24-01-2021 11:12:14 About Us Contact Us
మిలియన్ వ్యూస్ దాటిన శివాని సినిమా WWW టీజర్.!

మిలియన్ వ్యూస్ దాటిన శివాని సినిమా WWW టీజర్.!


యువ కథానాయకుడు ఆదిత్ అరుణ్.. జీవితా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం W W W (ఎవరు, ఎక్కడ,ఎందుకు). 118 చిత్రం తో మంచి థ్రిల్లర్ సినిమా తీశారని ప్రశంసలు అందుకున్న దర్శకుడు కేవీ గుహన్ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తుండగా.. రామనేత్ర క్రియేషన్స్ బ్యానర్ పై రవి.పి.రాజు దట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ విడుదల కాగా.. సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు. తాజాగా మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసింది.


టీజర్ విషయానికి వస్తే ఇది సీట్ ఏడ్జ్ థ్రిల్లర్ లానే చూపించే ప్రయత్నం చేసారు దర్శకుడు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని చూపిస్తూనే లవ్ స్టోరీ కూడా బానే ఉండబోతుంది అని తెలియచేసే విధంగా టీజర్ ని కట్ చేశారు. టీజర్ లో హీరో చెప్పే సంభాషణలు చూస్తే.. ఏదో ఆన్ లైన్ మర్డర్ నేపథ్యంలో చిత్రం ఉండబోతుందని అర్ధమవుతుంది. అసలు ఆ మర్డర్ ని ఎవరు?ఎక్కడ??ఎందుకు??? చేశారనే విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.


మైండ్ గేమ్స్.. థ్రిల్లర్ తరహా చిత్రాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా తప్పక నచ్చుతుంది అని చిత్రబృందం చెప్తున్నారు. మనం టీజర్ చూశాక చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి సైమన్.కె.కింగ్.. సంగీతం ఇరకొట్టేశాడనే చెప్పాలి. థ్రిల్లర్ చిత్రాలకి ఎలాంటి నేపధ్య సంగీతం కావాలో.. అదే అందించారు. ఈ చిత్రం సాంకేతికంగా కూడా మంచి నిర్మాణ విలువలతో తీసినట్లు అర్ధమవుతుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కూడా దర్శకుడు కె.వి.గుహన్ కావడం విశేషం.


ప్రధాన పాత్రాల్లో ప్రియదర్శి.. వైవా హర్ష.. శ్రీ దివ్య నటిస్తూవుండటం.. 118 దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తుండటం.. టీజర్ బాగుండటంతో.. ఈ చిత్రం పై థ్రిల్లర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

“పోలీస్ వారి హెచ్చరిక”.. “లక్ష్య”.. “వరుడు కావలెను” అంటున్న నాగశౌర్య కి జన్మదిన శుభాకాంక్షలు

“పోలీస్ వారి హెచ్చరిక”.. “లక్ష్య”.. “వరుడు కావలెను” అంటున్న నాగశౌర్య కి జన్మదిన శుభాకాంక్షలు10 ఏళ్ళ ముందు హీరోగా పరిచయమై.. ఊహలు గుసగుసలాడే.. చలో వంటి భారీ విజయాలను నమోదు చేసుకొని.. 2ఒక పైగా సినిమాలు పూర్తి చేసి..ప్రసృతం మూడు సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్న.. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న.. కథానాయకుడు నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ కధనం..


నాగశౌర్య పుట్టింది ఏలూరు. 6వ తరగతి నుండి స్కూల్ బంక్ కొట్టి సినిమాలు చూడటం అలవాటు అయింది ఆలా సినిమాల మీద ఆసక్తి పెరిగింది నాగశౌర్య కి ఆలా 10వ తరగతి పూర్తి చేసిన తరువాత సినిమాలలో నటిస్తా అని వాళ్ళ అమ్మ గారికి చెప్పడంతో ఆమె నువ్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత నచ్చింది చెయ్యు అని షరతు పెట్టరు.


విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ హైదరాబాద్ లో చదివితే.. సినిమా అవకాశాలు కోసం ప్రయత్నాలు చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఇంట్లో ఒప్పించి డిగ్రీ హైదరాబాద్ లో చదువుతూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు.ఆలా 4ఏళ్ళు సినీ ప్రయత్నాలు చేసిన తరువాత2010లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. తరువాత 2013 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చందమామ కధలు అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు.


