24-01-2022 15:55:38 About Us Contact Usనిజామాబాద్ లోని సాధారణ కుటుంభంలో జన్మించి ఇంటర్ వరకు పద్దతిగా చదువుకుంటూ..ఆకలి వేస్తే ఇసుక తింటూ..పెరిగిన అమ్మాయి..చదువు తర్వాత సినీరంగం వైపు అడుగు వేసింది..నాన్నకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఒప్పించి ఒక్కటే సినిమా అంటూ జులాయితో సినీ రంగ ప్రవేశం చేశారు..మరో వైపు మల్లెమ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన అదుర్స్ షో తో బుల్లి తెరకు పరిచయమై పటాస్ తో చలరేగిపోతున్నారు..ఆమె ఎవరో కాదు..బుల్లి తెర రాములమ్మ అన్నా..మాస్ మహా రాణి అన్నా..నేటి తరం యాంకర్ లలో విభిన్నమైన శైలితో తనకంటూ అభిమానులను ఏర్పరుచుకున్న శ్రీముఖి రాథోడ్..అటు బుల్లి తెర లో షోలు..ఇటు సినిమా వేడుకలు..మరో పక్క వెండితెరలో సినిమాలు..అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న శ్రీముఖి గారి గురించి…


2012లో మల్లెమాల ప్రొడక్షన్ లో వచ్చిన రియాలిటీ షో అదుర్స్ తో ప్రదీప్ తో తొలిసారి కెమెరా ఫేస్ చేసింది.. తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంది..తొలి షో లో మంచి మార్కులు రావడం తో సీజన్ 2లో సైతం ఆమెనే ఎంపిక చేశారు..ఈ లోపు మాటల మంత్రుకుడు త్రివిక్రమ్ గారు..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “జులాయి” ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు..బన్నీ కి చెల్లిగా అందరి దృష్టిలో పడ్డారు..చివర్లో నన్ను కాపాడడానికి ఇంటసేపా అంటూ బన్నీ ని కొట్టే సన్నివేశంతో ప్రేక్షకుల్లో బాగా గుర్తుండిపోయ్యారు..తండ్రికి ఒక్క సినిమా అంటూ బలవంతంగా ఒపించిన శ్రీముఖి.. ఇప్పటి వరకు హీరోయిన్ గా..ముఖ్య పాత్రలలో..గెస్ట్ రోల్ అంటూ ఇలా పదకొండు సినిమాలు చేశారు..జయాపజయాలు పక్కన పెడితే తన నటనకు మంచి గుర్తింపు లభించింది..


సినిమాలు చేస్తున్నా కదా అంటూ టీవీకి కొంత గ్యాప్ ఇచ్చిన శ్రీముఖి..తిరిగి మళ్ళీ బుల్లితెరపై వచ్చేశారు..గడిచిన ఏదేళ్లలో పదిహేను షోలు చేశారు..ఇది సాధారణ విషయం కాదు..మా టీవీ..జెమినీ..ఈటీవీ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపంచుకుంటు ముందుకు వెళ్తున్నారు..బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు..శ్రీముఖి చేస్తున్న షో అంటే కాసేపు నవ్వుకోవచ్చు..సరదాగా ఉంటుంది అని ఫ్యామిలీలు సైతం అనేలా చేసుకున్నారు..శ్రీముఖి ఉన్న కాసేపు షో మొత్తం రచ్చ రచ్చ లా ఉంటుంది..ఎప్పుడు మంచి ఎనర్జీ తో కనిపిస్తుంది..ఇక పంచ్ టైమింగ్ చెప్పక్కర్లేదు..అవతల షో లో ఎంతమంది ఉన్నా శ్రీముఖి కచ్చితంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది…అటు ప్రదీప్..ఇటు రవితో మంచి పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది..


