05-12-2020 13:22:33 About Us Contact Us



అవును నిజమే.. అభిమానులు లేనిదే హీరోలు లేరు.. ఎంతమంది అభిమానులు ఉంటే ఆ హీరోకి అంత ఎక్కువ పారితోషకం వస్తుంది.. అలానే సినిమాను ఎంత ఎక్కువ మంది చూస్తే.. అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ప్రేక్షకులకు మర్యాద ఇచ్చింది.. వారిని ప్రేక్షక దేవుళ్ళు అని సంభోదించింది.. అలానే పిలుస్తూనే ఉంటుంది.. అలానే హీరోలు సైతం ఎప్పుడు వారి అభిమానులు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు.. హీరో ను కలిసేందుకు సెట్స్ కి అభిమానులు వస్తే.. వారికి భోజనాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు.. ఇక్కడ డబ్బుకు మించిన ప్రేమ అభిమానిది అయితే.. మేము తింటున్న భోజనం వీరి వల్లనే అనే కృతజ్ఞత ఆ సగటు సినిమా వారిది.. అందుకే హీరోలకు అభిమానులు పట్ల గౌరవం.. బాధ్యత ఉంటాయి..


తన అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అనగానే డబ్బులు లేకున్నా కట్ ఔట్ లకి పాలభిషేకాలు.. పూలమాలలు.. ర్యాలీలు చేస్తుంటారు.. తొలి రోజు తొలి ఆటకి అభిమాని సినిమా హాల్ ని ఒక కల్యాణ మండపంలా మారుస్తుంటారు.. అప్పట్లో కొందరు అభిమానులు పంతానికి పోయి.. రికార్డుల కోసం.. అప్పు చేసి మరీ సినిమాను.. థియేటర్ లో ఆడిస్తే.. ఆ తర్వాత అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ నింద సగటు హీరో పైకి వచ్చేది.. అలా చేయమని హీరో ఎక్కడా చెప్పారు.. కానీ అభిమానం పేరుతో కొందరు చేసి.. హీరోని మానసికంగా బాధ పెట్టిన సంఘటనలు మనకు తెలియనివి కావు..


ఆ తర్వాతి రోజుల్లో అభిమానం సేవపైకి మళ్ళింది.. ఏ హీరో పుట్టినరోజుకి.. లేక సినిమా విడుదల రోజుకి.. ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తారు అనే పోటీ నెలకొనింది.. ఇది నచ్చిన చాలా మంది వ్యాపార వేత్తలు.. డబ్బు ఉన్న అభిమానులు.. వీరికి ఆర్థికంగా సహాయం చేయడంతో సేవా కార్యక్రమాలు బాగా జోరందుకున్నాయి.. అవి తెలుసుకొని హీరోలు సైతం గర్వంగా మా అభినులు గొప్ప అనే స్థాయికి చేరారు..కానీ .. ఇప్పుడు తరం మారింది.. కొత్త ట్రెండ్ వచ్చింది.. సామాజిక మద్యామాలలో అదే అభిమానులలో కొందరు ఆ హీరో పరువు తీస్తున్నారు..


పుట్టిన రోజు.. లేదా సినిమాకు సంబంధించిన ట్రెండ్ సామాజిక మాధ్యమాలలో జరగడం సర్వ సాధారణం అయిపోయింది.. ఇప్పుడు దానినే పరువుగా భావిస్తున్న కొందరు ఆ ట్రెండ్ ల కోసం ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చెయ్యడం ప్రారంభించారు.. పిచ్చి బాగా ముదిరిన మరికొందరు.. ఏకంగా యంత్రాలను సైతం రంగంలోకి దించారు.. డబ్బులు ఇచ్చి బోట్స్ అని పిలిచే వాటితో ట్రెండ్స్ లో పాలుగోనడం మొదలు పెట్టారు.. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ సమయంలో అవి ఇలా చేస్తున్నారు అని వేరే హీరోల అభిమానుల బయట పెట్టడం.. దింతో నిజంగా అభిమానించి ట్రెండ్ చేసిన అభిమానులు నిరుత్సాహ పడిపోతుంటే.. హీరో పరువు అక్కడ పోయింది.. దీనికి కారణం ఆ కొందరు అభిమానులే కదా..


సామాజిక మాద్యామాలలో ద్వారా అభిమానులకు.. ప్రేక్షకులకు.. దగ్గరైయే ప్రయత్నం చిత్ర పరిశ్రమలో వారు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే లైవ్ లు అంటూ.. ప్రశ్నించండి(ask) అంటూ సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.. అయితే వెంటనే కొందరు అభిమానాలు.. ఒక ముక్కలో అంటూ.. సగటు హీరో పేరు అడుగుతున్నారు.. వారి గురించి చెప్పడానికి.. లేక వారి గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వస్తున్న ప్రతి సినీ సెలెబ్రిటీకి ఇదొక తల నొప్పిగా మారింది.. కేవలం హీరోల గురించి మాత్రమే చెప్పేందుకు హీరోయిన్లు.. కమిడియన్స్.. సహా నటులు.. దర్శక.. నిర్మాతలు.. సంగీత దర్శకులు.. సింగర్స్.. రైటర్స్.. సోషల్ మెడియాలోకి రావాలా..?? ఇదే అసహనం అనేక మంది అనేక సార్లు నాతోనే స్వయంగా చెప్పుకొచ్చారు.. ఒకవేళ వారి గురించి చెప్పకపోయినా.. తెలియదు అని చెప్పినా.. లేకుంటే ఈ ఇద్దరిలో ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఒక హీరో పేరు చెప్పినా.. ఇక అంతే.. అదేంతో ఒక్కసారిగా అనేక అకౌంట్స్ నుండి దండ యాత్ర మొదలేదుతారు.. అసభ్య పదజాలంతో చదివేందుకు కూడా మనం ఇష్టపడలేనటు వంటి పదాలు వాడుతారు.. ఇక్కడ ఏ హీరో ఎవరిని అడగలేదు.. మా గురించి ప్రతి ఒక్కరిని అడగమని.. కానీ వీరే అడిగి.. వీరే రచ్చ చెయ్యడం మొదలు పెడతారు.. దింతో కొన్ని సార్లు.. సగటు హీరోకి ఆ సెగ తగులుతుంది.. ఏదో షో లో ఎక్కడో ఒక హీరోపై ఒక్కలు చేసిన చిన్న వ్యాఖ్యను పట్టుకొని రాదంతం చేస్తారు.. చివరకు.. ఏ మాత్రం ప్రతిభ లేకుండా పట్టుమని పది మందికి తెలియని వారు కూడా.. కేవలం కొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలబ్రిటీగా ఇప్పుడు చలామణి అవుతున్నారు.. హీరోలు సైతం ఈ అభిమానులను ఎలా అదుపు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంటే.. నిజమైన అభిమానులు బాధ పడుతున్నారు..


అందుకే అంటున్నా కొందరి అభిమానుల వల్ల హీరోల పరువు పోతుంది..