తరువాత 2014 లో వారహి చిత్రం బ్యానర్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో “ఊహలు గుసగుసలాడే” చిత్రంలో నటీంచగా అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావా మా ఇంటికి, జాదుగాడు, చలో, అశ్వాద్దామా వంటి చిత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.


ప్రస్తుతం వరుడు కావలెను.. లక్ష్య..పోలీస్ వారి హెచ్చరిక.. చిత్రలోలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవాలని.. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది B R మూవీ జోన్.

బ్యాక్ టూ బ్యాక్ ట్రైలర్ లతో మళ్ళీ గేర్ మార్చిన అల్లరి నరేష్

బ్యాక్ టూ బ్యాక్ ట్రైలర్ లతో మళ్ళీ గేర్ మార్చిన అల్లరి నరేష్


ఏడాదికి ఆరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చే అల్లరి నరేష్ ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గించాడు ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ మీ తీర్చడానికి ఒకే రోజు రెండు చిత్రాల ట్రైలర్ లతో మన ముందుకు వచ్చాడు మన అల్లరోడు..బంగారు బుల్లోడుగా రానున్న అల్లరి నరేష్ :-


కామెడి సినిమాలు మాత్రమే కాకుండా మంచి వినూత్నమైన సినిమాలు అడపాదండపా చేస్తూ వచ్చే మన అల్లరి నరేష్ మళ్ళీ తన మార్క్ కామెడీని చూపించడానికి బంగారు బుల్లోడు చిత్రంతో సిద్ధం అయ్యాడు.


ఇక ఈ చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే బ్యాంకులో పని చేసే బంగారు రాజుగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. లాకర్ లో పెట్టిన నగలు వేరే వాళ్ళకి ఇస్తూ మళ్ళీ తిరిగి పెట్టేస్తూ ఉండగా అందులో కొంతమేరా బంగారం కనిపించకుండా పోవడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకేక్కించాడు దర్శకుడు గిరి పలిక.అలనాటి బాలయ్య బాబు బంగారు బుల్లోడు చిత్రంలోని స్వాతిలో ముత్యమంతా పాట ని మళ్ళీ ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయడం విశేషం.


Ak ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కి జోడిగా పూజ ఝావేరి నటించగా ఇంకా ముఖ్య పాత్రాల్లో తనికెళ్ళ భరణి, పోసాని, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.. సాయి కార్తీక్ సంగీతం సమాకూర్చగా సతీష్ ముత్యాల కెమరామెన్ గా పని చేసిన ఈ చిత్రాన్ని జనవరి నెలలోనే విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది.


నాందిలో విలక్షణ పాత్రలో కనిపించునున్న అల్లరి నరేష్ :-


కామెడీ చిత్రాలతో పాటు సీరియస్ పాత్రలను కూడా చేయగల నటుడు అల్లరి నరేష్ మరొక్క సారి అలాంటి పాత్రలోనే ప్రేక్షకులను అలరించునున్నాడు..NS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దర్శకుడు సతీష్ వేగష్ణ నిర్మాత గా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో క్రాక్ లో విలక్షణ నటనలో అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించారు.


ఇక ట్రైలర్ అంతా సీరియస్ గానే చూపించారు అల్లరి నరేష్ వాయిస్ తో వచ్చే డైలాగ్ లు “15 లక్షల మంది ప్రాణ త్యాగం చేసుకుంటేనే కానీ మన దేశానికీ స్వాతంత్ర రాలేదు..1300 పైగా బలిదానాలు చేసుకుంటే కానీ ఒక రాష్ట్రం ఏర్పడలేదు..ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్బం చరిత్రలో ఒకటి లేదు…నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ న్యాయం గెలవాలి న్యాయమే గెలవాలి ” ఈ డైలాగ్ తో న్యాయం కోసం పోరాడే ఒక యువకుడిగా అల్లరి నరేష్ కనిపించునున్నాడు అని అర్ధం అవుతుంది.


విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా సీద్ కెమరామెన్ గా వ్యవహారించారు.


ఈ రెండు చిత్రాలు అల్లరి నరేష్ కెరీర్ లో మైలురాయిగా నిలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

రేపే అహలో ట్రిల్లర్ మూవీ “సూపర్ ఓవర్” విడుదల.!