చిత్రరంగంలో గాని..టీవీ రంగంలో గాని ఏ మాత్రం సంబంధంలేని కుటుంభం నుంచి వచ్చిన శ్రీముఖి కేవలం తన స్వశక్తితో ఎదిగింది..ఏడేళ్ళల్లో పదకొండు సినిమాలు..పదిహేను షోలు రావాలి అంటే..అందులోనూ పరిశ్రమలో అండ లేకుండా అంటే అది ఆషామాషీ విషయం కాదు..అందరిని కలుపుకొనిపోవాలి..సెట్ లో ఒక్కసారి కోపం వచ్చినా ఆపుకోవాల్సి ఉంటుంది..ఒకవేళ అరిచినా తర్వాత మళ్ళీ సర్దుకొని వారికి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది..లేకుంటే అవకాశాలు రావు..తాను ఎంత అలిసిపోయినా..సెట్ లోనో లేక వ్యకిగత కారణంతోనో మూడ్ బాగోలేకపోయినా.. అవేవి కనపడకుండా కెమెరా ముందు జోష్ తో చెయ్యాలి..ఇది మనం అనుకున్నంత తేలిక కాదు..ఇలా ఎన్నోసార్లు కచ్చితంగా తనలోతాను బాధ పడివుంటారు..జ్వరంతో..లేక అలిసిపోయి ఓపిక లేకున్నా షోలు చేసివుంటారు..ఇవేవీ మనకు కనిపించవు..


ఇలాంటి శ్రీముఖి పై కొన్నిసార్లు తమ పొట్ట నింపుకోవడానికి ఇష్టం వచ్చిన వార్తలు రాస్తుంటారు..ఇది తనపై ఎంత ప్రభావం చూపుతుందో కదా..అలానే వారి కుటుంబ సభ్యుల పై ఇంకెంత ప్రభావం ఉంటుందో కదా..ఇవేవీ ఆమెని ఆపలేదు..సోషల్ మీడియా ట్రోలింగ్ అంటారా దాని గురించి పట్టించుకునే స్థాయిని ఎప్పుడో దాటేశారు శ్రీముఖి..అందుకే శ్రీముఖి సినీ జీవితం..పరిశ్రమలోకి రావాలి అనుకునే నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం..తెలుగు చక్కగా మాట్లాడుతుంది..చూసేందుకు అందంగా ఉంటుంది..నటన బాగా చేస్తుంది..ఇది ఆమె గురించి చాలామంది ప్రేక్షకుల మాట..


మహిళా సాధికారటలో భాగంగా తెలుగు పరిశ్రమలో ఉన్న తెలుగు మహిళలను గౌరవిస్తూ ప్రచురిస్తున్న వరస కథనాలలో నేడు శ్రేముఖి గారి పై వ్యాసము..మే 10న అంటే రేపు (అమ్మయిల వయసు చెప్పకూడదు కనుక దాచేస్తున్నాం)..పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రీముఖి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..మరెనో సంవత్సరాలు ఇలా తెలుగు ప్రేక్షకులను అలరించాలి అని..పెద్ద హీరోయిన్ అవ్వాలి అనే మీ అమ్మగారి కోరిక నెరవేరాలి అని కోరుకుంటున్నాము..తెలుగు అటు బుల్లి తెర ఇటు వెండితెర లలో “Spinster” అటు టాప్ మహిళా యాంకర్ లలో పెళ్లి గాని ఏకైక యాంకర్ శ్రీముఖి..మహేష్ బాబు గారు పెళ్లి చేసుకున్న రోజు ఎంతమంది అమ్మాయిలు ఏడ్చారో తెలియదు కానీ..శ్రీముఖి పెళ్లి చేసుకుంటే ఎంతోమంది అబ్బాయిలు ఏడవడం ఖాయం..అది ఎప్పుడు జరిగినా తను పరిశ్రమలో ఇలానే కోనసాగాలి అని కోరుకుందాం..


రేపు మహిళా సాధికారతలో భాగంగా రేపు శ్రీముఖితో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ గాయని సునిత గారిపై కథనం..శ్రీముఖి గారికి మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు..