03-12-2020 22:31:20 About Us Contact Us



చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చుడీదార్ ధరించి పక్కింటి తెలుగు అమ్మాయిగా కనిపించారు శివాని రాజశేఖర్. జీవితా.. రాజశేఖర్.. స్వయం కృషి తో పైకి వచ్చి.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు.. గౌరవం సంపాదించుకున్నారు.నటిగా పరిచయమైన జీవిత.. దర్శకురాలిగా.. నిర్మాతగా మారారు.అలాంటి వీరి పిల్లలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతున్నారు.ఇప్పటికే వీరి చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో పరిచయమయ్యారు.ఇప్పుడు తాజాగా పెద్ద కుమార్తె శివాని సైతం హీరోయిన్ గా మరిచయం కానున్నారు.


నేడు శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె తొలి సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.ఇప్పటికే ప్రొడ్యూసర్ గా చేసిన శివాని.. తన తండ్రి లాగా ఒక డాక్టర్.బాల నటుడిగా మంచి పేరు సంపాదించుకొని.. తాజాగా ఓ బేబీ.! తో తిరిగి వెండితెర పై అల్లరి చేసిన తేజ సజ్జా.. ఈ సినిమాలో హీరో. 3 సీజన్స్ తో యువతను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ పెళ్లి గోల..ఆ వెబ్ సిరీస్ దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకులు. మహాతేజ క్రీయాషన్స్.. ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది.


డాక్టర్ నుంచి నటిగా మారిన శివాని.. తొలి సినిమా ప్రధమ పోస్టర్ లో చుడీదార్ తో కనిపించి తెలుగు అమ్మాయిలా ఆకట్టుకున్నారు.అలానే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేడ మీద కూర్చొని నెలవంకను చూస్తుంటే..నేటితరం యువతిలా కనిపించారు.ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు వెన్నెల.ఇప్పటికే తన చెల్లి శివాత్మిక పై సామాజిక మాధ్యమాలలో వచ్చిన ట్రోలింగ్స్ కి వేదికపై నుండి జవాబు చెప్పి.. తాను జీవిత కూతురుని అని నిరూపించుకున్న శివాని.. రానున్న రోజుల్లో తన తల్లి లాగా మంచి నటిగా కూడా పేరు తెచుకుంటారేమో చూడాలి.



నేటి తరం కొత్త తరహా లైవ్ స్టోరీ అని బృందం చెబుతుంది.చిత్రకరణ ప్రారంభించుకున్న ఈ సినిమాకి ఇప్పటివరకు ఎటువంటి టైటిల్ ఖరారు కాలేదు.అలానే ఇందులో పనిచేస్తున్న నిపుణులు.. మరియు ఇతర తారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.ఈ సినిమాతో హీరో గా తేజ సజ్జా. అలానే హీరోయిన్ గా శివాని రాజశేఖర్ పరిచయం కానున్నారు.


హీరోయిన్ గా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న శివాని.. నటిగా మంచి పేరు తెచ్చుకొని.. ఉన్నత స్థాయికి చేరాలని..నటిగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని కోరుకుంటూ..మా బి.ఆర్. మూవీ జోన్ బృందం తరపున శివాని కి పుట్టినరోజు శుభాకాంక్షలు.