రేపే అహలో ట్రిల్లర్ మూవీ “సూపర్ ఓవర్” విడుదల.!మన తెలుగు నటి.. లాక్ డౌన్ లో అటు వెబ్ సిరీస్ ఇటు సినిమాలు విడుదల చేస్తూ ఓ.టి.టి లలో తనకంటూ ఒక క్రేజ్ ని పొందిన “చాందిని చౌదరి” మరియు విలక్షణ పాత్రలతో నటుడిగా గుర్తింపు పొందిన “నవిన్ చంద్ర” కలిసి నటించిన క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం సూపర్ ఓవర్.. తెలుగు ఓ.టి.టి ఆహా లో రేపు (జనవరి 22న) కానుంది.


మన దేశంలో క్రికెట్ ఒక ఆట స్థాయి నుండి మతం అనే స్థాయికి చేరింది. అదే ఐపీఎల్ వచ్చింది అంటే క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ మ్యాచ్ లో బెట్టింగ్ లు వేసే వారు.. మరియు బుకీల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతు వస్తుంది. బెట్టింగ్ సామ్రాజ్యంలో రాత్రికి రాత్రి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు రోడ్డున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రమే “సూపర్ ఓవర్”..


ఈ మధ్య విడుదలైన “సూపర్ ఓవర్” చిత్రం ట్రైలర్ విభిన్నంగా ఉంది. భీమవరం.. హైదరాబాద్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ట్రైలర్ లో చాందిని చౌదరి.. నవీన్ చంద్ర మంచి స్నేహితులుగా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ లో కోటి డెబ్భై లక్షలు కోల్పోగా.. అవి తీర్చడానికి ఎలాంటి పనులు చేసారు? ఆ పరిస్థితి నుండి బయటపడ్డారా? తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథస్వామి రారా దర్శకుడు సుదీర్ వర్మ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ వర్మ తెరకేక్కించారు.లాక్ డౌన్ కారణంగా ఎక్కువ ఓటీటీ విడుదల మీద ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ “సూపర్ ఓవర్” చిత్రాన్ని కూడా ప్రముఖ ఓ.టీ.టీ అయిన ఆహాలో జనవరి 22 విడుదల చేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. చాందిని చౌదరి.. నవీన్ చంద్ర.. అజయ్.. వాసు.. మురళి.. వైవా హర్ష ప్రధాన పాత్రలలో ఉండటం.. యువత బాగా ఇష్టపడే క్రికెట్ మరియు బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడం.. పైగా ట్రిల్లర్ మూవీ అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


రేపు వస్తున్న “సూపర్ ఓవర్” మరో ఓ టీ టీ బ్లాక్ బస్టర్ గా నిలవాలని.. చాందిని చౌదరి కి ఓ.టి.టి లో మరో విజయం లభించాలని.. ఈ చిత్ర దర్శకుడికి మంచి పేరు రావాలని ఆశిద్దాం.

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ కు జన్మదిన  శుభాకాంక్షలు

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు


రెబల్ ఈ పేరు విన్నవెంటనే మీ మనసులో ప్రభాస్ పేరు రావడం సహజం కానీ ఒక తరం వెనక్కి వెళ్లి చూస్తే రెబల్ స్టార్ అనగానే ఆరడుగుల యాక్షన్ హీరో కృష్ణంరాజు గారు గుర్తుకు వస్తారు.1940లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు కృష్ణంరాజు గారు.. కృష్ణం రాజు గారి అసలు పేరు శ్రీ వెంకట కృష్ణంరాజు.


కష్టపడి పని చేసే తత్వం ఉన్న కృష్ణంరాజు గారికి ఫోటోగ్రఫీ అంటే మక్కువతో ఇంట్లో ఉన్న ఒక కెమెరాతో ఫొటోస్ తీయడం అలవాటుగా మార్చుకున్నారు.చిన్నతనంలో ఎక్కువ అల్లరి చేసే కృష్ణంరాజు గారు తన తండ్రి వెంకట సత్యనారాయణ రాజు గారి మాటలు విని తనకి బాగా ఇష్టం అయిన ఫోటొగ్రఫీని వ్యాపారంగా చేద్దాం అని నిర్ణయించుకున్నారు.తన దగ్గర ఉన్న ఒక కెమెరాతో పాటు ఇంకొక కెమెరా కొని ఒక షాప్ అద్దెకి తీసుకుని దానికి రాయల్ ఫొటో స్టూడియో అని పేరు పెట్టారు.


