03-12-2020 21:47:30 About Us Contact Us



తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సెట్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే దర్శకులు గుణశేఖర్ గారు రెండు భారీ సినిమాలను ప్రకటించారు.ఒకటి హిరణ్యకశ్యప కాగా రెండవది శాకుంతలం.వివరాల్లోకి వెళ్తే..


మెగాస్టార్ చిరంజీవి గారి తో చూడాలని ఉంది.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్కడు.. జూనియర్ ఎన్టీఆర్ తో చిన్నారుల శిల్పారామం.. రామాయణం. అదే బాల రామాయణం వంటి విజయవంతమైన మంచి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క తో రుద్రమదేవి సినిమాతో కాకతీయ సామ్రాజ్యపు విశేషాలను.. రాణి రుద్రమదేవి గారి గొప్పతనాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన దర్శకులు గుణశేఖర్ గారు.


ఒక్కడు సినిమాకు తాను వేసిన చార్మినార్ సెట్ గురించి ఇప్పటికి చిత్ర పరిశ్రమ మాట్లాడుతూ ఉంటుంది.ఆ తర్వాత ఆయన సినిమాలో సెట్ వెయ్యడం సర్వ సాధారణంగా మారిపోయింది.ఆయన చివరగా చేసిన రాణి రుద్రమదేవికి ఒక పక్క స్వీయ నిర్మాణం.. మరో పక్క భారీ తారాగణం.. అందులోనూ చరిత్ర.. దింతో అనేక సెట్లు వేశారు గుణశేఖర్ గారు.



అలాంటి గుణశేఖర్ గారు గత సంవత్సరం జూన్ ఒకటిన అంటే రుద్రమదేవి సినిమా విడుదలై.. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత తన తదుపరి సినిమా ప్రకటన చేశారు.దగ్గుబాటి రానా హీరోగా హిందు పురణలలోని లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి హిరణ్యకశ్యప అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.గడిచిన మూడు సంవత్సరాలుగా ఆ సినిమా పనులు జరుగుతున్నట్లు చెప్పడంతో భారీ సినిమా ఖాయమని అంతా భావించారు.ఇప్పుడు లాక్ డౌన్.. మరోవైపు రానా పెళ్ళి.. చేస్తున్న సినిమాల దృశ్య ఆ భారీ సినిమా పట్టలేక్కేందుకు సమయం పడుతుండటంతో మరో సినిమా చేస్తున్నట్లు నిన్న(అక్టోబర్ 9న) ప్రకటించారు.


మహా భారతంలోని ఆదిపర్వంలో విశ్వామిత్ర మహర్షి కూతురు శకుంతల.. కన్వ మహర్షి వద్ద పెరిగిన ఆమెను హస్తినాపురి రాజైన దుస్యంత మహారాజు ప్రేమిస్తారు.ఈ ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు.సినిమా టైటిల్ “శాకుంతలం”.. మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.లండన్ లో ఆర్ట్స్ & విజువల్ కల్చర్ (చిత్రాల ద్వారా సంస్కృతిని తెలపడం) చదివిన గుణశేఖర్ గారి పెద్ద కుమార్తె నీలిమ నిర్మాతగా పరిచయం కానున్నారు.గుణ టీం వర్క్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు.. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.


అద్భుతమైన టైటిల్ పోస్టర్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా భారీ విజయం సాధించాలని.. నేటి తరానికి మహా భారతంలోని విశేషాలు తెలియాలని కోరుకుంటూ.. నీలిమకు.. గుణశేఖర్ గారికి.. మరియు చిత్ర బృందానికి శుభాకాంశాలు..!


శాకుంతలం మోషన్ పోస్టర్