05-12-2020 14:04:35 About Us Contact Us



2014లో తమిళంలో విడుదలై దక్షణ భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన వి.ఐ.పి. అదే మన తెలుగులో రఘువరన్ బి.టెక్.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి.. సురభి.. కళ్ళతోనే అందరిని ఆకట్టుకున్నారు.. 2015లో సందీప్ కిషన్ తో కలిసి చేసిన బీరువా సినిమాతో తొలిసారి తెలుగులో సినిమా చేశారు.. 2016 లో ఏకంగా మూడు సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు సురభి.. ఆ ఒక్క సంవత్సరంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు..


2016లో శర్వానంద్ తో కలిసి నటించిన ఎక్స్ ప్రెస్ రాజా.. ఘన విజయం సాదించింది.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఆర్.జి.వి తీసిన ఎటాక్ సినిమాలో సైతం కనిపించింది.. ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నాని జెంటిల్ మన్ తో మరో విజయం సాధించింది.. 2017లో వచ్చిన ఒక క్షణం సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకుంది.. దింతో తెలుగు సినిమాలో బాగా బిజీగా మారిపోయారు సురభి.. 2019లో ఓటర్ అనే సినిమా చేసిన సురభి.. ఇప్పుడు 2020లో ఆది తో కలిసి శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఇప్పటికే ఆ సినిమా ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది.. ఇవి మాత్రమే కాక అటు తమిళం.. ఇటు కన్నడ భాషల్లో సైతం సినిమాలు చేస్తున్నారు సురభి.. సినిమాలు ఎన్ని చేశాం అనేదాని కంటే.. మంచి పాత్రలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తాను అని ఆమె ఇప్పటికే తెలిపారు..


తను నటిగా మారిన తర్వాత తొలిసారి విరామం దొరకడంతో ఇంట్లో కొంత వంటలు ప్రయోగిస్తూ.. కుటుంబ సభ్యులతో ముంబై లో గడుపుతున్నారు సురభి.. గడిచిన ఏళ్ళుగా అట్టహాసంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తాను నేడు.. ఇంట్లో నిరాడంబరంగా జరుపుకుంటున్నారు.. నాని.. ఈషా రెబ్బా.. సందీప్ కిషన్ తో తన సినీమా జీవితంలోని ప్రతి విషయాన్ని పంచుకుంటుంటారు సురభి.. మంచి కథ వస్తే వెబ్ సిరీస్ కు సైతం సిద్ధం అని పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు సురభి..


నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సురభి.. మరెనో సినిమాలు చేయాలని.. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరాలని.. కోరుకుంటూ.. మా బి.ఆర్. మూవీ జోన్ టీం తరపున సురభి కి జన్మదిన శుభాకాంశాలు..