05-12-2020 14:23:17 About Us Contact Us


తెలుగు చిత్ర పరిశ్రమలో మరో అరుదైన రికార్డ్ నెలొకోండి.డిజిటల్ యుగం వచ్చాక కొత్త రకమైన రికార్డులు పుట్టుకొచ్చాయి.అందులో ఒక్కటి..యూట్యూబ్ వ్యూస్. పాట.. టీజర్.. ట్రైలర్.. ఇలా ఏదైనా యూట్యూబ్ లో విడుదలైతే.. ఎంతసేపట్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు రికార్డ్ గా మారింది.అలాంటి యూట్యూబ్ లో ఉప్పెన సినిమా నుంచి తొలి పాటగా విడుదలైన “నీ కన్ను నీలి సముద్రం..” పాట లిరికల్ వీడియో ఇప్పుడు 100మిలియన్ వ్యూస్ సాదించింది.


నిజానికి 100మిలియన్ వ్యూస్ సాధించిన పాటలు చాలానే ఉన్నాయి.అలానే,ఈ పాట.. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్.. గీత రచయిత(లిరిసిస్ట్) శ్రీమణి ఖాతాలలో కూడా ఉన్నాయి.కానీ..ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న మరో మెగా హీరో.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.. పంజా వైష్ణవ్ తేజ్ కు ఇది ఒక అరుదైన రికార్డ్. అలానే తొలి సినిమాను దర్శకత్వం వహిస్తున్న ప్రముఖ దర్శకులు సుకుమార్ గారి శిష్యులు బుచ్చి బాబు కి ఇది ఒక అరుదైన గుర్తింపు.


సాధారణంగానే వారసులు పరిశ్రమలోకి వస్తుంటే వారిపై అంచనాలు ఉంటాయి.. అలానే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి.అలాంటిది మెగా ఫామిలీ నుండి వస్తుండటంతో వైష్ణవ్ తేజ్ పై అంచనాలతో పాటు ఉప్పెన సినిమాకు ముహూర్తం నుండే సామాజిక మాధ్యమాలలో ప్రమోషన్స్ జరిగిపోయాయి.అలాంటి సినిమాలో ఫస్ట్ లుక్ తో వైష్ణవ్ పల్లెటూరి మాస్ లుక్ తో ఆకట్టుకున్నారు.వెంటనే విడుదలైన “నీ కన్ను నీలి సముద్రం..” పాటకు మంచి స్పందన వచ్చింది.ఆ తర్వాత వచ్చిన లాక్ డౌన్ లో ఈ పాట యువత నుండి పెద్దల దాక వెళ్ళిపోయింది.



తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఈ పాట తాజాగా 100 మిలియన్ వ్యూస్ అందుకుంది.లిరిక్స్ అర్థవంతంగా ఉండటం.. దేవి సంగీతం వినసొంపుగా ఉండటంతో పాటు మెగా హీరో వైష్ణవ్ తేజ్ లుక్స్ అందరిని ఆకర్షించాయి.మెగా హీరో ఎలా ఉన్నాడో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది.ఏదేమైనా.. తొలి సినిమా నుంచి విడుదలైన తొలి పాటతో 100 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ అందుకోవడం ద్వారా పంజా వైష్ణవ్ తేజ్ అరుదైన రికార్డ్ నెలకొల్పారు.


ఇప్పటికే.. మెగా ఫామిలీ నుండి వస్తున్న వైష్ణవ్ తేజ్ హీరో కావడం.. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడు కావడం.. సంగీతం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తూవుండటం.. వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరియు దర్శకుడు సుకుమార్ స్థాపించిన సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండటం..తమిళంలో విభిన్న పాత్రలతో.. విలక్షణ నటుడిగా పేరు పొందిన విజయ్ సేతుపతి నటిస్తుండటంతో సినిమా పై అంచనాలు ఉండగా.. “అందరి నోటా.. ఇదే పాట..” అనే స్థాయిలో ఈ పాట చేరడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సమ్మర్ మూవీగా ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించగా కోవిడ్ కారణంగా విడుదల వాయిదా పడింది.సినిమా థియేటర్లు పునప్రారంభించిన వెంటనే ప్రమోషన్స్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నీ కన్ను నీలి సముద్రం లిరికల్ వీడియో