17-05-2022 03:18:41 About Us Contact Us
‘ప్రభాస్’ “Mr.పర్ ఫెక్ట్” గా మరి 9ఏళ్ళు..!

‘ప్రభాస్’ “Mr.పర్ ఫెక్ట్” గా మరి 9ఏళ్ళు..!“Mr.పర్ ఫెక్ట్”సినిమా విడుదలై 9ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో సినిమా విడుదల రోజుని ఒక్కసారి గుర్తుచేసుకుందాం..


2009లో బిల్లా సినిమాతో పూర్తిగా లుక్ మార్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్,ఆ తర్వాత 2010లో వచ్చిన డార్లింగ్ సినిమాతో పూర్తిగా స్టైలిష్ లుక్ లోకి వచ్చాడు,అంటే కాక డార్లింగ్ సినిమా భారీ విజయం అందుకుంది.2011లో కాజల్ తో కలిసి ‘దిల్ రాజు’ నిర్మాణంలో “సంతోషం” ఫేమ్ ‘దశరథ్’ దర్శకత్వంలో “Mr.పర్ ఫెక్ట్”అనే సినిమా ప్రకటన చేశారు ప్రభాస్.పోస్టర్స్ లో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించడంతో సినిమా మంచి హైప్ అందుకుంది..సరిగ్గా అప్పుడే రొక్ స్టార్ ‘దేవి శ్రీ ప్రసాద్’ అందించిన ఆల్బమ్ బయటకు వచ్చింది.6 పెద్ద పాటలు,3 చిన్న పాటలతో ఉన్న ఆ ఆల్బమ్ అదిరిపోయింది.ప్రేమ,మాస్,ఫామిలీ కు సంబంధించిన ఇలా అన్ని పాటలు కలగలిసి ఉన్నాయి..దేవి ఆల్బమ్ హిట్ కొట్టాడు,దింతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..


2011 ఏప్రిల్ 22న “Mr.పర్ ఫెక్ట్” సినిమా తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చింది.తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.శుక్ర,శిని,అదివారాలు గడిచాయి..సినిమా కలెక్షన్స్ లో మార్పు లేదు,సెలవలు కావడం,ఫామిలీ ఆడియాన్స్ రావడంతో దాదాపు 10రోజులు పాటు ఆ సినిమా మంచి వస్సులు సాదించింది.ప్రభాస్ మరో హిట్ బ్యాక్ 2 బ్యాక్ అందుకున్నాడు.ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు..కాజల్,ప్రభాస్ ఒకరినిఒకరు ఆట పట్టించడం..ప్రభాస్,తాప్సి కుటుంభంలో కలిసేందుకు ప్రయత్నించే ఎపిసోడ్ చాలా బాగుంటాయి,మరి ముఖ్యంగా ప్రభాస్,ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలలో నవ్వు ఆపుకోలేము.ఇందులోని సన్నివేశాలు ఎంత బాగుంటాయి అంటే ఇప్పటికి మనకు ఇవన్ని గుర్తుండేలా..


సినిమా వచ్చి 9 ఏళ్ళు గడించింది,కానీ ఆ పాటలు మనం ఇప్పుడు విన్నా మనలో చాలా మంది ఆ పాటలోని తర్వాత లైన్ పడేస్తుంటాం..ఈ సినిమాలో దేవి ఇచ్చిన పాటలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది.ఈ సినిమాలోని లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో..పాట ఆ రోజుల్లో ప్రతి ఫంక్షన్ లో పెట్టేవారు..అమ్మయిలకు అగ్గి పుల్ల లాంటి ఆడ పిల్ల నేను..స్నేహితులతో ఉంటే రావు గారి అబ్బాయి..ప్రేమలో ఉన్నవారికి ‘చలి..చలిగా..అల్లింది..’,’ఆకాశం బద్దలైన’..లవ్ లో ఒదిన వారికి ‘బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా’ఇలా ప్రతి పాట అందరూ వివిధ సందర్భాలలో పెట్టుకొని డాన్స్ లు వేసిన వారే..ప్రభాస్ సినిమాలలో అల్ టైం ఆల్బమ్స్ లో ఇది కూడా ఒకటి..ఇందులో మూడు పాటలు ఇప్పటికి నా ఆల్బమ్ లో ఉంటాయి మరి..


ఎక్కడో ఆస్ట్రేలియాలో గేమ్ డిజైనర్ విక్కీగా ప్రభాస్ ని చూపించిన దగ్గర నుండి ఇండియాలో కాజల్ ని కలిసిన దాక ఒక స్థాయిలో సినిమా ఉంటే..కాజల్,ప్రభాస్ మళ్ళీ విడిపోయి విక్కీ వెళ్లిపోయే దాక టైం కూడా తెలియకుండా ఉంటుంది.సన్నివేశాలు,వాటికి తగ్గట్లు పాటలు,ప్రభాస్,కాజల్ ఇద్దరు చాలా బాగా పాత్రలు పోషించారు..ఎక్కడా డార్లింగ్ సినిమా గుర్తుకు కూడా రాదు..తర్వాత తాప్సి,వారి ఫ్యామిలీ తో ప్రభాస్ పాట్లు,మధ్యలో కాజల్ రాక ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేసింది..జీవితంలో అందరిలా కాకుండా నచ్చిన రంగంలో అడుగులు వెయ్యమని యువతకు మంచి సందేశంతో పాటు,జీవితంలో,ముఖ్యంగా ప్రేమలో సర్దుకుపోవడం ఎంత మంచిదో కూడా తెలిపారు..ఫామిలీ డైరెక్టర్ గా పేరుపొందిన దశరథ్ చాలా రోజులు తర్వాత భారీస్థాయిలో హిట్ అందుకున్న సినిమా “Mr.పర్ ఫెక్ట్”..


9ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో సామాజిక మాధ్యమంలో ప్రభాస్ డార్లింగ్స్ సంబరాలు జరుపుకుంటున్నారు..అయితే దీనికి మించిన సంబరాలు రేపు సాయంత్రం నుండి డార్లింగ్ సినిమా 10 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా జరపబోతున్నాం అని ఇప్పటికే అభిమానులు అదేనండి “డై హార్ట్ ఫాన్స్” తెలిపిన నేపథ్యంలో వారికి అంచనాలకు తగ్గట్లే మేము ఆర్టికల్ సిద్ధం చేస్తున్నాం..ప్రభాస్ అన్న డార్లింగ్ దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు మరో పెద్ద వ్యాసం విడుదల చెయ్యనున్నాము..