03-12-2020 21:39:58 About Us Contact Us


విశ్వక్ సేన్ 2017 లో వెళ్ళిపోమాకే అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోగా అడుగు పెట్టాడు.ఆ తర్వాత 2018లో పెళ్ళిచూపులు తో మంచి పేరు పొందిన తరుణ్ బాస్కర్ తో కలిసి ఈ నగరానికి ఏమైంది అనే సినిమా తో ప్రక్షకుల ముందరికి వచ్చాడు.సినిమా మంచి విజయం సాదించింది.ఆ సినిమాలో కళ్ళ జోడు పెట్టుకొని తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకర్షించాయి.కానీ విశ్వక్ సేన్ సన్నిహితులకు ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి,సినిమా బాగా ఆడినా అది కేవలం మల్టీప్లెక్స్ సినిమాగా మిగిలిపోయింది అని.స్టార్ హీరోగా నిలవాలి అంటే మాస్ ఆడియాన్స్ ని దగ్గర అవ్వాలి

ఈసారి హిట్ కాదు మాస్ కి దగ్గరవ్వాలి అని అనుకున్నదేమో విశ్వక్ సేన్.ఆ ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. తానే ప్రొడ్యూసర్,తానే డైరెక్టర్ గా ఒక సినిమా తీయాలి అనుకున్నాడు.ఇలా 2019 లో మూడవ సినిమాకే హీరో,డైరెక్షన్,ప్రొడ్యూసర్ అన్ని తానై ఆ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు.ఆ సినిమా మాస్ ఆడియాన్స్ కి ఎంతలా చేరింది అంటే తన పేరు విశ్వక్ సేన్ కంటే ‘ఫలక్ నామ దాస్’ అంటే జనాలు గుర్తుపట్టేంతలా.ఈ రోజు ఫలక్ నామ దాస్ అనే పేరు తెలియని యువత రెండు తెలుగు రాష్ట్రాలలో లేరనే చెప్పాలి.ఆ స్థాయిలో మాస్ కి రీచ్ అయ్యాడు విశ్వక్ సేన్.

అంత పెద్ద హిట్ మూడవ సినిమాకే అందుకున్న విషాక్ సేన్ నాలుగో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.అంతలోనే నాని ప్రొడక్షన్ లో అనగానే సినిమాకు మరింత హైప్ వచ్చింది.సాధారణంగా అతి పెద్ద హిట్ కొట్టిన తర్వాత స్టార్ హీరో నుండి చిన్న హీరోలు దాక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ప్లాప్ అందుకుంటే విశ్వక్ సేన్ మాత్రం ‘హిట్’ అనే త్రిల్లర్ వచ్చి తో మరో విజయం అనుకున్నాడు.ఇది అటు మాస్,ఇటు క్లాస్ అనే బేధాలు లేకుండా ప్రతి సినిమాభిమాని ఆదరించే విధంగా ఉంది.దింతో ఇండస్ట్రీలో యువ హీరోలలో ఒక్కడుగా విశ్వక్ సేన్ పాటుకుపోయినట్లే అని చెప్పాలి.

కేవలం నాలుగు అంటే నాలుగు సంవత్సరాలలో,4 సినిమాలతో ఎంటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద పెరు సాధించడం అంటే సాధారణ విషయం కాదు.ఏ మాత్రం ఫలక్ నామ దాస్ సినిమా అటుఇటు అయినా ఇండస్ట్రీలో కనిపించడం కష్టమనే చెప్పాలి.అయినా నమ్మకంతో అడుగు ముందుకు వేసి ఇవాళ యువతలో తనకంటూ ఒక క్రేజ్ పొందాడు విశ్వక్ సేన్.తన సినీ ప్రయాణంతో సినిమాల్లోకి రావాలి అనుకునే ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచాడు.అలానే యువ హీరోలు,దర్శకులలో తరుణ్ బాస్కర్,కార్తికేయ,నందు,నాని,రానా వంటి వారిని తన మిత్రులుగా ఈ చిత్ర పరిశ్రమలో సంపాదించుకున్నాడు.రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలి అని కోరుకుంటూ,తన అభిమానుల తరపున,తెలుగు పరిశ్రమ తరపున,మా బి.ఆర్.బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు దాసన్న..!మందు తాగుదాం అంటే మందు దొరకట్లే అన్నా..!