05-12-2020 13:54:51 About Us Contact Us



ఒరేయ్ బుజ్జిగా సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన కలలు చూసిన కన్నులేయ్.. పాటను ఈ సాయంత్రం విడుదల చేశారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు.విడిపోయిన ప్రేమికుల బాధను పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు కాసర్ల శ్యామ్.ఇక మెలోడీ కి కొత్త రూపంలా తెలుగు పరిశ్రమలో మారిన అనూప్.. లిరిక్స్ తగ్గట్లు సంగీతం ఇవ్వడంతో పాట వింటూనే బాధ కలిగేలా ఉంది.


షార్ట్ ఫిలిమ్స్ తో యువతకు పరిచయమై..నేడు పరిశ్రమలో యువ హీరోగా మారిన రాజ్ తరుణ్ హీరోగా.. మాళవికా నాయర్..హెబ్బా పటేల్ హీరోయిన్లుగా.. గుండెజారి గల్లంతయ్యిందే.. ఒక లైలా కోసం సినిమాలు చేసిన దర్శకుడు విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒరేయ్ బుజ్జిగా.నిజానికి ఈ సినిమా మార్చ్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది చిత్ర బృందం.కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.నాలుగు నెలల ముందే ప్రచారాలు ప్రారంభించిన ఈ సినిమా ఇప్పుడు తిరిగి ఈ పాట విడుదలతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.తొలుత విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.


ఇప్పటికే విడుదలైన పాటలు..నాలుగు నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి.రాహుల్ సిప్లిగంజ్ పాడిన కృష్ణవేణి.. పాట మాస్ కు బాగా నచ్చగా..సిద్ శ్రీరామ్ పాడిన ఈ మాయ పేరేమిటో.. పాట సామాజిక మాధ్యమాలలో భారీ రికార్డ్స్ నెలకొలిపింది.నేడు విడుదలైన ఈ పాట కూడా అలానే అందరికి నచ్చేలా ఉంది.ప్రేమ మరియు కామెడీ తో యూత్ ఎంటర్టైనర్ గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం సాధిస్తుంది అని చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.కె.కె.రాధామోహన్ శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.


కలలు చూసిన కళ్ళు పాట..