25-10-2021 22:37:47 About Us Contact Us
ట్రైలర్ తో ఆసక్తి రేపిన “బొంభాట్” డిసెంబర్ 3న విడుదల..!

ట్రైలర్ తో ఆసక్తి రేపిన “బొంభాట్” డిసెంబర్ 3న విడుదల..!ఈ నగరానికి ఏమైంది సినిమా ఫేమ్ సుశాంత్ రెడ్డి.. సిమ్రన్ చౌదరి మరియు కలర్ ఫోటో తో ఓ.టి.టి లో భారీ విజయం అందుకోవడంతో పాటు తన నటనకు విమర్శకులచే ప్రశంసలు అందుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి కలిసి నటించిన బొంభాట్ చిత్రం డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల కానుంది.నవంబర్ 28న.. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.వివరాలలో వెళ్తే…


రాఘవేంద్ర వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం బొంభాట్.ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.తాజాగా విడుదలైన ట్రైలర్ లో విజువల్స్ చాలా బాగున్నాయి.అటు మోడరన్ ఇటు సంప్రదాయ దుస్తులలో చాందిని చౌదరి చాలా అందంగా కనిపించింది.సుశాంత్ రెడ్డికి సోలో హీరోగా మంచి సినిమా కానున్నట్లు అనిపించింది.మానవ రోబో పాత్రలో సిమ్రన్ కనిపించడంతో తన ప్రతిభ చూపేందుకు మంచి అవకాశం లభించింది.. ట్రైలర్ చూస్తుంటే తను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఉంది.కామెడీ చేసేందుకు ప్రియదర్శి ఉందనే ఉన్నారు. జోష్ బి (జోశ్యభట్ల) నేపధ్య సంగీతం బాగుంది.సినిమా కధాంశంలోకి వెళ్తే..చిన్నతనం నుండి బ్యాడ్ లక్ వెంటాడుతున్న మన హీరో విక్రమ్(సుశాంత్)కు.. అదే బ్యాడ్ లక్ వల్ల తను ప్రేమించిన చైత్ర(చాందిని చౌదరి) దూరమవుతుంది.ఈ బాధలో ఉన్న విక్రమ్..అప్పటికే చనిపోయిన ప్రోఫెసర్ ఆచార్య గారి కూతురు మాయ(సిమ్రన్ చౌదరి)ను కలుస్తాడు.అప్పటి నుండి లక్ తనకు అనుకూలంగా మారుతుంది.అలాంటి సమయంలో మాయ మానవ రూపంలో ఉండే రోబోట్ అని.. ఆ రోబోట్ ని మరో సైంటిస్ట్ వెంటాడుతున్నాడు అని తెలుస్తుంది.తర్వాత.. ఏం జరిగిందో?? తెలియాలంటే బొంభాట్ సినిమా చూడాల్సిందే..!


గాడ్(జి.ఓ.డి).. మస్తిస్.. కలర్ ఫోటో వంటి భారీ విజయాలు నమోదు చేసుకొని మంచి ఫార్మ్ లో ఉన్న చాందిని చౌదరి తన విజయపరంపర కొనసాగిస్తారేమో చూడాలి..తొలి సినిమా తోనే సైన్స్ ఫిక్షన్ సినిమాను చేసిన దర్శకుడు రాఘవేంద్ర వర్మ తాను చేసుకున్న కూర్పు తో… ఎంచుకున్న కధాంశంతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించారు.. మరి సినిమా ఎలా చేశారో చూడాలి మరియు సోలో హీరోగా హిట్ కొట్టి సత్తా చాటాలనుకుంటున్న సుశాంత్.. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.ఇప్పటికే పాటలతో తన సత్తా చాటిన సంగీత దర్శకుడు జోస్యభట్ల.. తనకు ఇది మంచి పేరు తెస్తుంది అని ఆశిస్తున్నారు.మానవ రోబో లా నటించిన సిమ్రన్ చౌదరి సైతం ఈ సినిమాతో తన నటనకు మంచి ప్రశంసలు వస్తుంది అని నమ్మకంతో వున్నారు.మరో విషయం ఏమిటంటే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఈ సినిమాను సమర్పించారు.


