08-12-2021 20:22:20 About Us Contact Us
అక్టోబర్ 23న విడుదల కానున్న కలర్ ఫోటో భారీ విజయం సాధించాలని ప్రత్యేక కథనం..!

అక్టోబర్ 23న విడుదల కానున్న కలర్ ఫోటో భారీ విజయం సాధించాలని ప్రత్యేక కథనం..!



ఆరంభం నుండే అటు ప్రేక్షకుల.. ఇటు సినిమా వర్గాల దృష్టిని ఆకర్షించిన సినిమా కలర్ ఫోటో.ఈ నెల 23న ఆహా యాప్ లో నేరుగా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్… పాటలు.. టీజర్ కు మంచి స్పందన వచ్చింది.కోటి ఆశలతో యువ బృందం చేసిన ప్రయత్నం కలర్ ఫోటో.ఆదివారం(అక్టోబర్ 18న) ప్రి-రిలీస్ వేడుక చేసుకొని ఈ శుక్రవారం (అక్టోబర్ 23న) విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమా గురించి ప్రత్యేక కథనం..!


ముందుగా ఈ సినిమాకు బీజం వేసిన వ్యక్తి ఈ సినిమా కథా రచయిత.. నిర్మాత సాయి రాజేష్ గారు.దర్శకుడవ్వాలని హైదరాబాద్ చేరిన సింహపురి(నెల్లూరు) వాసి సాయి రాజేష్ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదు.దింతో అటు ప్రేక్షకుల ఇటు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు మరియు మంచి సినిమా నిర్మించేందుకు డబ్బులు పొందేందుకు ఒక విభిన్నమైన కోణంలో ప్రయత్నం చేశారు.. అదే హృదయ కాలేయం.ఆ తర్వాత నిర్మాతగా కొబ్బరి మట్ట సినిమా చేశారు.ఆ తర్వాత స్వయంగా తన లవ్ స్టోరీని వెండితెర పై అవిష్కరించాలని కథ రాశారు.ఆ సినిమాను తన మిత్రుడు బెన్నీ ముప్పనేని తో కలిసి నిర్మించేందుకు సిద్ధమయ్యారు.


ఏడేళ్ళ ముందు చాయ్ బిస్కకెట్ ద్వారా షార్ట్ ఫిల్మ్ దర్శకుడిగా మంచి పేరు పొంది.. దర్శకుడిగా ఒక మంచి సినిమా తియ్యాలని అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు సందీప్ రాజ్.అలాంటి సందీప్ రాజ్ కు సాయి రాజేష్ కథ చెప్పడం.. తానే నిర్మిస్తాను.. దర్శకత్వం చెయ్యమని చెప్పడంతో కలర్ ఫోటో దర్శకుడిగా మారారు సందీప్ రాజ్.తన రచనతో.. అటు నటీనటుల.. సాంకేతిక నిపుణుల ఎంపిక తో సగం విజయం చిత్ర ప్రారంభానికి ముందే సాధించారు సందీప్ రాజ్


యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్న సుహాస్.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. మజిలీ.. డియర్ కామ్రేడ్.. ఉమామహేశ్వర ఉగ్రరూపాస్య వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు నటుడిగా బాగా దగ్గరయ్యారు.ఇలాంటి సమయంలో హీరోగా సుహాస్ చేస్తున్న తొలి ప్రయత్నం కలర్ ఫోటో.మంచి పాత్రలు వస్తున్న సమయంలో ఇలా ప్రయతించి విఫలమైతే వస్తున్న అవకాశాలు సైతం ఆగిపోతాయని తెలిసి కూడా కథ నచ్చడం.. మిత్రుడు.. దర్శకుడు సందీప్ రాజ్ పై నమ్మకంతో ఒప్పుకున్నారు సుహాస్.ఇప్పటికే చిత్రంలో పని చేసిన వారు నవాజుద్దీన్ సిద్ధికి.. తెలుగు విజయ్ సెట్టుపతి తో పోల్చడంతో ఆయనకు ఈ సినిమా తర్వాత నటుడిగా గొప్ప పేరు రావడం ఖాయంగా కనిపిస్తుంది.