ఆ షాప్ లో పని చేసే కుర్రాడు ఒక రోజు కృష్ణంరాజు గారితో ఇలా అన్నాడు.. సార్ మీరే హీరో లా ఉంటారు మీ ఫొటోస్ కొన్ని తీసి షాప్ లో షోకేస్ లో పెడదాం అని.. దానికి బదులుగా కృష్ణంరాజు గారు.. నా ఫొటోస్ ఎందుకు ఎన్టీఆర్, ఏ న్ ఆర్ ఫొటోస్ పెట్టు అన్నాడు.. అయినా ఆ కుర్రాడు పట్టుపట్టి మరి కృష్ణంరాజు గారితో కొన్ని స్టిల్స్ తీసుకుని షాపులో పెట్టాడు.ఆలా షాపులో ఫొటోస్ చూసిన ఒక పెద్దాయన నువ్ హీరోలా ఉన్నావ్ నేను కూడా ఒక సినిమా తియ్యాలి అనుకుంటున్నా నీకు ఇష్టం అయితే ఇప్పుడే మద్రాస్ తీసుకుని వెళ్తా అని చెప్తే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు స్ని సున్నితంగా తిరస్కరించారు కృష్ణంరాజు గారు


కానీ ఆ పెద్దాయన మరుసటి రోజు మళ్ళీ వచ్చి అడిగాడు ఆలా రెండు రోజులు వచ్చి అడిగే సరికి కృష్ణంరాజు గారికి కూడా ఆశ కలిగింది వెంటనే వాళ్ళ పత్రిక బాబాయ్ కి ఫోన్ చేసిన అడిగాడు వాళ్ళ బాబాయ్ కూడా హీరోలా ఉంటావ్ ఒక సారి ప్రయత్నించి చూడు అనే సరికి మద్రాస్ వెళ్ళాడు కృష్ణంరాజు.


మద్రాస్ వెళ్లిన కృష్ణంరాజు గారు అజంతా హోటల్ లో ఉండే వారు ప్రముఖ హీరోలకి మేకప్ వేసే పితాంబరం గారిని పిలిపించి మేకప్ టెస్ట్ చేయించారు ఆలా మూడు రోజులు గడిచాయి తరువాత 15రోజులు అయినా సరే ఆ పెద్దాయన కనిపించడం మానేసాడు అది గమనించిన హోటల్ యజమాని కృష్ణంరాజు గారితో ఇలా అన్నాడు.. మీరు ఆ పెద్దాయన కోసం ఎదురుచూస్తున్నట్టు అయితే వెళ్లిపోండి ఇంకా అయన రాడు అయన ఇలానే ప్రతి సారి తెలుగు వారిని ఒకరు ఇద్దరిని తీసుకుని వచ్చి సినిమా తీస్తా అని చెప్పి తన ఖర్చులకు డబ్బులు తీసుకుని మెల్లగా జారుకుంటాడు అని చెప్పడంతో కృష్ణంరాజు గారు నిరాశతో మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారు.


1966 లో ప్రత్యేకాత్మ గారి దర్శకత్వంలో చిలక గోరింకా అనే చిత్రంలో నటించారు కృష్ణంరాజు గారు.. ఈ చిత్రంలో S V రంగారావు గారిలాంటి మేటి నటులకు దీటుగా నటించి మెప్పించారు రాజు గారు కానీ ఆ చిత్రం నిరాశపరిచినా కాని కృష్ణంరాజు గారి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు.తరువాత బుద్దిమంతుడు, పవిత్రబంధం, జై జవాన్ లాంటి చిత్రాలలో విలన్ పాత్రలో నటించారు మళ్ళీ తిరిగి 1974 లో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.


ఇంటి దొంగలు చిత్రం తో మళ్ళీ హీరోగా వెలుగొందిన కృష్ణంరాజు గారు తరువాత కృష్ణవేణి అనే చిత్రం సగం పూర్తి అయిన తరువాత ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అయిపోవడంతో కృష్ణంరాజు గారు మిగిలిన డబ్బులు పెట్టి సినిమా పూర్తి చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా హీరో పాత్రాల్లో చేయడం ప్రారంభించారు నిత్యసుమంగళి, మొగుడా పెళ్ళామా, భక్త కన్నప్ప వంటి చిత్రాలు చేసి మెప్పించారు తరువాత బిల్లా, రెబల్ వంటి చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు.


ఇంకా ముందు ముందు మరెన్నో పాత్రాల్లో అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ “రెబల్ స్టార్ కృష్ణంరాజు” గారికి B R మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.