05-03-2021 09:39:56 About Us Contact Us
ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఉప్పెన!

ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఉప్పెన!

Uppena Trailer  : మెగా ఫ్యామిలీ నుండి వస్తున్నా మరొక హీరో పంజా వైష్ణవ్ తేజ్ ని కథనాయకుడిగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఉప్పెన.


ఈ చిత్ర ట్రైలర్ ని ( Uppena Trailer ) యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులు మీదగా విడుదల చేసారు చిత్ర బృందంట్రైలర్ అధ్యంతం ఒక చక్కటి ప్రేమకథలానే తీర్చిదిద్ధారు దర్శకుడు బుచ్చిబాబు సాన.. ప్రేమంటే వదిలేయడం కాదు పట్టుకోవడం అని హీరోయిన్ కృతి శెట్టి చెప్పే డైలాగ్ తోనే సినిమా లవ్ మరియు అధిపథ్యం బ్యాక్ డ్రాప్ లోనే ఉండపోతుంది అని అర్ధమైంది.


ఈ చిత్రాన్ని ఉత్తరాంద్ర మాండాలికంలో తెరకేకేంచిన ఈ చిత్రం అత్యధికంగా బీమిలి తీరంలోనే చిత్రికరించారు సంభాషణలు కూడా అ ప్రాంతానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడ్డారు దర్శకుడు.ఇకపోతే విలన్ గా తమిళ స్టార్ హీరో మెక్కల్ సెల్వమ్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు ఆయనకు సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ గాత్ర దానం చేసారు.

uppena trailerఈ చిత్రానికి అదనపు ఆకర్షణ సమాదాట్ సైయినిద్దీన్ సినిమాటోగ్రాఫి ఒక్కో ఫ్రేమ్ ఒక అందమైన పెయింటింగ్ లాగ చూపించారు.దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా ట్రైలర్ లో నెపధ్య సంగీతం అయితే అద్భుతంగా ఉంది అనే చెప్పాలి


ప్రేమికుల రోజులు కానుకగా రెండు రోజుల ముందు ఫిబ్రవరి 12 న విడుదల చేస్తున్నారు చిత్ర బృందం.. మెగా మేనల్లుడు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి 

సున్నిత ప్రేమ కథల దర్శకుడు శేఖర్ కమ్ములకి జన్మదిన శుభాకాంక్షలు.

సున్నిత ప్రేమ కథల దర్శకుడు శేఖర్ కమ్ములకి జన్మదిన శుభాకాంక్షలు.


Happy Birthday Sekhar Kammula: ప్రేమకథా చిత్రాలు తెరకేక్కించడంలో ఒక్కొక్కరిది ఒకొక్క పంధా ఉంటుంది అలానే శేఖర్ కమ్ముల గారు కూడా ప్రేమకథలలో తనదైన మార్క్ ని వేసుకున్నారు.హీరోయిన్ లను గ్లామర్ మెటీరియల్ గా చూసే సినిమాలు వస్తున్నా కూడా శేఖర్ కమ్ముల గారి చిత్రలలో ఎప్పుడు కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత పుష్కళంగా ఉంటుంది.


హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శేఖర్ కమ్ముల గారు పై చదువులకు వాషింగ్టన్ వెళ్ళినప్పుడు ఒక కథ రాసుకున్నారు. అది డాలర్స్ మాయలో పడి తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాల్లో స్థిరపడుతున్న యువతని ఉద్దేశించి తయారుచేసుకున్న కథ తో 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రాన్ని తెరకేక్కించారు శేఖర్ కమ్ముల గారు కానీ కమర్షియల్ గా అంతా విజయాన్ని అందుకోకపోయినా సప్తగిరి ఛానల్ వాళ్ళు సాటిలైట్ రైట్స్ రూపంలో 15 లక్షలకు కొనుకున్నారు.ఇక ఈ చిత్రానికి గాను ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.


