24-01-2022 15:30:36 About Us Contact Usఒక చిన్న ఉద్యోగానికే సిఫారసు వాడుతున్న ప్రపంచం..మరి అదే సినీ పరిశ్రమ అయితే,అందులో కోట్లమందికి అభిమాన నటుడిగా మరే హీరో పాత్ర అవకాశం అంత తేలికగా రాదు.అప్పుడెప్పుడో “మెగాస్టార్ చిరంజీవి” ఒకడిగా మద్రాస్ మహనగరానికి చేరి ఇప్పుడు ఒకటవ స్థానంలో కూర్చొని ఉన్నారు..ఆ తర్వాత తెలుగు పరిశ్రమ చెప్పుకునే పేరు “మాస్ రాజా రవితేజ”..ఆ తర్వాతి తరంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి వచ్చి మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయారు “న్యాచురల్ స్టార్ నాని”..ఇదంతా ఇప్పుడెందుకు అంటే మన ముందే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేటి తరం యూత్ ఐకాన్ గా ఎంతోమందికి రౌడీలా మారిన ప్రొడ్యూసర్ కొత్త అవతారం ఎట్టిన స్టార్ హీరో “విజయ దేవరకొండ” పుట్టిన రోజు కనుక..!


2011 లో రవిబాబు సినిమాలో..ఆ తరువాత ఒకటి రెండు సినిమాలలో కనిపించాడు విజయ్..అయితే 2015లో నానితో చేసిన ఎవడే సుబ్రమణ్యం సినిమా తో అటు ప్రేక్షకులకు,ఇటు ఇండస్ట్రీ వారికి చేరువయ్యాడు..2016 లో హీరో గా “పెళ్లి చూపులు” సినిమాతో చిన్న సినిమాలలో అతి పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ..” అర్జున్ రెడ్డి” తో యూత్ ఐకాన్ గా మారిపోయాడు..”గీత గోవిందం”తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరో,ఈ మాట నేను కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు..


విజయ దేవరకొండ పుట్టినరోజు అనగానే నాకు ఆయనతో ఉన్న కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి.అది 2015 చివర్లో అనుకుంటా నా మిత్రుడి అన్నయ్య నుండి కాల్,ఏదో సినిమా డిస్ట్రిబ్యూషన్ అమెరికాలోని ఏదో స్టేట్ ది తీసుకుంటున్నాడు,నన్ను మరో స్నేహితుడిని ప్రొడక్షన్ ఆఫీస్ కి ఒక్కసారి వెళ్లి రమ్మని సారాంశం.అయితే అందరూ కొత్త వాళ్ళు అనగానే అసలు తీసుకోవద్దు అని చెప్పేశాను.అస్సలు ఆఫీస్ కి కూడా నేను పోలేదు..ఆ తర్వాత సినిమా విడుదల అయింది..సినిమాకు మంచి స్పందన వచ్చింది అని యూఎస్ లో కలెక్షన్స్ బాగున్నాయి అని నా మిత్రుడు చెప్పాడు..అప్పటికి నేను సినిమా చూడలేదు..మరో ఇద్దరు స్నేహితులు ఇంకా సినిమా చూడలేదా అంటూ నన్ను ఒక్క రోజు సెకండ్ షోకి తీసుకెళ్లారు..చిత్రం నిజంగా చాలా బాగుంది..కొత్త వాళ్ళతో చిన్న సినిమా ఎలా తియ్యాలో చెప్పిన సినిమా అది..


కొన్ని రోజుల తర్వాత నేను ప్రసాద్ లాబ్స్ కు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కు వెళ్ళాను..అదే షో కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్..షో తర్వాత విజయ్ అవతల ఉంటే నేను ఇవతల వున్నాను..తనతో ఫోటో దిగాలి అనే ఆలోచన నాకు గాని నా స్నేహితులకు గాని లేదు ఆ రోజు..ఆయన పక్కన ఎవరు లేరు డ్రైవర్ తప్ప..దాదాపు సంవత్సరం తర్వాత అనుకుంటా ఇలానే ఏదో షో చూసి ప్రసాద్ లాబ్స్ క్రిందకు వస్తుంటే అక్కడ ఇద్దరు బౌన్సర్లు..ఒక మంది అబ్బాయిలు..అమ్మాయిలు.. సెల్ ఫోన్ లో సెల్ఫీ కెమెరా ఆన్ చేసి వున్నారు..నేను ఎవరు వస్తున్నారు అని ఒక కుర్రాడిని అడిగితే..తను అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ అని గర్వంగా చెప్పాడు..నిజంగా ఒక రెండు సంవత్సరాలలో ఆయన స్టార్డం అమాంతం ఆకాశానికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది..