తెలుగులో యూట్యూబ్ లో స్టార్ గా మారిన తొలి హీరోయిన్ చాందిని చౌదరి.తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది తెలుగు హీరోయిన్ లలో ఒక్కరు చాందిని చౌదరి.మను సినిమాతో ఇప్పటికే నటిగా మంచి పేరు తెచ్చుకున్నరు.గాడ్స్ ఆఫ్ ధర్మపురి.. మస్తిస్.. వెబ్ సిరీస్ లతో భారీ విజయాలు నమోదు చేసుకొని మంచి ఫామ్ లో ఉన్న చాందిని చౌదరి కి నటిగా పేరు రానున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.


విలన్ పాత్రలో సునీల్ గారు మెప్పించి.. పరిపూర్ణమైన నటుడిగా సునీల్ మారనున్నరు. ఇప్పటికే పాటలతో సంగీత దర్శకుడు కాలభైరవ విజయం సాధించారు.ఇప్పుడు సినిమా విడుదల తర్వాత నేపధ్య సంగీతంలో కూడా తన మార్క్ చూపించనున్నారు కాలభైరవ.ఇప్పటికే టీజర్ తో వెంకట్ గొప్ప సినిమాతోగ్రఫీ అందించినట్లు పరిశ్రమలోని పెద్ద వ్యక్తులు వ్యాఖ్యానించారు.దింతో ప్రేక్షకులకు సైతం తన కెమెరాతో ఆకట్టుకొనున్నారు.ఈ సినిమా కోసం ఎడిటర్ పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో ప్రి-రిలీస్ వేడుక చూసిన ఏవిరికైనా అర్ధమవుతుంది.


సినిమా ఆహాకు ఇచ్చేయడంతో నిర్మాతగా ఇప్పటికే విజయం సాధించిన సాయి రాజేష్ కు ఈ సినిమాతో అటు కథా రచయితగా మంచి పేరు తో పాటు దర్శకుడిగా సినిమా అవకాశాలు రావాలని.. ఈ నెల 23న తొలిసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సందీప్ రాజ్.. దర్శకుడిగా మంచి పేరు పొందాలని.. సుహాస్.. చాందిని చౌదరి లకు వారి నటనలో మంచి పేరుతో పాటు.. మరిన్ని అవకాశాలు రావాలని.. సంగీత దర్శకుడు.. సినిమాతోగ్రఫీ.. ఎడిటర్ ఇలా అన్ని విభాగాలలో విజయాలు సాధించి మొత్తం యువకులతో కూడిన ఈ కలర్ ఫోటో బృందం విజయం సాధించడంతో పాటు మరిన్ని అవకాశాలు రావాలని మా బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం.అందరిలా 23న కలర్ ఫోటో చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాం.

“సింహపురి” ‘పంజా’ “సుప్రీమ్ హీరో” ‘సాయి ధరమ్ తేజ్’ పుట్టినరోజు స్పెషల్.!

“సింహపురి” ‘పంజా’ “సుప్రీమ్ హీరో” ‘సాయి ధరమ్ తేజ్’ పుట్టినరోజు స్పెషల్.!



మెగా కుటుంబం నుంచి ముగ్గురి మావయ్యల ముద్దుల అల్లుడిగా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం తో పరిచయమై..చూడగానే మన పక్కింటి కుర్రాడు అనే దగ్గర నుండి తెలుగువారు అందరూ.. మన ఇంటి కుర్రాడు అనేంతలా చేరువయ్యారు ధరమ్ తేజ్.తనదైన శైలిలో నటిస్తూ.. తనకంటూ ఒక ఇమేజ్ ని సాధించి.. సుప్రీమ్ హీరో గా ఎదిగారు పంజా సాయి ధరమ్ తేజ్. అటు మాస్.. ఇటు ఫామిలీ ఆడియాన్స్ కు బాగా చేరువయ్యారు తేజు.. మరిముఖ్యంగా తేజుకు అమ్మయిల ఫాలోయింగ్ కూడా కొంచెం ఎక్కువే.. అలాంటి సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కధనం..!


1986 అక్టోబర్ 15న మద్రాస్ లో జన్మించాడు తేజు.తన బాల్యం.. కొద్ది సంవత్సరాలు నెల్లూరులో.. మరి కొద్ది సంవత్సరాలు చెన్నై లో గడిచింది.పరిశ్రమ హైదరాబాద్ చేరిన క్రమంలో హైదరాబాద్ చేరిన తేజు.. డిగ్రీ మరియు ఎంబీఏ హైదరాబాద్ లో పూర్తి చేశారు.డిగ్రీ చదివే రోజుల నుండి ఇంట్లో డబ్బులు తీసుకోవడం మానేసిన తేజు.. డబ్బుల సంపాదన కోసం మిత్రులతో కలిసి అనేక వ్యాపారాలు చేశారు.ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకొని తొలుత తనకు బాగా దగ్గరైన పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు.ప్రతి విషయం తల్లితో పంచుకునే తేజు నెమ్మదిగా తల్లికి కూడా తెలిపారు.ఇలా ఏదో ఒక రోజు సినిమా అంటావు అని తెలుసు.. అంటూ ముందు ఎంబీఏ చదువు ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పారు తల్లి విజయ దుర్గ.అమ్మ కోసం అలా చదువు పూర్తి చేసి సినీ రంగం వైపు అడుగులు వేశాడు ఆ 23 ఏళ్ళ కుర్రాడు.


ఆ రోజుల్లో 132 కేజీల బరువు ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా.. కఠోర శ్రమతో 50 కేజీలు పైన తగ్గాడు.అంతటితో అయిపోలేదు.పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఆయన గురువైన సత్యానంద మాస్టర్ వద్ద నటనా శిక్షణ పొందాడు.మెగా కుటుంబం నుండి వచ్చినా తేజు మాత్రం సినిమా అవకాశాల కోసం పరిశ్రమకు వచ్చిన కొత్త వారిలా ఫోటోలు పట్టుకొని దర్శక..నిర్మాతల ఆఫీసులు చుట్టు తిరిగాడు.ఫోటో వెనక పేరు సాయి అని.. ఫోన్ నెంబర్ రాసి అవకాశం ఉంటే చెప్పాలని చెప్పేవాడు.అలా తిరుగుతున్న తను ఒక రోజు మంచు మనోజ్ ఆఫీస్ లో క్రికెట్ అడుతుండగా వై.వి.ఎస్.చౌదరి గారి కంట్లో పడ్డారు.నీకు సినిమా ఇంట్రెస్ట్ ఉందా అని అడగటంతో సాయి ధరమ్ తేజ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది.


మెగా కుటుంబం నుండి వచ్చినా అవకాశాల కోసం తిరిగినా తన కష్టాలు పోలేదు.2010 లో ప్రారంభమైన రేయ్ సినిమా 2015లో విడుదలైంది.2012లో మొదలైన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సమయంలో 2013లో శ్రీహరి గారి మరణంతో సినిమాలో అనేక సన్నివేశాలు మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆ పాత్రను జగపతిబాబు గారు చేశారు.అలా 2010లో అవకాశం లభించినా ప్రేక్షకుల ముందుకు 2014లో వచ్చాడు తేజు.అక్కడ నుండి చరిత్ర..



“చిత్రలహరి” లో “రేయ్” “తేజ్ ఐ లవ్ యూ” అంటే.. “ఇంటెలిజెంట్” గా.. “పిల్లా నువ్వు లేని జీవితం””ప్రతిరోజు పండగే” అని చెప్పి.. “సుబ్రమణ్యం ఫర్ సేల్” అంటూ తన “తిక్క” తో బాక్స్ ఆఫీస్ వద్ద “విన్నర్”గా.. నిలిచిన “జవాన్”. “సోలో బ్రతుకే సో బెటర్” అంటున్న.. “సుప్రీమ్”.. “నక్షత్రం”(స్టార్).. “పంజా సాయి ధరమ్ తేజ్”..!


కెరియర్ తొలి రోజుల్లో పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. సుప్రీమ్ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు.ఆ తర్వాత వరస ప్లాప్స్ వచ్చినా ఎక్కడా తన తదుపరి చిత్రం ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం కనపడలేదు.అంటే సాయి ధరమ్ తేజ్ సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా తనకంటూ ఒక మార్కెట్ ని సంపాదించుకున్నారు అని అర్థం.తిరిగి చిత్రాలహరి తో భారీ విజయం అందుకున్న సుప్రీమ్ హీరో ప్రతిరోజు పండగే సినిమాతో విజయం కొనసాగించారు.ఇప్పడు.. సోలో బ్రతుకే సో బెటర్.. మరియు దేవ కట్ట గారితో మరో సినిమా చేస్తున్నారు.


ఎప్పుడు ఎవరు కనిపించినా చిరునవ్వుతో పలకరిస్తూ.. అభిమానులతో సరదాగా మాట్లాడుతూ.. సొసైటీ కోసం తనవంతు బాధ్యతగా థింక్ పీస్(Think Peace)అనే స్వచ్చంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ చేసేందుకు ముందు వచ్చారు తేజు.గత సంవత్సరం తన పుట్టినరోజున విజయవాడ వృధాశ్రమాని పూర్తిగా మెరుగు పరిచారు.మా పెద్ద మామ చిరంజీవి గారు చిన్నతనం నుండి నన్ను చూసుకున్నారు..మా నాగబాబు మామ ఏం చదవాలి..ఏ ఆట ఆడాలి..అలా అనేక విషయాలు నేర్పారు..మా చిన్న మామ పవన్ కళ్యాణ్ గారు నా గురువు..అంటూ ముగ్గురి గురించి ఎప్పుడు చెప్పినా తన మొహంలో గర్వంతో కూడిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటుంది.మెగాభిమానులకు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులలో సైతం తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు తేజ్.!


ఇలా దశాబ్ద సినిమా ప్రస్థానంలో పదమూడు సినిమాలు పూర్తి చేసుకున్నారు.మెగా కుటుంబం నుండి వచ్చిన మిగతా హీరోలకు భిన్నంగా సినిమా అవకాశాల కోసం కష్టపడి.. వరస పరాజయాలను ఎదురుకొని.. తన ప్రతిభ.. కష్టం.. ఓపికతో పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి.. అటు మాస్ ఇటు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైన మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!

హిరణ్యకశ్యప.. శాకుంతలం అంటూ భారీ సినిమాలను ప్రకటించిన గుణశేఖర్.!

హిరణ్యకశ్యప.. శాకుంతలం అంటూ భారీ సినిమాలను ప్రకటించిన గుణశేఖర్.!



తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సెట్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే దర్శకులు గుణశేఖర్ గారు రెండు భారీ సినిమాలను ప్రకటించారు.ఒకటి హిరణ్యకశ్యప కాగా రెండవది శాకుంతలం.వివరాల్లోకి వెళ్తే..


మెగాస్టార్ చిరంజీవి గారి తో చూడాలని ఉంది.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్కడు.. జూనియర్ ఎన్టీఆర్ తో చిన్నారుల శిల్పారామం.. రామాయణం. అదే బాల రామాయణం వంటి విజయవంతమైన మంచి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క తో రుద్రమదేవి సినిమాతో కాకతీయ సామ్రాజ్యపు విశేషాలను.. రాణి రుద్రమదేవి గారి గొప్పతనాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన దర్శకులు గుణశేఖర్ గారు.


