01-12-2020 20:36:03 About Us Contact Us



షకీలా.. మలయాళం నటి.. ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరు.. “నేను చేసిన కొన్ని సినిమాల వల్ల నా సినిమాలు చూడటానికి వెళ్తున్నాము అని భర్తలు తమ భార్యలకు చెప్పరు” అని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. మరో పక్క సాయి రామ్ దాసరి తొలి సినిమా విడుదలకు ముందు ప్లాప్ మీట్ పెట్టిన దర్శకుడు.. రెండవ సినిమా కంట్రవర్సీ తో చల్లపల్లి జైలు కు వెళ్లారు.. తాను గత సంవత్సరం తీసిన ladies not allowed అనే సినిమాని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. గత కొన్ని నెలలుగా దీని పై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఆ సినిమా సర్టిఫికెట్ ఫైల్ ఢిల్లీ లో ఉంది.. ఇప్పటికే శిలావతి అనే సినిమా వీరి కాంబినేషన్ లో వచ్చింది.. అలాంటి వీరిద్దరు కలిసి మరో సినిమా అంటూ గత సంవత్సరం ఒక ప్రకటన విడుదలైంది..


అంతలో టీజర్ వచ్చింది.. సినిమా పేరు “షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం”.. టైటిల్ ఏంటి ఇంత వెరైటీగా ఉండి అని అనుకుంటుందాగా.. టీజర్ లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో డైలాగ్ పెట్టి తన ట్రేడ్ మార్క్ పంచ్ వేశారు సాయి రామ్ దాసరి.. దింతో ఈ సినిమా ఇంకెంత కాంట్రవర్సీ అవుతుందో అని అనుకున్నారు అంతా.. అసలు ఇది సెన్సార్ బోర్డ్ దగ్గరకైనా వెళ్తుందా అని భావించారు.. లాక్ డౌన్ సడలించడంతో సినీ రంగంలో షూటింగ్ మినహా మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఇప్పటికే చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉన్న ఈ సినిమా నేడు సెన్సార్ బోర్డ్ ముందుకు వచ్చింది.. అయితే సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.. అటు షకీలా సినీ ప్రస్థానంలో గాని.. ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం “జగన్ అన్న” అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు.. మ్యూట్లు లేవు.. అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది..


తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లోకి ఎక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో.. ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు.. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మిత.. లండన్ గణేష్ సహా నిర్మాత.. మధు పొన్నస్ సంగీత దర్శకులు.. ఇప్పటికే ఆయన బాణీలు అందించిన పాటలు విడుదలయ్యాయి..


రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు.. సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రం అని.. ఇది నేరుగా ఓ.టి.టి.లో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సాయి రామ్ దాసరి తెలిపారు.. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పారు..