ఇలా బొంభాట్ చిత్ర బృందం కొత్తగా ప్రయత్నించి.. సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు.సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వ తేదీ వరకు ఆగాల్సిందే.అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న బొంభాట్ చిత్రం విజయం సాధించాలని మా బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం..!

బొంభాట్ ట్రైలర్

ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన మెగా బ్రదర్స్.!

ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన మెగా బ్రదర్స్.!సినీమాభిమానులకు వరసగా మెగా సోదరులు శుభవార్తలు అందిస్తూ.. అందరిని ఆనందింపచేస్తున్నారు.ఈ సంవత్సరం మార్చ్ రెండవ వారం నుండి సినిమా హాల్స్ ముయ్యడం.. అదే నెల చివరి వారం నుండి షూటింగ్స్ ఆగిపోవడంతో పెద్దగా సినిమా వార్తలు లేవు.అలాంటిది వారం రోజుల వ్యవధిలో మెగా బ్రదర్స్ సెట్స్ పైకి వెళ్తున్నట్లు ప్రకటించి కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు.


ఇప్పటికే మెగా హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుప్రీమ్ హీరో ధరమ్ తేజ్.. వైష్ణవ్ తేజ్.. కళ్యాణ్ దేవ్ లు షూటింగ్స్ ప్రారంభించారు.వైష్ణవ్ తేజ్ ఏకంగా కొత్త సినిమాని ప్రారంభించి ఒక్క షెడ్యూల్ లో సినిమా పూర్తి చేశారు.. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం ముగిసింది.ఇలా మెగాహీరోలు సెట్స్ లోకి వెళ్తుంటే మేము ఏమి తక్కువ కాదు అంటూ చిత్రీకరణకు సై అన్నారు మెగా బ్రదర్స్.


ఇప్పటికే తన సినీ కరీర్ లో ఎప్పుడు లేని విధంగా వరస సినిమాలు సైన్ చేస్తూ పవర్ స్టార్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.జూన్ మొదటి వారంలో చాతుర్మాస దీక్ష ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారు దసరా రోజుల్లో దీక్ష ముగించారు.దింతో వెంటనే మిగిలిన వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసేందుకు సెట్స్ పైకి వచ్చేశారు.ఇప్పటికే విడుదలైన ఫొటోలలో పవన్ కళ్యాణ్ చాలా బాగా కనిపిస్తున్నారు.దింతో అభిమానుల సంబరాలకు అవధులు లేకుండా పోయాయి.అంతేనా మరో పక్క సంక్రాంతి బరిలోకి వకీల్ సాబ్ అనే వార్త కూడా తిరుగుతుంది.ఇప్పటికి అధికారిక ప్రకటన రాలేదు కానీ,సామాజిక మాధ్యమాలలో ప్రచారం మాత్రం బలంగా జరుగుతుంది.మరో పక్క మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ప్రకటన విడుదల చేశారు.ఈ నెల(నవంబర్) 9 నుంచి ఆచార్య షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. భారీ షెడ్యూల్ లో మెగాస్టార్ పాలుగోనున్నట్లు.. దింతో ఆచార్య సింహ భాగం షూటింగ్ పూర్తవుతుందని.. 2021 వేసవికి సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ ప్రకటన సారాంశం.


వీటితో పాటు.. మొన్ననే కరోనా నుండి కోలుకుని.. ప్లాస్మా దానం చేసి పుట్టినరోజు జరుపుకున్న టవర్ స్టార్ నాగబాబు గారు తాను కూడా శుభవార్త చెప్పాలనుకున్నట్లు ఉన్నారు.ఇప్పటికే నిర్చిదార్థం చేసిన కూతురు నిహారిక పెళ్ళి తేదీని ప్రకటించారు.డిసెంబర్ 9న రాజస్థాన్ లో పెళ్ళి చేయన్నునట్లు తెలపడంతో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇలా మెగా బ్రదర్స్ వార్తలతో సినిమాభిమానులకు కొత్త జోష్ వచ్చింది.అలానే.. మెగాస్టార్ సైతం సెట్స్ పైకి వస్తుండటంతో మిగతా హీరోలు సైతం షూటింగ్స్ ప్రారంభించేందుకు ముందుకు రావడం తధ్యం.