తరువాత తన స్నేహితులు సహాయంతో ఆనంద్ చిత్రాన్ని తెరకేక్కించారు అది చాలామంది భయ్యార్స్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు దీనితో హైదరాబాద్ లో 5 థియేటర్స్ కి ఒక్కో థియేటర్ కి 2లక్షలు ఇచ్చి రెండు వారాలు ఉంచాల్సిందిగా కోరాడు అ సినిమా విడుదల అయిన రెండురోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దర్శకుడిగా అద్భుత విజయాన్ని అందుకున్నారు శేఖర్ కమ్ముల గారు.

Shekar kammula birthday


తరువాత కొత్త ఆర్టిస్ట్లతో హ్యాపీ డేస్ చిత్రాన్ని తెరకేక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు అ సమయంలో యువత ఎగబడి చూసిన చిత్రం హ్యాపీ డేస్ ఈ చిత్రంలో తమని తాము చూసుకుంటూ థియేటర్స్ నుండి బయటకు వచ్చిన యువత హ్యాపీ డేస్ ని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు.


అక్కడ నుండి దర్శకుడిగా వెనుతిరిగి చూసుకోలేదు గోదావరి, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్,అనామిక వంటి చిత్రాలు తీసి తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దిల్ రాజు నిర్మించిన ఫిదా చిత్రంతో 50కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు (Sekhar Kammula )శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా love స్టోరీ అనే చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేస్తున్నారు.


అద్భుత విజయాలు అందించిన శేఖర్ కమ్ముల గారు ఇంకా మరెన్నో చక్కని చిత్రాలు అందించి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ BR మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

అశ్విన్ తో థాంక్ యూ బ్రదర్ అంటున్న అనసూయా..!

అశ్విన్ తో థాంక్ యూ బ్రదర్ అంటున్న అనసూయా..!


బుల్లితేర యాంకర్ గా పరిచయమై.. అటు బుల్లి తెర పై యాంకరింగ్ చేస్తునే.. ఇటు వెండితెర పై నటిగా మంచి గుర్తింపు పొందిన “అనసూయ భరద్వాజ్”.. మరియు అననగనగా ఓ ప్రేమ కథ చిత్రంతో వెండితెర పై పరిచయమై.. “మనసానమః” తో యూట్యూబ్ లో భారీ విజయం సాదించటంతో పాటు.. అందులోని నటనకు అనేక అవార్డులు అందుకున్న యువ హీరో “విరాజ్ అశ్విన్” ప్రధాన పాత్రలుగా రమేష్ రాపర్తి తెరకేక్కిస్తున్న చిత్రం “థాంక్ యు బ్రదర్ ”


ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను రాణా విడుదల చేయగా.. కిందటి వారం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా.. మోషన్ పోస్టర్ తో ఆసక్తిని కలిగించింది. అలాంటి ఈ చిత్ర ట్రైలర్ ని తాజాగా విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదగా విడుదల చేశారు.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. గర్భవతిగా ఉన్న ప్రియా(అనసూయా) లిఫ్ట్ లో అభి (అశ్విన్) తో పాటు ఇరుక్కుపోయిన తరువాత పరిణామాలు ఎలా ఉన్నాయ్? ఇంతకీ ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అభి మరియు ప్రియా ఎవరు? వాళ్ళు ఆ లిఫ్ట్ నుండి ఎలా బయటపడ్డారు?గర్భవతి గా ఉన్న ప్రియా ను నొప్పులు మొదలైతే.. మెడికల్ కు సంబంధం లేని అభి ఏం చేస్తాడు అనేది మనం పూర్తి సినిమా విడుదలైతే చూడాల్సిందే.ట్రైలర్ చుస్తే.. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన హీరో అశ్విన్.. ఎన్నో సినిమాల అనుభవం గల నటుడిగా కనిపించారు. డబ్బులు.. ఆవేశం ఉన్న ఒక్క కుర్రాడు ఎలా ఉంటాడో అశ్విన్ చేసి చూపించారు. మంచి ఎత్తు.. చూసేందుకు కూడా అందంగా కనిపిస్తూ ఉందటం.. హావభావాలు బాగా పలుకుతూ వుంటాడం చూస్తుంటే.. ఈ కుర్ర హీరో త్వరలో గొప్ప హీరోల జాబితాలో చేరేలా ఉన్నారు. ఇక గర్భవతి పాత్రలో అనసూయ చాలా బాగా నటించారు. భిన్న పాత్రలతో ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు పొందిన అనసూయ.. ఈ పాత్రతో తన నటనా ప్రావీణ్యం గురించి మరోసారి ప్రేక్షకులు మరియు పరిశ్రమ మాట్లాడుకునేలా చేశారు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రానికి గుణా బాలసుబ్రమణ్యం అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలమని చెప్పాలి.


