05-12-2020 13:38:33 About Us Contact Us



మెగాస్టార్ అభిమానిగా మొదలై..రివ్యూ రైటర్ గా మారి..సినిమా రిపోర్టర్ గా పని చేసి.. పి.ఆర్.ఓ గా పేరు తెచ్చుకొని..ఎక్సగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా..లైన్ ప్రొడ్యూసర్ గా..కో-ప్రొడ్యూసర్ గా చేసి..ఇప్పుడు నిర్మాతగా మారారు జి.శ్రీనివాస్ కుమార్..అందరికి తెలిసిన పేరు ఎస్.కె.ఎన్.. అలాంటి ఎస్.కె.ఎన్ పుట్టినరోజు నేడు.


శ్రీనివాస్ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు.చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని.చదువు తర్వాత ఏమవుతావు అని ఎవరైనా అడిగితే..చిరంజీవి గారి దగ్గరకు వెలిపోతా అనేంత అభిమానం.శ్రీనివాస్ కి ఆయన దగ్గర ఏమి చెయ్యాలో తెలియదు కానీ చిరంజీవి గారి దగ్గర ఉండాలి అనే ఆలోచన ఉండేది.సామాజిక మాధ్యమాలు కొత్తగా వచ్చిన రోజుల్లో..2000వ సంవత్సర సమయంలో మెగా అభిమానులకు ఆయన సినిమా సమాచారం ఇంటర్నెట్ లో దొరికింది అంటే అదే కచ్చితంగా ఎస్.కె.ఎన్ రాసిన ఆర్టికల్ ద్వారానే.అలా నాన్ స్టాప్ సినిమా అనే వెబ్సైట్ ప్రారంభించి సినిమా రివ్యూలు..సినిమా సమాచారం ఇవ్వడం ప్రారంభించారు.


అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కు..తను ఇంటర్నెట్ లో ఎలా పని చేస్తున్నారో గమనించి..మెగా అభిమానిగా తన తపనను గుర్తించి నిత్యం అందుబాటులో ఉండేవారు.బన్నీ గంగోత్రి సినిమా ప్రారంభం అవుతున్న సమయంలో మా అన్నయ్య సినిమాలో హీరోగా అవుతున్నారు.తనకు పిఆర్వో..మేనేజర్ కావాలి.నువ్వు ఏమి చేస్తావు అని అడగడం.శిరీష్ కి పిఆర్వో అని చెప్పి అప్పుడే 24 గంటల వార్త ఛానల్ గా ప్రారంభమైన టీవీ9లో సినిమా రిపోర్టర్ గా ఉద్యోగం ప్రారంభించారు ఎస్.కె.ఎన్.అలా ఏలూరులో మెగా అభిమాని హైదరాబాద్ లో రిపోర్టర్ గా మారారు.


2009లో చిరంజీవి గారితో రాజకీయాల్లోకి వెళ్ళి..తిరిగి సినిమా ప్రారంచంలోకి వచ్చేశారు.సినీ ప్రయాణంలో దర్శకుడు మారుతి..నిర్మాత బన్నీ వాసు..ఏలూరు శ్రీను..యూవీ క్రియేషన్స్ వంశీ..శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గార్లు మిత్రులుగా మారారు.వీరు గుంటూరు..వెస్ట్ గోడవరిలలో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు.మారుతి దర్శకుడిగా చేసిన ఈ రోజుల్లో సినిమాతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన ఎస్.కె.ఎన్..గీత ఆర్ట్స్ లో 100%లవ్ తో బన్నీ వాసుకు నిర్మాతగా అవకాశం రావడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో సినిమా నిర్మాత చెయ్యాల్సిన అన్ని విషయాలు తెలుసుకున్నారు.ఆ తర్వాత యూ.వి క్రయషన్స్ ప్రారంభించడంతో అందులో ఎక్సుగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేశారు.టాక్సీ వాలా తో నిర్మాతగా మారారు.రెస్ట్ ఐస్ హిస్టరీ..


మెగాస్టార్ మీద అభిమానం హైదరాబాద్ కు చేరిస్తే..సినిమా పట్ల ప్రేమ..తన కష్టం తనను నిర్మాత స్థాయికి చేర్చింది.ఎప్పుడు సినిమా..మెగాస్టార్..బన్నీ గురించి మాత్రమే మాట్లాడే శ్రీనివాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!