ఒక్కడు సినిమాకు తాను వేసిన చార్మినార్ సెట్ గురించి ఇప్పటికి చిత్ర పరిశ్రమ మాట్లాడుతూ ఉంటుంది.ఆ తర్వాత ఆయన సినిమాలో సెట్ వెయ్యడం సర్వ సాధారణంగా మారిపోయింది.ఆయన చివరగా చేసిన రాణి రుద్రమదేవికి ఒక పక్క స్వీయ నిర్మాణం.. మరో పక్క భారీ తారాగణం.. అందులోనూ చరిత్ర.. దింతో అనేక సెట్లు వేశారు గుణశేఖర్ గారు.



అలాంటి గుణశేఖర్ గారు గత సంవత్సరం జూన్ ఒకటిన అంటే రుద్రమదేవి సినిమా విడుదలై.. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత తన తదుపరి సినిమా ప్రకటన చేశారు.దగ్గుబాటి రానా హీరోగా హిందు పురణలలోని లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి హిరణ్యకశ్యప అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.గడిచిన మూడు సంవత్సరాలుగా ఆ సినిమా పనులు జరుగుతున్నట్లు చెప్పడంతో భారీ సినిమా ఖాయమని అంతా భావించారు.ఇప్పుడు లాక్ డౌన్.. మరోవైపు రానా పెళ్ళి.. చేస్తున్న సినిమాల దృశ్య ఆ భారీ సినిమా పట్టలేక్కేందుకు సమయం పడుతుండటంతో మరో సినిమా చేస్తున్నట్లు నిన్న(అక్టోబర్ 9న) ప్రకటించారు.


మహా భారతంలోని ఆదిపర్వంలో విశ్వామిత్ర మహర్షి కూతురు శకుంతల.. కన్వ మహర్షి వద్ద పెరిగిన ఆమెను హస్తినాపురి రాజైన దుస్యంత మహారాజు ప్రేమిస్తారు.ఈ ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు.సినిమా టైటిల్ “శాకుంతలం”.. మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.లండన్ లో ఆర్ట్స్ & విజువల్ కల్చర్ (చిత్రాల ద్వారా సంస్కృతిని తెలపడం) చదివిన గుణశేఖర్ గారి పెద్ద కుమార్తె నీలిమ నిర్మాతగా పరిచయం కానున్నారు.గుణ టీం వర్క్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు.. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.


అద్భుతమైన టైటిల్ పోస్టర్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా భారీ విజయం సాధించాలని.. నేటి తరానికి మహా భారతంలోని విశేషాలు తెలియాలని కోరుకుంటూ.. నీలిమకు.. గుణశేఖర్ గారికి.. మరియు చిత్ర బృందానికి శుభాకాంశాలు..!


శాకుంతలం మోషన్ పోస్టర్

ట్రెండింగ్ నెం 1 తో మిలియన్ వ్యూస్ దాటిన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.!

ట్రెండింగ్ నెం 1 తో మిలియన్ వ్యూస్ దాటిన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.!



అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉదయం పదిన్నర గంటలకు(10:30) బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా టీజర్ నిన్న(అక్టోబర్ 5న) ఒక మిలియన్(10 లక్షల) వ్యూస్ దాటింది.విభిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నందు హీరోగా.. యాంకర్ గా అటు బుల్లితెర పై దూసుకుపోటు ఇటు వెండితెరపై హీరోయిన్ గా చేస్తున్న రేష్మి గౌతమ్ హీరోయిన్ గా.. లఘు చిత్రాలతో మంచి పేరు సంపాదించిన రాజ్ విరాట్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న సినిమా “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఆ టీజర్ వివరాల్లోకి వెళ్తే…