త్వరలో అటు సినిమా షూటింగ్స్ అన్ని ప్రారంభం అవ్వాలని.. అలానే సినిమా హాల్స్ సైతం తేర్చుకోవాలని.. చిత్రపరిశ్రమ మళ్ళీ పునర్వైభవం పొందాలని కోరుకుందాం..!

నేటి తరం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టినరోజు స్పెషల్.!

నేటి తరం తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టినరోజు స్పెషల్.!యూట్యూబ్ లో పరిచయమై.. వెండితెరపై అలరించి.. ఇప్పుడు ఓ.టి.టి లలో సైతం దూసుకుపోతున్న మన తెలుగమ్మాయి చాందిని చౌదరి.అందం.. అభినయం.. కలగలిసిన అభినేత్రి.కైలాషగిరి పర్వతాలలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుంటే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడని సిగ్గుతో డైలాగ్ చెప్పడం ఆపేసిన దగ్గర నుండి ఇప్పుడు వందల మంది మధ్యలో నిర్భయంగా నటించే స్థాయికి చేరిన చాందిని నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


చిన్నతం నుండి చదువుతో పాటు క్రీడల్లో రణించింది చాందిని.ఇంజినీరింగ్ లో అమ్మాయిలు అతి తక్కువగా ఉన్న మెకానికల్ తీసుకోవడంలోనే తెలుస్తుంది ఆమెకు నచ్చింది చేసే నైజం.. దేనికి బయపడని గుణం.బిటెక్ చదువుతూ తనకు నచ్చిన చిత్ర పరిశ్రమ వైపు అడుగు వేసేందుకు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.థి వీక్(the week) అనే షార్ట్ ఫిల్మ్ లో (రాజ్ తరుణ్ తో) 2011లో తొలిసారి కనిపించారు.అక్కడ నుండి ఎంతోమంది తెలుగు యువకుల మనసును కొల్లగొట్టారు.


చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్ విడుదలవుతుందంటే ఆ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి ఉండేది.ఇప్పుడంటే యూట్యూబ్.. ఇంస్టాగ్రామ్.. టిక్ టాక్ లో అనేకమంది అమ్మాయిల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ..ఆ రోజుల్లో యూట్యూబ్ లో తెలుగు అమ్మాయి అంటే అందరికి గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు చాందిని చౌదరి.2014లో వచ్చిన మధురంతో.. ఆ రోజుల్లో కాలేజీ చదివే విద్యార్థులకు ఆమె ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయారు.అప్పుడే తెలుగు చిత్రపరిశ్రమ నుండి అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు చదువు ముందు అనడంతో చదువు పూర్తి చేసుకొని పరిశ్రమ వైపు అడుగులు వేశారు. 2015లో “కేటుగాడు”తో తెరంగ్రేటం చేసి.. “శమంతకమణి” ధరించి “హౌరా బ్రిడ్జి” పై “కుందనపు బొమ్మ” లా “మను” తో కలిసి “కలర్ ఫోటో” దిగేందుకు సిద్ధంగా ఉంది.


అటు వెండితెరపై సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే.. కొత్తగా వచ్చిన ఓటీటీ లలో సైతం వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు చాందిని.ఇప్పటికే “గాడ్స్ ఆఫ్ ధర్మపురి”.. “మస్తిస్” తో వెబ్ సిరీస్ చూస్తున్న నేటి తరం యువతకు బాగా చేరువయ్యారు.నేడు.. తన పుట్టినరోజున విడుదల కానున్న కలర్ ఫోటో సినిమా తో అటు పెద్దవారికి.. ఇటు యువతకు మరింత చేరువకనున్నట్లు విడుదలైన టీజర్.. పాటల తో అర్ధమవుతుంది.


