతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని హైదరాబాద్ లోని కృష్ణానగర్ చేరి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వారం మొత్తం కష్టపడి.. ఆదివారం కష్టసుఖాలను మిత్రులతో చెప్పుకునే ఆ సినీ కళాకారులు.. కార్మికులు ఇప్పుడు కనపడటం లేదు.అక్కడదక్కడా సీరియల్స్.. టెలివిజన్ కార్యక్రమల షూటింగ్ ప్రారంభం కావడంతో కొంతమంది కనిపిస్తున్నారు.


నిన్న ఆదివారం అక్కడకు వెళితే ఒక్కరి మొహంలో కూడా ఆనందం కనపడటం లేదు.మిత్రులు ఎప్పుడు వస్తారో.. అనే దిగులు.. కుటుంబ సభ్యుల గురించి భయం.. మొత్తం మీద మునుపటి రోజులు ఎప్పుడు వస్తాయా అని.. ఎదురు చూస్తున్న మొహాలు మాత్రమే కనిపించాయి. భవిషత్తు మీద ఆశ కన్నా.. ప్రస్తృత పరిస్థితి పోతే చాలు అనే మాటలే వినిపించాయి.అందుకే అంటున్నా
కృష్ణానగర్ కళ తప్పింది.!పూర్వవైభవం ఎప్పుడో మరి??
తిరిగి అంతా మాములుగా మారి.. త్వరలో నా తోటి సినీ పరిశ్రమ (కుటుంబ) సభ్యులు.. కృష్ణానగర్ చేరి వారి నవ్వులు వినిపించాలని కోరుకుందాం..!

నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా!? – సత్య దేవ్

నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా!? – సత్య దేవ్ఒక పక్క హీరోగా.. మరో పక్క సినిమాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ.. నేటి తరం నటులలో విలక్షణ నటుడిగా పేరు పొందారు సత్య దేవ్.లాక్ డౌన్ లో కూడా వరస సినిమాలు విడుదల చేస్తూ ట్రెండింగ్ హీరోగా నిలిచిన సత్య ఈ నెల(జులై) 8వ తేదీన మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారిని కలిశారు.ఆ అనుభవాన్ని ప్రేక్షకులకు లేఖ ద్వారా పంచుకున్నారు సత్య.


సత్య చిన్నతనంలో.. ఎవరైనా.. ఏదైనా సాధించలేని విషయాన్ని చెప్పినప్పుడు.. తనకు బాగా వినిపించిన మాట.”నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నవా.” ఈ మాట తను స్కూల్ రోజుల్లో తొలిసారి విన్న సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ఆ తర్వాత ఆ మాట చాలా సార్లు విన్నాను అని.. “నేను చిరంజీవి ని అనుకోవడం లేదు.. కానీ.. కొన్ని కోట్ల మంది లాగా చిరంజీవి ని అవ్వాలనుకుంటున్నాను..” అని లేఖ లో తెలిపారు.ఎవరెస్ట్ ఎక్కాలనుకొనే ప్రతి ఒక్కరికి అనుమానాలు.. భయాలు తప్పవు.మధ్యలో.. ఇక నా వల్ల కాదు అని అనిపిస్తుంది.అలాంటప్పుడు ఆ ఎవరెస్ట్ పైన ఉన్న జండా ధైర్యాన్ని ఇస్తుంది.. శక్తి పొంజుకుంటుంది.అలానే.. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు ఒక జండా అని చెప్పుకొచ్చారు.చిరంజీవి గారిని తన నివాసంలో కలిశానని.. ఆ యూఫోరియా నుండి ఇంకా తెరుకోలేదని.. ఇంకా కల లానే ఉంది అని..ఇలా మెగాస్టార్ ని కలవడం వల్ల తనకు కలిగిన ఆనందాన్ని.. ఆయన పట్ల తనకు ఉన్న గౌరవాన్ని పంచుకున్నారు.


2019లో బ్రోచేవారెవరురా.. ఇస్మార్ట్ శంకర్.. జార్జ్ రెడ్డి సినిమాలు.. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ తో భారీ విజయాలతో పాటు తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు సత్య.ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు.లాక్ డౌన్ లో 47డేస్ అనే సినిమా.. locked అనే వెబ్ సిరీస్ విడుదల చేశారు.త్వరలో.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. అనే సినిమా విడుదల కానుంది.ఇలా.. ప్రసృతం ట్రెండింగ్ హీరోగా ఉన్న సత్య.. చిరంజీవిని కలవడం ఆ అనుభవానికి పంచుకోవడంతో ఆ లేఖ ప్రసృతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.