అక్టోబర్ 2న ఉదయం విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ వెంటనే లో ట్రెండింగ్ 1 కి చేరింది.. దాదాపు 48 గంటల పాటు అదే స్థానంలో నిలిచింది.మిలియన్(10లక్షల) వ్యూస్ ని చాలా వేగంగా చేరుకుంది.ఇప్పటికే చూసిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.సవారిలో మాస్ పాత్ర చేసిన నందు నుండి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఫస్ట్ లుక్ కి ముందు నుండే బజ్ నడిచింది.దీనికి తోడు.. బిబి అంటూ నందు పోస్ట్ చేయడంతో సినిమా టైటిల్ కి బిగ్ బాస్ కి మధ్య చర్చ జోరుగా సాగింది.ఎట్టకేలకు టైటిల్ పోస్టర్ తో చర్చ కు తెర పడింది.ఆ తర్వాత ఈ సినిమాలో పాత్ర పేరు పోతురాజు కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అన్నవరం సినిమాలోని పోతురాజు డైలాగ్ తో వీడియో విడుదల చేశారు.నందు పుట్టినరోజున వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంది.


ప్రదీప్ మాచిరాజు విడుదల చేసిన రేష్మి గౌతమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పూరి జగన్నాథ్ గారి పుట్టినరోజున పోతురాజు రూమ్ లో ఆయన పోస్టర్స్ ఉన్న వీడియో విడుదల చెయ్యడంతో ఆయన సైతం టీజర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.అప్పటికే హీరో.. హీరోయిన్ ఫస్ట్ లుక్ వల్ల ప్రేక్షకులు సైతం టీజర్ కోసం ఎదురు చూశారు.నిన్న గాంధీ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.



విశాఖ జిల్లా అచుతాపురం ఊరిలో నాటకాలు వేసుకునే పోతురాజు(నందు)పూరి జగన్నాథ్ గారి వీరాభిమాని.తన జీవిత కథను తన అభిమాన దర్శకుడు పూరికి ఇచ్చి సినిమా తియ్యమని చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి పోతురాజు జీవిత కథ ఏమిటి?అతనికి వాణి(రేష్మి)ఎలా పరిచయమవుతుంది.. తర్వాత ఏంటి అనేది కధాంశం.ప్రతి స్కీన్ మాస్ ఆడియాన్స్ కి దగ్గరగా ఉంది.నందు స్క్రీన్ మీద ఉన్నంత సేపు హై వోల్టాజ్ లో షాట్స్ ఉన్నాయి.ఈ టీజర్ లో హీరో శ్రీ విష్ణు వాయిస్ ఓవర్ ఇచ్చారు.దర్శకుడి కష్టం మరియు ఆలోచన పోతురాజు రూమ్ మరియు నాటక మండలి రూమ్ చూస్తే తెలిసిపోతుంది.డైలాగ్స్ కూడా బాగున్నాయి.ఒక్క ముక్కలో చెప్పాలంటే టీజర్ అదిరిపోయింది భయ్యా..!


ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సుజాత సిద్దార్థ్ సినిమాతోగ్రఫీ చేశారు.ఈ సినిమాను విజయీభవ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల,బోసుబాబు నిదుమోలు,ఆనంద్ రెడ్డి మద్ది మరియు మనోహర్ రెడ్డి ఏడా నిర్మించారు.దర్శకులు పూరి జగన్నాథ్ టీజర్ బాగుందని బాహాటంగా మెచ్చుకోగా.. మరో ప్రముఖ దర్శకులు సుకుమార్ వాట్సాప్ కాల్ ద్వారా అభినందించినట్లు హీరో నందు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.ఫస్ట్ లుక్.. టీజర్ తోనే అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సినిమా విడుదల తేది కోసం ఎదురుచూస్తు.. “బొమ్మ బ్లాక్ బస్టర్” కావాలని కోరుకుందాం..!