చిత్ర దర్శకుడు రమేష్ రాపర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక లిఫ్ట్ లో ఏం జరిగిందో అనే చిన్న లైన్ తో ఇంత సినిమా తియ్యడం మాములు విషయం కాదు. ట్రైలర్ చుస్తే.. ప్రతి సన్నివేశం సస్పెన్స్ థ్రిల్లర్ లా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. అతి తక్కువ రోజుల్లో.. లాక్ డౌన్ తరవాత తీసిన ఈ సినిమా అప్పుడే ప్రక్షుకుల ముందు రానుంది అంటే డైరెక్టర్ ప్రతిభ.. కష్టం అర్ధమవుతుంది. సినిమా అధ్యంతం థ్రిల్లర్ నేపథ్యంలో అన్ని రకాల బావోద్వేగాలను సమపాళ్ళలో తీర్చిదిద్దినట్లు ఉన్నారు దర్శకుడు రమేష్ రాపర్తి.


ఇప్పటికే ముప్పయి లక్షల మంది ఈ ట్రైలర్ ని చూశారు.. అలాంటి ఈ చిత్రం ద్వారా అనసూయా.. అశ్విన్ లకు మరియు.. సాంకేతిక బృందానికి.. మంచి పేరు రావాలని అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.


థాంక్ యు బ్రదర్ ట్రైలర్


“ఆచార్య” టీజర్ తో యూట్యూబ్ దుమ్ములేపిన మెగాస్టార్!

“ఆచార్య” టీజర్ తో యూట్యూబ్ దుమ్ములేపిన మెగాస్టార్!


క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ చెక్కుచెందరనిది..


అలాంటి మెగాస్టార్ పక్కా మాస్ కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ తో సినిమా అంటే అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. అంతేకాక రామ్ చరణ్ ముఖ్య పాత్రలో మేరవడంతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంచనాలను అందుకోవడంలో మన ఆచార్య ఎంతవరకు సక్సెస్ అయ్యాడు కొరటాల.. చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నాడు అనే ప్రశ్నలకు ఈ టీజర్ తో సమాధానం దొరికినట్టేనా? ఈ ఆర్టికల్ తో తెలుసుకుందాం..


ఇక టీజర్ విషయానికి వస్తే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది.. “ఇతరులకోసం జీవించేవారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు”. అలానే మెగాస్టార్ చిరంజీవిని ఒక మాస్ కోణంలో తెరపైకి తీసుకుని వచ్చాడు కొరటాల.. ఆ మాస్ లుక్ ప్రేక్షకులకు నచ్చిందని టీజర్ కు వస్తున్న స్పందనను బట్టి తెలిసిపోతుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇప్పటికే 7మిలియన్ వ్యూస్ సాధించింది ఈ టీజర్.


పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాంటి అన్ని అంశాలను జతచేసి చూపించాడు కొరటాల. టీజర్ వచ్చిన దగ్గర నుండి యూట్యూబ్ లో మొత్తమోగించారు ఫ్యాన్స్.. సామాజిక మాధ్యమంలో ఇదే ఇప్పుడు ట్రెండింగ్. మెగాస్టార్ మరియు మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు మెలోడీ బ్రాహ్మ మణిశర్మ. ప్రేక్షకులకు మళ్ళీ ఇంద్ర రోజులు గుర్తు చేసారనే చెప్పాలి.


ఈ చిత్రాన్ని మే 13 న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం పోస్టర్స్ విడుదల చేసారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్దా పాత్రలో కనిపించునున్నాడు. ఆకలి మీద ఉన్న సినీమాభిమానులకు మంచి కమర్షియల్ చిత్రంగా వస్తున్న “ఆచార్య” భారీ విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.

సినిమా ఉత్సవం ప్రారంభించిన తెలుగు చిత్ర పరిశ్రమ.!

సినిమా ఉత్సవం ప్రారంభించిన తెలుగు చిత్ర పరిశ్రమ.!


ప్రతి ఏడాది స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఒక సినిమా విడుదల చేసేవారు కానీ కరోనా కారణంగా విడుదల చేయడానికి థియేటర్స్ లేకపోవడం వల్ల బాగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అన్ని సినిమాలు కలిసి తమ స్థానాలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి. వరసగా గత రెండు రోజులుగా అన్ని చిత్ర బృందాలు.. సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ అభిమానులలో నుతున ఉత్సాహం నింపుతున్నారు.


RRR :- రామ్ చరణ్, ఎన్టీఆర్ కధానాయకులుగా దర్శక దీరుడు రాజమౌళి తెరకేక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం పోస్టర్ ను విడుదల చేసి ప్రకటించాయి.


పుష్ప :- క్రియేటివ్ జీనియస్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం పుష్ప ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు.


F3 : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన F2 (Fun nd frustration ) 2019 సంక్రాంతికి విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు F2 కి కొనసాగింపుగా F3 ని తెరకేక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఆగష్టు 27 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


జాతి రత్నాలు :- ఏజెంట్ శ్రీనివాస్ అత్రేయతో మంచి విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి కధానాయకుడుగా స్వప్న సినిమాస్ బ్యానర్లో ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం జాతిరత్నాలు ఈ చిత్రాన్ని మార్చ్ 11న విడుదల చేయనున్నారు.


విరాటపర్వం :- రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా సుధాకర్ చెరుకూరి తెరకేక్కిస్తున్న చిత్రం విరాటపర్వం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30 న విడుదల చేయనున్నారు ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించునున్నాడు.
సీటీమార్ :- గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న చిత్రం సిటిమార్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 న విడుదల చేయనున్నారు.


గని :- వరుణ్ తేజ్ కథానాయకుడుగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు లు ముఖ్య పాత్రాలు పోషించిన చిత్రం గని ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నారు.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.


మేజర్ :- తక్కువ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక విలువలు కలిగిన చిత్రాలు చేసే కథానాయకుడు అడివి శేషు ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై 2 న విడుదల చేయనున్నారు.


వీటితో పాటు.. పవర్ స్టార్ వకీల్ సాబ్.. మరియు ఆయన రానా కలిసి చేస్తున్న సినిమా ఈ సంవత్సరమే విడుదల చేయనున్నారు. మెగాస్టార్ ఆచార్య.. కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్.. విక్టరీ వెంకీ నారప్ప ఇలా జాబితా చాలానే ఉంది. మరో వారం రోజుల్లో అన్ని సినిమాల విడుదల తేదీలను ప్రకటించనున్నారు. మొత్తం చూస్తూనే ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ సినిమా ఉత్సవాన్నే నిర్వహించేలా ఉన్నాయి. విడుదలకి సిద్ధం అవుతున్న చిత్రాలు అన్ని మంచి విజయాలు అందుకోవాలి అని.. సినిమా హాల్స్ మరియు పరిశ్రమ కళకళలాడాలని కోరుకుందాం..!