అంతటి విజయం కుర్ర వయసులో వస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి అని అంటుంటారు..కానీ విజయ్ కి అవేమి లేవు అని అనిపిస్తుంది..తరువాత ఒక్కసారి సూర్యకాంతం ప్రి రిలీస్ వేడుకకు విజయ్ దేవరకొండ వచ్చాడు..అతన్ని చూసి అమ్మాయిలు,అబ్బాయిలు కేకలు పెడుతున్నారు..కానీ తను మాత్రం అక్కడ ఉన్న తనకు తెలిసిన వారందరినీ బౌన్సర్లను పక్కకు పంపి ఆప్యాయంగా పలకరించాడు..పెద్దవారికి తాను చూపిన గౌరవం చాలా బాగా నచ్చింది..మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఒడిగి ఉండాలనే మంచి అలవాటును ఆయన అనుసరిస్తున్నారు అని అనిపించింది.


విజయ్ దేవరకొండ పుట్టినరోజు అంటే ఆయనే స్వయంగా తన టీంతో ఏదో ఒక విధంగా కొంతమందినైనా సంతోష పెట్టడం..తర్వాత రోజుల్లో విజయ్ తనకు వీలైనంత సహాయం ప్రజలకు చేస్తూ వచ్చారు..అందులో భాగమే మొన్నటి కరోనా యాప్ అయినా నిన్న వైజాగ్ గ్యాస్ లీక్ సమయంలో “టీం జతాయు” తో కలిసి సహాయం చెయ్యడమైనా..ఇది పక్కన పెడితే చిన్నపాటి గుర్తింపు రాగానే చిన్న ప్రజా సమస్య పైన స్పందించేందుకు వంద సార్లు ఆలోచిస్తుంటారు..కానీ విజయ్ అలా కనపడదు..ట్రోలింగ్ నే ట్రోల్ చేసి పడేశాడు..నల్లమల్ల అడవులపై స్పందించిన తీరు.. కొన్ని వెబ్సైట్ల పై ఇటీవల స్పందించిన తీరు చూస్తుంటే తాను నిజంగా రౌడీ అనిపిస్తుంది..ఇండస్ట్రీకి ఇలాంటి మంచి రౌడీ అవసరం ఉంది కూడా..


జయాపజయాలు సర్వ సాధారణం..అందులో హిట్ శాతం చాలా తక్కువ ఉన్న సినీ పరిశ్రమలో హిట్లు చాలా అరుదు..కనుక విజయం సిద్దంచాలి అని కాక జయాపజయాలను ఒక్కేలా తీసుకునే స్థాయిలో ఉన్న విజయ్ దేవరకొండ..ఎప్పుడు తను అలానే ఉండాలి అని కోరుకుంటూ..పూరి గారితో సినిమా కోసం ఎదురుచూస్తూ..మరెనో పుట్టినరోజులు ఇలాంటి స్టార్డంలో జరుపుకోవాలి అని ఆసిస్తూ చిత్ర పరిశ్రమ తరుపున..మా బి.ఆర్.మూవీ జోన్ తరపున..మరి ముఖ్యంగా రౌడీ బాయ్స్ & గర్ల్స్ తరపున అమ్మయిల “డియర్ కామ్రడ్”..”వరల్డ్ ఫేమస్ లవర్”..”మహానటి”తో “పెళ్లి చూపులు” కోసం “టాక్సీ వాలా” గా మారిన “అర్జున్ రెడ్డి”..”ఎవడే సుభ్రమణ్యం” అంటూ “ద్వారక” చేరిన “గీతా గోవిందం”..”ఈనగరానికి ఏమైంది” అంటే..”మీకు మాత్రమే చెప్తా” అని “నోటా” కు ఓటు వెయ్యమన్న.. “రౌడీ హీరో “..”విజయ్ దేవరకొండ” కు “పుట్టిన రోజు శుభాకాంక్షలు”!!