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్

ట్రైలర్ తో ఆసక్తి రేపిన శంకర్ మార్తాండ్స్ ఎక్స పైరీ డేట్.!

ట్రైలర్ తో ఆసక్తి రేపిన శంకర్ మార్తాండ్స్ ఎక్స పైరీ డేట్.!



అసలే.. వెబ్ సిరీస్ అందులో థ్రిల్లర్.. ఇంకేముంది భాషతో సంబంధం లేకుండా కేవలం సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు మన యువత.అలాంటి వారికి ఈ లాక్ డౌన్ లో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది.తెలుగు,హిందీ భాషల్లో మన తెలుగు దర్శకుడు శంకర్ మార్తాండ్ తీసిన వెబ్ సిరీస్ ఎక్స్ పైరీ డేట్ ( Expiry Date). వచ్చే నెల (అక్టోబర్) 2న హిందీ లో.. 9న తెలుగులో.. ఈ సిరీస్ జీ5 లో విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది.


ఉల్లాసంగా.. ఉత్సాహంగా,కరంట్,సింహ,అలా మొదలైంది చిత్రాలలో నటించి తెలుగు వారికి చేరువైన బాలీవుడ్ నటి.. అటు హిందీ.. ఇటు తెలుగులో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్.. బడలా సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టోనీ లూక్ జంటగా ఈ వెబ్ వెరీస్ లో నటిస్తున్నారు.మరో జంటగా తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో సైతం సినిమాలు చేసిన మధు షాలిని మరియు బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ రెజా నటించారు.


స్నేహా ఉల్లాల్ పెళ్లికి వెళ్ళిన రోజు నుండి కనిపించడం లేదని పిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న టోనీ కి.. అదే మార్గంలో.. అదే పెళ్ళికి వెళ్లిన అలీ రెజా కూడా కనిపించడం లేదని మధు షాలిని పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మరి అక్కడ నుండి వారికి ఏమైంది?వారిద్దరికీ సంబంధం ఏమిటి?తప్పిపోయ్యారని చెప్పుతున వీరి మాటల్లో నిజమెంట?పోలీసు విచారణలో అసలు ఆ రోజు ఏమి జరిగిందని తెలిసింది??పాత్రధారులు ఎవరు?వారి వెనక ఉన్న సూత్రధారులు ఎవరనే కధాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెకింది.ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.సురేష్ రాజుతు సినిమాతోగ్రఫీ చేశారు.నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మించారు.

Sneha ullal,madhu shalini,expiry date web series,shankar marthand

దర్శకుడు శంకర్ మార్తాండ్.. ఈ వెబ్ సిరీస్ ని బాగా తెరకెకించినట్లు.. సిరీస్ ఆద్యంతం చాలా ఉత్కంఠ బరిమతంగా సాగుతుందని.. ఈ సిరీస్ అటు హిందీ,ఇటు తెలుగులో భారీ విజయం నమోదు చేస్తుందని.. అక్టోబర్ 2వ తేదీ కోసం ఎదురు చుట్టున్నట్లు వెబ్ సిరీస్ లో నటించినవారు మరియు సాంకేతిక బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. మార్చ్ చివరి నాటికే సింహ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. మన హైదరాబాద్ సిటీ.. మరియు హైదరాబాద్ శివార్లలోనే చిత్రీకరణ మొత్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి దాకా ఏదో దేశంలో ఎవరో తెలియని వారు నటించిన త్రిల్లర్ సిరీస్సులు చూసిన మన ప్రేక్షకులకు.. మనకు తెలిసిన వారు నటించిన మన సమాజానికి దగ్గరగా ఉన్న ఈ త్రిల్లర్ ను ఎలా ఆదరిస్తారో చూడాలి!? హిందీలో 2న.. తెలుగులో 9న విడుదల చేస్తున్నారు కనుక అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం.!

ఎక్స పైరీ డేట్ ట్రైలర్