పరాయి భాషల్లో అవకాశాలు వస్తున్నా.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తుంది.ఆమె కథల ఎంపిక చూస్తుంటే నాకు నిత్యా మీనన్ గుర్తుకొస్తుంది.ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. చేసిన పాత్రల వల్ల.. మనం ఎంత ప్రభావం చూపాము అనే సిద్ధాంతం బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది.అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు హీరోయిన్లు దొరకడం లేదని చెప్పే మన చిత్ర పరిశ్రమ పెద్దలకు.. దర్శకనిర్మాతలకు.. చాందిని చౌదరి ఎందుకు కనపడటం లేదనేది బదులు దొరకని ప్రశ్న..!


అప్పుడప్పుడే ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి.. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. ప్రేక్షకులను మెప్పించి.. యూట్యూబ్ లో తొలి లేడీ స్టార్ గా ఎదిగటం.. షార్ట్ ఫిలిమ్స్ క్వీన్ అనే పేరు సంపాదించటం చాలా గొప్ప విషయం.9ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్న క్వీన్ చాందిని చౌదరి.. రానున్న రోజుల్లో వెండితెర పై విభిన్న పాత్రలు చేసి చిత్ర పరిశ్రమలో సైతం ప్రకాశించాలని కోరుకుంటూ.. నేడు(అక్టోబర్ 23న)పుట్టిన రోజు జరుపుకుంటున్న చాందిని చౌదరి గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!

ప్యాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.!

ప్యాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.!


ఈశ్వర్ తో పరిచయమై.. వర్షం తో భారీ విజయం సాధించి.. ఛత్రపతి తో యంగ్ రెబల్ స్టార్ గా మారిన అమ్మయిల డార్లింగ్.. ఆరడుగుల మిస్టర్ పర్ఫెక్ట్.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు.రేపు(అక్టోబర్23న) అటువంటి బాహుబలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..!


ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారిల మూడవ సంతానం ప్రభాస్.భీమవరంలో కొద్ది సంవత్సరాలు చదువుకున్న ప్రభాస్.. ఆ తర్వాత హైదరాబాద్ లో పూర్తి చేశారు.పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా 2002లో జయంత్. సి. పరంజాయ్ దర్శకత్వంలో.. ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకుడిగా.. శ్రీదేవి విజయకుమారి హీరోయిన్ గా ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.వెంటనే రాఘవేంద్ర సినిమా చేశారు.తొలి రెండు సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.2004లో విదులైన వర్షం సినిమాతో భారీ విజయం అందుకున్నారు ప్రభాస్.అక్కడ నుండి అందరికి తెలిసిన చరిత్రే.తాను చేసిన ఒక్కో సినిమాతో తనకంటూ అభిమానులను పెంచుకుంటూ పోయారు ప్రభాస్.ఛత్రపతి.. పౌర్ణమి.. బిల్లా సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.డార్లింగ్.. మిస్టర్ పర్ఫెక్ట్.. మిర్చి.. సినిమాలతో అమ్మయిల అభిమాన హీరో అయిపోయారు.ఈ మూడు సినిమాల భారీ విజయంతో యువతలో మంచి ఫాలోయింగ్ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. పదేళ్ళ సినీ జీవితంలో భారీ విజయాలతో పాటు పరాజయాలను చూసిన ప్రభాస్ అల్ టైం స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.


అమ్మయిల “డార్లింగ్”.. “పౌర్ణమి” యొక్క “బుజ్జిగాడు”.. “బిల్లా” తో “రెబల్” స్టార్ గా మారిన “మున్నా”.. “మిర్చి” లాంటి “ఈశ్వర్”.. ఇప్పటికీ “ఎక్ నిరంజన్” అంటున్న “అడివి రాముడు”.. “యోగి” “రాఘవేంద్ర” స్వామి భక్తుడు..”వర్షం” తో బాక్స్ ఆఫీస్ లో “చక్రం” తిప్పిన “ఛత్రపతి” ని.. “మిస్టర్.పర్ఫెక్ట్” అంటూ.. “సాహో” “బాహుబలి” అంటూ దేశం కీర్తించింది.ఇప్పుడు “రాధే శ్యామ్” తో మన ముందుకు వస్తున్నారు “ఆదిపురుషు”..2015లో విడుదలైన బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు స్టార్ హీరోల జాబితా నుండి దేశం మొత్తం తెలిసిన ప్రాంతీయ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించారు.బాహుబలి 2 విడుదల సమయానికి ప్యాన్ ఇండియా హీరోగా అవతరించారు ప్రభాస్.సాహో.. రాధే శ్యామ్.. ఆదిపురుషు.. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇలా తాను చేస్తున్న ప్రతీ సినిమా.. అన్ని భాషలలో విడుదల చేస్తూ.. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు.అటు దక్షణ చిత్ర పరిశ్రమలతో పాటు.. ఇటు బాలీవుడ్ లో సైతం జండా పాటెందుకు ముందుకు వెళ్తున్నారు ప్రభాస్.


రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి.. యంగ్ రెబల్ స్టార్ గా పేరు పొంది.. వరస విజయాలతో కోట్లాది మంది అభిమాన రెబల్ స్టార్ గా మారారు.ఇప్పుడు ప్రాంతీయ చిత్ర పరిశ్రమ నుండి ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగారు.చేస్తున్న సినిమాలు భారీ విజయాలు సాధించి తెలుగు హీరో స్థాయి.. స్టామినా.. దేశ.. విదేశాల్లో ప్రతిధ్వనించాలని కోరుకుంటూ..రేపు (అక్టోబర్ 23న) పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు..!

అక్టోబర్ 23న విడుదల కానున్న కలర్ ఫోటో భారీ విజయం సాధించాలని ప్రత్యేక కథనం..!

అక్టోబర్ 23న విడుదల కానున్న కలర్ ఫోటో భారీ విజయం సాధించాలని ప్రత్యేక కథనం..!ఆరంభం నుండే అటు ప్రేక్షకుల.. ఇటు సినిమా వర్గాల దృష్టిని ఆకర్షించిన సినిమా కలర్ ఫోటో.ఈ నెల 23న ఆహా యాప్ లో నేరుగా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్… పాటలు.. టీజర్ కు మంచి స్పందన వచ్చింది.కోటి ఆశలతో యువ బృందం చేసిన ప్రయత్నం కలర్ ఫోటో.ఆదివారం(అక్టోబర్ 18న) ప్రి-రిలీస్ వేడుక చేసుకొని ఈ శుక్రవారం (అక్టోబర్ 23న) విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమా గురించి ప్రత్యేక కథనం..!


ముందుగా ఈ సినిమాకు బీజం వేసిన వ్యక్తి ఈ సినిమా కథా రచయిత.. నిర్మాత సాయి రాజేష్ గారు.దర్శకుడవ్వాలని హైదరాబాద్ చేరిన సింహపురి(నెల్లూరు) వాసి సాయి రాజేష్ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదు.దింతో అటు ప్రేక్షకుల ఇటు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు మరియు మంచి సినిమా నిర్మించేందుకు డబ్బులు పొందేందుకు ఒక విభిన్నమైన కోణంలో ప్రయత్నం చేశారు.. అదే హృదయ కాలేయం.ఆ తర్వాత నిర్మాతగా కొబ్బరి మట్ట సినిమా చేశారు.ఆ తర్వాత స్వయంగా తన లవ్ స్టోరీని వెండితెర పై అవిష్కరించాలని కథ రాశారు.ఆ సినిమాను తన మిత్రుడు బెన్నీ ముప్పనేని తో కలిసి నిర్మించేందుకు సిద్ధమయ్యారు.


ఏడేళ్ళ ముందు చాయ్ బిస్కకెట్ ద్వారా షార్ట్ ఫిల్మ్ దర్శకుడిగా మంచి పేరు పొంది.. దర్శకుడిగా ఒక మంచి సినిమా తియ్యాలని అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు సందీప్ రాజ్.అలాంటి సందీప్ రాజ్ కు సాయి రాజేష్ కథ చెప్పడం.. తానే నిర్మిస్తాను.. దర్శకత్వం చెయ్యమని చెప్పడంతో కలర్ ఫోటో దర్శకుడిగా మారారు సందీప్ రాజ్.తన రచనతో.. అటు నటీనటుల.. సాంకేతిక నిపుణుల ఎంపిక తో సగం విజయం చిత్ర ప్రారంభానికి ముందే సాధించారు సందీప్ రాజ్


యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్న సుహాస్.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. మజిలీ.. డియర్ కామ్రేడ్.. ఉమామహేశ్వర ఉగ్రరూపాస్య వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు నటుడిగా బాగా దగ్గరయ్యారు.ఇలాంటి సమయంలో హీరోగా సుహాస్ చేస్తున్న తొలి ప్రయత్నం కలర్ ఫోటో.మంచి పాత్రలు వస్తున్న సమయంలో ఇలా ప్రయతించి విఫలమైతే వస్తున్న అవకాశాలు సైతం ఆగిపోతాయని తెలిసి కూడా కథ నచ్చడం.. మిత్రుడు.. దర్శకుడు సందీప్ రాజ్ పై నమ్మకంతో ఒప్పుకున్నారు సుహాస్.ఇప్పటికే చిత్రంలో పని చేసిన వారు నవాజుద్దీన్ సిద్ధికి.. తెలుగు విజయ్ సెట్టుపతి తో పోల్చడంతో ఆయనకు ఈ సినిమా తర్వాత నటుడిగా గొప్ప పేరు రావడం ఖాయంగా కనిపిస్తుంది.తెలుగులో యూట్యూబ్ లో స్టార్ గా మారిన తొలి హీరోయిన్ చాందిని చౌదరి.తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అతి కొద్ది తెలుగు హీరోయిన్ లలో ఒక్కరు చాందిని చౌదరి.మను సినిమాతో ఇప్పటికే నటిగా మంచి పేరు తెచ్చుకున్నరు.గాడ్స్ ఆఫ్ ధర్మపురి.. మస్తిస్.. వెబ్ సిరీస్ లతో భారీ విజయాలు నమోదు చేసుకొని మంచి ఫామ్ లో ఉన్న చాందిని చౌదరి కి నటిగా పేరు రానున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.


విలన్ పాత్రలో సునీల్ గారు మెప్పించి.. పరిపూర్ణమైన నటుడిగా సునీల్ మారనున్నరు. ఇప్పటికే పాటలతో సంగీత దర్శకుడు కాలభైరవ విజయం సాధించారు.ఇప్పుడు సినిమా విడుదల తర్వాత నేపధ్య సంగీతంలో కూడా తన మార్క్ చూపించనున్నారు కాలభైరవ.ఇప్పటికే టీజర్ తో వెంకట్ గొప్ప సినిమాతోగ్రఫీ అందించినట్లు పరిశ్రమలోని పెద్ద వ్యక్తులు వ్యాఖ్యానించారు.దింతో ప్రేక్షకులకు సైతం తన కెమెరాతో ఆకట్టుకొనున్నారు.ఈ సినిమా కోసం ఎడిటర్ పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో ప్రి-రిలీస్ వేడుక చూసిన ఏవిరికైనా అర్ధమవుతుంది.


సినిమా ఆహాకు ఇచ్చేయడంతో నిర్మాతగా ఇప్పటికే విజయం సాధించిన సాయి రాజేష్ కు ఈ సినిమాతో అటు కథా రచయితగా మంచి పేరు తో పాటు దర్శకుడిగా సినిమా అవకాశాలు రావాలని.. ఈ నెల 23న తొలిసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సందీప్ రాజ్.. దర్శకుడిగా మంచి పేరు పొందాలని.. సుహాస్.. చాందిని చౌదరి లకు వారి నటనలో మంచి పేరుతో పాటు.. మరిన్ని అవకాశాలు రావాలని.. సంగీత దర్శకుడు.. సినిమాతోగ్రఫీ.. ఎడిటర్ ఇలా అన్ని విభాగాలలో విజయాలు సాధించి మొత్తం యువకులతో కూడిన ఈ కలర్ ఫోటో బృందం విజయం సాధించడంతో పాటు మరిన్ని అవకాశాలు రావాలని మా బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం.అందరిలా 23న కలర్ ఫోటో చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాం.